జగన్ రోడ్ షోకు నో పర్మిషన్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయనకు రోడ్డు మార్గంలో అనుమతి లేదని అనకాపల్లి పోలీసులు తేల్చి చెప్పారు. జగన్ దాదాపు 63 కిలోమీటర్లు రోడ్ షో చేయాలని భావించారు. అయితే ఇటీవల  తమిళనాడు కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించాన సంఘటనను పేర్కొంటూ.. జగన్ రోడ్ షోకు అనకాపల్లి పోలీసులు అనుమతి నిరారించారు. అయన వైజాగ్ నుంచి  నేరుగా హెలికాప్ట‌ర్‌లో వెళ్లేందుకు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్న‌ట్టు చెప్పారు. అసలింతకీ విషయమేంటంటే.. జగన్ గురువారం (అక్టోబర్ 9) విశాఖకు 63 కిలోమీటర్ల దూరంలో ఉనన వాకవరపాలెంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసన చేపట్టనున్నారు. ఇందు కోసం ఆయన వైజాగ్ నుంచి రోడ్ మార్గం ద్వారా 53 కిలోమీటర్లు ప్రయాణించాలని నిర్ణయించారు. ఇందుకోసం స్థానిక వైసీపీ నాయకులు పోలీసుల అనుమతి కోరారు. 

త‌న హ‌యాంలో తీసుకు వ‌చ్చిన 17 మెడిక‌ల్ కాలేజీల్లో 12 కాలేజీల‌ను ప్ర‌వేటు భాగ‌స్వామ్యానికి ఇవ్వ‌డాన్ని తప్పుపడుతున్న జగన్ నిరసనలకు పిలుపునిచ్చారు. దీనిపై స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు.. త‌న నియోజ‌ క‌వ‌ర్గం లోనూ.. కొత్త‌గా మెడిక‌ల్ కాలేజీ ప్రారంభించి వ‌దిలేశార‌ని   ఇటీవ‌ల వ్యాఖ్యానించారు.  దానికి జీవో కూడా లేద‌ని.. అది ఎప్ప‌టికి పూర్త‌వుతుందో కూడా చెప్ప‌లేమ‌నీ అన్నారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందించిన జగన్.. స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడి నియోజ‌క‌వ‌ర్గంలో మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందనీ,  ఆ విషయాన్ని తానే స్వయంగా నిరూపిస్తాననీ సవాల్ విసిరి మకవర పాలెం పర్యటకు రెడీ అయ్యారు. విశాఖ నుంచి 63 కిలోమీటర్లు రోడ్ షో ద్వారా మాకవర పాలెంలో నిర్మాణంలో ఉన్న కాలేజీని సందర్శించేందుకు సమాయత్తమయ్యారు. అయితే జగన్ రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

కావాలంటే. విశాఖ నుంచి హెలికాప్టర్ లో మాకవర పాలెం వెళ్లాలని సూచించారు.  అయితే వైసీపీ నేతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. అనుమతి ఉన్నా లేకున్నా రోడ్ షో జరుగుతుందంటూ సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఎలా సాగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రోడ్డు మార్గంలోనే వెడతానంటూ పట్టుబట్టడం వెనుక శాంతి భద్రతల సమస్య సృష్టించాలన్న కుట్ర కోణం ఉందని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu