LATEST NEWS
  యూట్యూబ్ చూసి డైట్ ఫాలో అయిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొలచెల్‌కు చెందిన శక్తిశ్వరన్ అనే వ్యక్తి  యూట్యూబ్‌లో వీడియో చూసి మూడు నెలలుగా  ఆహారం తీసుకోకుండా కేవలం నీరు, ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకున్నారు. నిన్న అతడికి ఊపిరాడక మృతి చెందారు. డైట్ ఫాలో కావడం కారణంగానే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శక్తిశ్వరన్ ఆహార నియమాలు పాటించే ముందు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోలేదని తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు. కేవలం యూట్యూబ్ వీడియోల్లోని సూచనలనే అతను పాటించాడని వారు తెలిపారు.  బరువు తగ్గడానికి వ్యాయామం కూడా చేస్తున్నాడని, కొన్ని మాత్రలు వాడుతున్నాడని తెలిపారు. గురువారం నాడు శక్తిశ్వరన్ ఒక్కసారిగా ఊపిరి ఆడక ఇంట్లో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.
శాంతి గోదావరి వరద ఉధృతితో మహోగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజి 175 గేట్లు ఎత్తి దాదాపు 2 లక్షల 16 వేల 300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోనికి విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు లంక గ్రామాలు జలమయమయ్యాయి. పలు లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గోదవరి వరద మరింత పెరిగే అవకాశం ఉందనీ, తోతట్లు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పర్యాటక రంగ ప్రగతిని ఇస్తున్న అత్యధిక ప్రాముఖ్యతకు  గుర్తింపు దక్కింది. ఏపీ పర్యాటక శాఖకు అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.   10వ అంతర్జాతీయ టూరిజం కాన్ క్లేవ్ అండ్ ట్రావెల్ అవార్డు(ఐటీసీటీఏ) సంస్థ ఏపీలో చేప‌డుతున్న ప‌ర్యాట‌క ప్రాజెక్టులు.. ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను నిశితంగా ప‌రిశీలించి.. ఎమర్జింగ్ కోస్టల్ అండ్ హెరి టేజ్ అవార్డు ను రాష్ట్రానికి  ఇచ్చింది.  శ‌నివారం(జులై 26) ఢిల్లీలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో ఈ అవార్డును ప‌ర్యాట‌క అభివృద్ది కార్పొరేష‌న్‌(ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్ట‌ర్‌, ఐఏఎస్ అధికారి ఆమ్ర‌పాలికి  అందించ‌నుంది. ఏపీ టీడీసీ ఎండీ అమ్రపాలి ఆ విషయాన్ని స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు.   ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత విస్తారమైన తీర ప్రాంతం ఉన్న రోండో రాష్ట్రం. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాన్ని వినియోగించుకుని.. ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం న‌డుంబిగించింది. ఈ క్ర‌మంలో ప‌లు ప్రాంతాల్లో ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేసింది.  అఖండ గోదావ‌రి  ప్రాజెక్టు ద్వారా.. రాష్ట్రాన్ని ప‌ర్యాట‌క రంగంలో ముందుకు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించింది. అదే స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్యాట‌క శాఖ‌కు ‘ప‌రిశ్ర‌మ‌’ హోదాక‌ల్పించారు. త‌ద్వారా రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంగం ద్వారా.. ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాల‌తో పాటు.. ఆదాయం కూడా పెరుగుతుందని అంచ‌నా వేశారు. ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వినూత్న విధానాలు, కొత్త పాలసీలు, విప్లవాత్మక సంస్కరణలకు ఆయ‌న పెద్ద‌పీట వేస్తున్నారు. వీట‌న్నింటిని గ‌మ‌నించిన ఇంటర్నేషనల్ టూరిజం కాన్ క్లేవ్ అండ్ ట్రావెల్ అవార్డు(  సంస్థ‌.. ఈ సారి మర్జింగ్ కోస్టల్ అండ్ హెరి టేజ్ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది.  ఈ అవార్డుతో రాష్ట్ర ప‌ర్యాట‌కం మ‌రింత పుంజుకునేందుకు.. విదేశీ ప‌ర్యాట‌క‌లు కూడా రాష్ట్రానికి మ‌రింత పెరిగేందుకు అవ‌కాశం ఉంద‌ని ఆమ్ర‌పాలి తన పోస్టులో పేర్కొన్నారు.
  బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో కోస్తాంధ్రలో ఆదివారం వరకు భారీ వర్షాల అంచన నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. వర్షాలు, ష్లడ్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముందుస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు హోం మంత్రి ఆదేశించారు. తీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆదేశించారు.  రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై విపత్తు నిర్వహణ ఎండీ ప్రఖర్‌ జైన్‌, సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు. వాయుగుండం రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ వైపు కదులుతుందన్నారు. ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు.. రాయలసీమ ప్రాంతంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే వీలుందని చెప్పారు.  తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. వరద ముప్పు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని హాట్‌స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి అని కలెక్టర్లకు హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్ లో  112, 1070, 1800-4250101 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలను ఆమె కోరారు.
ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందే . గతంలో ఇదే తెలంగాణ హైకోర్టు  ఇదే ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ప్రమేయం లేదని పేర్కొంటూ, ఆ కేసునుంచి తప్పించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. అదే తెలంగాణ హైకోర్టు ఇప్పుడు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ప్రమేయంపై విచారించేందుకు సీబీఐ, ఈడీలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి నేతృత్వంలో జ‌రిగిన ఓబులాపురం మైనింగ్ అక్ర‌మాల వ్య‌వ‌హా రంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీల‌క్ష్మిని విచారించాల్సిందేన‌ని.. ఆ అక్రమాలలో ఆమె పాత్ర సుస్ప‌ష్టంగా ఉంద‌ని.. తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఆమెను విచారించేందుకు సీబీఐ, ఈడీల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు తేల్చి చెప్పింది.  ఇదే కోర్టు గ‌తంలో గ‌నుల కేసులో శ్రీల‌క్ష్మికి ప్ర‌మేయం లేద‌ని తేల్చి చెప్పింది. దీంతో ఆమెను కేసు నుంచి త‌ప్పించాల‌ని సీబీఐ, ఈడీల‌కు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. సీబీఐ, ఈడీలు.. ఈ ఉత్త‌ర్వుల‌ను సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు, ఈ కేసులో శ్రీల‌క్ష్మి పాత్ర స్ప‌ష్టంగా ఉంద‌ని తెలుస్తోంద‌ని..  ఆమెను కేసు నుంచి ఎలా త‌ప్పిస్తార‌ని నిలదీస్తూ..  మ‌రోసారి దీనిపై హైకోర్టు విచార‌ణ చేసి.. ఆదేశాలు ఇవ్వాల‌ని పేర్కొంది. దీంతో హైకోర్టులో మ‌రోసారి శ్రీల‌క్ష్మి.. త‌నను ఈ కేసు నుంచి త‌ప్పించాల‌ని కోరుతూ.. రివిజ‌న్ పిటిష‌న్ దాఖలు చేశారు. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో శ్రీల‌క్ష్మి కేసును విచారించాల్సిందేన‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. సీబీఐ వాదనలు వినకుండా గ‌తంలో ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను ఉప‌సంహ‌ రించుకుంటున్నట్లు హైకోర్టు పేర్కొంది.  వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో కేటాయించిన ఓబులాపురం మైనింగ్ కు సంబంధించి అన్ని అనుమతులనూ శ్రీల‌క్ష్మి  ఇచ్చార‌ని.. ఆమె ఉద్దేశ పూర్వకంగానే ఈ అక్ర‌మాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌నీ సీబీఐ ఆరోపిస్తోంది.  అయితే,  ప్ర‌భుత్వం తీసుకున్న విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల‌కు మాత్ర‌మే తాను అనుమ‌తి ఇచ్చాన‌ని, అధికారిగా త‌న పాత్ర పోషించాన‌ని శ్రీల‌క్ష్మి చెబుతున్న శ్రీలక్ష్మి ఈ కేసు నుంచి తనను తప్పించాలని కోరుతున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
  Megastar Chiranjeevi is set to dazzle once again with Vishwambhara, a grand socio-fantasy spectacle that has already captivated fans across the country. The film has garnered immense attention with its electrifying teaser, chartbuster first single, and striking promotional campaigns. An exclusive book of Vishwambhara was unveiled at the prestigious Cannes Film Festival. Helmed by director Vassishta, Vishwambhara is being mounted on an epic scale by Vikram, Vamsi, and Pramod on UV Creations.   Megastar Chiranjeevi is back in full form as Vishwambhara wrapped up its shoot with a thundering mass dance number featuring none other than Mouni Roy alongside the icon himself. While the film's overall score is composed by Oscar-winner MM Keeravani, this high-energy dance number is composed by Bheems Ceciroleo, known for his flair in crafting mass-appeal tracks.   The lyrics penned by the dynamic Shyam Kasarla, this foot-tapping number is a feast for fans. Ganesh Acharya who choreographed for blockbuster songs in Pushpa and Pushpa 2 took care of the dance choreography of this song, with over 100 dancers setting the floor on fire.   Chiranjeevi will be showcasing his signature grace on the dance floor, while Mouni Roy, a great dancer herself, adds her own spark to the sequence. Mounted on a lavish scale, the song promises to be a visual extravaganza.   Trisha Krishnan is the lead actress, while Ashika Ranganath will be seen in a significant role, alongside Kunal Kapoor.   Chota K Naidu cranks the camera, while the world of Vishwambhara is being intricately crafted by production designer AS Prakash.   The makers are gearing up to kick-start promotional activities soon, along with an announcement of the film’s release date.  
భారతీయ చిత్ర పరిశ్రమలో సింగర్ 'బబ్లామెహతా'(Babla Mehta)కి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో అద్భుతమైన పాటల్ని ఆలపించిన బబ్లా  'గోల్డెన్ వాయిస్ ఆఫ్ ముఖేష్' గా కూడా కీర్తిని గడించాడు.  లెజండ్రీ గాయనిమణి 'లతా మంగేష్కర్'(Lata Mangeshkar)తో కలిసి కూడా పాడటం జరిగింది. ఈ నెల 22 వ తారీఖున బబ్లా మెహతా ముంబైలో గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా బయటకి రాగా, బబ్లా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలియచేసారు. కొన్ని చిత్రాలకి సంగీతాన్ని కూడా అందించడంతో పాటు అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా తన స్వరకల్పనలో వచ్చాయి. దిల్ హై కే మంత నహిన్,  చాందిని, సడక్, తహల్కా,  మేజర్  సాబ్ చిత్రంలోని పాటలు మెహతాకి మంచి  గుర్తింపుని ఇచ్చాయి. ప్రస్తుతం ఆయన వయసు 65 సంవత్సరాలు కాగా 'ఢిల్లీ' స్వస్థలం.   
సినిమా పేరు: మహావతార్ నరసింహ తారాగణం: శ్రీ మహావిష్ణువు, నరసింహుడు, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, శుక్రాచార్యుడు, కయాదు, హోళికా తదితరులు   మ్యూజిక్ : సామ్ సి ఎస్  ఎడిటర్: అశ్విన్ కుమార్  రచన, దర్శకత్వం: అశ్విన్ కుమార్  నిర్మాతలు: విజయ్ కిరంగదుర్, శిల్పాధావన్, కుషాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ బ్యానర్ :హోంబులే ఫిల్మ్స్, క్లిమ్ ప్రొడక్షన్స్ విడుదల తేదీ: జూలై 25 ,2025  కేజిఎఫ్ చాప్టర్ 1 ,చాప్టర్ 2 ,కాంతార, సలార్ వంటి పలు చిత్రాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్  ని సంపాదించుకున్న నిర్మాణ సంస్థ 'హోంబులే ఫిల్మ్స్'. ఈ రోజు 'మహావతార్ నరసింహ'(Mahavatar Narsimha) అనే యానిమేషన్ మూవీతో పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  కథ 'కశ్యపు' మహర్షి దైవస్మరణలో ఉంటాడు. ఆ సమయంలో భార్య 'దితి' చేసిన తప్పు వల్ల 'హిరణ్యాక్షుడు', 'హిరణ్యకశప' అనే రాక్షస అంశతో కూడిన ఇద్దరు కవలల జననం జరుగుతుంది. ఆ ఇద్దరు పెద్దయ్యాక  రాక్షస గురువు 'శుక్రాచార్యుడు'తో కలిసి అసుర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. విష్ణు నామాన్ని స్మరించే వాళ్ళని క్రూరంగా చంపుతుంటారు. వరాహా రూపంతో ఉన్న ఒక శక్తీ హిరణ్యాక్షుడుని సంహరిస్తుంది. దాంతో హిరణ్యకశపుడు మరింత శక్తులని సొంతం చేసుకొని ముల్లోకాలకి అధిపతిగా ప్రకటించుకొని   పరిపాలన సాగిస్తుంటాడు. భార్య 'కయాదు' కడుపున 'ప్రహ్లదుడు' అనే బాలుడు జనియిస్తాడు. తన రాక్షస కులానికి వ్యతిరేకంగా పదిమంది పట్ల జాలి, దయ, ప్రేమని చూపిస్తు విష్ణు నామాన్నే తన శ్వాసగా చేసుకొంటాడు. దీంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ప్రహ్లాదుడు విషయంలో హిరణ్యకశిపుడు తీసుకున్న నిర్ణయం ఏంటి?  విష్ణువుపై హిరణ్యకశిపుడుకి ఎందుకు పగ?  హిరణ్యాక్షుడు సోదరుడిని చంపిన వరాహం ఎవరు? హిరణ్యకశిపుడు శక్తులకి కారణం ఏంటి ? అసుర వంశానికి చెందిన ప్రహ్లాదుడుకి విష్ణు భక్తి ఏర్పడడానికి కారణం ఏంటి? ప్రహ్లాదుడిని విష్ణు ఏ విధంగా కాపాడాడు ? అసలు కశ్యపు' మహర్షి భార్య 'దితి' చేసిన తప్పేంటి? అపార శక్తుల్ని కలిగి ఉన్న  హిరణ్యకశిపుడుని  విష్ణువు  ఏ  విధంగా సంహరించాడు అనేదే ఈ చిత్ర కథ   ఎనాలసిస్  ఈ చిత్ర కథ భారతీయ ఇతిహాసాల్లో పొందుపరిచి ఉండటం, గతంలో చాలా భాషల్లో సినిమాలుగా కూడా వచ్చి ఉండటంతో చాలా మందికి ఈ చిత్ర కథ తెలుసు. కానీ ఇప్పటి తరం కోసం మళ్ళీ తీసుకు రావడంతో చిత్ర బృందాన్ని తప్పకుండా అభినందించాల్సిందే. తెలుగులో భక్త ప్రహ్లాద గా వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. నేటికి ప్రతి ఒక్క విష్ణు భక్తుల ఇళ్లల్లో ఆ చిత్రంలోని పాటలు మారుమోగిపోతూనే ఉంటాయి.  పైగా యానిమేషన్ చిత్రం అనే ఆలోచన కలగకపోవడం ఈ చిత్రం యొక్క స్పెషాలిటీ. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశపల జననానికి గల కారణంతో ఓపెన్ అయ్యి, సినిమాపై ఇంట్రస్ట్ కలిగించింది. కాకపోతే ఇతిహాసాల్లో కశ్యపు మహర్షి కి సంబంధించిన మరో అంశాన్ని కూడా చూపించి  హిరణ్యాక్షుడు, హిరణ్యకశపల జనానికి గల కారణాల్ని మరింత లాంగ్ ప్రాసెస్ లో చూపించాల్సింది. పెరిగి పెద్దయిన ఆ ఇద్దరు విష్ణువు ని ఆరాధించే వాళ్ళని చంపడం దగ్గరనుంచి హిరణ్యాక్షుడు మరణం లాంటి సీన్స్ అన్ని బాగున్నాయి.  ఆ తర్వాత   హిరణ్యకశపుడు ఘోర తపస్సు చేసే ప్రాసెస్ ని కూడా లెన్త్ లో చూపించాల్సింది. సెకండ్ హాఫ్ లో ప్రహ్లాదుడు ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి కథనం వేగంగా సాగింది. ప్రహ్లాదుడు రూపం కూడా చాలా చక్కగా కుదిరింది. నిజమైన ప్రహ్లాదుడు అలాగే ఉండేవాడు ఏమో అనేలా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి  లేదు. చివరి అరగంట  మూవీ మొత్తానికి హైలెట్. సాంకేతిక నిపుణుల పని తీరు 'మహావతార్ నరసింహ' కి డైలాగులు చాలా బలాన్ని ఇచ్చాయి. ఒక మనిషి ఎలా జీవించాలో కూడా చెప్పిన ఆ  మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తాయి.  ఇక ప్రతి క్యారక్టర్ కి చెప్పిన వాయిస్ కూడా  అదనపు బలం. ముఖ్యంగా ప్రహ్లాదుడు కి చెప్పిన వాయిస్ వింటుంటే అమృతాన్ని సేవించి మాట్లాడుతున్నట్టుగా ఉంది. 'నారసింహుడు' కి చెప్పిన వాయిస్ కూడా గంబీరంగా ఉండటంతో పాటు గూస్ బంప్స్ తెప్పించింది. విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఐ ఫీస్ట్ అని చెప్పవచ్చు. సామ్ సిఎస్(Sam cs) అందించిన సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  నభూతో న భవిష్యత్. అంతలా మెస్మరైజ్ చేసాడు. అశ్విన్ కుమార్(AshwinKumar), దర్శకత్వం,ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే మూవీ లవర్స్ , విష్ణు భక్తులని 'మహావతార్ నరసింహ' ఆకట్టుకుంటుంది. యానిమేషన్ మూవీ అని అనిపించకపోవడం కూడా ఒక ప్రత్యేకత.                                                                                                            రేటింగ్ 2 . 5 / 5                                                                                                                                            అరుణాచలం                                                                                
  Cast: Animated Feature  Crew:  Based on Bhagavatam, Vishnu Purana, Narasimha Purana, Prahlada Story  Written by Ashwin Kumar, Jayapurna Das, Rudra Pratap Ghosh Music by Sam CS Editing by Ashwin Kumar, Ajay Varma Directed by Ashwin Kumar  Produced by Kleem Productions  Presented by Hombale Films    Hombale Films have announced Mahavatar Cinematic Universe with films based on Lord Vishnu Avatars. Kleem Productions are producing this massive animated feature film universe starting with Mahavatar Narsimha. Let's discuss about the film in detail.    Plot:  Maharishi Kashyipu and his wife Dhiti participate in reproduction activity during dusk time, which is prohibited by sastras and this results in the birth of two asuras - Hiranyakashyipu and Hiranyaksha. They both grow into enemies of Lord Vishnu and start torturing Devatas. Hiranayaksha hides Mother Earth and Vishnu kills him in Varaha Avatar.  For vengeance, Hiranyakashyipu starts penance towards Brahma and gets a boon that he cannot be killed by a weapon during Day time or Night. He announces himself as God but his son, Prahlada, denounces this claim and becomes devotee of Lord Vishnu. Thus ensues a battle of God vs Demon like never before. Watch the movie to witness Glory of Lord Narasimha.    Analysis:  Ashwin Kumar and his team have decided to give visual representation to popular legendary tales of Lord Vishnu in animation form but their writing lacks depth. Why devotion is greater than bodily strength needed to be brought out in this story rather than visuals.  There is a lot of inspiration from Japanese Anime and Hollywood animation features in visual representation of Indian mythology. It feels like we are watching a flow of events rather than a story of devotion for most part. The animators did work hard to bring to life the visuals but they lack life.  Music by Sam CS is not up to the mark and even few scenes feel like unnecessarily being dragged out. But Lord Narasimha, Lord Vishnu representations are well crafted. Still, the script lacks cohesiveness and impact. For devotees, this film can be watched once.     Bottomline:  Script and Music needed to be better for bigger impact.    Rating: 2.5/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. We would encourage viewers' discretion before reacting to them.  
  గత పదేళ్లుగా అపజయమెరుగని హీరోగా దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ షర్ట్ లేకుండా స్క్రీన్ పై కనిపిస్తే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ కూడా పడిపోయింది. మొదటిసారి 'టెంపర్'లో షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చాడు ఎన్టీఆర్. టెంపర్ సూపర్ హిట్ కావడమే కాకుండా, ఎన్టీఆర్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 'అరవింద సమేత'లో ఇంట్రో ఫైట్ లో షర్ట్ లెస్ గా కనిపించాడు. ఆ ఫైట్ సీక్వెన్స్ లో కత్తికున్న రత్నాన్ని ప్యాంట్ కి పూసే షాట్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. 'అరవింద సమేత' మూవీ ఆ టైంకి ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే 'ఆర్ఆర్ఆర్' ఇంట్రడక్షన్ సీన్ లో కూడా షర్ట్ లేకుండా కనిపించాడు ఎన్టీఆర్. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచనాలు సృష్టించిందో తెలిసిందే. ఎన్టీఆర్ షర్ట్ లెస్ గా కనిపించిన 'టెంపర్', 'అరవింద సమేత', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు మూడూ కూడా ఒకదానిని మించిన ఒకటి విజయం సాధించాయి. ఇప్పుడు 'వార్-2' వంతు వచ్చింది.   'వార్-2'తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాలో.. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా 'వార్-2' ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ ట్రైలర్ కట్ ఉంది. ముఖ్యంగా ఒక షాట్ లో ఎన్టీఆర్ షర్ట్ లేకుండా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'అరవింద సమేత'ను గుర్తుచేసేలా ఆ షాట్ ఉంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎన్టీఆర్ షర్ట్ లెస్ సీన్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి.. 'టెంపర్', 'అరవింద సమేత', 'ఆర్ఆర్ఆర్'లను మించిన విజయం 'వార్-2' సాధిస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.  
  'వార్-2' మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా 'వార్'కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో.. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే నెలలో విడుదలైన టీజర్ ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోని మరింత పవర్ ఫుల్ గా చూడాలనుకున్నారు. అందుకే ట్రైలర్ కోసం వారు ఎంతగానో ఎదురుచూశారు. (War 2 Trailer)   'వార్-2' ట్రైలర్ తాజాగా విడుదలైంది. రెండున్నర నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ కట్ అదిరిపోయింది. "నేను ప్రమాణం చేస్తున్నాను. నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, నా కుటుంబాన్ని.. అన్నింటినీ వదిలేసి ఒక నీడలా మారిపోతాను" అంటూ హృతిక్ రోషన్ పాత్రను పరిచయం చేశారు. "నేను మాట ఇస్తున్నాను. ఎవరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను." అంటూ ఎన్టీఆర్ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. హృతిక్, ఎన్టీఆర్ పాత్రలు పోటాపోటీగా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ షాట్ కానీ, బ్లాస్ట్ లోనుంచి జంప్ చేసే షాట్ కానీ.. ఫ్యాన్స్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇద్దరు సైనికుల మధ్య భీకర యుద్ధం అన్నట్టుగా ట్రైలర్ కట్ ఉంది. టీజర్ తో పోలిస్తే ట్రైలర్ లో ఎన్టీఆర్ షాట్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఇక యాక్షన్ సీన్స్ లో అయితే ఎన్టీఆర్ డైనమైట్ లా కనిపిస్తున్నాడు. హృతిక్ కళ్ళలోకి ఎన్టీఆర్ కళ్ళుపెట్టి చూసే షాట్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది అనడంలో డౌట్ లేదు. "కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన" అనే భగవద్గీత శ్లోకంతో హృతిక్-ఎన్టీఆర్ ల మధ్య ఫైట్ తో ట్రైలర్ ను ముగించిన తీరు బాగుంది.   'వార్-2' టీజర్ చూసి కాస్త నిరాశచెందిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఇప్పుడు ట్రైలర్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా ట్రైలర్ కట్ ఉందని, కొన్ని షాట్స్ లో ఎన్టీఆర్ ని చూపించిన తీరు నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉందని సంబరపడుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచే కాదు.. యాక్షన్ ప్రియుల నుంచి కూడా ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుత బజ్ చూస్తుంటే 'వార్-2' మూవీ రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.  
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అభిమానులతో పాటు సినీప్రేమికులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న 'హరిహర వీరమల్లు'(HariHara Veeramallu)ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదలైంది. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుంచే అన్నిచోట్ల ప్రతేక్య 'షో' లు ప్రదర్శించడంతో అభిమానులతో పాటు పవన్ పొలిటికల్ పార్టీ 'జనసేన'(Janasena)కి చెందిన పలువురు ఎంఎల్ఏ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరమల్లుని వీక్షించడం జరిగింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)రాష్ట్రానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి 'కందుల దుర్గేష్'(Kandula Durgesh)వీరమల్లుని చూడటం జరిగింది. ఈ సందర్భంగా ఒక మీడియా పర్సన్ కందుల దుర్గేష్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు పవన్ రాజకీయాల్లో ఉంటు సినిమాల్లో చేస్తున్నాడు కాబట్టి వీరమల్లుని బాయ్ కాట్ చెయ్యాలని అంటున్నారు కదా అని అడగడం జరిగింది. అనంతరం దుర్గేష్ మాట్లాడుతు 'సినిమాల్లో నటించడం పవన్ గారి వృత్తి.   బ్యాన్ చెయ్యాలనే వైసిపీ వాళ్లకి దొంగ వ్యాపారాలు, దొంగ మైనింగ్, రకరకాల పత్రికలు, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా లాంటివి ఆదాయ వనరులుగా చేసుకుని డబ్బు సంపాదించవచ్చు. కానీ పవన్ గారు తనకి నచ్చిన వృత్తిని, ఆదాయ మార్గంగా చేసుకొని సినిమాల్లో నటిస్తున్నారు. భారతదేశం యొక్క సంస్కృతిని, ఔనత్యాన్ని నిలబెడుతున్న వీరమల్లు లాంటి సినిమాలు తెరకెక్కిస్తున్నందుకు బ్యాన్ అంటున్నారా. వాళ్ళకి వాళ్ళు చేసే దొంగతనం పనులు చూపిస్తున్న సినిమాలు నచ్చుతాయేమో అని చెప్పుకొచ్చాడు.    
  ఫ్యాన్స్ సెలబ్రేషన్ లందు మెల్బోర్న్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వేరయా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు.. మెల్బోర్న్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా 'వార్-2' సెలబ్రేషన్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు అక్కడి ఫ్యాన్స్.   'ఆర్ఆర్ఆర్' చిత్రం సమయంలో 'JAI NTR RRR' అని వచ్చేలా కార్లను ఇంగ్లీష్ లెటర్స్ లా పేర్చి సర్ ప్రైజ్ చేశారు మెల్బోర్న్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆ తర్వాత 'దేవర' మూవీ టైంలో 'DEVARA' అనే పేరు వచ్చేలా నీటిలో పడవలను పేర్చి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు 'వార్-2' వంతు వచ్చింది.   ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జూలై 25న ట్రైలర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన సెలబ్రేషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నింగిలో స్మోక్ ఎఫెక్ట్ తో 'NTR WAR 2' అని రాశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)సుమారు మూడు సంవత్సరాల తర్వాత ఈ రోజు 'హరిహర వీరమల్లు' గా థియేటర్స్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి ప్రీమియర్ షో కూడా ప్రదర్శించడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా పవన్ కెరీర్ లోనే వీరమల్లు బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి జరిగిన ప్రమోషన్స్ లో పవన్ మాట్లాడుతు సంగీత దర్శకులు  'కీరవాణి' గారు లేకపోతే వీరమల్లు మూవీ లేదని, మేము డల్ గా ఉన్న ప్రతిసారి ఆయన ఇచ్చిన ఆర్ఆర్ తో కొత్త ఉత్సాహం వచ్చేదని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మూవీ చూసిన ప్రేక్షకులు కీరవాణి(Keeravani)గురించి పవన్ చెప్పిన మాటలు అక్షర సత్యమని, తన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వీరమల్లుకి చాలా ప్లస్ అయ్యాడని చెప్తున్నారు. మూవీలో అద్భుతంగా నటించిన మొదటి హీరో 'పవన్ కళ్యాణ్' అయితే, భారీ బడ్జెట్ తో నిర్మించి ఎన్నో వ్యయప్రయాసలని ఓర్చుకొని రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ ఏఎంరత్నం' (Am Rathnam)రెండో హీరో. మూడో హీరో కీరవాణి(Keeravani)అనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.  ఔరంగ జేబు క్యారక్టర్ లో బాలీవుడ్ అగ్రనటుడు 'బాబీడియోల్' కనిపించిన వీరమల్లులో పవన్ కి జోడిగా నిధి అగర్వాల్ చేసింది. రఘుబాబు,సునీల్, సుబ్బరాజు, నాజర్, సత్యరాజ్ ఇతర పాత్రల్లో కనిపించగా క్రిష్ ,జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.      
  పవన్ కళ్యాణ్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ తాజాగా 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చిత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమా విడుదల గురువారం(జూలై 24) కాగా, బుధవారం(జూలై 23) రాత్రి నుంచే షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రీమియర్ షోలు ఫుల్ అయ్యి.. భారీ ఓపెనింగ్స్ కి పునాది పడింది. ఇప్పుడిదే బాటలో 'కింగ్‌డమ్‌' (Kingdom) అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.   విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'కింగ్‌డమ్‌' మూవీ జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇండియాలో జూలై 30 రాత్రి నుంచే ఈ మూవీ ప్రీమియర్స్ వేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దానికి కారణం కంటెంట్ పై ఉన్న నమ్మకమే అని అంటున్నారు.   విజయ్ ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు. అందుకే ఆయన గత చిత్రాల స్థాయిలో 'కింగ్‌డమ్‌'పై భారీ హైప్ లేదనే మాట వినిపిస్తోంది. అయితే ఇదే తమకు కలిసొస్తుందని మేకర్స్ నమ్ముతున్నారట. 'లైగర్' వంటి సినిమాలు భారీ అంచనాలతో వచ్చి.. దారుణంగా నిరాశపరిచాయి. 'కింగ్‌డమ్‌' విషయంలో అది రివర్స్ అవుతుందని నిర్మాతలు అనుకుంటున్నారట. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై.. కంటెంట్ తో అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందనేది వారి నమ్మకమట. అదే కాన్ఫిడెన్స్ తో ప్రీమియర్స్ కి సైతం రెడీ అవుతున్నట్లు సమాచారం.    ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల పెంపుకి అనుమతి లభించింది. ఇక మేకర్స్ నమ్మకం నిజమై.. ప్రీమియర్స్ కి పాజిటివ్ టాక్ వస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది అనడంలో సందేహం లేదు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
తల్లి కావడం అనేది ప్రతి స్త్రీకి అత్యంత సంతోషకరమైన,  బాధాకరమైన అనుభూతి. వారి స్వంత జీవితాన్ని పక్కన పెడితే, మహిళలు కొత్తగా ఒక  చిన్న జీవితానికి ప్రాణం పోస్తారు. అటువంటి పరిస్థితిలో ప్రసవం తర్వాత వారి జీవనశైలి, దుస్తులు ధరించడం,  జీవనశైలి పూర్తిగా మారిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో తల్లి అయిన మహిళలకు  కుటుంబ మద్దతు చాలా అవసరం అవుతుంది.   ప్రతి తల్లి తన బిడ్డ గురించి చాలా భావోద్వేగంగా,  సున్నితంగా ఆలోచిస్తుంది. కొంతమంది దీనిని అర్థం చేసుకోలేరు. దీని కారణంగా చాలా సార్లు ప్రజలు తెలియకుండానే తల్లుల భావాలను దెబ్బతీసే  మాటలు అంటుంటారు. బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీ ముందు ఎవ్వరూ పొరపాటున కూడా మాట్లాడకూడని విషయాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. పిల్లవాడు ఏడుస్తున్నాడు, సరిగ్గా చూసుకో.. నీ బిడ్డ ఏడుస్తున్నాడు,  బిడ్డను సరిగ్గా చూసుకో అని ఎప్పుడూ తల్లికి చెప్పడం మంచిది కాదు.  రాత్రిపూట పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు  తరచుగా ఇలా అంటారు. ఇలా చెప్పడం సులువే.. తామేదో గొప్ప జాగ్రత్త చెప్పాం అనుకుంటారు. కానీ ఈ విషయం ఆ స్త్రీ యొక్క మాతృత్వ సామర్థ్యాన్ని నేరుగా దెబ్బతీస్తుంది. బిడ్డ ఏడుపుతో ఎక్కువగా బాధపడేది తల్లి. అటువంటి పరిస్థితిలో పిల్లవాడిని ఊరుకోబెట్టడంలో  ఆమెకు మద్దతు ఇవ్వాలి తప్ప  పొరపాటున కూడా ఆమెను విమర్శించకూడదు. నీకు పిల్లవాడిని చూసుకోవడం చేతకాదు.. పిల్లవాడిని స్నానం చేయించడం నుండి పిల్లాడిని రెడీ చేసి,  పాలిచ్చి నిద్రపుచ్చడం వరకు ప్రతి స్త్రీ చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా సార్లు స్త్రీలు చాలా కాలం తర్వాత కూడా బిడ్డను ఎలా చూసుకోవాలో అర్థం చేసుకోలేరు.  వార గందరగోళానికి గురవుతూ ఉంటారు.  ఇలాంటి  సమయంలో కుటుంబం వారికి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి తల్లి నేర్చుకునే ప్రయాణం భిన్నంగా ఉంటుంది. ప్రతిదీ నేర్చుకోవడానికి సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో వారి సామర్థ్యాన్ని ప్రశ్నించే బదులు, వారికి మద్దతు ఇవ్వడం మంచిది. బిడ్డను ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకుని చెడగొడుతున్నావు.. తల్లి,  బిడ్డల మధ్య స్పర్శ బిడ్డకు బంధం ,  భద్రతకు ఒక మార్గం. ఇది ఏ రకమైన "చెడు అలవాటు" కాదు. కాబట్టి బిడ్డను ఎప్పుడూ  చేతుల్లోనే ఉంచుకోవద్దని తల్లికి ఎప్పుడూ చెప్పకండి. బిడ్డకు తల్లి ఒడిలో అత్యంత సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతుంది. ఈ మాత్రం దానికే అలసిపోతావా? తల్లి అయిన తర్వాత బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి స్త్రీకి పూర్తి సమయం ఉద్యోగంగా మారుతుంది.  అది ఆమె నిర్వర్తించాల్సిన విధి కూడా. చిన్న పిల్లలు రాత్రంతా ఏడుస్తారు, అలాంటి పరిస్థితిలో  తల్లులు  రాత్రి నిద్రపోలేరు. అలాంటి పరిస్థితిలో నువ్వు బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడం, నువ్వు ఎందుకు అంత అలసిపోతావు అనడం చేయకూడదు.  అది వాళ్ళని చాలా బాధపెడుతుంది. ప్రారంభ రోజుల్లో, ప్రతి తల్లి తనకోసం అరగంట కూడా కేటాయించుకోలేకపోతుంది.                          *రూపశ్రీ.  
  చాలామందిలో భయం సిగ్గు అనేవి లక్షణాలుగా ఉంటాయి. ఇవి చాలామంది సహజమే అనుకుంటారు. మరికొందరు అయితే వారి స్వభావమే అంత అనుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల్లో ఇలాంటి లక్షణాల గురించి నలుగురిలో ఉన్నప్పుడు మావాడికి భలే బిడియమండీ.. తనకు తాను ఏదైనా చేయాలంటే తడబడతాడు, మా అమ్మాయి చాలా మొహమాటస్తురాలు ఎవరితోనూ తొందరగా మాట్లాడదు, ఎవరితోనూ కలవదు అని చెబుతుండటం గమనిస్తూనే ఉంటాం. అయితే ఈ లక్షణాలు పిల్లల్లో ఉండటం వల్ల అదేదో బుద్దిమంతుల లక్షణం అన్నట్టు ఫీలైపోతారు చాలామంది తల్లిదండ్రులు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే.. పెరిగి పెద్దయ్యే కొద్దీ ఈ లక్షణాలు మనిషిని ఎదగనీయకుండా చేస్తాయి.  బిడియపడే వ్యక్తి తనని తనే విభజించుకుంటాడు. ఆ వ్యక్తిలో ఆత్మస్థైర్యం  బలహీనంగా ఉంటుంది. ఇలా బిడియపడేవారికి కూడా  సమాజంతో అందరితో పరిచయం పెంచుకోవాలని అనిపిస్తుంది. పేరు తెచ్చుకోవాలని అనిపిస్తుంది. కానీ.. ఇవేమీ సాధించలేరు.  ఎందుకంటే బిడియపడే వ్యక్తి అంతరాత్మ ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటుంది. వీరిలో రెండు రకాల ఆలోచనలు ఉంటాయి.  ఒకటి.. ఇతరులతో స్నేహం చేయడంలో ప్రమాదాన్ని ఊహించడం. రెండు.. తన స్నేహన్ని ఇతరులు తక్కువగా చూస్తారని జంకడం. ఇలాంటి వ్యక్తులు అంగవైకల్యంతో బాధపడే రోగిలాగా ప్రవర్తిస్తారు. కేవలం ఈ ఒక్క లక్షణం వల్ల ఆ వ్యక్తి మొత్తం జీవితమే గందరగోళంగా తయారౌతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఏది చేయాలన్నా సిగ్గు బిడియాలు అవరోధకాలుగా మారతాయి. ఇకపోతే… ఈ సిగ్గు, బిడియం వల్ల కలిగే సమస్యల గురించి చెప్పుకుంటే...మితిమీరిన సిగ్గువల్ల మాటలు తడబడతాయి. కాళ్ళు వణుకుతాయి. అ వ్యక్తి అసంపూర్ణమైన వ్యక్తిత్వంతో మిగిలిపోతాడు అందరూ తనని తృణీకార భావంతో చూస్తున్నట్లుగా బాధపడతాడు. అతను తన అస్థిత్వాన్ని తాను ఋజువు పర్చుకోలేడు. సంఘ జీవితం అసంతృప్తిగా వుంటుంది. ఆఖరుకి అతని క్రింద ఉద్యోగస్థులు కూడా తనని ఏదో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద గౌరవిస్తున్నారని భావిస్తాడు. అంటే వ్యక్తి తనని తాను అల్పుడిగా భావించుకోవడం తనను అందరికంటే తక్కువగా చూసుకోవడం జరుగుతుంది.   వ్యక్తిలో ఎంతో ప్రతిభ ఉంటుంది కానీ..తన ప్రతిజ్ఞా పాటవాలని ఎలా ప్రదర్శించాలో, తవ క్రింద ఉద్యోగస్థుల యొక్క విస్వాశాన్ని ఎలా పొందాలో తెలియదు. బిడియం వల్ల అందరూ తక్కువ ధరకు కొనే వస్తువును బేరం ఆడలేక, అలా బేరం చేయడం చేతకాక, బేరం చేస్తే ఎవసరు ఏమనుకుంటారో అనే భావంతో  ఎక్కువధర చెల్లించి కొంటారు. ఇతరులు తనని చూసి నవ్వితే హేళనగా నవ్వుకుంటున్నారని భావిస్తారు. ఎవరన్నా  అభినందనలు తెలియచేస్తే అయోమయములో సరిపోతారు. ఇతరులు  చెప్పేదానిని ప్రతిఘటించడానికి భయపడిపోతారు.  మనుషుల్లో ఈ సిగ్గు, బిడియం అనేవి ఎందుకు చోటుచేసుకుంటాయి అంటే.. ఓ మనిషిలో సిగ్గు బిడియాలు చాలా కారణాల వల్ల కలుగుతాయి.  మొట్టమొదటి కారణం..   ప్రకృతి సహజమైన మనస్తత్వం. వ్యక్తిలో ఉన్న ప్రకృతి సహజంగా గుణం ఆ వ్యక్తిని సిగ్గుకు, భయానికి గురి చేస్తుంది. ఫలితంగా సున్నిత మనస్కులుగాను స్తబ్దులుగాను భయస్తులుగా, రూపొందుతారు.  రెండవ కారణం..  పరిసరాల ప్రభావం. వ్యక్తి మీద పరిసరాల ప్రభావం చాలా తీవ్రంగా చూపిస్తుంది. బాల్యంలో ఒంటరి జీవితం గడిపినా  లేదా తల్లిదండ్రులు అతిగా గారాబం చేయడం వల్ల కానీ, లేదా చిన్నతనం నుండి బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు మొదలైనవారికి దూరంగా ఉండటం వల్ల కానీ.. (చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చదువుకోవాలి. చదువుకునే పిల్లలు తిరగకూడదు, బయటకు వెళ్లకూడదు, ఆడుకోకూడదు వంటి నమ్మకాలతో పిల్లలను ఎక్కడికీ పంపరు, బంధువుల దగ్గరకు, స్నేహితులతో, బయట సరదాగా గడపడానికి ఇలా అన్నిటికీ దూరం ఉంచుతారు) చిన్నవయసులో  తల్లిదండ్రులచేత విపరీతమైన ఆంక్షలు, కట్టుదిట్టమైన జాగ్రతలు విధింపబడటం వల్లగాని, లేదా ఇవేమీ కాకపోయినా, బాల్యం నుంచీ యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలోనైనా తెలియకుండానే ఒకానొక బిడియం, సిగ్గు అలవాటైపోతాయి. కొందరిలో వయసు పెరిగేకొద్దీ ఈ బిడియం, సిగ్గు అనేవి తగ్గుతాయి. కానీ మరికొందరిలో ఇవి కూడా క్రమంగా పెరిగి జీవితంలో ఎదుగుదలకు అడ్డంకిగా మారతాయి. కారణమేదైనా, ఇటువంటి అనవసరమైన సిగ్గు బిడియాలు జీవితం తాలూకు సంతోషాలను ఆస్వాదించకుండా,  అమభవించనీయకుండా చేస్తాయి. కేవలం మనకి మనమే  సృష్టించుకుంటున్న ఈ పూర్తి మానసిక అవలక్షణం వల్ల జీవితమే దుర్భరమైపోతుంది. అయితే.. ఇలా సిగ్గుపడే వ్యక్తులు తమని తామే కొన్ని ప్రశ్నలు వేసుకుంటే వారిలో మార్పు సాధ్యమవుతుంది.  ఎందుకు ? సిగ్గుకు, బిడియానికి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.   ఎలా?  సిగ్గును ఎలా ప్రకటిస్తారు?? తడబాటుతోనా లేదా భయపడుతూనా..  ఎర్రబడ్డ మొహంతోనా లేదా మనుషులకు దూరంగా వెళ్లడం ద్వారానా..  ఎప్పుడు? ఎటువంటి పరిస్థితుల్లో లేదా ఎవరి సమక్షంలో అధికంగా సిగ్గుపడతారు. అది ఎందుకు అలా జరుగుతోంది. ఎక్కడ? ఎక్కడ అంటే ఎలాంటి సందర్భాలలో ఈ లక్షణం అధికంగా బయటపడుతుంది?  ఈ ప్రశ్నలు వేసుకుని వాటికి సమాధానాలు వెతుక్కుంటే.. ఈ సిగ్గు, బిడియం అనే సమస్యలను సులువుగా అధిగమించవచ్చు.                                      ◆నిశ్శబ్ద.
  ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషమే కావాలని కోరుకుంటారు.  కష్టం కావాలని,  ఇబ్బందులు ఎదుర్కోవాలని ఏ కోశాన ఆలోచించరు. కానీ కష్టసుఖాలు అనేవి చీకటి వెలుగుల లాంటివి.  ఒకదాని తరువాత మరొకటి రాక తప్పవు. అయితే సంతోష సమయాలను ఆస్వాదించినట్టు వాటిని స్వీకరించినట్టు కష్ట సమయాలను తీసుకోలేరు. కానీ ఆచార్య చాణక్యుడు చెప్పిన రహస్యాలు తెలుసుకుంటే.. ఈ కష్ట సమయాలను కూడా చాలా త్వరగా, సులువుగా దాటేయచ్చు. అవేంటో తెలుసుకంటే.. వాస్తవం.. ఏ వ్యక్తినైనా జీవితంలో  అత్యంత కష్టతరమైన సమయమే ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది  స్వంత సామర్థ్యాలను గుర్తించగలిగే సమయం. ఇతరుల కంటే తాము ఎంత బలంగా ఉన్నాము,  ఇతరుల కంటే ఎంత ప్రత్యేకంగా ఉన్నాం.. అనే విషయాన్ని ఇది తెలుపుతుంది.  ఓపిక.. కష్ట సమయాల్లో ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఓపిక లేకపోతే తొందరపడి తప్పు నిర్ణయం తీసుకోవచ్చు. దీని కారణంగా సమస్య  మరింత పెరుగుతుంది. దీనితో పాటు చెడు సమయాల్లో జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యం. ఆలోచన.. కష్ట  సమయంలో ఒక చిన్న తప్పు కూడా  చాలా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. అందుకే ఆచార్య చాణక్యుడు కష్ట సమయాల్లో ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా వేయాలని చెబుతాడు. బలం.. కష్ట సమయాల్లో తన బలాన్ని గుర్తించి, దానిని సరిగ్గా ఉపయోగించుకునే గుణం  వ్యక్తికి ఉండాలి. కష్ట సమయాల్లో తన సామర్థ్యాలను విశ్వసిస్తే, త్వరగా పరిష్కారం కనుగొంటాడని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. ఆరోగ్యం.. కష్ట సమయాల్లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే  ఆరోగ్యంగా ఉన్నప్పుడే,  సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసిక స్థితి కూడా దృఢంగా ఉంటుంది. ప్రణాళిక.. చాణక్యుడి ప్రకారం ప్రతి వ్యక్తికి కష్ట సమయాల్లో ఒక ప్రణాళిక ఉండాలి. తద్వారా  సరైన దిశలో ముందుకు సాగవచ్చు. దీనితో పాటు, ప్రతి వ్యక్తి చెడు సమయాల్లో ఉపయోగకరంగా ఉండేలా డబ్బును కూడా ఆదా చేయాలి. సానుకూలత.. కొంతమంది కష్టకాలం వచ్చిన వెంటనే కొన్ని వదిలేయాలని చూస్తారు.   ఆ పరిస్థితి నుండి బయటపడటానికి ప్రయత్నించరు. అందుకే  ఆచార్య చాణక్యుడు క్లిష్ట పరిస్థితుల్లో  ఆలోచనను సానుకూలంగా ఉంచుకోవడం ముఖ్యం అని చెప్పారు. సానుకూల ఆలోచనతో  సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. దీనితో పాటు బలాన్ని పొందుతూ ఉండటానికి కుటుంబ సహకారం కూడా అవసరం.                                *రూపశ్రీ.  
  భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఉదయాన్నే పనులు చురుగ్గా మొదలుపెట్టాలన్నా, సాయంత్రం అలసట నుండి బయటపడాలన్నా టీ ఉండాల్సిందే.. అయితే రోజూ తాగే టీలో పాలు కలపడకుండా అందులో కాస్త నిమ్మరసం జోడిస్తే చాలా షాకింగ్ రిజల్ట్ ఉంటాయని అంటున్నారు వైద్యులు,  ఆహార నిపుణులు. దీన్నే లెమన్ టీ అంటారు.  రోజూ ఒక కప్పు లెమన్ టీ తాగడం మొదలుపెడితే  ఒకటి,  రెండు కాదు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. ఇంతకూ లెమన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి..  హైడ్రేషన్.. లెమన్ టీ  అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది  రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. నిమ్మకాయ విటమిన్ సి కి అద్భుతమైన మూలం. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి,  శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి అవసరం. లెమన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు,  ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల నుండి  రక్షించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, లెమన్ టీ సహజ నిర్విషీకరణ కారకంగా పనిచేస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో, కాలేయం,  మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో,  శరీరాన్ని లోపలి నుండి శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ, బరువు.. ఎక్కువగా  జీర్ణ సమస్యలు ఎదుర్కునేవారు లెమన్ టీ తీసుకుంటే చాలా మంచిది. లెమన్  టీ జీర్ణ సమస్యలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే ఆమ్ల లక్షణాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఆహారాన్ని జీర్ణం చేయడాన్ని సులభతరం చేస్తాయి. ఇది ఉబ్బరం, గ్యాస్,  అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కేవలం జీర్ణ సమస్యలకు మాత్రమే కాదు.. లెమన్ టీ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.  నిమ్మకాయ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని లెమన్ టీ తాగడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును కాల్చే ప్రక్రియ వేగవంతం అవుతుంది.  కడుపు నిండిన  ఫీలింగ్ ఇస్తుంది. దీని వల్ల  అనవసరమైన ఆకలిని కూడా నియంత్రించవచ్చు. చర్మం.. లెమన్  టీ  అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని అకాల వృద్ధాప్యం,  ముడతలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం క్లియర్ గా , ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా కనిపిస్తుంది. మొటిమలు, మచ్చలు..  మొటిమలు,  మచ్చలను తగ్గించడంలో కూడా లెమన్ టీ సహాయపడుతుంది.   ఒత్తిడి,  ఆందోళనను తగ్గించడంలో సహాయపడే  ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నిమ్మకాయ వాసన,  వేడిగా ఉండే లెమన్  టీ శరీరానికి రిలాక్స్ ఇస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం.. లెమన్ టీలో లభించే పాలీఫెనాల్స్,  యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి  మేలు చేస్తాయి. అవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తపోటును నియంత్రించడంలో,  చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బులు,  స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు.. నిమ్మకాయలో నోటి ఆరోగ్యానికి ప్రయోజనకరమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం ద్వారా దుర్వాసనను తగ్గించడానికి,  చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే రోజుకు 2 నుండి 3 కప్పుల కంటే ఎక్కువ లెమన్ టీ తాగకూడదు.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
   భారతీయులకు పరాఠాలు, రోటీలు అంటే చాలా ఇష్టం. చాలా ఇళ్ళలో  పూరీలు,  స్టఫ్డ్ చేసిన పరాఠాలు  చాలా సాధారణం. బంగాళాదుంపలు, పనీర్, జున్ను, మాంసం.. ఇట్లా చాలా పదార్థాలు పరాఠాల స్టఫింగ్ లో వాడతారు. పరాఠా రుచి ఇనుమడించడం కోసం చాలా రకాలుగా పరాఠాలు చేస్తుంటారు.  కానీ ఇట్లా పరాఠాలు చేయడం అన్ని విదాలుగా ఆరోగ్యకరమైనది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. కొన్ని రకాల పదార్థాలు స్టఫ్ చేసి పరాఠాలు తయారు చేసుకుని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా పెరుగుతుందట. అలాగే ఊబకాయం కూడా సందేహం లేకుండా వస్తుంది అంటున్నారు. ఇంతకీ పరాఠాలలో స్టఫ్ చేయకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుంటే.. ప్రాసెస్డ్ చీజ్ లేదా మయోనైస్.. ఈ రోజుల్లో చీజ్ పరాఠాలు లేదా మాయో స్టఫ్డ్ రోల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ ప్రాసెస్ చేసిన వస్తువులలో సంతృప్త కొవ్వులు,  రసాయన ప్రజర్వేటివ్స్  ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.  ఊబకాయం,  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. సరిగ్గా ఉడికించని మాంసం లేదా కీమా..  పూర్తిగా ఉడికించకుండా ముక్కలు చేసిన మాంసం లేదా మటన్‌తో నింపితే అది ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది. సరిగ్గా ఉడికించని మాంసం బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది.  గ్యాస్, వాంతులు, విరేచనాలు వంటి కడుపు సమస్యలను కలిగిస్తుంది.  ఎక్కువ నూనెతో సుగంధ ద్రవ్యాలు.. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు లేదా ఏదైనా కూరటానికి ఎక్కువ నూనె,  సుగంధ ద్రవ్యాలు జోడించిన పదార్థాలు స్టప్ చేస్తే  అది  కడుపు  జీర్ణ శక్తిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఆమ్లతత్వం,  గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. మిగిలిన కూరలు లేదా కూరగాయలు.. చాలా మంది మిగిలిపోయిన కూరగాయలను పరాఠాలలో ఉపయోగిస్తారు, కానీ ఏమైనా కాస్త పాడైన  కూరగాయలు శరీరంలో విషాన్ని కలిగిస్తాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్ లకు  దారితీస్తాయి. అధిక ఉప్పు లేదా ఊరగాయ.. కొంతమంది  ఊరగాయ లేదా ఎక్కువ ఉప్పు జోడించడం ద్వారా పరాఠా రుచిని పెంచాలని కోరుకుంటారు. కానీ ఊరగాయలో ఉండే అధిక ఉప్పు కంటెంట్ కడుపులో చికాకు, ఆమ్లతత్వం,  అధిక రక్తపోటు వస్తుంది. అధిక ఉప్పు గుండె జబ్బులు,  మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
   చాక్లెట్ అంటే అందరికీ ఇష్టం.. సాధారణ చాక్లెట్ లు అందరికీ తెలుసు కానీ  డార్క్ చాక్లెట్ గురించి చాలామందికి తెలియదు. కానీ డార్క్ చాక్లెట్ అంటే ఇష్టపడే వారికి మాత్రం దాని ప్రయోజనాలు కొద్దో గొప్పో తెలిసి ఉంటాయి.  ఎందుకంటే ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.  ముడి లేదా ప్రాసెస్ చేయని బీన్స్ లేదా కోకో నుండి తయారుచేసిన డార్క్ చాక్లెట్ ను  మాత్రమే తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరానికి ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు లభిస్తుంది. డార్క్ చాక్లెట్‌లోని కొవ్వు కోకో బటర్  నుండి వస్తుంది. అందువల్ల కృత్రిమ చక్కెర కలిగిన చాక్లెట్‌కు బదులుగా పరిమిత పరిమాణంలో డార్క్ చాక్లెట్ తినడం మంచిదని భావిస్తారు. డార్క్ చాక్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ప్రయోజనాలు.. డార్క్ చాక్లెట్ లో ఉన్న గొప్పదనం ఏమిటంటే ఇందులో చాలా తక్కువ కేలరీలు,  చక్కెర కంటెంట్ ఉంటుంది.  దీనిని తినడం వల్ల ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. బరువు తగ్గాలనుకునే వారు తీపి తినాలని అనిపించినప్పుడు ఓ ముక్క  డార్క్ చాక్లెట్‌ను  తీసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. ఈ చాక్లెట్ తీసుకోవడం ద్వారా హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇందులో ఆక్సీకరణ ఒత్తిడిని తొలగించే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను ఫిట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. దీన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. డార్క్ చాక్లెట్‌లో ఉండే ఐరన్, మెగ్నీషియం,  రాగి శరీరంలో శక్తిని నిలుపుకుంటాయి. నిద్ర సమస్యలు ఉన్నవారు  డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. దీని వల్ల  మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తుందని  భావిస్తారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే, దీని వినియోగం ముఖంపై మెరుపును తెస్తుంది.  అయితే సరైన పరిమాణంలో తీసుకుంటేనే ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజూ డార్క్ చాక్లెట్ తినడం మంచిదేనా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం డార్క్ చాక్లెట్ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.  కానీ దానిని ప్రతిరోజూ తినకూడదు. దీనికి కారణం దానిలో ఉండే కెఫిన్. దాదాపు 100 గ్రాముల డార్క్ చాక్లెట్‌లో కెఫిన్ మొత్తం దాదాపు 80 మిల్లీగ్రాములు. డార్క్ చాక్లెట్‌లో పండ్ల సారం పేరుతో చక్కెరను కలిపే కంపెనీలు చాలా ఉన్నాయి.  చాక్లెట్ తినడం చాలా ఇష్టపడితే  డార్క్ చాక్లెట్ తినవచ్చు. కానీ  దీన్ని ప్రతిరోజూ తినకూడదు. డార్క్ చాక్లెట్ ఎక్కువగా తినడం వల్ల  ఏమవుతుంది? డార్క్ చాక్లెట్ తినడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. డార్క్ చాక్లెట్‌లో కెఫిన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజూ లేదా పెద్ద పరిమాణంలో తినేవారికి తలనొప్పి లేదా మైగ్రేన్, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ప్రతిరోజూ దీన్ని తినడం మానుకోవాలి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..