Facebook Twitter
ఆ వైపు

ఆ వైపు

- డా.సి. భవానీదేవి

ఈ మట్టి మత్తుగా ఆకర్షిస్తుంది
సుతి మెత్తని మాటలా

ఈ సముద్రం ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది
దృశ్యాన్ని వరించిన కనుపాపలా

ఈ గాలి మురళిలా తాకుతుంది
మమకారం నిండిన స్పర్శలా

ఈ ఆకాశం నిలువునా కమ్మేస్తుంది
మనసంతా ఆవరించిన రూపంలా

ఈ దాహం అగ్నిలా రగులుతుంది
ప్రతిక్షణం జ్వలించే వేదనలా

పంచభుతాల పరికల్పిత శరీరం
అటువైపే తిరిగి చూస్తోంది
గమ్యాన్ని అన్వేషిస్తూ
కాలం సాయంతో
ఆవైపే నడుస్తూ