TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
పుడమితల్లి పదాలు -1
-శ్రీమతి.కె. నీరజ
రుధిరంబు అలరారు
ఈనాటి కాశ్మీరు
తలచినా బేజారు
ఓ పుడమితల్లి
మమ్మేలే వేస్టేజి
ప్రభుతనో స్టోరేజి
పవర్ కట్ మస్ట్ జీ
ఓ పుడమితల్లి
నదుల లోనికి దూకు
నేటి బస్సుల షోకు
చూచుచుండిన షాకు
ఓ పుడమితల్లి
ఒకనాడు ధర్మంబు
అలనాడు కర్మంబు
ఈనాడు మర్మంబు
ఓ పుడమితల్లి
చర్చల్తో హాటెక్కు
కాల్పుల్తో హీటెక్కు
పేరేమో హైటెక్కు
ఓ పుడమితల్లి
తరలించె ఆంగ్లేయుల్
తెగమింగే నాయకుల్
దిగమింగే దేశీయుల్
ఓ పుడమితల్లి
చీలేటి పార్టీలు
మారేటి పీయమ్ లు
మిడ్ టరమ్ పోలింగ్ లు
ఓ పుడమితల్లి
పార్టీల కలెక్షన్స్
బంధుల సెలక్షన్స్
మిడ్ టరమ్ ఎలక్షన్స్
ఓ పుడమితల్లి
వసుధలో సౌధంబు
కంటేను సాధ్యంబు
రోదశీ వయనంబు
ఓ పుడమితల్లి
చెరకు వింటితో మరుడు
రుచితో కలువ రేడు
స్టెన్నుగన్ టో నరుడు
ఓ పుడమితల్లి
గరుడి పైనను అజుడు
దున్న పైనను యముడు
నరుడి పైనే నరుడు
ఓ పుడమితల్లి
ఒంపు సొంపుల కొమ్మ
పులకరింతల రెమ్మ
బాపు గీసిన బొమ్మ
ఓ పుడమితల్లి
రసరయ్య భరితాలు
ఆహ్లాద వర్ణాలు
రవివర్మ చిత్రాలు
ఓ పుడమితల్లి
బాలమురళీ గళము
ఆలకించిన జనము
ఒడలు మరుచుట నిజము
ఓ పుడమితల్లి