TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.!

Published on: Thu Sep 17, 2026 11:55AM

ప్రధాని నరేంద్ర మోదీ తన 76వ పుట్టినరోజు  సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల అధినేతల నుంచీ  రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల అగ్రనేతలు ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే..  మోదీకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.

వీరితో పాటు కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ  చీఫ్‌ శరద్‌ పవార్‌, శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది తదితరులు మోదీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధినేత  స్టాలిన్‌  తదితరులు కూడా మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 

అలాగే    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ సేవలందిస్తున్న తీరు  చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.  గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధాని పదవి వరకు సాగిన సుమారు రెండున్నర దశాబ్దాల రాజకీయ ప్రయాణం దేశ ప్రగతికి దోహదం చేసిందన్నారు. సేవ, సంకల్ప్, సుశాసన్  అనే నినాదంతో ఆయన చేపడుతున్న కార్యక్రమాలు కోట్లాది మంది పౌరులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

 సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న ప్రధాని ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని మంత్రి నారాలోకేష్ పేర్కొన్నారు.  క్రమశిక్షణ, అంకితభావం రాజకీయాల్లో పనిచేసే యువ నాయకులకు ప్రధాని మోడీ ఆదర్శమని లోకేష్ ప్రస్తుతించారు. 

[Narendra Modi Birthday, Rahul Gandhi, Mallikarjun Kharge, Nara Chandrababu, Lokesh, Modi 76th birthday Wishes, Telugu One]