
‘దేవర’లోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన AI మార్ఫింగ్ వీడియో వివాదంపై జాన్వీ కపూర్ తొలిసారి స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన నోట్‌లో.. మహిళలను ఆబ్జెక్టిఫై చేయడానికి, వారి అనుమతి లేకుండా కల్పిత కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేయడానికి టెక్నాలజీని ఉపయోగించడం చాలా తీవ్రమైన విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“మహిళలను ఆబ్జెక్టిఫై చేయడానికి, వారి అనుమతి లేకుండా ఫిక్షనల్ కంటెంట్‌ను సర్క్యులేట్ చేయడానికి టెక్నాలజీని దుర్వినియోగం చేయడం చాలా బాధాకరం. ఇది లైంగిక వేధింపులతో సమానం” అంటూ జాన్వీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన ఇండస్ట్రీలోని దాదాపు ప్రతి మహిళా ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక రూపంలో బాధపడిందని కూడా ఆమె చెప్పారు.
మహిళ ఏ దుస్తులు వేసుకోవాలి, ఎక్కడ కంఫర్ట్‌గా ఉండాలి, తన శరీరంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత హక్కు అని జాన్వీ స్పష్టం చేశారు. ఒక మహిళ మినీ స్కర్ట్ వేసుకున్నంత మాత్రాన.. ఆమెను ఎవరైనా అనుమతి లేకుండా చిత్రీకరించడానికి లేదా ఆమె శరీరాన్ని అసభ్యంగా చూపించడానికి హక్కు ఇచ్చినట్టు కాదని పేర్కొన్నారు.
ఇది కేవలం తనకు ఎదురైన AI వీడియో సమస్య మాత్రమే కాదని జాన్వీ అన్నారు. మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న చూపులు, తీర్పులు, భద్రతపై భయం వంటి సమస్యలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి కూడా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక మహిళ శరీరం కంటెంట్ కాదు.. ఆమె గౌరవం ఎంటర్‌టైన్‌మెంట్ కాదు” అనే బలమైన సందేశాన్ని ఆమె ఇచ్చారు.

ఈ విషయంలో ఎన్టీఆర్ తీసుకున్న స్టాండ్ తనను ఎంతో టచ్ చేసిందని జాన్వీ పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచి ఈ ఘటనను ఖండించినందుకు ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఖుష్బూ తదితరులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరినందుకు కూడా ఆమె ధన్యవాదాలు చెప్పారు.
చివరగా జాన్వీ చెప్పిన మాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “ఆమె శరీరం.. ఆమె ఇమేజ్.. ఆమె హద్దులు.. ఆమె నిర్ణయం.” AI టెక్నాలజీ దుర్వినియోగంపై జాన్వీతో పాటు టాలీవుడ్ ప్రముఖులంతా ఒకే మాటపై నిలబడటంతో.. ఈ వ్యవహారంలో ఇక ఎలాంటి చర్యలు జరుగుతాయన్నది ఆసక్తిగా మారింది.
ఇది కూడా చదవండి: చిరంజీవి ‘డాడీ’కి 25 ఏళ్లు.. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కి కూడా స్పెషల్ మూవీ.!
[Janhvi Kapoor Reaction On AI Morphed Video, Janhvi Kapoor Instagram, Janhvi Kapoor AI Video, Janhvi Kapoor, Chuttamalle Song, Jr NTR, Chiranjeevi, Vijay Deverakonda, Telugu Film News]





