Home

»

Latest News

మెగా షాక్: సంక్రాంతి బరిలో 'కాకా' ఫిక్స్.. అయోమయంలో 'విశ్వంభర' టీమ్.!

Sep 17, 2026 2:18PM

గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర', 'కాకా' సినిమాల రిలీజ్ డేట్ల గురించి ఓ రేంజ్‌లో రచ్చ జరుగుతోంది. 'విశ్వంభర' 2027 సంక్రాంతికి రానుందని, అందుకే 'కాకా' మూవీ 2027 సమ్మర్‌కి షిఫ్ట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టాయి. కానీ తాజాగా 'కాకా' మేకర్స్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

'వాల్తేరు వీరయ్య' తర్వాత బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ప్రాజెక్ట్ 'కాకా'. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు.

అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన చిరంజీవి మరో మూవీ 'విశ్వంభర' VFX వర్క్స్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. రెండూ చిరంజీవి సినిమాలే కావడంతో, తప్పనిసరి పరిస్థితిల్లో సమ్మర్ కి షిఫ్ట్ అవ్వడానికి 'కాకా' టీమ్ అంగీకరించినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. 

సంక్రాంతి రేసు నుంచి 'కాకా' మూవీ తప్పుకుందనే వార్తలను పటాపంచలు చేస్తూ, KVN ప్రొడక్షన్స్ తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. "ఎలాంటి ప్రచారాలు నమ్మకండి.. ముందుగా చెప్పినట్టుగానే 'కాకా' జనవరి 13, 2027 సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తోంది" అని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, త్వరలోనే ఫస్ట్ సింగిల్ రాబోతోందని కూడా తెలిపారు.

ఈ సందర్భంగా  KVN ప్రొడక్షన్స్ విడుదల చేసిన ఫొటోలో చిరంజీవి, వెంకట్ కె. నారాయణతో పాటు యూవీ క్రియేషన్స్ కి చెందిన విక్రమ్ రెడ్డి కూడా ఉండటం విశేషం.

ఇప్పుడు 'కాకా' జనవరి 13కే ఫిక్స్ కావడంతో.. చిరంజీవి రెండు సినిమాలు ఒకే సంక్రాంతికి రావడం అసాధ్యం కాబట్టి, 'విశ్వంభర' కొత్త రిలీజ్ డేట్ ఏంటి అనే దానిపై మళ్ళీ సస్పెన్స్ నెలకొంది. 'విశ్వంభర' డిసెంబర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

 

 

[Kaaka vs Vishwambhara, Megastar Chiranjeevi, Chiranjeevi Kaaka Movie, Vishwambhara Movie, Kaaka Release Date, Vishwambhara Release Date, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com