Facebook Twitter
ప్రయత్నం

ప్రయత్నం


- డా.సి. భవానీదేవి

 


ఇన్నిన్ని పుస్తకాలు చదివాను కానీ
చదవలేకపోయింది నా మనసునే !
పిల్లగాలిలా తాకవు
నిప్పుకణికలా కాల్చేస్తున్నావు
తలమీద గోడుగువనుకున్నాను
వంద పీలికల వికృత ఛాయావైనావు

సముద్రమంత అందం నీది
మునక వేస్తే ఊపిరి ఆడదు కదా!
 భ్రమకి వాస్తవానికి మధ్య
విభజన రేఖని స్పర్శించేది మనసే!
ప్రేమించడం నా బలమైన బలహీనత
దాన్ని ఆవిరి చేయటం నిర్విర్యత

ఇప్పుడైనా
మన అభిజాత్యపు పొరల్ని వొల్చుకుంటూ
ఒకరిలోకి ఒకరు గా ప్రవహిస్తూ
చీకటి ముసిరినప్పుడు మెరిసే నక్షత్రాల్లా
కాసేపు చీకట్లోనే మాట్లాడుకుందాం,
హృదయ నేత్రాల్ని
విప్పార్చి చూసుకుందాం!