
ఒక సినిమాకు భారీ హైప్ తీసుకురావాలంటే పెద్ద స్టార్స్ పేర్లు చాలు. కానీ ఆ హైప్‌ను బాక్సాఫీస్ సక్సెస్‌గా మార్చాలంటే మాత్రం సినిమాలో విషయం ఉండాలి. ఇప్పుడు ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ విషయంలో ఇదే చర్చగా మారింది.
ఈ సినిమాకు ప్రమోషన్స్ విషయంలో మామూలు సపోర్ట్ దక్కలేదు. రాజమౌళి ప్రజెంటర్‌గా ఉండటం ఒక ఎత్తయితే.. ఎన్టీఆర్, మహేష్ బాబు, సుకుమార్, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు సినిమాపై పాజిటివ్‌గా మాట్లాడటం మరో ఎత్తు.
ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై టీమ్‌కు బూస్ట్ ఇచ్చారు. మహేష్ బాబు కూడా సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. మహేష్‌తో పాటు సితార కూడా చిన్నారి సారాతో కలిసి ప్రమోషనల్ వీడియోలో కనిపించింది. సుకుమార్, అనిల్ రావిపూడి వంటి వాళ్లు కూడా సినిమాపై పాజిటివ్‌గా స్పందించారు.
ఇక ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచే మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది. బాలకృష్ణకు సంబంధించిన పాపులర్ డైలాగ్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’నే టైటిల్‌గా పెట్టుకోవడంతో.. ఆయన వాయిస్ ఓవర్‌తో ట్రైలర్‌ను ప్రమోట్ చేశారు.
అంటే.. సినిమాకు కావాల్సినంత అటెన్షన్ అయితే వచ్చింది. కానీ అసలు పరీక్ష థియేటర్లలో మొదలైంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమాకు రివ్యూలు, ప్రేక్షకుల స్పందన మాత్రం మిక్స్‌డ్‌గా వచ్చింది. కథలో కొత్త పాయింట్ ఉన్నప్పటికీ.. దాన్ని ఆసక్తికరంగా నడిపించలేకపోయారనే కామెంట్స్ వినిపించాయి.
సెలబ్రిటీ ప్రమోషన్స్ అనేవి సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కానీ థియేటర్‌కు ప్రేక్షకుడిని తీసుకొచ్చిన తర్వాత అతడిని కూర్చోబెట్టేది మాత్రం సినిమా కంటెంట్. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో మరోసారి “స్టార్ పవర్ కంటే కంటెంట్ పవర్ ముఖ్యం” అనే మాట వినిపిస్తోంది.
‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ విషయంలో అయితే పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. రాజమౌళి ప్రజెంటర్.. ఆయన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాత.. ఫహాద్ ఫాజిల్ లీడ్ యాక్టర్.. ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్స్ ప్రమోషన్స్‌లో భాగమయ్యారు.
చివరికి మరోసారి రుజువవుతున్న విషయం ఒక్కటే.. ఎన్ని పెద్ద పేర్లు ఉన్నా, థియేటర్‌లో ప్రేక్షకుడిని గెలిపించేది మాత్రం సినిమా కంటెంటే.
ఇది కూడా చదవండి: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. రంగంలోకి బాలయ్య హీరోయిన్లు.!
[Dont Trouble The Trouble Movie, Don't Trouble The Trouble, Fahadh Faasil, SS Rajamouli, Jr NTR, Mahesh Babu, Nandamuri Balakrishna, Telugu Film News]






