LATEST NEWS
వైద్య రంగంలో జరిగే చిన్నపాటి తప్పులు ఒక్కోసారి మనుషుల జీవితాలనే తీవ్రంగా మార్చేస్తుంటాయి. అలాంటి ఒక విషాదకరమైన సంఘటన బెక్కీ జోన్స్ అనే మహిళ జీవితంలో చోటుచేసుకుంది. 2012లో ఆమె తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు ఆమెకు బ్రెయిన్ స్కాన్ నిర్వహించగా మెదడులో ఒక పెద్ద మచ్చ కనిపించింది. ఆ మచ్చను చూసి అది ప్రమాదకరమైన బ్రెయిన్ ట్యూమర్ అని, ప్రాణాంతక క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. చికిత్స వెంటనే ప్రారంభించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని పదే పదే హెచ్చరించడంతో, ఆమె కీమోథెరపీ తీసుకోవడం ప్రారంభించారు. అది ఒక ఏడాది కాదు, రెండేళ్లు కాదు.. ఏకంగా 11 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. కొద్ది నెలల వ్యవధిలోనే ముగియాల్సిన మానసిక, శారీరక వేదన ఆమె జీవితంలో దాదాపు దశాబ్ద కాలానికి పైగా నిత్యకృత్యమైంది. కీమోథెరపీ వల్ల కలిగే తీవ్రమైన పార్శ్య ప్రభావాలు, వెంట్రుకలు రాలిపోవడం, వికారంగా ఉండటం, శరీరం బలహీనపడటం వంటి నరకయాతనను ఆమె ప్రతిరోజూ అనుభవించారు. చికిత్స ఆపేస్తే ఎక్కడ క్యాన్సర్ తిరగబెట్టి తన ప్రాణాలను తీస్తుందో అనే భయంతోనే ఆమె 11 ఏళ్ల పాటు ఆ నరకాన్ని భరిస్తూ వచ్చారు. అయితే 2025లో ఆమె వైద్య రిపోర్టులను కొందరు న్యూరోసర్జన్లు మరియు రేడియాలజిస్టులు మరొకసారి క్షణ్ణంగా పరిశీలించినప్పుడు అసలు షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. బెక్కీ జోన్స్‌కు అసలు ఎప్పుడూ బ్రెయిన్ క్యాన్సరే లేదని వైద్యులు తేల్చి చెప్పారు. స్కాన్‌లో కనిపిస్తున్న మచ్చ క్యాన్సర్ ట్యూమర్ కాదని, అది  ట్యూమర్‌ఫ్యాక్టివ్ డిమైలినేషన్  అనే అరుదైన నాడీ సంబంధిత సమస్య అని స్పష్టం చేశారు. నరాల పొర దెబ్బతినడం వల్ల వచ్చే ఒక రకమైన వాపు కారణంగా అది స్కాన్‌లో చూడటానికి హానికరమైన ట్యూమర్‌లా కనిపించిందని వివరించారు. ఈ నిజం తెలుసుకున్న బెక్కీ జోన్స్‌కు ఉపశమనం లభించడం కంటే తీవ్రమైన దిగ్భ్రాంతి, వేదన మిగిలాయి. తన జీవితంలోని అమూల్యమైన 11 సంవత్సరాల కాలాన్ని, ఆరోగ్యాన్ని కేవలం ఒక తప్పుడు వైద్య నిర్ధారణ వల్ల అనవసరంగా కోల్పోయానని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.  నాకు అసలు బ్రెయిన్ ట్యూమరే లేదు, పదేళ్లకు పైగా ఏ కారణం లేకుండానే నరకాన్ని అనుభవించాను  అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన అరుదైన లేదా క్లిష్టమైన వైద్య పరీక్షలు ఎదురైనప్పుడు సెకండ్ ఒపినియన్ ఎంత కీలకమో అందరికీ కన్నువిప్పు కలిగిస్తోంది.     [ Becky Jones, Medical Misdiagnosis, Brain Tumor, Tumefactive Demyelination, Brain Scan, Chemotherapy, Neurology, Neurosurgery, Radiology, Second Opinion ]
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. ! తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ అలాగే వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన జారీ చేసింది. వచ్చే ఏడాది 2027 మార్చి నెలలో సిట్టింగ్ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, ఈ రెండు స్థానాలకు కొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జూరీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్‌ను అధికారులు తాజాగా విడుదల చేయడంతో పట్టభద్రుల్లో ఉత్కంఠ నెలకొంది.  ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థుల కోసం అధికారిక యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది.  ఈ ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి సెప్టెంబర్ 28వ తేదీన అధికారికంగా ప్రజా నోటీసు లేదా ప్రకటన వెలువడనుంది. నవంబర్ 1, 2026 నాటికి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత సాధించిన పట్టభద్రులందరూ ఈ ఓటర్ల నమోదుకు పూర్తిగా అర్హులుగా ఉంటారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అర్హులైన నిరుద్యోగులు, ఉద్యోగులు మరియు పట్టభద్రులు తమ ఓటు హక్కు కోసం నవంబర్ 6వ తేదీ వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.  అక్టోబర్ 15న పత్రికల్లో తొలి పునఃప్రచురణ, అక్టోబర్ 25న రెండో పునఃప్రచురణ చేపట్టనున్నారు. గడువు ముగిసిన తర్వాత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నవంబర్ 25వ తేదీన ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.  ఒకవేళ ముసాయిదా జాబితాలో పేర్లు లేకపోతే లేదా తప్పులు ఉంటే, వాటి సవరణలు మరియు అభ్యంతరాల స్వీకరణ కోసం నవంబర్ 25 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు ప్రత్యేక సమయం కేటాయించడం జరిగింది.  ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిశితంగా పరిశీలించి అన్ని రకాల మార్పు చేర్పులు పూర్తి చేసిన అనంతరం, డిసెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. అయితే, ఇక్కడ పట్టభద్రులు అత్యంత గమనించాల్సిన కీలక విషయం ఏమిటంటే.. గతంలో పాత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు సైతం ఈసారి కొత్తగా మార్పు చేసిన ఫారం-18 ద్వారా విధిగా దరఖాస్తు చేసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. దరఖాస్తుతో పాటు అర్హతకు సంబంధించిన ధ్రువీకరించిన సర్టిఫికెట్ల కాపీలను జతచేయాల్సి ఉంటుంది. పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.        [ graduate mlc elections, telangana voters list, form 18 registration, mlc election schedule, telangana news, graduate voters, Mlc Tinmar Malanna, Telugu one, Telugu News ]
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తెలంగాణ భూములపై చేసిన ప్రసంగం ప్రకంపనలు సృష్టించింది. రాజకీయ నాయకులకు భూమి, భారీ ప్రాజెక్టుల్లో కమిషన్లు అనేవి ప్రధాన ఆదాయ వనరులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భూమికి సంబంధించిన అక్రమాలు, కబ్జాలు లెక్కకు మించి జరిగాయనే విమర్శలు ఉన్నాయి.  దీనికి సంబంధించి అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. బడా రాజకీయ నాయకుల నుంచి గ్రామ స్థాయి రాజకీయ నాయకుల వరకు భూకబ్జాలకు, అక్రమ భూఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి.   పోరంబోకు, అటవీ, అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయి. వాటిని ధరణి ద్వారా న్యాయబద్దత లేదా చట్టబద్ధత కల్పించుకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో నిజం వుంది. అయితే, ఇది బిఆర్ఎస్ నాయకులకు మాత్రమే వర్తిస్తుందా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వర్తించదా అనేది ప్రశ్న. అదికారంలో వున్న పార్టీకి భూములను భుక్తం చేసుకునే వెసులుబాటు ఎక్కువగా వుంటుంది. చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది. ఈ చట్టానికి లోబడి భూమిని కలిగి వుండేలా చాలా మంది జాగ్రత్త పడి వుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అది అతిక్రమణకు గురైంది. భూ పరిమితి చట్టం అమలులో వుందనే విషయం తెలియని ఓ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను సమర్పించిన అఫిడవిట్‌లో 110 ఎకరాలు ఉన్నట్లు చెప్పుకున్నాడు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్, ఆ తర్వాతి బిఆర్ఎస్ ప్రభుత్వాలు భూ హక్కుల పాబందిని ధ్వంసం చేశాయి. ఆ విధ్వంసం బహుశా 2018 నుంచి ఎక్కువగా జరుగుతూ వచ్చింది. ఆ ఏడాది నుంచి పహణీ రాయడం ఆపేశారు. పహాణీ అనేది భూ యాజమాన్యాన్ని పక్కా చేస్తుంది. అంటే ఏ భూమి ఎవరి పేరు మీద వుందనే విషయాన్ని అది తేటతెల్లం చేస్తుంది.  ఇది వేర్వేరు సర్వే నెంబర్లలో ఒక వ్యక్తి కలిగి వున్న భూమిని తెలియజేస్తుంది. ఆసామీవారి ఖాతాలు మాయమయ్యాయి.  పట్వారీ వ్యవస్థను ఎన్‌టీ రామారావు ప్రభుత్వం రద్దు చేస్తే, వీఆర్వో వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది మస్కూర్ వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఒక గ్రామంలో ఏ భూమి ఎవరి పేరు మీద ఉందనే విషయం తెలియకుండా పోయింది, ఆర్డీవోలకు ఉన్న హక్కులను రద్దు చేసి కలెక్టర్ చేతిలో పెట్టారు. దీంతో భూముల యాజమాన్య హక్కులు తెలుసుకోవడం సమస్యగా తయారైంది. రాత్రికి రాత్రి బలవంతులు భూములను ధరణిలో ఎక్కించుకుని కబ్జాలు చేసిన వైనాలున్నాయనే విషయం ఏ గ్రామానికి వెళ్లినా తెలుస్తుంది. దీంతో గ్రామాల్లో భూ తగాదాలు పెరిగాయి.  కేసీఆర్ ప్రభుత్వం భూములకు సంబంధించి కొత్త పద్ధతి ప్రవేశపెట్టడం వల్ల కూడా భూ యాజమాన్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఎవరైనా తమ భూమి వివరాలను దాచి పెట్టుకునే అవకాశం అది. అంటే ఒక వ్యక్తి తన భూమి వివరాలను రెండో కంటికి కనిపించకుండా దాచి పెట్టుకోవచ్చు  రేవంత్ రెడ్డి భూ వివరాలను బయటపెడతానని చెబుతున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ మీద చాలా గట్టి ప్రకటనే చేశారు. దాన్ని అమలు చేస్తారా, లేదా అనేది తర్వాతి విషయం. బీఆర్ఎస్ బడా నేతల భూముల లెక్కలు కూడా చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీల నాయకుల భూముల వివరాలను కూడా బయటపెడతారా, చూడాలి.  మరో విషయం..  చోటా మోటా నాయకులు గ్రామాల్లో వందల ఎకరాలు సంపాదించుకున్న వైనం కూడా వుంది. వాటిని బయటకు తీస్తారా? రేవంత్ రెడ్డి మీద కూడా భూములకు సంబంధించి ఆరోపణలు వున్నాయి. తన విషయాన్ని ఆయన స్పష్టం చేస్తారా? తెలంగాణలో భూమి అనేదే ఇప్పుడు ప్రధానమైన చర్చ. దాని అంతు తేలిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. అందుకు రాజకీయ నాయకులు సిద్ధపడుతారా అనేది సందేహం. Telangana Lands, Telangana Politcs, Revanth reddy, KCR, BRS, Dharni, Telugu One
భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు మరియు ఆయన ప్రజా జీవితంలో అప్రతిహతంగా పాతికేళ్లు  పూర్తి చేసుకున్న సందర్భంగా వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం (సెప్టెంబర్ 17) ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.    సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ఒక నెల రోజుల పాటు కొనసాగే సేవ మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు  ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం కాశీ నగరంలో  గురువారం (సెప్టెంబర్ 17) శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వడ్నగర్ నుండి వారణాసి వరకు  అలాగే వారణాసి నుండి వడ్నగర్ వరకు రెండు భారీ బైక్ ర్యాలీలను అగ్రనేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రలు  10 రాష్ట్రాల గుండా ప్రయాణించి, 193 జిల్లాలు మరియు దాదాపు 1,159 గ్రాగాలను తాకుతూ అక్టోబర్ 7న ముగియనున్నాయి. ఈ బృహత్తర బైక్ ర్యాలీలు మొత్తం 40,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుండగా, ఇందులో  వెయ్యి మంది  భాగస్వాములు కావడం విశేషం. ఈ  కార్యక్రమంలో  పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి బయలుదేరి వారణాసి  చేరుకున్నారు. అక్కడ తొలుత ప్రసిద్ధ శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రుద్రాక్ష ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సేవా యాత్ర ప్రారంభ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఇదే సమయంలో గుజరాత్‌లోని వడ్నగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తదితరులు వ్యతిరేక దిశ నుంచి సాగే బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ యాత్రల ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేయడంతో పాటు, ప్రజా భాగస్వామ్యం,  సామాజిక బాధ్యత ప్రాముఖ్యతను చాటిచెప్పాలన్నది  లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు వారణాసిలో కాశీ విశ్వనాథ ధామ్‌లో పవిత్ర జలాలతో జలాభిషేకం చేసేందుకు దేశంలోని వివిధ నదుల నుండి నీటిని సేకరించి ఈ యాత్ర ద్వారా తరలిస్తున్నారు.   నెల రోజుల పాటు సాగే  సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా రక్తదాన శిబిరాలు, ఆరోగ్య పరీక్షలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, అట్టడుగు స్థాయి లబ్ధిదారుల సన్మానం,  వికసిత్ భారత్-2047 లక్ష్యంగా పలు యువజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమై, దేశ ప్రధాని స్థాయి వరకు సాగిన మోదీ పరిపాలనా ప్రస్థానాన్ని, సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.  [Seva Sankalp Abhiyan, PM Modi birthday, Chandrababu Naidu Varanasi, Yogi Adityanath, Vadnagar Varanasi bike rally, NDA leaders Varanasi, Telugu One]
ప్రధాని నరేంద్ర మోదీ తన 76వ పుట్టినరోజు  సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల అధినేతల నుంచీ  రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల అగ్రనేతలు ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే..  మోదీకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. వీరితో పాటు కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ  చీఫ్‌ శరద్‌ పవార్‌, శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది తదితరులు మోదీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధినేత  స్టాలిన్‌  తదితరులు కూడా మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  అలాగే    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ సేవలందిస్తున్న తీరు  చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.  గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధాని పదవి వరకు సాగిన సుమారు రెండున్నర దశాబ్దాల రాజకీయ ప్రయాణం దేశ ప్రగతికి దోహదం చేసిందన్నారు. సేవ, సంకల్ప్, సుశాసన్  అనే నినాదంతో ఆయన చేపడుతున్న కార్యక్రమాలు కోట్లాది మంది పౌరులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.  సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న ప్రధాని ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని మంత్రి నారాలోకేష్ పేర్కొన్నారు.  క్రమశిక్షణ, అంకితభావం రాజకీయాల్లో పనిచేసే యువ నాయకులకు ప్రధాని మోడీ ఆదర్శమని లోకేష్ ప్రస్తుతించారు.  [Narendra Modi Birthday, Rahul Gandhi, Mallikarjun Kharge, Nara Chandrababu, Lokesh, Modi 76th birthday Wishes, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
'మహానటి', 'సీతారామం', 'లక్కీ భాస్కర్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఇప్పుడు ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ హార్ట్ టచింగ్ డ్రామా 'ఆకాశంలో ఒక తార' సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని నవంబర్ 20న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. "ది జర్నీ టు ది స్టార్స్ బిగిన్స్.. ఆకాశంలో ఒక తార నవంబర్ 20న థియేటర్లలోకి వస్తోంది.. ఒక అందమైన ప్రపంచం మీ కోసం వేచి చూస్తోంది" అంటూ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. పవన్ సాదినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో, ఎమోషనల్ అండ్ రొమాంటిక్ రైడ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తోంది.  స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్, లైట్‌బాక్స్ మీడియా సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. స్వప్న సినిమాస్ - దుల్కర్ కాంబినేషన్ అనగానే మనకి 'మహానటి', 'సీతారామం' లాంటి ఆల్ టైమ్ క్లాసిక్స్ గుర్తుకొస్తాయి. ఆ సెంటిమెంట్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో, ఈ సినిమాతో హ్యాట్రిక్ క్లాసిక్ హిట్ పక్కా అని సినీ ప్రియులు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండటం విశేషం. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో నవంబర్ 20, 2026న రాబోతున్న ఈ 'ఆకాశంలో ఒక తార' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.       [Aakasamlo Oka Tara Release Date, Dulquer Salmaan Aakasamlo Oka Tara, Dulquer Salmaan Telugu Movie, Aakasamlo Oka Tara Movie, Dulquer Salmaan, Pavan Sadineni, Swapna Cinema, Telugu Film News, Telugu News]  
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చినా, ఇక ముందు ఎన్ని సినిమాలు వచ్చినా 'గబ్బర్ సింగ్' మానియా మాత్రం నిత్యం రగులుతూనే ఉంటుంది. ఈ సినిమాలో 'అంత్యాక్షరి' సన్నివేశంలో నటించి ‘గబ్బర్ సింగ్’ రమేశ్.గా గుర్తింపు పొందాడు రమేశ్.  కొద్దిరోజుల క్రితం తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అత్యవసర పరిస్థితిలో అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్న వార్త విని సినీ వర్గాలు, పవన్ కల్యాణ్ అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.  వైద్యుల నిరంతర పర్యవేక్షణ, శస్త్రచికిత్స మరియు మెరుగైన వైద్య సేవలు ఫలించడంతో రమేశ్ ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. ఈ కష్టకాలంలో ఆయనలో మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కుటుంబ సభ్యులు ఎంతో శ్రమిస్తున్నారు. ఆసుపత్రి బెడ్‌పైన ఉన్న రమేశ్‌కు ఆయనకు ఎంతో ఇష్టమైన పవన్ కల్యాణ్ సినిమాలను, అలాగే ‘గబ్బర్ సింగ్’ చిత్రంలోని అంత్యాక్షరి సీన్లను టీవీలో చూపిస్తూ నిత్యం ఉత్సాహపరుస్తున్నారు. ఈ క్రమంలో టీవీలో వచ్చే పాటలను చూస్తూ ఆయన సరదాగా పాడుతున్న ఓ భావోద్వేగమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.     Also Read: బెడ్‌రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ 'బాల్‌'తోనే.. బోల్డ్ సీన్స్ గుట్టు విప్పిన హీరోయిన్!  రమేశ్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు, సహ నటులు, దర్శకులు మరియు మెగా కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి మరియు నాగబాబు రమేష్ కుటుంబానికి 5 లక్షల మేర ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా లక్షల ఖరీదైన ట్రీట్ మెంట్ ని కూడా అపోలోలో ఫ్రీగా ఇప్పించారు. వీడియో చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ 'రమేష్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, మళ్లీ పూర్వవైభవం సంతరించుకుని వెండితెరపై నవ్వులు పూయించాలని  ‘గెట్ వెల్ సూన్ రమేశ్’ అంటూ కామెంట్స్ తో సోషల్ మీడియాకి కూడా మానవత్వం పీక్ లో ఉంటుందని నిరూపిస్తున్నారు.     [Gabbari Sing, Pawan kalyan, Gabbar Singh Actor Ramesh Brain Stroke Recovery, Chiranjeevi, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'డ్రాగన్'. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.  ఇటీవల ఎన్టీఆర్ చేతికి గాయం కావడం, దానికి సర్జరీ జరగడంతో ఆయన కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దాంతో ప్లాన్ చేసిన కీలక షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యమయ్యాయి. ఎన్టీఆర్‌తో పాటు ఇతర ప్రధాన నటీనటులు నటించాల్సిన కాంబినేషన్ సీన్స్ చాలావరకు పెండింగ్‌లో పడిపోయాయి. ఇప్పుడు వారందరి డేట్స్‌ను మళ్లీ అడ్జస్ట్ చేస్తూ కొత్త షెడ్యూల్స్ ప్లాన్ చేయడం ప్రశాంత్ నీల్‌కి పెద్ద ఛాలెంజ్‌గా మారింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఆయన ప్రతి సీన్‌లోనూ, ప్రతీ ఫ్రేమ్ లోనూ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడరు. పైగా, షూటింగ్ పూర్తి కావడం ఒకెత్తయితే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం నెలల తరబడి సమయం పడుతుంది. అనుకున్నట్టుగా జూన్ 11న సినిమా రావాలంటే, వచ్చే ఫిబ్రవరి నాటికే టోటల్ టాకీ పార్ట్ కంప్లీట్ కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది కష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ షూటింగ్ ఆలస్యమైతే.. 2027 దసరాకు సినిమాను తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మరి ఈ ప్రచారంలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.       [NTR Dragon Release Date, NTR Dragon Postponed, Dragon 2027 Dasara Release, NTR Dragon Movie, Jr NTR, Prashanth Neel, Telugu Film News, Telugu News]  
  జోనర్ ఏదైనా సరే ;బోల్డ్ సీన్స్' కి కూడా ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారనేది సినీ సత్యం. పైగా రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు. కానీ వాళ్ళని బాధకి గురి చేసే అంశం ఏంటంటే బోల్డ్ మరియు రొమాంటిక్ సీన్లు అనేవి చాలా వరకు సహజంగా క్రికరించినవి కావు. సినిమాలైనా వెబ్ సిరీస్‌లైనా అదే బాపతు.  వీటిపై చాలా వివరంగా ప్రముఖ హాలీవుడ్ నటి సారా షాహీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  వెల్లడి  చేసి ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో విపరీతమైన ప్రజాదరణ పొందిన 'సెక్స్/లైఫ్' (Sex/Life) వంటి సిరీస్‌లలో ధైర్యంగా నటించిన సారా, బెడ్‌రూమ్ సన్నివేశాల్లో హీరోలు లేదా సహ నటుల శరీర స్పర్శ లేకుండా సీన్లు ఎలా రికార్డ్ చేస్తారో వివరంగా వెల్లడించింది.  ఆమె మాట్లాడుతు హాలీవుడ్‌లో రొమాంటిక్, బోల్డ్ సీన్లు చిత్రీకరించేటప్పుడు నటీనటులు మానసికంగా, శారీరకంగా ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన ట్రిక్ ఉపయోగిస్తారట. షూటింగ్ సమయంలో ఇద్దరి నటుల మధ్య గాలి తీసేసిన ఒక చిన్న ప్లాస్టిక్ 'యోగా బాల్', లేదా యోగా డిస్క్ బాల్‌ ఉంచుతారు. కెమెరా ముందుకు వచ్చి సీన్‌లో ఇన్వాల్వ్ అయ్యే సమయంలో నటుడు కేవలం ఆ యోగా బాల్‌ను మాత్రమే స్పర్శిస్తాడు. దీనివల్ల ఎదుటి నటి శరీరానికి నేరుగా నటుడి స్పర్శ తగలదు. "నాకు కేవలం ఆ సాఫ్ట్ బాల్ ప్రెజర్ లేదా ఇంపాక్ట్ మాత్రమే అనిపిస్తుంది, అంతే తప్ప ఎదుటి నటుడి శరీర స్పర్శ నా చర్మానికి ఏమాత్రం తగలదు" అని సారా స్పష్టం చేశారు. ఈ వినూత్నమైన పద్ధతి వల్ల నటీనటులకు సెట్‌లో పూర్తి రక్షణ మరియు పని చేయడానికి అవసరమైన స్వేచ్ఛ లభిస్తుంది. కెమెరా ముందు అసౌకర్యంగా భావించే అనవసర శారీరక స్పర్శలు లేకుండా, తమ పరిమితులకు లోబడి చాలా ప్రొఫెషనల్‌గా సురక్షితంగా నటించే వెసులుబాటు ఈ యోగా బాల్ ట్రిక్ ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. అయితే, తెరపై చూసే ప్రేక్షకులకు మాత్రం వాస్తవంగానే రొమాన్స్ చేస్తున్నట్లు కనిపించడం హాలీవుడ్ మేకర్స్ సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.   Also Read: Ramayana: 'రామాయణ' పార్ట్ 1 :ప్రపంచంలోనే ముందుగా ఈ దేశంలో విడుదల..అక్కడే ఎందుకు! ఇంతేకాకుండా, ఇటువంటి క్లిష్టమైన ఇంటిమేట్ సన్నివేశాల షూటింగ్ సమయంలో దాదాపు 3 నుంచి 4 గంటల సమయం కేటాయించి ప్రోస్టెటిక్స్ కూడా ఉపయోగిస్తారని సారా గతంలో వెల్లడించారు. 8 ఎపిసోడ్లు ఉన్న సిరీస్‌లలో నటీనటులు పూర్తిగా సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రొడక్షన్ బృందం ఇన్టిమసీ కోఆర్డినేటర్లను (Intimacy Coordinators) నియమిస్తుందనేది సినీ వర్గాల సమాచారం. ఏది ఏమైనా ఈ మాటలన్నీ బోల్డ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇష్టపడే వాళ్ళు అసలు పట్టించుకోరు. అసలు విన్నట్టుగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది తమ కంటికి ఏం కనపడుతుందని మాత్రమే. అందుకే ఆ జోనర్ సినిమాలకి నైట్ విహంగులు ఎక్కువ.      [Sarah Shahi, Yoga Ball Secret, Hollywood intimate scenes , Sex Life Netflix, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
    భారతీయ చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు యావత్తు ఇది మా సినిమా,  మా రాముని రామాయణం అంటూ గర్వపడేలా తెరకెక్కిన మూవీ రామాయణ. ఆ మాట అక్షర సత్యమనడానికి ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలే సజీవ సాక్ష్యం. రామాయణ’రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ‘రామాయణ’ పార్ట్ 1 రిలీజ్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన తేదీల కంటే ఒక రోజు ముందుగానే ఓ దేశంలో రామాయణ అక్కడి ప్రేక్షకుల చేత జై శ్రీరామ్ అనిపించబోతుంది. ఆ దేశమే  సింగపూర్‌. సింగపూర్ లో   నవంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్  ఖరారు చేశారు. దీంతో  ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ముందుగా సింగపూర్‌లోనే ‘రామాయణ’ పార్ట్ 1 ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.ఇది వాళ్ళకి రాముడు ఇచ్చిన సినీ వరంగా భావించవచ్చు.     Also Read: రాకాలో ఆ '37' మిస్టరీ ఏంటి: విప్పిన వాళ్ళు నిజమైన అల్లు అర్జున్ ఫ్యాన్స్!  రాముడిగా రణబీర్ కపూర్, సీతమ్మ వారుగా సాయి పల్లవి,రావణుడిగా యష్ ఎలా మెస్మరైజ్ చేయబోతున్నారో అని రామభక్తులు,  ప్రేక్షకులు, మూవీ లవర్స్ కాచుకొని కూర్చున్నారు. దీంతో దంగల్ ఫేమ్ దర్శకుడు నితీష్ తివారి, అంతర్జాతీయ లెజండ్రీ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా రాముడి కోసం ఎంత తపనపడ్డారో తెలిసిపోనుంది.     [Ramayana, Ramayana Part 1 To Release First In This Country, Singapore, Ranbir Kapoor , Saipalavi, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రెస్టేజియస్ట్ మూవీ 'రాకా' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే.  షారుక్ తో జవాన్ తర్వాత అట్లీ ఏరి కోరి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో రాకా ఖ్వాలిటీని అర్ధం చేసుకోవచ్చు.  అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అభిమానులని, నెటిజన్లని తీవ్రమైన ఉత్కంఠకి గురిచేస్తున్న అంశం  #WhatisRaaka37 అనే కొత్త హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్. నెట్టింట రాత్రికి రాత్రే ఈ హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్తంగా విపరీతంగా ట్రెండింగ్‌లోకి వచ్చి అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఈ ట్రెండింగ్‌లో ప్రాధాన్యత సంతరించుకున్న '37' అనే సంఖ్య దేనికి సంకేతం? చిత్ర నిర్మాణ సంస్థ మేకర్స్ నుంచి ఎలాంటి ఊహించని సర్ప్రైజ్ లేదా బిగ్ అప్‌డేట్ రాబోతోంది? అని అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి. కొందరైతే ఇది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో చేస్తున్న 37వ ప్రాజెక్ట్ కి సంకేతం అయి ఉంటుందని భావిస్తుంటే, మరికొందరైతే ఈ సినిమాలో బన్నీ సరికొత్త వైల్డ్ షేడ్స్‌తో 37 విభిన్నమైన గెటప్స్ లేదా అత్యంత కీలకమైన 37 నిమిషాల హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ని  అట్లీ ప్లాన్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటివరకు రహస్యంగా ఉంచిన ఈ '37' మిస్టరీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో, మేకర్స్ ఇస్తున్న ఈ సస్పెన్స్ అప్‌డేట్ ఏ స్థాయిలో ఉండబోతోందో అని అభిమానులు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో పోస్టులు చేస్తు రచ్చ చేస్తున్నారు. ఏది ఏమైనా చిత్ర బృందం మాత్రమే ఈ విషయంలో 37 నెంబర్ కి ఉన్న విశిష్టత చెప్పాలి. రాకా మాత్రం అల్లు అర్జున్ చేస్తున్న 22 వ సినిమా.   Also Read: ప్రేక్షక దేవుళ్ళకి షాక్.. చివరి నిమిషంలో ఈ సినిమాలు పోస్ట్ పోన్! ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకోణె దీటైన క్యారక్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు కూడా వినపడుతుండగా భారతీయ చిత్ర సీమలో ఇంతవరకు ఎవరు చూడని సరికొత్త లుక్ తో రాకా ముస్తాబవుతుందనేది మాత్రం నిజం.       [Allu Arjun, Raaka, Raaka 37, Atlee, Deepika Padukune, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, ప్రముఖ వ్యాపారవేత్త కొణిదెల ఉపాసన కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో సందడి చేశారు. గురువారం ఉదయం మంత్రాలయానికి విచ్చేసిన ఆమె, శ్రీ రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా మంత్రాలయానికి చేరుకున్న ఉపాసనకు ఆలయ అధికారులు మరియు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు సంప్రదాయబద్ధంగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకున్న ఉపాసన, అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూలబృందావనం సన్నిధికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ నిర్వహించిన పూజ, అభిషేక కార్యక్రమాలలో పాల్గొని తన మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామివారు ఉపాసనకు ఆశీస్సులు అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు మరియు శేషవస్త్రాలను అందజేశారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకుని పీఠాధిపతుల ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా మరియు ప్రశాంతంగా ఉందని ఈ సందర్భంగా ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. గతంలోనూ రామ్ చరణ్-ఉపాసన దంపతులు పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఇక మెగా కోడలు మంత్రాలయానికి వచ్చారనే వార్త తెలియడంతో స్థానిక మెగా అభిమానులు, భక్తులు ఉపాసనను చూడటానికి పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో మంత్రాలయ క్షేత్రంలో కాసేపు సందడి వాతావరణం నెలకొంది.     [Upasana Konidela, Mantralayam, Sri Raghavendra Swamy Temple, Ram Charan, Tollywood News]
  చిన్న సినిమా.. పెద్ద సినిమా ఎలాగూ, ప్రతి శుక్రవారం రాదు కాబట్టి చిన్న సినిమా కోసం శుక్రవారం పూట ఎదురుచూడని ప్రేక్షకుడు అంటూ ఉండదు. ఇక సినిమా నచ్చిందా! తనకి కనపడిన వాళ్ళందరిని ఫ్రెండ్స్ , బంధువులుగా మార్చుకొని సినిమాలో అది బాగుంది, ఇది బాగుంది అంటూ ప్రమోషన్స్ లో మేకర్స్ చెప్పని విషయాలని కూడా చెప్తాడు. దీంతో సినిమా కలెక్షన్స్ కూడా పెరుగుతాయి. సినిమా పుట్టిన దగ్గర్నుంచి చిన్న సినిమా విజయానికి సూత్రం ఈ విధమైన ప్రేక్షక మిషనే. కానీ ఇప్పుడు ఆ పక్ష పాత  ప్రేక్షకుడుకి చిన్న సినిమా షాక్ ఇచ్చింది.      ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 18 లేదా శుక్రవారం రేసులో నిలవాల్సిన '418', 'హనుమాన్ అంశ్', మరియు 'అనుమాన పక్షి' వంటి చిత్రాలు అనుకోని కారణాల వల్ల బాక్సాఫీస్ రేసు నుంచి తాత్కాలికంగా తప్పుకున్నాయి.హిందీ బాక్సాఫీస్ వద్ద కేవలం లో-బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ మార్కుకు సమీపిస్తూ, 'ధురంధర్' వంటి భారీ సినిమాల రికార్డులని  సైతం తుడిచిపెట్టేసిన హనుమాన్ అంశ్'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో ప్రమోషన్స్ ప్రారంభమైనప్పటికీ, చివరి నిమిషంలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నుండి వైదొలగడం, ప్రమోషనల్ ఈవెంట్లు రద్దు కావడం మరియు సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలుగు వెర్షన్ విడుదల ఆగిపోయింది. అసలు 100 శాతానికి పైగా లాభాలతో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ డివైన్ హిట్ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అని సినీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  మరోవైపు, కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన '418' మరియు 'అనుమాన పక్షి' చిత్రాల నిర్మాతలు కూడా చివరి నిమిషంలో తమ విడుదల తేదీలను వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడించారు. థియేటర్ల సర్దుబాటు లోపాలు, సాంకేతిక మరియు ప్రమోషనల్ కారణాలు, అలాగే సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియలో ఎదురైన జాప్యం వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని విశ్లేషకులు చెబుతున్నారు.    ఒక్కసారిగా ఈ మూడు ప్రతిష్టాత్మక చిన్న సినిమాలు పోస్ట్‌పోన్ కావడంతో ఈ వారం థియేటర్స్ రేసులో ఇతర చిత్రాలకు లేదా హోల్డోవర్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ స్క్రీన్లు లభించే అవకాశం ఉంది.ఈ హఠాత్ పరిణామం వల్ల చిన్న చిత్రాల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.  ప్రేక్షకులు అంతకంటే.  మేకర్స్ త్వరలోనే సరికొత్త ప్రచార చిత్రాలతో పాటు, కొత్త విడుదల తేదీలను అధికారికంగా ప్రకటిస్తామని చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కాంపిటీషన్ సరిగ్గా ప్లాన్ చేసుకుని, సరైన ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రావడం ద్వారా ఈ చిత్రాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని ఎలా పరీక్షించుకుంటాయో వేచి చూడాలి! ఈ శుక్రవారం వస్తున్న సినిమాలు ఈ పాట కోరిన వారు , హ్యాపీ జర్నీ. మరి ప్రేక్షకుడు రెడీగా కాచుకొని కూర్చుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు.     [Hanuman Ansh,  418, Anumana Pakshi, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
The much-discussed release-date confusion around Chiranjeevi’s Kaaka and Vishwambhara for Sankranthi 2027 now seems to have been sorted out. Kaaka has officially confirmed January 13, 2027 as its theatrical release date, making it Chiranjeevi’s Sankranthi release for next year. The makers announced the date today, putting an end to the recent speculation over whether the film would move out of the festival season. KVN Productions have released the photo of Chiranjeevi speaking with K Venkata Narayana and Vikram Reddy of UV Creations. Finally, it looks like the last minute confusion has been cleared by the Megastar himself with great discussion.  This also indicates that Vishwambhara could be looking at a different release window. The socio-fantasy film has been delayed for two years, mainly due to its extensive VFX work and other production-related factors. There have been reports that the team is considering Summer 2027, as Sankranti gone out of hands. Directed by Bobby Kolli, Kaaka is being produced by KVN Productions and stars Chiranjeevi in the lead along with Anaswara Rajan, Nivetha Pethuraj, Sunil and Getup Srinu. The film is currently progressing with its shooting schedules as the team works towards the January release. With Kaaka now firmly occupying the January 13 slot, attention shifts to Vishwambhara and when the Vassishta directorial will finally make its way to theatres.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర', 'కాకా' సినిమాల రిలీజ్ డేట్ల గురించి ఓ రేంజ్‌లో రచ్చ జరుగుతోంది. 'విశ్వంభర' 2027 సంక్రాంతికి రానుందని, అందుకే 'కాకా' మూవీ 2027 సమ్మర్‌కి షిఫ్ట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టాయి. కానీ తాజాగా 'కాకా' మేకర్స్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. 'వాల్తేరు వీరయ్య' తర్వాత బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ప్రాజెక్ట్ 'కాకా'. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన చిరంజీవి మరో మూవీ 'విశ్వంభర' VFX వర్క్స్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. రెండూ చిరంజీవి సినిమాలే కావడంతో, తప్పనిసరి పరిస్థితిల్లో సమ్మర్ కి షిఫ్ట్ అవ్వడానికి 'కాకా' టీమ్ అంగీకరించినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.  సంక్రాంతి రేసు నుంచి 'కాకా' మూవీ తప్పుకుందనే వార్తలను పటాపంచలు చేస్తూ, KVN ప్రొడక్షన్స్ తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. "ఎలాంటి ప్రచారాలు నమ్మకండి.. ముందుగా చెప్పినట్టుగానే 'కాకా' జనవరి 13, 2027 సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తోంది" అని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, త్వరలోనే ఫస్ట్ సింగిల్ రాబోతోందని కూడా తెలిపారు. ఈ సందర్భంగా  KVN ప్రొడక్షన్స్ విడుదల చేసిన ఫొటోలో చిరంజీవి, వెంకట్ కె. నారాయణతో పాటు యూవీ క్రియేషన్స్ కి చెందిన విక్రమ్ రెడ్డి కూడా ఉండటం విశేషం. ఇప్పుడు 'కాకా' జనవరి 13కే ఫిక్స్ కావడంతో.. చిరంజీవి రెండు సినిమాలు ఒకే సంక్రాంతికి రావడం అసాధ్యం కాబట్టి, 'విశ్వంభర' కొత్త రిలీజ్ డేట్ ఏంటి అనే దానిపై మళ్ళీ సస్పెన్స్ నెలకొంది. 'విశ్వంభర' డిసెంబర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  https://x.com/KvnProductions/status/2100471338297442801       [Kaaka vs Vishwambhara, Megastar Chiranjeevi, Chiranjeevi Kaaka Movie, Vishwambhara Movie, Kaaka Release Date, Vishwambhara Release Date, Telugu Film News, Telugu News]  
మన ఆరోగ్య సంరక్షణలో పీచు పదార్థం లేదా ఫైబర్ (Fiber) పాత్ర ఎంత కీలకమైనదో అందరికీ తెలిసిందే. జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, మలబద్ధకం సమస్య దూరమవ్వాలన్నా, బరువు అదుపులో ఉండాలన్నా ప్రతీ ఒక్కరూ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోమని సలహా ఇస్తుంటారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు మరియు పప్పుధాన్యాలలో లభించే ఈ పీచు పదార్థం పేగులలోని మంచి బాక్టీరియాకు ఆహారంగా పనిచేసి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే, ఏదైనా అతిగా తింటే అమృతమైనా విషమవుతుందనే నానుడి ఫైబర్ విషయంలోనూ నూటికి నూరు శాతం వర్తిస్తుంది. ఫైబర్ ఆరోగ్యానికి మంచిదే కదా అని మోతాదుకు మించి ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం బాగుపడటానికి బదులుగా తీవ్రంగా పాడయ్యే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు మరియు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన మానవ శరీరానికి రోజువారీగా సుమారు 25 నుండి 30 గ్రాముల ఫైబర్ మాత్రమే అవసరమవుతుంది. కానీ చాలామంది బరువు వేగంగా తగ్గాలనే ఉద్దేశంతో లేదా జీర్ణ సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందాలని ఒక్కసారిగా తమ ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని 50 నుండి 60 గ్రాములకు పైగా పెంచేస్తుంటారు. ఇలా హఠాత్తుగా లేదా అతిగా పీచు పదార్థాన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై విపరీతమైన భారం పడుతుంది. మన పేగుల్లో ఉండే బాక్టీరియా ఈ అధిక ఫైబర్‌ను వేగంగా ఫర్మెంటేషన్ (కిణ్వ ప్రక్రియ) చేయడం ప్రారంభిస్తుంది. దీని ఫలితంగా కడుపులో విపరీతమైన గ్యాస్ తయారవ్వడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, కడుపులో తీవ్రమైన నొప్పి మరియు అసౌకర్యం వంటి సమస్యలు వెంట వెంటనే తలెత్తుతాయి. అంతేకాకుండా, పరిమితికి మించిన ఫైబర్ తీసుకోవడం వల్ల విరోచనాలు (Diarrhea) లేదా కొందరిలో విరుద్ధంగా మరింత తీవ్రమైన మలబద్ధకం (Constipation) ఏర్పడే అవకాశం ఉంది. మనం తినే ఫైబర్ సరిగ్గా జీర్ణం కావాలంటే శరీరానికి తగినంత నీరు అత్యంత అవసరం. శరీరం లోపల నీటి శాతం తక్కువగా ఉండి, ఫైబర్ మాత్రమే ఎక్కువగా తీసుకుంటే, ఆ పీచు పదార్థం పేగుల్లోని నీటిని పీల్చేసుకుని గట్టిపడిపోతుంది. దీనివల్ల ఆహారం పేగుల్లో ముందుకు కదలకుండా అడ్డుపడి మలబద్ధకాన్ని మరింత క్లిష్టం చేస్తుంది. ఇది క్రమంగా కడుపులో తీవ్రమైన తిమ్మిర్లు మరియు పేగులలో వాపునకు దారితీస్తుంది. అధిక ఫైబర్ వల్ల మరొక ప్రధానమైన ముప్పు ఏమిటంటే పోషకాల లోపం. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం మోతాదుకు మించి ఉంటే, అది శరీరంలో కీలకమైన కాల్షియం, ఐరన్, జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలను పేగులు పీల్చుకోకుండా అడ్డుకుంటుంది. ఫైబర్ ఈ ఖనిజాలతో బంధాన్ని ఏర్పరచుకుని, అవి శరీరానికి అందకుండానే మలం ద్వారా బయటకు పంపేస్తుంది. ఫలితంగా దీర్ఘకాలంలో రక్తహీనత (Anemia) మరియు ఎముకల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రోజువారీ డైట్‌లో ఫైబర్‌ను ఒక్కసారిగా కాకుండా క్రమక్రమంగా పెంచుకోవాలి. ప్రతిరోజూ కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగుతూ, శరీరానికి సరిపడా సమతుల్య ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ద్వారా పొట్టను, పేగులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.     [ Fiber, High Fiber Diet, Digestive Health, Constipation, Diarrhea, Gut Health, Bloating, Hydration, Nutrient Deficiency, Healthy Diet ]
నేటి వేగవంతమైన జీవనశైలి మరియు మార్పుచెందిన ఆహార అలవాట్ల కారణంగా మధుమేహం లేదా టైప్ 2 డయాబెటిస్ అనేది ప్రతి ఇంటా సాధారణ సమస్యగా మారిపోయింది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడు ఏ విధంగా పెరుగుతాయో తెలియక చాలామంది ప్రతిరోజూ ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా ఉదయం పూట తినే అల్పాహారం లేదా బ్రేక్‌ఫాస్ట్ మన రోజంతా ఉండే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఉదయాన్నే మైదా, ప్రాసెస్ చేసిన పిండి వంటకాలు లేదా అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా స్పైక్ అవుతాయి. ఇలాంటి సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచే ఆరోగ్యకరమైన టిఫిన్ ఎంచుకోవడం అత్యంత ఆవశ్యకం. మధుమేహ బాధితులకు దివ్యౌషధంగా పనిచేసే అలాంటి ఒక అద్భుతమైన సాంప్రదాయక ఉదయపు ఆహారమే జొన్న మెంతి పరోటా (Jowar Methi Paratha). జొన్నలు మరియు మెంతులు రెండూ కూడా ఆయుర్వేదంలో మరియు ఆధునిక పోషకాహార శాస్త్రంలో అత్యుత్తమ ఆహారాలుగా గుర్తించబడ్డాయి. సాధారణంగా మనం తినే గోధుమలు లేదా బియ్యంతో పోలిస్తే జొన్నలలో గ్లైసీమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. జొన్నల పిండిని ఆహారంగా తీసుకున్నప్పుడు అది శరీరంలో చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల రక్తంలోకి గ్లూకోజ్ ఒక్కసారిగా విడుదల కాకుండా క్రమంగా విడుదలవుతుంది. తద్వారా ఇన్సులిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. అంతేకాకుండా జొన్నలలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ లేదా పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఇది పదే పదే ఆకలి వేయకుండా ఆపుతుంది, తద్వారా బరువు పెరగకుండా సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. ఇక ఈ పరోటాలో ఉపయోగించే మరో ముఖ్యమైన దినుసు మెంతి ఆకులు. మెంతి ఆకులలో లభించే విశిష్టమైన గెలాక్టోమన్నన్ అనే పీచు పదార్థం మరియు అమైనో ఆమ్లాలు శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని (Insulin Sensitivity) పెంచుతాయి. మెంతి ఆకులు రక్తంలోని గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేసి డయాబెటిస్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. జొన్న పిండికి సన్నగా తరిగిన పచ్చి మెంతి ఆకులు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, వాము మరియు తగినంత ఉప్పు కలిపి కొద్దిగా గోరువెచ్చని నీటితో సాఫ్ట్‌గా కలుపుకోవాలి. జొన్న పిండిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి రొట్టెలు చేయడం కొద్దిగా కష్టంగా అనిపించినా, కొద్దిపాటి నూనె లేదా నెయ్యి రాసి నిదానంగా ఒత్తి పెనంపై కాల్చుకోవాలి. ఈ జొన్న మెంతి పరోటాను ప్రతిరోజూ ఉదయం టిఫిన్‌గా తీసుకోవడం వల్ల కేవలం షుగర్ లెవెల్స్ అదుపులో ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన ప్రోటీన్, కాల్షియం, ఐరన్ మరియు విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. నిత్యం బిపి, షుగర్ సమస్యలతో బాధపడేవారు మరియు బరువు తగ్గాలనుకునే వారు తమ రోజువారీ ఉదయపు ఆహారంలో ఒకట్రెండు జొన్న మెంతి పరోటాలను పెరుగు లేదా పుదీనా చట్నీతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ రుచికరమైన, పోషకాల గని వంటి బ్రేక్‌ఫాస్ట్‌ను మీ ఆహారంలో భాగం చేసుకోండి.     [ Jowar Methi Paratha, Diabetes, Type 2 Diabetes, Blood Sugar, Jowar, Methi Leaves, Low GI Foods, Dietary Fiber, Insulin Sensitivity, Healthy Breakfast ]  
వయస్సు పెరుగుతున్న కొద్దీ లేదా మారుతున్న జీవనశైలి కారణంగా మన శరీరంలో వచ్చే అత్యంత ప్రధానమైన మార్పు ఎముకల బలహీనత. చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు రావడం, కొద్దిపాటి దెబ్బలకే ఎముకలు విరగడం లేదా అరిగిపోవడం వంటి సమస్యలు నేడు చాలామందిని వేధిస్తున్నాయి. సాధారణంగా ఎముకల ఆరోగ్యం అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది పాలు మరియు పాల ఉత్పత్తులు మాత్రమే. కానీ మన ఇంట్లోనే లభించే కొన్ని సంప్రదాయ మరియు సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు పాలకంటే అత్యంత శక్తివంతంగా ఎముకలను దృఢపరచగలవని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా నల్ల నువ్వులు, పొన్నగంటి కూర, తోటకూర మరియు రాగులు వంటి పదార్థాలలో లభించే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం మరియు విటమిన్లు మన ఎముకల సాంద్రతను (Bone Density) ఊహించని రీతిలో పెంచి, వాటిని ఉక్కులా బలంగా మారుస్తాయి. నల్ల నువ్వులు (Black Sesame Seeds) ఎముకల ఆరోగ్యానికి ఒక గొప్ప నిధి లాంటివి. వీటిలో సాధారణ తెల్ల నువ్వుల కంటే అత్యధిక పరిమాణంలో కాల్షియం మరియు యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. కేవలం వంద గ్రాముల నల్ల నువ్వులను తీసుకుంటే దాదాపు 1450 మిల్లీగ్రాముల వరకు ఉపాధి కలిగించే కాల్షియం శరీరానికి అందుతుంది. ఇది మనం రోజువారీ తాగే ఒక గ్లాసు పాలలో లభించే కాల్షియం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కావడం విశేషం. అంతేకాకుండా, వీటిలోని జింక్ మరియు రాగి (Copper) కండరాలు, ఎముకల అనుసంధాన కణజాలాన్ని బలోపేతం చేస్తాయి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక స్పూన్ వేయించిన నల్ల నువ్వులను లేదా నువ్వుల లడ్డును ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) వంటి తీవ్రమైన ఎముకల వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆకుకూరల విషయానికి వస్తే పొన్నగంటి కూర మరియు తోటకూర ఎముకల బలానికి అద్భుతంగా తోడ్పడతాయి. పొన్నగంటి కూరలో కాల్షియంతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి మరియు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల అరుగుదలను నివారించడమే కాకుండా, కీళ్ల మధ్య ఉండే సైనోవియల్ ద్రవం ఇంకిపోకుండా కాపాడుతుంది. మరొకవైపు, తోటకూర (Amaranth Leaves) అత్యధిక కాల్షియం మరియు మెగ్నీషియం కలిగిన ఆకుకూరగా పేరుగాంచింది. వంద గ్రాముల తోటకూరలో సుమారు 330 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది శరీరంలో ఎముకల నిర్మాణికి అవసరమైన ఆస్టియోబ్లాస్ట్ కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ఆకుకూరలను పప్పు లేదా వేపుడు రూపంలో తీసుకోవడం వల్ల ఎముకల మాతృక (Bone Matrix) ఎంతో దృఢపడుతుంది. వీటితో పాటు మన సంప్రదాయ చిరుధాన్యమైన రాగులు (Ragi/Finger Millet) ఎముకల ఆరోగ్యానికి ఒక పవర్‌హౌస్‌గా పనిచేస్తాయి. శాకాహార ఆహారాలలో రాగులలో ఉన్నంత కాల్షియం మరే ఇతర ధాన్యంలోనూ లభించదు. ప్రతి వంద గ్రాముల రాగులలో దాదాపు 344 మిల్లీగ్రాముల సులభంగా జీర్ణమయ్యే కాల్షియం నిండి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే రాగి జావ తాగడం లేదా రాగి సంకటి, రాగి రొట్టెలు తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత క్రమంగా పెరుగుతుంది. చిన్నపిల్లల పెరుగుదలకు, గర్భిణులకు మరియు రుతుస్రావం ముగిసిన (Menopause) మహిళలకు ఎముకలు బలహీనపడకుండా ఉండటానికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. ఈ నాలుగు సహజ ఆహారాలను మన రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకోవడం ద్వారా ఎముకల నొప్పులకు స్వస్తి చెప్పి, సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు.     [ Bone Health, Bone Density, Calcium Rich Foods, Black Sesame Seeds, Ponnaganti Leaves, Amaranth Leaves, Ragi, Osteoporosis, Joint Health, Strong Bones ]
అమరాంత్ సీడ్స్.. తోటకూర గింజలు లేదా రాజ్‌గిరా అని వీటిని పిలుస్తారు. ఇవి ఇటీవల కాలంలో సూపర్ ఫుడ్‌గా విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రాచీన కాలం నుండి మన సాంప్రదాయ ఆహారంలో భాగమైన ఈ గింజలు, ఆధునిక ఆరోగ్య నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నాయి. మన నిత్య జీవితంలో తోటకూరను ఆకుకూరగా ఎంతగా ఉపయోగిస్తామో, దాని గింజలలో ఉన్న పోషక విలువలు కూడా అంతకంటే ఎక్కువే. సాధారణంగా కనిపించే ఈ చిన్న గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. అమరాంత్ సీడ్స్ అంటే.. అమరాంత్ సీడ్స్ అనేది 'అమరాంథస్' అనే మొక్క నుండి లభించే గింజలు. తెలుగులో వీటిని తోటకూర గింజలు అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో వీటిని 'రాజ్‌గిరా' లేదా 'రామ్‌దానా' అని అంటారు. అమరాంత్ గింజలను ధాన్యాల జాబితాలో చేర్చినప్పటికీ, వృక్షశాస్త్రం ప్రకారం ఇవి నిజానికి సూడోసిరియల్స్ గా పిలుస్తున్నారు. అంటే బియ్యం, గోధుమల లాగా కాకుండా, ఇవి ఆకుకూరల జాతికి చెందిన గింజలు. అందుకే వీటిలో ఇతర సాధారణ ధాన్యాల కంటే పోషకాలు ఎంతో ఎక్కువగా ఉంటాయి. ఇందులో గ్లూటెన్ ఉండకపోవడం వల్ల ఇది గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఆరోగ్యానికి అమరాంత్ సీడ్స్ చేసే మేలు.. పోషకాల గని: అమరాంత్ గింజలలో శరీరానికి కావలసిన అత్యంత ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫోస్ఫరస్ , పోటాషియం సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం ఇతర ధాన్యాలతో పోలిస్తే ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్: సాధారణంగా వృక్ష సంబంధిత ఆహారాలలో అన్ని రకాల అమైనో ఆసిడ్లు లభించడం చాలా అరుదు. కానీ అమరాంత్ లో శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అవసరమైన అమైనో ఆసిడ్లు ఉంటాయి. ముఖ్యంగా 'లైసిన్' అనే అమైనో ఆసిడ్ ఇందులో ఉండటం వల్ల ఇది శరీరంలో ప్రొటీన్ శోషణకు ఎంతగానో తోడ్పడుతుంది. శాఖాహారులకు, కండరాల పుష్టిని కోరుకునే వారికి ఇది సరైన పోషకాహారం. జీర్ణవ్యవస్థ మెరుగుదల: అమరాంత్ గింజలలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ ఎక్కువ సమయం కడుపు నిండిన భావనను కలిగిస్తుంది కాబట్టి, అతిగా తినే అలవాటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం , కొలెస్ట్రాల్ నియంత్రణ: అమరాంత్ లో ఉండే సహజ నూనెలు , ఫైబర్ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు గుండె నాళాల్లో పూడికలు ఏర్పడకుండా నిరోధించి, రక్తప్రసరణను నార్మల్ గా ఉండేలా చేస్తాయి. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. బరువు తగ్గడానికి: బరువు తగ్గాలనుకునే వారికి అమరాంత్ సీడ్స్ చక్కని ఎంపిక. తక్కువ క్యాలరీలు, అధిక ప్రొటీన్ , పీచు పదార్థం కలిగి ఉండటం  వల్ల శరీర జీవక్రియ రేటు అంటే మెటబాలిజం  పెరుగుతుంది. కొవ్వును కరిగించే ప్రక్రియ వేగవంతమై, ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి ఇది దోహదపడుతుంది. డయాబెటిస్ నియంత్రణ: ఈ గింజలలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ సాధారణ ధాన్యాల కంటే తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా క్రమబద్ధంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రోజువారీ ఆహారంలో అమరాంత్ ను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి.. అమరాంత్ లో స్క్వాలేన్ , లోనాఫిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు  ఉంటాయి. ఇవి శరీరంలో  ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో తోడ్పడతాయి. శరీర కణజాలాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఆహారంలో అమరాంత్ సీడ్స్ ఎలా తీసుకోవాలి? అమరాంత్ సీడ్స్ ని వివిధ రకాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిని వేయించి, పాప్‌కార్న్ లాగా మార్చి పాలు లేదా తేనెతో కలిపి ఉదయపు అల్పాహారంగా తీసుకోవచ్చు. వరి అన్నం లాగే వీటిని ఉడికించి తీసుకోవచ్చు లేదా ఉప్మా రూపంలో వండుకోవచ్చు. అమరాంత్ గింజలను పిండిగా తయారుచేసి  గోధుమ పిండితో కలిపి రొట్టెలు, చపాతీలు తయారు చేసుకోవచ్చు. పాయసం లేదా పానీయాలలో ఉడకబెట్టిన అమరాంత్ గింజలను చేర్చి పౌష్టికాహారంగా తీసుకోవచ్చు. సలాడ్లు లేదా సూప్‌లలో వేయించిన అమరాంత్ గింజలను పైన చల్లుకోవడం ద్వారా పోషక విలువలతో పాటు రుచిని పెంచుకోవచ్చు.                      *రూపశ్రీ.  
ఆరోగ్యం కోసం వాకింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. వాకింగ్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. బ్రిస్క్ వాకింగ్ , బ్యాక్ వాకింగ్.. అంటూ చాలా రకాలు ఉన్నాయి. వీటిలో 8 ఆకారంలో వాకింగ్ చేయడం చాలా పవర్ఫుల్ అంటున్నారు. దీన్ని అష్టాంగ నడక లేదా ఎనిమిది ఆకారపు నడక అని కూడా అంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన సాంప్రదాయ వ్యాయామ పద్ధతి. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. అష్టాంగ నడక.. సాధారణంగా మనం ప్రతిరోజూ నేరుగా లేదా పార్కుల్లో రౌండ్‌గా నడుస్తుంటాం. కానీ ఒకే రీతిలో నడిచే నడక కంటే,  ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల శరీరానికి ఎన్నో రెట్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. సరైన పద్ధతిలో ఈ నడకను  దినచర్యలో భాగం చేసుకుంటే, కొద్దిరోజుల్లోనే శరీరంలో వచ్చే మార్పులను ప్రత్యక్షంగా చూడవచ్చు. చిన్న స్థలం చాలు.. ఈ నడకను సాధన చేయడానికి పెద్దగా స్థలం లేదా ఖరీదైన పరికరాలు అవసరం లేదు.  ఇంటి ఆవరణలో లేదా ఒక ఖాళీ గదిలో దక్షిణం నుండి ఉత్తర దిశగా ఎనిమిది ఆకారాన్ని ఊహించుకుని లేదా సుద్ద ముక్కతో గీసుకుని నడవడం ప్రారంభించాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పరగడుపున పరధ్యానం లేకుండా పాదరక్షలు లేకుండా నడవడం చాలా మంచిది. ఎలా నడవాలి?  నడిచేటప్పుడు శ్వాసపై ధ్యాస ఉంచుతూ ప్రశాంతంగా, నిలకడగా అడుగులు వేయాలి. దాదాపు పదిహేను నిమిషాలు ఒక దిశలో నడిచిన తర్వాత, తదుపరి పదిహేను నిమిషాలు వ్యతిరేక దిశలో నడవడం ఈ పద్ధతి లో ఉండే  ముఖ్య నియమం. అష్టాంగ నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. గుండె ఆరోగ్యం.. ఎనిమిది ఆకారంలో తిరుగుతూ నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ ఎంతో మెరుగుపడుతుంది. రెండు వైపులా  అడుగులు వేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు, ముఖ్యంగా గుండెకు తగినంత ప్రాణవాయువు అందుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థ.. కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఎనిమిది ఆకారంలో నడిచేటప్పుడు మోకాళ్లు, తుంటి భాగాలు, వెన్నుముక సహజంగా వంగుతాయి. దీనివల్ల వెన్నుముక బలపడి, నడుము నొప్పి , సయాటికా వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పాదాల కింద ఉండే ఆక్యుప్రెజర్ పాయింట్లు నేలను తాకడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. మానసిక ఆరోగ్యం.. అష్టాంగ నడక మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎనిమిది ఆకారాన్ని అనుసరిస్తూ నడిచేటప్పుడు మనస్సు పూర్తిగా ఆకారం పైన నడక పైన దృష్టి పెడుతుంది. దీనివల్ల అనవసరమైన ఆలోచనలు తగ్గి, మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ నడకను సాధన చేస్తే మంచి నిద్ర పడుతుంది. డయాబెటిస్ కు మంచిది.. అష్టాంగ నడక వల్ల జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు భాగంలో కదలికలు ఏర్పడి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగి, బరువు అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ స్థాయిలు సమతుల్యంగా ఉండటానికి, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ఈ నడక ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం.. సాధారణ నడకతో పోలిస్తే అష్టాంగ నడక శరీరంలోని రెండు వైపుల కండరాలను సమంగా ఉపయోగిస్తుంది. దీనివల్ల శరీర సమతుల్యత పెరుగుతుంది. వయసు పైబడిన వారు పడిపోకుండా స్థిరంగా నడవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ  నార్మల్ బ్యాకింగ్  కు బదులుగా  ప్రతిరోజూ కనీసం అర్ధగంట సేపు ఈ అష్టాంగ నడకను సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని , కొత్త ఉత్సాహాన్ని సొంతం చేసుకోవచ్చు.                          *రూపశ్రీ.  
గర్భనిరోధక మాత్రలు మహిళల జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. కుటుంబ నియంత్రణతో పాటు నెలసరి సరిగ్గా రానప్పుడు వాటిని రీసెట్ చేయడానికి, తీవ్రమైన కడుపునొప్పి, పిసిఓడి వంటి హార్మోన్ల సమస్యల చికిత్సకు కూడా వైద్యులు వీటిని సూచిస్తుంటారు. అయితే వీటిని కొద్దికాలం  పాటు వైద్యుల పర్యవేక్షణలో వాడటం సురక్షితమే..  అయినప్పటికీ, ఎక్కువ కాలం పాటు ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా క్రమం తప్పకుండా వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  ముఖ్యంగా మహిళలు వైద్యుల సలహాతో అయినా సరే.. ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం మంచిది కాదు.. దీర్ఘకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు , సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి?  వివరంగా తెలుసుకుంటే.. హార్మోన్ల అసమతుల్యత , మూడ్ స్వింగ్స్...  గర్భనిరోధక మాత్రలలో ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టిన్ అనే హార్మోన్లు ఉంటాయి. వీటిని ఎక్కువకాలం తీసుకోవడం వల్ల శరీరంలో సహజమైన హార్మోన్ల ఉత్పత్తి ప్రభావితమవుతుంది. దీనివల్ల మానసిక ఆందోళన, నిరాశ, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు తరచూ ఎదురవుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం..  ఎక్కువకాలం పాటు గర్భనిరోధక  మాత్రలు వాడటం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ముప్పు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాళ్లలోని నాళాలలో లేదా ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధిక బరువు ఉన్నవారిలో,   ముప్పై ఐదేళ్లు పైబడిన మహిళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు , అధిక రక్తపోటు..  గర్భనిరోధక మాత్రల వల్ల కొందరిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా చాలా ఏళ్ల పాటు వీటిని వాడటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ,  స్ట్రోక్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది. విటమిన్లు , ఖనిజాల లోపం..  ఈ మాత్రలు ఎక్కువ కాలం పాటు వాడటం వల్ల జీర్ణ వ్యవస్థలో పోషకాల శోషణ తగ్గుతుంది. ముఖ్యంగా విటమిన్ బి6, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి , మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల లోపం శరీరంలో ఏర్పడుతుంది. దీనివల్ల ఎప్పుడూ అలసట, నీరసం , రోగనిరోధక శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.  రొమ్ము నొప్పులు.. ఎక్కువ కాలం ఈ మాత్రల  వాడకం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పుల కారణంగా రొమ్ములో బరువుగా అనిపించడం, వాపు లేదా నొప్పి రావడం జరుగుతుంది. కాలేయం , పిత్తాశయ సమస్యలు.. మాత్రల రూపంలో తీసుకునే ఈ హార్మోన్లను కాలేయం జీర్ణం చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం వీటిని వాడటం వల్ల కాలేయ పనితీరుపై ప్రభావం పడి కాలేయ గడ్డలు ఏర్పడటం లేదా పిత్తాశయంలో రాళ్లు తయారయ్యే ప్రమాదం ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదం..  ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల గర్భాశయ ముఖద్వారం , రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు కొద్దిగా  పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే అదే సమయంలో ఇవి అండాశయ , గర్భాశయ క్యాన్సర్ల నుండి రక్షణ ఇస్తాయట. మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడే ముందు , వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. సొంత వైద్యం చేసుకోవద్దు. వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రారంభించాలి. ప్రతి కొన్ని నెలలకోసారి సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. కొందరు వైద్యులు కేవలం సమస్యను తగ్గించాలనే కారణంతో ఈ మాత్రలను ఎక్కువ నెలలు రికమెండ్ చేస్తూ ఉంటారు. అవగాహన లోపం వల్ల కంటిన్యు గా ఎక్కువ నెలలు ఈ మాత్రలు రికమెండ్ చేయడం లేదా వాడటం మంచిది కాదు. రక్తపోటు , కాలేయ పనితీరును తరచూ సరిచూసుకోవాలి. మాత్రలు వాడుతున్న సమయంలో తరచూ తలనొప్పి, కాళ్ల వాపు, తీవ్రమైన కడుపునొప్పి లేదా చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.                        *రూపశ్రీ.