Facebook Twitter
చిన్నదాన

చిన్నదాన

- మనోహర బోగా

అందరాని  కొమ్మపైన చుక్కనంటినట్టున్న
చిన్నదాన
నిన్నందుకొనేది ఎలాగో చెప్పవా....
భామా
నా ఆశల గుడిలో కపురముండే దేవతవనుకున్నానే.
అందరాని కొమ్మ పైనా.......నా
ఒక్కసారి పంతం వీడి కొమ్మని
వదలి
కిందకి దిగి నా గుండెల చప్పుడు
విన్నావంటే నీ గుండె చప్పుడు పెరుగునే
ఒ చెలి నా చెలి.
ఆశలు రేపుతావు అంతలొనే నీళ్ళు
పోస్తావు
అదేమంటే నాకేమ్ తెలుసున్నంటావ్
మర్మము తెలిసిన వనితలు మాటలడకనే చంపుతారు
మగవారిని మా మగవారిని
కళ్ళ నిదురా దూరమ్ చేసి మా
కల్లల్లో కాపురముంటామంటారు
బడాయి ఫొజులు కొడుతుంటారు
అందరాని  కొమ్మపైన చుక్కనంటినట్టున్న
చిన్నదానా
నిన్నందుకొనేది ఎలాగో చెప్పవా....
భామా
నా ఆశల గుడిలో కపురముండే దేవతవనుకున్నానే.