Home

»

Latest News

బాబోయ్ శ్రీకాంత్ ఓదెల: సుకుమార్ కోసం ఇండియా టాప్ డైరెక్టర్‌కి నో చెప్పాడు.!

Oct 4, 2026 5:14PM

సినిమా ఇండస్ట్రీలో ఒక్క అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసేవాళ్లు చాలామంది ఉంటారు. అలాంటిది కెరీర్ ఆరంభంలోనే దేశంలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం వస్తే.. ఎవరైనా వెంటనే ఓకే చెప్పేస్తారు. పైగా నెలకు రూ.50 వేల జీతం అంటే ఆ రోజుల్లో అది చాలా పెద్ద ఆఫర్. కానీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం ఆ ఆఫర్‌ను సింపుల్‌గా రిజెక్ట్ చేశారు. కారణం ఒక్కటే.. సుకుమార్ దగ్గరే పనిచేయాలి.

తాజాగా ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌తో జరిగిన చిట్‌చాట్‌లో శ్రీకాంత్ ఓదెల తన కెరీర్ ప్రారంభ రోజుల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. తనకు ఒక ప్రముఖ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చిందని, ఆయన పేరు మాత్రం వెల్లడించనని చెప్పారు.

అప్పట్లో అనుకోకుండా ఆ దర్శకుడి నుంచి శ్రీకాంత్‌కు పిలుపు వచ్చిందట. ‘‘రేపటి నుంచే షూటింగ్‌కు వచ్చేయ్.. నెలకు రూ.50 వేలు ఇస్తాం’’ అని చెప్పారట. ఆ రోజుల్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌కు రూ.50 వేల జీతం అంటే మామూలు విషయం కాదు.

అయినా శ్రీకాంత్ మాత్రం ఆ ఆఫర్‌కు ఓకే చెప్పలేదు. తనకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి సినిమా నేర్చుకోవడమే లక్ష్యమని, ముందుగా ఆయన దగ్గరే పనిచేస్తానని స్పష్టంగా చెప్పారట.

అసలు సుకుమార్ దగ్గర ఛాన్స్ కోసం శ్రీకాంత్ పడిన కష్టం కూడా మామూలుగా లేదు. తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. దాదాపు నాలుగేళ్ల పాటు సుకుమార్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. రోజూ ఉదయం ఆయన ఇంటి గేటు దగ్గరకు వెళ్లడం, అవకాశం కోసం ఎదురుచూడటం చేసేవారట.

చివరికి శ్రీకాంత్ పట్టుదలను గమనించిన సుకుమార్.. ఒక షార్ట్ ఫిల్మ్ చేసి తీసుకురమ్మని చెప్పారట. శ్రీకాంత్ ఆ షార్ట్ ఫిల్మ్ తీసుకెళ్లిన తర్వాత సుకుమార్ టీమ్‌లోకి అవకాశం దక్కింది.

అలా ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘రంగస్థలం’ కోసం సుకుమార్ టీమ్‌లో పూర్తిస్థాయిలో పనిచేశారు.

ఇది కూడా చదవండి: ప్రభాస్ సినిమా ఎఫెక్ట్.. ఆ హీరోయిన్ కెరీర్ రిస్క్ లో పడిందా.?

 

 

 

[Srikanth Odela Interview, Director Sukumar, The Paradise Movie, Srikanth Odela, Nani Paradise, Telugu Film News, Telugu News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com