LATEST NEWS
  రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమే. అయితే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఓ కాంగ్రెస్ నేత బర్త్ డే గిఫ్ట్ గా ఓ వినూత్న గిఫ్ట్ పంపి సంచలనం సృష్టించారు. కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 (శుక్రవారం) ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు. ఈ విషయంపై గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మెట్టు సాయి కుమార్..  ఇది కేటీఆర్‌కు మా బర్త్‌డే గిఫ్ట్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యం విలువ తెలుసుకోవాలనే కేటీఆర్ కు  ఈ కానుక పంపినట్లు చెప్పారు.  ఈ పాతిక కిలోలతో సరిపెట్టేయడం లేదనీ, అవసరమైతే.. ప్రతి నెలా ఈ రేషన్ ను కేటీఆర్ కు పంపేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు.  దేశంలో ప్రజలకు సన్నబి య్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఇంటికీ నాణ్యమైన బియ్యం చేరుతోందని పేర్కొన్నారు.  ఒకప్పుడు సన్నబియ్యంతో వంట చేస్తే అది పండగ రోజు అనుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఇంట్లో ప్రతిరోజూ పండగేనని సాయికుమార్ చెప్పారు.  మొత్తం మీద సాయికుమార్ కేటీఆర్ కు పంపిన ఈ బర్త్ డే గిఫ్ట్ రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.   25kgs, sannabiyyam, rapido, telanganabhawan, Mettu Saikumar
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన  క్యాబినెట్  సమావేశానికి   ఉప ముఖ్యమంత్రి,  పవన్ కళ్యాణ్ గైర్హాజరుపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ పవన్ కల్యాణ్ గైర్హాజర్ ను కూటమి పార్టీల మధ్య విభేదాలుగా చిత్రీకరించి పొలిటికల్ మైలేజీ కోసం తాపత్రేయ పడుతోంది. వాస్తవానికి ప్రభుత్వం   కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే   ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.    అయితే ఇక్కడే వైసీపీయులు కేబినెట్ భేటీకి గైర్హాజరై విశ్రాంతి తీసుకున్న పవన్ కల్యాణ్   కుంకీ ఏనుగులకు స్వాగతం పలకడానికి మాత్రం ఎలా రాగలిగారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కుంకీ ఏనుగుల విషయంలో పవన్ కల్యాణ్ బయటకు వచ్చింది ఆరగంట సేపు మాత్రమేననీ, అదే కేబినెట్ భేటీ అయితే గంటల తరబడి ఉంటుందనీ,   కొంత కాలంపాటు అలా సుదీర్ఘ సమయం జరిగే సమావేశాలు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు విస్పష్టంగా చెప్పినందునే పవన్ కల్యాణ్  క్యాబినెట్ భేటీ హాజరు కాలేదనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  Pawan Kalyan, Pawan Kalyan Shoulder Surgery, AP Cabinet Meeting,   Deputy CM Pawan Kalyan, Jana Sena Party
  మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు. ఆయన కుమారుడు ప్రమేయం ఉన్న ప్రమాదంలో ఒక గొర్రెల కాపరి మరణించడం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఆంధ్రా రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రమాద స్థలంలో నిజాలను దాచేందుకు వేరొక వ్యక్తిని నిలబెట్టారనే అభియోగాలు, నిందితుడిని తప్పించే ప్రయత్నాలు చేశారనే కోణంలో పోలీసులు సిదిరి అప్పలరాజును అరెస్ట్ చేశారు. ఈ అంశంపై  టోన్‌ న్యూస్‌లో ఆసక్తికర విశ్లేషణ జరిగింది. ఈ పరిణామంపై వైసీపీ అధినేత జగన్ ఘాటుగా స్పందించారు. అప్పలరాజును పేద మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన వైద్యుడిగా, నిష్కళంకమైన నాయకుడిగా అభివర్ణిస్తూ, ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రమాదాన్ని హత్యగా ఎలా చిత్రీకరిస్తారని, పిల్లాడి పొరపాటుకు తండ్రిని ఎలా బాధ్యుడిని చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ వరుస పరిణామాలు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ మరియు కూటమి ప్రభుత్వం మధ్య రాజకీయ పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ కేసును కేవలం ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగా చూసేందుకు వీల్లేదు. దీని వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహాలు, ప్రయోజనాలు కనిపిస్తున్నాయి.  తమ పార్టీ నాయకులపై ఏ చిన్న కేసు నమోదైనా, దాన్ని తక్షణమే "రాజకీయ కక్ష సాధింపు"గా మలిచే వ్యూహాన్ని వైఎస్సార్‌సీపీ అనుసరిస్తోంది. నాయకులకు శ్రేణుల స్థాయిలో అభయం ఇవ్వడం, పార్టీ శ్రేణులు అధైర్యపడకుండా కాపాడుకోవడం ఈ డిఫెన్సివ్   కేసు చట్టపరమైన లోతుపాతులతో సంబంధం లేకుండా, నాయకుడికి అధినేత పూర్తి మద్దతుగా నిలవడం ద్వారా పార్టీ కేడర్‌కు బలమైన సందేశం వెళ్తుంది. చట్టం ముందు తప్పు-ఒప్పుల కంటే, పార్టీ అండగా ఉందనే భావనను కలిగించడం ఇక్కడ ప్రాధాన్యంగా మారింది. కూటమి ప్రభుత్వ నిష్పాక్షిక ముద్ర: మరోవైపు, అధికారంలో ఉన్న తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోతుందనే సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చాటడం కూటమి ప్రాథమిక లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ వ్యూహాత్మక ఘర్షణల్లో సామాన్య ప్రజలు, ముఖ్యంగా బాధితుల పట్ల మానవీయ కోణం మరుగునపడిపోతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అరెస్ట్ పరిణామం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలు మార్పులకు బీజం వేసే అవకాశం ఉంది. నేరారోపణలు లేదా చట్టపరమైన చిక్కుల్లో ఉన్న నాయకులను రాజకీయంగా వెనకేసుకురావడం ద్వారా తటస్థ ఓటర్లలో (Neutral Voters) ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందనేది కీలక అంశం.  చట్టాన్ని గౌరవించే ధోరణి లేకపోతే, మధ్యతరగతి మరియు మేధోవర్గం దూరమయ్యే ప్రమాదం ఉంది. చట్టబద్ధమైన పాలనను అందిస్తున్నామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ఇది ఒక పరీక్ష లాంటిది. కేసుల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా విచారణ పూర్తి చేయగలిగితేనే ప్రభుత్వానికి విశ్వసనీయత పెరుగుతుంది.  ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఈ తరహా అరెస్టులు ఒక రకంగా కేడర్‌ను రోడ్లపైకి తెచ్చే అవకాశాన్ని ఇస్తాయి. అయితే, ఇవి ప్రజల్లో సానుభూతిని తెచ్చిపెడతాయా లేదా పార్టీ ప్రతిష్టను దిగజారుస్తాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. సమగ్ర విచారణ ద్వారా న్యాయం జరగడం, చట్టం ముందు అందరూ సమానులే అనే సంకేతం సమాజంలోకి వెళ్లడం మాత్రమే ఈ వివాదానికి సరైన ముగింపు కాగలదు. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.   Seediri Appalaraju Arrest, YS Jagan Mohan Reddy, AP Political News, Seediri Appalaraju Son Case, AP Politics, YSRCP Strategy, AP Law and Order, CM Chandrababu Naidu
వైసీపీలో ఎప్పుడు ఎవరికి అందలం దక్కుతుందో.. ఎప్పుడు ఎవరికి అధ:పాతాళమే దిక్కౌతుందో తెలియని పరిస్థితి ఉంది. జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆడింది ఆట, పాడింది పాటగా పెత్తనం చెలాయించారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ అండతో చెవిరెడ్డి పార్టీలో ఓ వెలుగు వెలిగారు. చెవిరెడ్డికి దక్కిన ప్రాధాన్యత వైసీపీలో మరెవరికీ దక్కలేదంటే అందులో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. అటుంటి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.  గత సార్వత్రిక ఎన్నికల్లో  ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించడంతో సరిపెట్టకుండా, ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇచ్చి మరీ పోటీకి దింపారు జగన్. అటువంటి చెవిరెడ్డిని జగన్ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  జగన్ అధికారంలో ఉండగా జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కీలకంగా వ్యవహరించారు. మద్యంవిధానంరూపకల్పన దగ్గరనుంచి డిస్టిలరీల వరకూ చెవిరెడ్డి అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ కుంభకోణంపై ఈడీ దర్యాప్తుచేపట్టింది. అంతకు ముందే ఇదే కేసులో చెవిరెడ్డి అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉండి బెయిలుపై బయటకు వచ్చారు. ఇప్పుడు అదే కుంభకోణం చెవిరెడ్డిని జగన్ కు దూరం చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మద్యం కుంభకోణం వ్యవహారంలో జగన్ దృష్టికి కూడా రాకుండా చెవిరెడ్డి తన సొంతంకోసం సొమ్ములు వెనకేశారనీ, సిట్ దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డిని అరెస్టు చేసి విచారించిన సందర్భంలో ఆ వివరాలు వెల్లడయ్యాయనీ  పార్టీ వర్గాల భోగట్టా. దీంతో మద్యం కుంభకోణం విషయంలో తన అనుకునన చెవిరెడ్డే తనను మోసం చేశారన్న అసంతృప్తితో జగన్ చెవిరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టేశారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.   దీంతో ఒకప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోనే తరచుగా కనిపించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ తలుపులు బంద్ అయ్యాయని అంటున్నారు. ఈ కారణంగానే గత కొంత కాలంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి జగన్ దరిదాపుల్లో కూడా నిలబడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారనీ చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగాఇటీవలి కాలంల ో పార్టీ సమావేశాలకు కూడా ఆయనఎంట్రీని జగన నిేధించరనిపేర్కొంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ దక్కే అవకాశాలు దాదాపు శూన్యమని పార్టీవర్గాలే చెబుతున్నాయి.   Jagan keeps Chevireddy at a distance, Ap Liquor cam, Chevireddy Bhaskarreddy, Cheating 
ఒక దేశంలోని 150 కోట్ల మంది ప్రజలను ఎల్లకాలం మోసం చేయడం సాధ్యమేనా? ఒక మహా సామ్రాజ్యాన్ని నిరంతరం ఏలగలరా? అంటే అది అసాద్యం అన్న సమాధానమే వస్తుంది.   నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కాక్రోచ్‌ లు వీధుల్లోకి వచ్చాయి! ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ  కాక్రోచ్ జనతా పార్టీ  రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.   సరిహద్దు గోడలు, ముళ్ల కంచెలు, పోలీసు లారీలు, వాటర్ క్యానన్లు, లాఠీచార్జీలు... వీటివేవీ   యువత ఆక్రోశాన్ని, ఆగ్రహాన్నీ  ఆపలేకపోతున్నాయి. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, వ్యవస్థాగత అవినీతి, ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటం కేవలం ఒక మంత్రి రాజీనామాకో, పరీక్షల రద్దుకో పరిమితం కాదని, ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమని ఉద్యమకారులు చెబుతున్నారు.   మతం, కులం, వర్గం ఆధారంగా పౌరుల మధ్య వ్యత్యాసం చూపే విభజన రాజకీయాలను ఎండగడుతూ, ఎలాంటి ఆయుధాలు లేకుండానే శాంతియుతంగా జరుగుతున్న ఈ ఉద్యమం ప్రస్తుత పాలక వ్యవస్థ పునాదులను కదిలించివేస్తున్నది.     Delhi students protest,  Cockroach Janata Party,  Competitive exam paper leak, Demand for Education Ministers resignation
ALSO ON TELUGUONE N E W S
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రతిభావంతురాలైన దర్శకురాలు గీతు మోహన్‌దాస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మోస్ట్ ఏవైటెడ్ మూవీ 'టాక్సిక్'. 'కేజీఎఫ్' సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యశ్ నుంచి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో 'టాక్సిక్'పై మొదటి నుంచీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే నెట్టింట అనేక విమర్శలు, వివాదాలకు ప్రధాన కేంద్రబిందువుగా మారింది. సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సెకన్ల వ్యవధిలోనే వైరల్ అవుతుండటంతో పాటు తీవ్రమైన చర్చలకు కూడా దారితీస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో దర్శకురాలు గీతు మోహన్‌దాస్ ప్రదర్శిస్తున్న అత్యంత హింసాత్మక సన్నివేశాలు, బోల్డ్ రొమాంటిక్ విజువల్స్ ప్రేక్షకుల్లో, నెటిజన్లలో భిన్నాభిప్రాయాలను రేకెత్తిస్తున్నాయి. టీజర్ విడుదలైన నాటి నుంచి హాలీవుడ్ స్థాయి వైలెంట్ యాక్షన్ సన్నివేశాలను, అత్యంత కాంట్రవర్షియల్ అడల్ట్ రొమాన్స్‌ను చూపిస్తున్నారంటూ కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యశ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్, ఆ తర్వాత వచ్చిన టీజర్‌లోని వైలెన్స్ షాట్లు, అలాగే ప్రముఖ కథానాయిక కియారా అద్వానీతో చిత్రీకరించిన 'తబాహీ' పాటలోని ప్రమోషనల్ అండ్ ఇంటిమేట్ సీన్స్ సోషల్ మీడియా వేదికగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి ఐదుగురు అగ్ర కథానాయికలు అత్యంత కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కథానాయికలకు సంబంధించిన పాటలు విడుదలై ఆకట్టుకోగా, మిగిలిన 3 ప్రమోషనల్ ట్రాక్స్‌పై ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి 'ఎ' సర్టిఫికేట్ లేదా కట్స్ ఎదురయ్యే అవకాశం ఉందంటూ సాగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ చిత్ర నిర్మాత వెంకట్ కె.నారాయణ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల 'జన నాయగన్' సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన ఆయన, 'టాక్సిక్' అనేది ఏ రకమైన రెగ్యులర్ లేదా సాధారణ సినిమా కాదని, ఇది పూర్తిగా పెద్దల కోసం రూపుదిద్దుకున్న ఒక ప్రత్యేకమైన కల్పిత కథ అని స్పష్టం చేశారు. ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని అదే కోణంలో, ఆ మైండ్‌సెట్‌తో చూస్తే ఖచ్చితంగా థియేటర్లలో ఒక కొత్త అనుభూతిని పొంది ఆస్వాదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తర్వాత ఖచ్చితంగా ప్రేక్షకులు దీనిని ఒక విశిష్టమైన మరియు భిన్నమైన చిత్రంగా అభినందిస్తారనే పూర్తి నమ్మకాన్ని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో సినిమాపై నెలకొన్న సెన్సార్ ఆందోళనలు మరింత ఊపందుకున్నాయి. మరి రాబోయే ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ పాన్-ఇండియా చిత్రం ఎలాంటి కొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.     Yash, Toxic Movie, Geetu Mohandas Toxic, Kiara Advani 
  గ్లామర్ ప్రపంచం వెనుక ఉండే నల్లటి చీకటి కోణాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీల లైఫ్‌స్టైల్, లేట్ నైట్ పార్టీలు, అక్కడ జరిగే వ్యవహారాల గురించి నిత్యం వార్తలు వస్తుంటాయి. అయితే తాజాగా బుల్లితెర రంగానికి చెందిన ప్రముఖ నటి నారాయణి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. హిందీ టెలివిజన్ పరిశ్రమలో ఏళ్ల తరబడిగా పేరుగాంచిన ఆమె, ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో టీవీ ఇండస్ట్రీలో పేరుకుపోయిన డ్రగ్స్ సంస్కృతి గురించి అనేక షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఒకప్పుడు కేవలం వినోదం, డాన్స్‌లు, అల్పాహారాల కోసం మాత్రమే జరిగే పార్టీల రూపురేఖలు కాలక్రమేణా దారుణంగా మారిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణి శాస్త్రి వెల్లడించిన కథనం ప్రకారం.. గతంలో ఇండస్ట్రీలో జరిగే గ్రాండ్ పార్టీల్లో మద్యం లేదా ఆల్కహాల్‌కు మాత్రమే ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పార్టీల నిర్వహణలో అక్రమ మాదకద్రవ్యాలు, సింథటిక్ డ్రగ్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నారంటూ అమ్మడు చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో పెద్ద ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కోకైన్, ఎండీఎంఏ వంటి ప్రాణాంతకమైన డ్రగ్స్ ఈ పార్టీలలో సర్వసాధారణంగా అందుబాటులోకి వస్తున్నాయని ఆమె ఆరోపించారు. పెద్ద పెద్ద వేడుకల్లో ఇవన్నీ రహస్యంగా, గుట్టుచప్పుడు కాకుండా సాగుతుంటే, చిన్నపాటి సన్నిహిత సమావేశాలలో మాత్రం అందరికీ తెలిసేలా బహిరంగంగానే జరుగుతుంటాయని చెప్పారు. తాను స్వయంగా ఈ దారుణ పరిస్థితులను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, అందుకే కొన్నేళ్ల కిందటే ఇలాంటి ఇండస్ట్రీ పార్టీలకు వెళ్లడం పూర్తిగా మానేశానని తెలిపారు. తన వ్యక్తిగత అనుభవాల గురించి మాట్లాడిన నారాయణి, ఎవరైనా డ్రింక్స్‌లో ఏదైనా కలిపితే ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి గతంలో ఒకసారి ఆల్కహాల్‌ను రుచి చూశానని చెప్పారు. అంతేకాకుండా కేవలం ప్రయోగాత్మకంగా, కొత్త విషయాలను అర్థం చేసుకోవడానికి గతంలో కొన్నిసార్లు డ్రగ్స్ పరీక్షించి చూశానని, అయితే వాటికి ఎప్పుడూ బానిస కాలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ అలవాటు వ్యక్తిగత జీవితాలనే కాకుండా వృత్తిపరమైన బాధ్యతలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆమె ఉదాహరణలతో వివరించారు. ఈ సంస్కృతి కేవలం నైట్ పార్టీలకే పరిమితం కాకుండా చివరికి షూటింగ్ సెట్లలోకి కూడా ప్రవేశించిందని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. షూటింగ్ సెట్లలో నటీనటులు డ్రగ్స్ ప్రభావంతో సరైన స్పృహలో లేకపోవడం వల్ల పలుమార్లు రాత్రింబవళ్లు ప్లాన్ చేసిన షూటింగ్‌లు సగం లోనే రద్దయిపోయిన సందర్భాలు ఉన్నాయని నారాయణి గుర్తుచేశారు. ఒకసారి ఓ ప్రధాన నటుడు డ్రగ్స్ మత్తులో అసలు నిలబడే స్థితిలో కూడా లేకపోవడంతో, తాను సెట్లో ఏకంగా 4 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల వల్ల నిర్మాతలు కోట్లలో ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డారు. ప్రధాన పాత్రధారులను హఠాత్తుగా తొలగిస్తే షో టీఆర్‌పీ పడిపోతుందని, సీరియల్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే భయంతో నిర్మాతలు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పారు. చివరికి చేసేదేమీ లేక నటుల కుటుంబ సభ్యుల సహాయం కోరుతూ షూటింగ్‌లను నెట్టుకొస్తున్నారని నారాయణి శాస్త్రి విమర్శించారు. 'కుసుమ్', 'పియా కా ఘర్', 'క్యూంకీ సాస్ భీ కభీ థీ' వంటి బ్లాక్‌బస్టర్ సీరియల్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఒక సీనియర్ నటి ఇలాంటి నిజాలను బయటపెట్టడంతో టెలివిజన్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
మలయాళ చిత్రసీమ నుంచి వచ్చే వైవిధ్యమైన కథాంశాలకు, పిరియాడికల్ డ్రామాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు టోవినో థామస్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'పళ్లిచట్టంబి'. ఈ ఏడాది ఏప్రిల్ 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, జులై 24వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక 'సోనీలివ్' లో ఏకంగా 6 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ పిరియాడికల్ డ్రామా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో, 1950 - 1960ల కాలంనాటి కేరళ నేపథ్యాన్ని ఎలా ఆవిష్కరించిందో వివరంగా తెలుసుకుందాం. ఈ కథ అంతా కేరళలోని 'తరియెట్టమల' అనే పర్వత ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. ఆ కొండల చుట్టూ అనేక గిరిజన గూడాలు ఉన్నప్పటికీ, ఎవరూ కూడా ఆ పర్వతం వైపు వెళ్లడానికి సాహసించరు. అది ఒక 'పిశాచి భూమి' అనే తీవ్రమైన భయం అక్కడి ప్రజల మనస్సుల్లో నాటుకుపోయింది. దాంతో ఆ ప్రాంతం గురించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ పర్వత ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామే 'కణియార్'. ఆ సమయంలో కేరళలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడంతో, తమ భూములను ప్రభుత్వం లాగేస్తుందేమోననే భయం స్థానిక ప్రజల్లో మొదలవుతుంది. ఆందోళన చెందిన చర్చి ఫాదర్, తమ చర్చి ఆస్తులను, భూములను రక్షించుకోవడం కోసం ఒక భయం లేని బలవంతుడిని, రౌడీయిజం తెలిసిన వ్యక్తిని వెతకడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే 'తోమాపురం' నుంచి కృష్ణ పిళ్లై (టోవినో థామస్)ను నెలకు నిర్దిష్ట జీతం ఇస్తామని ఒప్పించి, అతని పేరును 'క్రిస్టఫర్ పోతన్' గా మార్చి కణియార్‌కి తీసుకువస్తారు. ఊరిలో అడుగుపెట్టడమే లోకల్ రౌడీ జార్జ్‌ని ఓడించిన పోతన్, 'పళ్లిచట్టంబి' అంటే చర్చి తరఫున నిలబడే రౌడీగా గుర్తింపు పొందుతాడు. అయితే, వీధి నాటకాల ద్వారా కమ్యూనిజం సిద్ధాంతాలను ప్రచారం చేసే 'రెబెక్కా' (కయాదు లోహర్)తో పోతన్‌కు పరిచయం ఏర్పడుతుంది. ఆమె ఆకర్షణలో పడిన పోతన్, ప్రచారాన్ని అడ్డుకోలేకపోతాడు. అసలు ఈ గొడవల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు, డబ్బు కోసం వచ్చిన పోతన్ తన ప్రేమికురాలి ఆశయం కోసం ఎలా మారాడు అనేది కథలోని మిగతా భాగం. సాంకేతికంగా చూస్తే, 1950 - 60ల కాలంనాటి వాతావరణాన్ని విజువల్‌గా ఆవిష్కరించడంలో సినిమా విజయం సాధించింది. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం, 'ఇన్నినాళ్లు చూడలేదులే' అనే మెలోడీ పాట కథలోని ఎమోషన్ ని నిలబెట్టాయి. టిజో టోమీ సినిమాటోగ్రఫీ, శ్రీజిత్ సారంగ్ కూర్పు సినిమాకు బలాన్నిచ్చాయి. టోవినో థామస్ నటన, కయాదు లోహర్ అందం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఐదుకి 2.50 రేటింగ్ లభించింది. నిదానంగా సాగే కథనం ఉన్నప్పటికీ, చారిత్రక సామాజిక పరిస్థితులను ఆస్వాదించే ఓటీటీ ప్రేక్షకులకు ఇది ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.   Pallichattambi, Tovino Thomas 
    ప్రెజెంట్ కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram),శ్రీ గౌరీ ప్రియ(Sri Gouri Priya),చెన్నై లవ్ స్టోరీ'(Chennai Love Story)తో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. 'బేబీ' వంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఎస్‌కేఎన్, ధీరజ్ మొగిలినేనితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ రచయిత రవి నంబూరి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సంగీత బ్రహ్మ మణిశర్మ అందించిన స్వరాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  విడుదలకు ముందే భారీ అంచనాలని  పెంచేశాయి.   దీంతో ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టిన చెన్నై లవ్ స్టోరీ కి అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా భారీగానే పోటెత్తారు. నిన్న నైట్ ప్రీమియర్స్ నుంచే హంగామా మొదలైంది.  ఈ నేపథ్యంలొ బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యిందా లేక యావరేజ్/ఫ్లాప్ టాక్ తెచ్చుకుందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.  కథ విషయానికి వస్తే, 3 ఏళ్ల పాటు ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి పీటలు ఎక్కే సమయంలో కథానాయిక నివేదిత అలియాస్ నివి (శ్రీ గౌరీ ప్రియ)కి ఆమె ప్రియుడు అజయ్ (త్రిగుణ్) హ్యాండ్ ఇస్తాడు. వేరే అమ్మాయిని ప్రేమించానని చెప్పి బ్రేకప్ చెప్తాడు. తీవ్రమైన డిప్రెషన్‌కి గురైన నివి, బ్రేకప్ బాధ తట్టుకోలేక మందుకి బానిసవుతుంది. ఆమెను ఆ బాధ నుంచి బయటపడేసేందుకు స్నేహితులు చెన్నై తీసుకువెళ్తారు. అదే సమయంలో చెన్నైలో సినీ దర్శకుడు కావాలని ప్రయత్నిస్తున్న స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) పరిచయమవుతాడు. స్టీవెన్ తింగరి పనులు, అతని ప్యాషన్ చూసి నివి నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తుంది. అతనికి ఒక అవకాశాన్ని ఇప్పించడంతో పాటు, మళ్లీ అతని ప్రేమలో పడుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిన సమయంలో కథ ఒక అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. Also read: ఈ వీకెండ్ మిస్ అవ్వకండి.. 25 సినిమాలు మీ కోసమే  మూవీకి అయితే థియేటర్ల వద్ద,సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. మొదటి భాగం సరదా సన్నివేశాలు, మంచి ఫీల్ గుడ్ ఎమోషన్స్, మణిశర్మ అందించిన పాటలతో చాలా వేగంగా సాగిపోతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ లో ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథానాయికగా శ్రీ గౌరీ ప్రియ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకోగా, కిరణ్ అబ్బవరం తన పరిధి మేరకు చక్కగా నటించాడు.  మణిశర్మ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది.  అయితే, సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత దర్శకుడు తీసుకున్న కథన విధానం కొంతవరకు ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. 'ఎందుకంటే ప్రేమంట' వంటి సినిమాలను గుర్తుచేసే లాజిక్ లేని మ్యాజిక్ ఎలిమెంట్స్, సాగదీసినట్టు ఉండే సన్నివేశాలు సెకండ్ హాఫ్‌లోని ఎమోషన్‌ దెబ్బతీశాయని కొంత మంది మీడియా సముఖంగా చెప్తున్నారు.  దీంతో యావరేజ్ చిత్రంగా మిగలవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే టైంలో లవ్ స్టోరీస్, ఎమోషనల్ డ్రామాలని ఇష్టపడే వారు మాత్రం మూవీ చాలా బాగుందని చెప్తూ, మూవీ చూసి కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ రోజు తొలి రోజు కాబట్టి కన్ఫ్యూజ్ తో కూడిన టాక్ వస్తుంది. రేపు ఎలాంటి టాక్  వస్తుందో చూడాలి. chennai love story, kiran abbavaram, sri Gouri Priya, tollywood
  వాతావరణం చేంజ్ అయినా నాలో మాత్రం ఎలాంటి చేంజ్ లేదు, అంతకంత సినీ వినోదాన్ని అందివ్వడానికి ఓటిటి వేదిక డిజిటల్ వినోదాల పండుగలా మారబోతోంది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఒకవైపు, వైవిధ్యమైన కథాంశాలతో ఉక్కిరిబిక్కిరి చేసే థ్రిల్లర్ సిరీస్‌లు మరొకవైపు డిజిటల్ వేదికలపై సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, ఈటీవీ విన్ వంటి దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఏకంగా 25ki పైగా కొత్త సినిమాలు వెబ్ సిరీస్‌లు వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్‌లో ఇంటి పట్టునే ఉండి రిలాక్స్ అవ్వాలనుకునే సినిమా ప్రేమికులకు ఇది నిజంగానే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఈ వారం ఓటీటీలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న చిత్రాల్లో 'నాగబంధం' అగ్రస్థానంలో నిలుస్తోంది. విరాట్ కర్ణ కథానాయకుడిగా, నభా నటేష్, ఐశ్వర్య మేనన్ కథానాయికలుగా నటించిన ఈ పాన్-ఇండియా యాక్షన్ అడ్వెంచర్ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. జులై 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులోకి రావడం విశేషం. పురాతన నిధుల రహస్యాలు, నాగబంధం సంప్రదాయాలతో నిండిన ఈ విజువల్ వండర్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక పోలీస్ డ్రామాలు, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వీక్షకులకు ఈటీవీ విన్ (ETV Win) వేదిక సరికొత్త అనుభూతిని అందిస్తోంది. దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కన్నడ సూపర్ హిట్ థ్రిల్లర్ 'కేస్ ఆఫ్ కొండాన' ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. విజయ్ రాఘవేంద్ర, భావన మేనన్ కీలక పాత్రల్లో జీవించిన ఈ సినిమా కథాంశం ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. తెలియక చేసిన ఒక చిన్న పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు చేసే వరుస తప్పులు మనిషి జీవితాన్ని ఎంతటి ముప్పులోకి నెడతాయో ఈ చిత్రంలో అత్యంత ప్రతిభావంతంగా చూపించారు. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో అద్భుతమైన కథా చిత్రం 'పళ్లిచట్టంబి'. కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటించారు. డిజో జోస్ ఆంటోని నిర్దేశత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో మెరిశారు. థియేటర్లలో విశేష ఆదరణ పొందిన ఈ సినిమా ప్రస్తుతం సోనీలివ్ (Sony LIV) లో మలయాళంతో పాటు తెలుగు వర్షన్‌లోనూ స్ట్రీమింగ్ అవుతూ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మరోవైపు గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకుల కోసం హిందీ మరియు తెలుగు భాషల్లో 'ముసాఫిర్ కెఫే' అనే డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌ను అందుబాటులోకి తెచ్చింది. విక్రాంత్ మాస్సే, వేదికా పింటో, మహిమా మక్వానా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను రుచిర్ అరుణ్ తెరకెక్కించారు. టెరిబ్లీ టైనీ టేల్స్ సంస్థ నిర్మించిన ఈ డ్రామా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో పవన్ కల్యాణ్, సప్తగిరి, రాజ్‌కుమార్ కసిరెడ్డి ముఖ్య పాత్రల్లో రూపుదిద్దుకున్న 'పురుషః' చిత్రం మరియు హిందీ కామెడీ సిరీస్ 'ఆదర్శ బాల విద్యాలయ' కూడా వీక్షకులను అలరిస్తున్నాయి. Also read: పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, విజయ్ పై బాబీ డియోల్ షాకింగ్ కామెంట్స్  వీటితో పాటు అంతర్జాతీయ కంటెంట్ ఇష్టపడే వారి కోసం నెట్‌ఫ్లిక్స్‌లో 'ఎలైట్ ఫోర్స్', 'ద డెట్ కలెక్టర్', '1941', '72 అవర్స్' వంటి 8కి పైగా ఇంగ్లీష్, తమిళ చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో 'ఇగో రమణ్', 'అనోమి' వంటి ప్రాంతీయ భాషా చిత్రాలతో పాటు సబ్‌స్క్రైబర్లను మైమరిపించేందుకు దాదాపు 25కు పైగా విభిన్న రకాల ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ శని, ఆదివారాల్లో మీకు నచ్చిన జానర్ కథలను ఎంచుకుని డిజిటల్ వినోదాన్ని ఆస్వాదించండి! naga bandham, ott movies, anomi, elite force
నారా రోహిత్ తన వైవిధ్యమైన కథా ఎంపికలతో ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటారు. విభిన్నమైన పాత్రలతో మెప్పించే ఆయన, ఈసారి మరొక సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ఈ నూతన చిత్రాన్ని దర్శకుడు రామ్ గన్ని తెరకెక్కిస్తున్నారు. పోలీస్ బ్యాక్‌డ్రాప్ కి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.  శప్త అశ్వ మీడియా వర్క్స్ పతాకంపై కళ్యాణ చక్రవర్తి మంథెన, భాను కిరణ్ ప్రతాప ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, విజయ్ కృష్ణ లింగమనేని ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఉత్కంఠభరితమైన హారర్ కథలో నారా రోహిత్ సరసన అందాల నటి హన్సిక మోత్వాని హీరోయిన్ గా నటిస్తోంది. నారా రోహిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. సినిమా టైటిల్ తో పాటు అత్యంత భయానకంగా, ఆకట్టుకునేలా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అన్వీల్ చేశారు.  ఈ చిత్రానికి 'కపాలీ' అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. 'కపాలీ' అంటే పుర్రెను ధరించినవాడు అని అర్థం వస్తుంది. ఈ ఆధ్యాత్మిక, తాంత్రిక నేపథ్యం ఉన్న పేరుకు తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ కూడా ఉత్కంఠభరితంగా, భయం గొలిపే విధంగా రూపొందించబడింది. టైటిల్ లోని గూఢమైన అర్థాన్ని పోస్టర్ విజువల్స్ పర్ఫెక్ట్‌గా ప్రతిబింబిస్తున్నాయి. దీనికి తోడు 'ఏ జర్నీ ఇంటో ది అన్నోన్' (తెలియని ప్రపంచంలోకి ఒక ప్రయాణం) అనే ట్యాగ్‌లైన్ సినిమాలోని మిస్టరీ స్థాయిని మరింత పెంచుతోంది. మొత్తం మీద, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అత్యంత గ్రిప్పింగ్‌గా ఉంటూ ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని కలిగిస్తోంది. మేకర్స్ త్వరలోనే ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.   Nara Rohith, Kapaali Movie, Hansika Motwani  
The makers of Nenu Ready have unveiled the film's latest single, Konchem Konchem Kothaga, offering a glimpse into the romantic side of the Havish-starrer. After the teaser and earlier promotional material generated interest, the new track shifts focus to the chemistry between the lead pair and presents a bold yet aesthetically shot romantic number. Composed by Mickey J. Meyer, the song is sung by Sameera Bharadwaj, while Ramajogayya Sastry has penned the lyrics. The track revolves around two lovers embracing their growing intimacy, with the music and lyrics complementing the mood without crossing into overtly provocative territory. Mickey's melody keeps the composition soft and melodious, making it an easy listen despite its sensual theme. Havish and Kavya Thapar share impressive on-screen chemistry, with the visuals capturing their romance in a stylish and artistic manner. Director Trinadha Rao Nakkina, known primarily for commercial entertainers, appears to have opted for a more restrained and visually elegant approach while picturising the song. The choreography and cinematography further add to the song's polished appeal. Adding to the excitement is Nargis Fakhri, who makes a special appearance in the film. Her presence in the song has become another talking point among viewers, hinting at an interesting role in the narrative. Produced by Kanchana Koneru, Nenu Ready is currently in the final stages of post-production. With its youthful vibe, polished visuals and music-driven promotions, the film is steadily building anticipation ahead of its release, the date for which is expected to be announced soon. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన రీసెంట్‌గా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'వంద దేవుళ్ళు' ఆగస్టులో తమ ప్లాట్‌ఫామ్‌లో ఓటీటీ ప్రీమియర్ కానుందని ZEE5 తెలుగు ప్రకటించింది. అధికారిక స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.  ఇటీవల విడుదలైన 'పరిమళ & కో' ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. జయరామ్, ఊర్వశి నటించిన ఈ చిత్రంలో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని రకాల అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ZEE5 తెలుగు ఈ విజయ పరంపరను కొనసాగించేందుకు 'వంద దేవుళ్ళు'తో ముందుకు వస్తోంది. ఇది ఫ్యామిలీ అంతటినీ ఒకచోట చేర్చే సామర్థ్యం ఉన్న చిత్రం. ఈ మూవీలోని భావోద్వేగాలు పూర్తిగా భిన్నమైనవి. నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన 'వంద దేవుళ్ళు' చిత్రం వింతతువు, ఆమె ఇద్దరి కొడుకుల చుట్టూ తిరుగుతుంది. మధ్య వయస్సుకి వచ్చిన అమ్మని మళ్లీ పెళ్లి చేయాలని కొడుకు అనుకోవడం, ఆ తల్లి సైతం తోడును వెతుక్కోవాలని ఆలోచించినప్పుడు, ఆమె నిర్ణయం బంధువులు, గ్రామస్తులు, మొత్తం సమాజం నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. తల్లి, కొడుకుల మధ్య ఉండే అందమైన బంధమే ఈ కథకు ప్రధాన ఆకర్షణ. ఒక తల్లి తన జీవితాంతం చేసే లెక్కలేనన్ని త్యాగాలను హైలైట్ చేస్తుంది ఈ చిత్రం. ఒక కొడుకు తన తల్లి కష్టాలను, త్యాగాలను చూసి, గుర్తించడమే కాకుండా, సామాజిక విమర్శలను ఎదుర్కొని కూడా తన సంతోషాన్ని తనే ఎంచుకునేలా ఆమెను ప్రోత్సహించడం ఈ మూవీలోని కోర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తల్లీకొడుకుల అద్భుతమైన బంధాన్ని తెరపై అంతే అద్బుతంగా చూపించారు.   Vijay Antony, Vanda Devullu, OTT Update, ZEE5  
  పాన్ ఇండియా సెల్యులాయిడ్ పై బాబీ డియోల్( దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకప్పటి హీరో కూడా అయిన బాబీ డియోల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణమైన, అత్యంత పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్స్ చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత బిజీ నటుడిగా మారిపోయాడు. ప్రెజెంట్ నిన్న విడుదలైన జన నాయకుడుతో సందడి చేస్తున్నాడు. రీసెంట్ గా ఒక  ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు  వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతు 'నేను దక్షిణాదిలో ఏ అగ్ర నటుడితో కలసి పనిచేసినా, వాళ్లంతా ఆ తర్వాత పొలిటికల్ గా పవర్ సీట్లలో కూర్చుంటున్నారు. మంత్రులు, డిప్యూటీ సీఎంలు, సీఎంలు అవుతున్నారు! ఇది నిజంగా చాలా విచిత్రమైన, అత్యంత సరదాగా అనిపించే యాదృచ్ఛిక విషయం. నందమూరి బాలకృష్ణతో కలిసి 'డాకు మహారాజ్' లో  బలవంత్ సింగ్ ఠాకూర్ అనే పవర్‌ఫుల్ రోల్ లో చేశాను. ఆయన ఇప్పటికే రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసారు. పవన్ కళ్యాణ్ తో  'హరిహర వీరమల్లు' లో  ఔరంగజేబు క్యారక్టర్  పోషించాను. ఈ ప్రాజెక్ట్ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా (డిప్యూటీ సీఎం) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు 'జన నాయగన్' లో విజయ్ తో చేశాను. సీఎం అయ్యారని బాబీ డియోల్  చెప్పుకొచ్చాడు.  Also read: సినిమాగా తెరకెక్కకుండా 30 లక్షలు సంపాదించిన కథ.. ఆ రైటర్ ఎవరో తెలుసా!  
తమిళ చిత్రసీమతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'జననాయగన్'. దళపతి విజయ్ నటనకు స్వస్తి పలుకుతూ రాజకీయ రంగ ప్రవేశం చేసి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలైన మొదటి, చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పవర్‌ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా గురువారం, జులై 23న ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎత్తున థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచే తమిళనాడు వ్యాప్తంగా ఉన్న థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం, డప్పు చప్పుళ్లు, బాణసంచా కాల్పులతో పండగ వాతావరణం నెలకొంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ఊహించని ఒక తీవ్రమైన సామాజిక, రాజకీయ వివాదంలో చిక్కుకుంది. సినిమా సాధిస్తున్న అపారమైన బాక్సాఫీస్ విజయంతో పాటు, ఒక తమిళనాడు మంత్రి చేసిన బాధ్యతారాహిత్య చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రస్థాయి విమర్శలకు దారితీసింది. ఈ ఊహించని వివాదానికి ప్రధాన కారణం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) జారీ చేసిన సెన్సార్ సర్టిఫికేషన్. సినిమాలో ఉన్న తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు, కథాంశం ప్రాధాన్యతను బట్టి సెన్సార్ బోర్డు ఈ 'జన నాయగన్' చిత్రానికి 'A' (అడల్ట్ ఓన్లీ) సర్టిఫికెట్ మంజూరు చేసింది. భారతీయ సినిమా చట్టాలు, సెన్సార్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం 'A' సర్టిఫికెట్ పొందిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శిస్తున్నప్పుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లలను హాల్లోకి అనుమతించడం సంపూర్ణంగా చట్టవిరుద్ధం. ప్రవేశ ద్వారాల వద్ద ప్రేక్షకుల వయస్సును సరిచూడాల్సిన ప్రాథమిక బాధ్యత థియేటర్ యాజమాన్యాలపై స్పష్టంగా ఉంది. ఏ పరిస్థితుల్లోనూ మైనర్లను, చిన్న పిల్లలను ఇటువంటి సినిమాలకు అనుమతించకూడదనేది కచ్చితమైన నిబంధన. అయితే రామనాథపురంలోని ఒక ప్రముఖ థియేటర్‌లో గురువారం సాయంత్రం 4 గంటల ప్రదర్శన సమయంలో ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి రాజీవ్ తన కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసేందుకు థియేటర్‌కు విచ్చేశారు. సాధారణంగా ప్రశాంతంగా సాగాల్సిన ఈ సినిమా వీక్షణలో మంత్రి రాజీవ్ తన భార్యతో పాటు తమ చిన్న పిల్లలను కూడా వెంటబెట్టుకుని నేరుగా థియేటర్ లోపలికి వచ్చి సీట్లలో కూర్చున్నారు. ప్రదర్శన జరుగుతుండగా మంత్రి 'A' సర్టిఫికెట్ ఉన్న సినిమాను చిన్న పిల్లలతో కలిసి వీక్షిస్తున్న దృశ్యాలు, ఫొటోలు, వీడియో క్లిప్‌లు మొబైల్ కెమెరాల్లో రికార్డ్ అయి క్షణాల్లో సోషల్ మీడియా వేదికలపైకి లీక్ అయ్యాయి. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షం కావడమే ఆలస్యం నెటిజన్ల నుంచి, ప్రజా సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. "దేశంలో చట్టాలు, సెన్సార్ నిబంధనలు కేవలం సామాన్య పౌరులకేనా? విఐపీలకు, మంత్రులకు ఇవి వర్తించవా?" అని నెటిజన్లు నిలదీయడం ప్రారంభించారు. ఒక పర్యావరణ శాఖ మంత్రి స్థాయి వ్యక్తి అయి ఉండి, చట్టాన్ని గౌరవించాల్సిన స్థానంలో ఉన్న మంత్రి రాజీవ్ ఇలా బహిరంగంగా సెన్సార్ నిబంధనలను ఉల్లంఘించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ పౌరులు తమ పిల్లలతో వస్తే గేటు వద్దే నిలిపివేసే థియేటర్ సిబ్బంది, మంత్రి రాగానే నిబంధనలన్నింటినీ పక్కనబెట్టి చిన్న పిల్లలను లోపలికి ఎలా అనుమతించారంటూ థియేటర్ యాజమాన్యాల తీరుపై కూడా ప్రశ్నల వర్షం కురుస్తోంది. బాక్సాఫీస్ వద్ద 'జన నాయగన్' చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతున్నప్పటికీ, మంత్రి రాజీవ్ చుట్టూ ముసురుకున్న ఈ 'A' సర్టిఫికెట్ ఉల్లంఘన రగడ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు నిబంధనలను పక్కనబెట్టి ప్రవర్తించడం విఐపి సంస్కృతికి నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై సెన్సార్ బోర్డు, సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..  కొన్నిసార్లు తరాల మధ్య అభిప్రాయ భేదాలు లేదా ఆలోచనా విధానాలలో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు విభేదాలకు దారితీయవచ్చు. దీని వల్ల ప్రతి కోడలికి తన మనసులో ఒక ప్రశ్న ఉండిపోతుంది. అత్తగారు చెప్పే ప్రతి విషయాన్ని కోడలు వినాలా? అత్త చెప్పిన ప్రతి విషయాన్ని కోడలు అంగీకరించాల్సిందేనా?  అని.  అయితే దీనికి సమాధానం అంత సులభమైనది కూడా కాదు.  దీని గురించి లైఫ్ స్టైల్ నిపుణులు వివరణ ఇస్తున్నారు.  ప్రతి కోడలు తెలుసుకోవలసిన ఈ విషయం గురించి తెలుసుకుంటే.. సెల్ఫ్ రెస్పెక్ట్.. ప్రవర్తన.. కొందరు అత్తలు చాలా దురుసుగా ఉంటారు.   దుర్భాషలాడటం, ఎగతాళి చేసి మాట్లాడటం, అందరి ముందు కోడలిని  అవమానించడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి ఎప్పుడూ  ఎదుర్కొంటున్నట్లయితే కోడలు  మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మొదట  ప్రశాంతంగా మాట్లాడి, సరిగ్గా మాట్లాడమని, సరిగ్గా ప్రవర్తించమని అడగడం మంచిది. అత్తాకోడళ్ల బంధం బాగుండాలంటే.. రెండు వైపులా గౌరవం చాలా ముఖ్యం. ఆరోగ్య సంబంధ విషయాలు..  అత్తల తరానికి,  ఇప్పటి కోడళ్ల తరానికి చాలా తేడాలు ఉన్నాయి.  వారి జీవనశైలి,  ఆహారం వంటి విషయాలు ఇప్పట్లో లేవు.  ఈ కారణంగా ఇప్పటి అమ్మాయిలలో అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది.  ఏదైనా అనారోగ్యానికి చికిత్స, మందులు, విశ్రాంతి తీసుకోవడం, గర్భం దాల్చడం, మానసిక ఆరోగ్యం లేదా మరే ఇతర వైద్య సలహాలలో అయినా అత్తలు ఎప్పుడూ కోడళ్లను నిర్ల7్యంగా మాట్లాడకూడదు.  మేము ఇంత పని చేసుకునేవాళ్లం, మాకేమీ సమస్య ఉండేది కాదు అనడం,  పని తప్పించుకోవడానికి అనారోగ్యం అని చెబుతున్నావని నిందించడం చాలా మంది అత్తగార్లు చేస్తారు. కోడళ్లు  అత్తగారి మాటల కంటే డాక్టర్ సలహాకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆరోగ్య నిర్ణయాలు కేవలం కుటుంబ ఒత్తిడి మీద కాకుండా, వాస్తవాలు , నిపుణుల సలహా ఆధారంగా తీసుకోవాలి. విద్య, ఉద్యోగం.. నేటికాలంలో అమ్మాయిలు అబ్బాయిలకేమీ తీసిపోకుండా బాగా చదువుతున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు.  ఉద్యోగం , ఆర్థిక స్వాతంత్య్రానికి  సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రతి కోడలికి ఉంటుంది.  కుటుంబ అంచనాలకు,  వృత్తిపరమైన లక్ష్యాలకు మధ్య పొంతన కుదరకపోతే ఓపెన్ గా ఇంట్లో డిస్కస్ చేసి  అందరికి నచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అంతేకానీ అత్తగారు చేప్పారు అని ఉద్యోగాలు వదిలేయడం, ఇంటికే పరిమితం కావడం వంటివి చేయాల్సిన అవసరం లేదు.  ఏకపక్ష ఒత్తిడితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో మనస్పర్థలకు దారితీయవచ్చు.అంతేకాదు.. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు కూడా కారణం కావచ్చు. వ్యక్తిగత హద్దులు.. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత సమయం, వ్యక్తిగత స్వేచ్ఛ , వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది.  వ్యక్తిగత హద్దులను పదేపదే ఉల్లంఘించినా లేదా ప్రతి నిర్ణయంలో అనవసరమైన జోక్యం ఉన్నా,  హద్దులను మర్యాదగా తెలియజేయడం మంచిది. ఇది అపార్థాలు, గొడవలు ఎక్కువ దూరం వెళ్లకుండా చేస్తుంది.  కొందరు అత్తలు కోడళ్లకు ఎలాంటి పర్సనల్ స్పేస్ ఉండకూడదని, వారికి పర్సనల్ అంటూ ఏమీ అవసరం లేదని వాదిస్తారు.  కానీ కోడళ్లకు పర్సనల్ స్పేట్ ఉండటం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతుంది.   ప్రొటెక్షన్,  లీగల్ రైట్స్.. ఆడపిల్ల  భద్రతకు, చట్టపరమైన హక్కులకు, లేదా నైతిక విలువలకు భంగం కలిగించే పని చేయమని అత్తగారు కోడలిని అడిగితే, దానికి తలొగ్గడం మంచిది కాదు. అలాంటి పరిస్థితిలో జీవిత భాగస్వామిని, నమ్మకమైన కుటుంబ సభ్యుడిని, లేదా అవసరమైతే చట్టపరమైన సహాయాన్ని తీసుకోవడం మంచిది.                                       *రూపశ్రీ.  
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది. అయితే.. విజయం సాధించడానికి కష్టపడితే సరిపోతుందని  తెలివి ఉంటే చాలని అనుకుంటారు అందరూ. కానీ విజయం సాధించడానికి తెలివి తేటలు, కష్టపడే తత్వం ఉన్నా.. కొన్ని అలవాట్లు మాత్రం వారికి విజయాన్ని దూరంగానే ఉంచుతాయి.  కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడని సాక్షత్తు ఆచార్య చాణక్యుడే చెబుతాడు.  ఒక వ్యక్తిని విజయం సాధించకుండా చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. సోమరితనం.. కష్టపడే వ్యక్తులలో సోమరితనం ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.. కష్టపడే వ్యక్తులలో ఎంతో కొంత సోమరితనం కనిపిస్తూ ఉంటుంది.  అయితే ఏదో ఒక సందర్బంలో ఈ సోమరితనం వారిని దెబ్బతీస్తుంది.  కీలకమైన సందర్బంలో ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటే లేదా పనిని నిర్లక్ష్యం చేస్తే.. చేతుల దాకా వచ్చిన విజయం కూడా చేజారిపోతుంది.  అందుకే.. ఏ కొద్దిపాటి సోమరితనం ఉన్నా,  దాన్ని వదిలిపెట్టడం మంచిది. పట్టుదల.. పట్టుదల ఏ పనిలో అయినా ముందుకు సాగడానికి,  పనిని పూర్తీ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు చాలా సీరియస్ గా ప్రారంభించి కష్టపడతారు.. ఆ తరువాత మాత్రం తమ పట్టుదలను తగ్గిస్తారు.  దీని వల్ల దక్కాల్సిన విజయం చెయ్యి జారిపోతుంది. ప్రవర్తన.. మనిషి ప్రవర్తన కూడా వారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఇతరులతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను చుట్టుప్రక్కల వారు, సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, వారికి గౌరవం ఇవ్వదు,  వారు చేసే పనులలో తోడ్పాటు, వారు చేసే పనులకు గౌరవం కూడా ఇవ్వదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తమ పనుల విషయంలో కూడా నెగెటివ్ ఫలితాలు పొందుతారు.                                   *రూపశ్రీ.
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది. ఒకప్పుడు కేవలం పండుగలు,  పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి సమయాల్లో మాత్రమే ధరించినప్పటికీ, నేటికాలంలో మహిళలు ఆఫీస్, పార్టీలు, పండుగలు, నార్మల్ టూర్స్ వంటి వాటికి కూడా సల్వార్ సూట్ లు ధరించడానికి ఇష్టపడతారు.  అయితే ఇప్పట్లో సల్వార్ సూట్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ లోకి మారింది. నేటికాలంలో మరింత ఫ్యాషన్ గా ఉన్న దుస్తులు రావడంతో సల్వార్ సూట్ కూడా సాధారణ దుస్తుల్లా మారిపోయింది.  కానీ సల్వార్ సూట్ ను కూడా ఫ్యాషన్ గా ధరిస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండొచ్చు.  అందుకోసం సల్వార్ సూట్ ను ఎలా ధరించాలి?  తెలుసుకుంటే.. సల్వార్ సూట్ స్టైల్ గా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు.. సరైన ఫిట్టింగ్..  సరైన ఫిట్‌తో సూట్‌ను ఎంచుకోండి. సల్వార్ సూట్ స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా కనిపించాలంటే, దాని ఫిట్టింగ్‌పై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. చక్కగా సరిపోయే సూట్  చక్కగా కనిపించేలా చేస్తుంది, అలాగే చాలా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.  మరీ వదులుగా ఉండే సూట్ ధరించడం వల్ల దుస్తుల షేప్  పాడవుతుంది, అదే సమయంలో మరీ బిగుతుగా ఉండే సూట్ ఎబ్బెట్టుగా కనిపించేలా చేస్తుంది. అందుకే ఫిట్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుప్పట్టా.. సల్వార్ సూట్‌లో దుపట్టా చాలా ముఖ్యమైనది.  ఇది మొత్తం రూపాన్ని డిఫరెంట్ గా మార్చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు.. దుపట్టాను ధరించే విధానాన్ని మార్చడం ద్వారా ఒకే సూట్‌ను చాలా విధాలుగా దరించవచ్చు. దుప్పట్టాను  ఒక భుజంపై ఓపెన్ గా  వేసుకోవచ్చు, ముందు వైపు కుచ్చులతో ధరించవచ్చు, లేదా బెల్ట్‌తో కొత్త టచ్ ఇవ్వవచ్చు.   ఫ్యాషన్ జ్యువెలరీ.. సరైన జ్యువెలరీ  సాధారణ సల్వార్ సూట్‌ను కూడా స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా మార్చగలవు.  సూట్ సింపుల్‌గా ఉంటే, ఆక్సిడైజ్డ్ చెవిపోగులు, చాంద్‌బాలీలు, ఒక స్టేట్‌మెంట్ నెక్లెస్ లేదా రంగురంగుల బ్రాస్‌లెట్‌లు ధరించి  లుక్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చు. అయితే, భారీ వర్క్  ఉన్న సూట్‌తో సింపుల్ ఆభరణాలు మరింత హుందాగా కనిపిస్తాయి. ఆభరణాలను ఎంచుకునేటప్పుడు, బాలెన్స్డ్  లుక్ కోసం సూట్  రంగు , డిజైన్‌ను పరిగణలోకి తీసుకోవాలి. .పాదరక్షలు.. సల్వార్ సూట్‌కు సరైన పాదరక్షలను ఎంచుకోవడం  మొత్తం రూపాన్ని మార్చేస్తుంది. సాంప్రదాయ రూపానికి, ఎత్నిక్ జుట్టీలు, కొల్హాపురి చెప్పులు , శాండల్స్ మంచి ఎంపికలు.  పార్టీకి లేదా ప్రత్యేక సందర్భానికి సూట్ ధరిస్తుంటే, లైట్ హీల్స్ మరింత అందాన్ని ఇస్తాయి.  హెయిర్ స్టైల్, మేకప్.. సరైన హెయిర్‌స్టైల్ , మేకప్ సల్వార్ సూట్‌తో  రూపాన్ని మరింత మెరుగుపరుస్తాయి. సాంప్రదాయ దుస్తులతో, లూజ్ హెయిర్ స్టైల్ కు స్మూత్  కర్ల్స్, లో బన్, గజ్రా స్టైల్ లేదా సైడ్ బ్రెయిడ్ వంటివి బాగుంటాయి. హెవీ మేకప్ లుక్ కంటే లైట్ గా , సహజమైన మేకప్ మరింత హుందాగా కనిపిస్తుంది.  డ్రెస్ రంగుకు అనుగుణంగా   లిప్ కలర్, ఐ మేకప్ , బిందీని సెలెక్ట్ చేసుకోవచ్చు.                                           *రూపశ్రీ.  
BMI వార్నింగ్..బిఎమ్ఐ ఎంత ఉండే జాగ్రత్త పడాలి తెలుసా.! బిఎమ్ఐ.. దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఎత్తుకు తగ్గ బరువు  ఉన్నారా లేదా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో అన్ని వయసుల వారిలో అధిక బరువు , ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది. అధిక బరువు ఎన్నో వ్యాధులకు ఒక కారణమని వైద్యులు చెబుతారు.  ఊబకాయం అనేది కేవలం శరీరాన్ని లావుగా చేస్తుందని చాలా మంది అనుకుంటారు.. కానీ నిజం దానికంటే చాలా భయంకరమైనది. ఇది హార్మోన్ల సమస్యలు, రోగనిరోధక వ్యవస్థ సమస్యలు,  మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా చాలా  పెంచుతుంది . చాలామంది బరువు చూసుకుని తాము ఎక్కువ బరువు ఉన్నామా, తక్కువ బరువు ఉన్నామా అని తెలుసుకుని సాటిసిపై అవుతుంటారు. కానీ నిజానికి వెయిట్ మిషన్ లో బరువు చూసుకోవడం అనేది ఆరోగ్యకరమైన బరువును నిర్థారించదు.  ఆరోగ్యకరమైన బరువును బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా నిర్ణయిస్తారు.  దీన్నే బిఎమ్ఐ అని కూడా అంటారు.  బిఎమ్ఐ ఎంత ఉంటే ఆరోగ్యం సేఫ్ గా ఉన్నట్టు? ఎప్పుడు జాగ్రత్త పడాలి? వివరంగా తెలుసుకుంటే.. బిఎమ్ఐ అంటే.. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనేది  ఎత్తుకు తగ్గట్టు బరువు సాధారణంగా ఉందో లేదో తెలియజేసే ఒక కొలమానం. ఒక వ్యక్తి 70 కిలోగ్రాముల బరువు ఉండి, 1.70 మీటర్ల ఎత్తు ఉంటే, ఆ వ్యక్తి BMI సుమారుగా 24.2 ఉంటుంది. BMIని తెలుసుకోవడానికి,  బరువును (కిలోగ్రాములలో)  ఎత్తు యొక్క వర్గంతో (మీటర్లలో) భాగించాలి.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 25 కంటే ఎక్కువ BMI ఉన్న వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. 18.5 కంటే తక్కువ ఉంటే..  తక్కువ బరువు. 18.5- 24.9 మధ్య ఉంటే.. సాధారణ బరువు. 25 29.9 మధ్య ఉంటే..  అధిక బరువు. 30 లేదా అంతకంటే ఎక్కువ  ఉంటే.. ఊబకాయం. బిఎమ్ఐ ఎక్కువ ఉంటే ఏమవుతుంది?  BMI ఎక్కువ ఉంటే తరచుగా శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయినట్టు అర్థం. ఇది రక్తనాళాలు , గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.   పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు శరీరంలోకి వాపును కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది. దీనివల్ల ధమనులలో పాచి పేరుకుపోవడం, అధిక కొలెస్ట్రాల్ , అధిక రక్తపోటు వంటి ప్రమాదాలు పెరుగుతాయి. కాలక్రమేణా, ఈ పరిస్థితి కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండెపోటు , పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు, కణాలు ఇన్సులిన్‌కు తక్కువ సున్నితంగా మారతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ బిఎమ్ఐ వల్ల సమస్యలు.. ఎక్కువ BMI ఉన్నవారికి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని నియంత్రించకుండా వదిలేస్తే, అది కాలేయ వాపు, ఫైబ్రోసిస్ , సిర్రోసిస్‌ సమస్యలకు  దారితీయవచ్చు. ఊబకాయం వల్ల కనీసం 13 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అనేక  అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో  కొవ్వు శరీరంలో వాపుకు కారణమవుతుంది , ఇన్సులిన్, కొన్ని హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల కణాలు అసాధారణఁగా పెరుగుతాయి.  ఇది చాలా ప్రమాదంగా మారుతుంది. బిఎమ్ఐ ను ఎలా నియంత్రించాలి? BMIని నార్మల్ గా ఉంచుకోవడానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ,  జీవనశైలి చురుగ్గా ఉంచుకోవడం చాలా కీలకమని వైద్యులు చెబుతున్నారు. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి, అదనంగా ఆహారంలో తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు , ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. తగినంత నిద్ర పొవాలి,   ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈ రెండూ బరువుపై ప్రభావం చూపుతాయి.  BMI పెరుగుతూ ఉంటే లేదా 25-30 కంటే ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.                                  *రూపశ్రీ.  
ఆహారం మానెయ్యకుండా బరువు తగ్గడం ఎలా..Atkins Diet ప్లాన్ పూర్తి వివరాలు ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి పెద్ద సవాలుగా మారింది. అయితే బరువు తగ్గడం కోసం ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా మానెయ్యాల్సిన అవసరం లేదని ప్రముఖ సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ పి. జానకి శ్రీనాథ్ చెప్తున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే "అట్కిన్స్ డైట్" (Atkins Diet) విధానం ద్వారా ఆహార నియంత్రణల భయం లేకుండానే సులభంగా బరువు తగ్గవచ్చని ఆమె వివరించారు. అట్కిన్స్ డైట్ అంటే ఏమిటి? అట్కిన్స్ డైట్ అనేది ఆహారంలో పిండి పదార్థాలను (Carbohydrates) తగ్గించి, శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులను సరైన పరిమాణంలో అందించే ఒక ప్రత్యేకమైన డైట్ ప్లాన్. మనం సాధారణంగా తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. అట్కిన్స్ డైట్‌లో వాటిని క్రమంగా తగ్గించడం వల్ల శరీరం శక్తి కోసం దాచుకున్న కొవ్వును (Fat) కరిగించడం ప్రారంభిస్తుంది. ఈ డైట్ ప్లాన్ వల్ల కలిగే ముఖ్యమైన ఉపయోగాలు: ఆకలి బాధలు ఉండవు: ఆహారం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకుండానే కేలరీలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. శరీరంలో కొవ్వు త్వరగా కరుగుతుంది: కార్బోహైడ్రేట్లు తగ్గడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు శక్తిగా మారుతుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్: రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి కూడా ఈ డైట్ సహకరిస్తుంది. ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది: ఆహారంలో ప్రోటీన్ మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా నిరోధక శక్తి, ఉత్సాహం ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు తమ జీవన శైలికి మరియు ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరైన న్యూట్రిషనిస్ట్ సలహాతో ఈ డైట్ ప్లాన్‌ని పాటించడం మంచిది. సంపూర్ణ వివరాలు మరియు డాక్టర్ గారి పూర్తి సలహాల కోసం TeluguOne Health వీడియోను తప్పకుండా వీక్షించండి. గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డైట్ ప్లాన్ ప్రారంభించే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించండి.
అంతులేని అలసట వెనుక అసలు కారణం ఏమిటి..డాక్టర్ చెప్పిన నిజాలు.! రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ గారు Chronic Fatigue Syndrome గురించి సులభమైన భాషలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: Chronic Fatigue Syndrome అంటే ఏమిటి? సాధారణ అలసటకు, Chronic Fatigue Syndrome కు ఉన్న తేడా ఏమిటి? ఈ సమస్య వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి? ఈ సమస్యను తగ్గించేందుకు జీవనశైలిలో చేయాల్సిన మార్పులు సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణుల సూచనలు ఎప్పుడూ అలసటగా ఉండటం, ఏ పని చేయాలన్నా శక్తి లేకపోవడం, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. సరైన సమయంలో కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి. గమనిక: ఈ వీడియోలో అందించిన సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సలహా, నిర్ధారణ లేదా చికిత్స కోసం వైద్య నిపుణులను సంప్రదించండి.