Home

»

Latest News

ప్రేక్షక దేవుళ్ళకి షాక్.. చివరి నిమిషంలో ఈ సినిమాలు పోస్ట్ పోన్!

Sep 17, 2026 2:38PM

 

చిన్న సినిమా.. పెద్ద సినిమా ఎలాగూ, ప్రతి శుక్రవారం రాదు కాబట్టి చిన్న సినిమా కోసం శుక్రవారం పూట ఎదురుచూడని ప్రేక్షకుడు అంటూ ఉండదు. ఇక సినిమా నచ్చిందా! తనకి కనపడిన వాళ్ళందరిని ఫ్రెండ్స్ , బంధువులుగా మార్చుకొని సినిమాలో అది బాగుంది, ఇది బాగుంది అంటూ ప్రమోషన్స్ లో మేకర్స్ చెప్పని విషయాలని కూడా చెప్తాడు. దీంతో సినిమా కలెక్షన్స్ కూడా పెరుగుతాయి. సినిమా పుట్టిన దగ్గర్నుంచి చిన్న సినిమా విజయానికి సూత్రం ఈ విధమైన ప్రేక్షక మిషనే. కానీ ఇప్పుడు ఆ పక్ష పాత  ప్రేక్షకుడుకి చిన్న సినిమా షాక్ ఇచ్చింది.    


 ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 18 లేదా శుక్రవారం రేసులో నిలవాల్సిన '418', 'హనుమాన్ అంశ్', మరియు 'అనుమాన పక్షి' వంటి చిత్రాలు అనుకోని కారణాల వల్ల బాక్సాఫీస్ రేసు నుంచి తాత్కాలికంగా తప్పుకున్నాయి.హిందీ బాక్సాఫీస్ వద్ద కేవలం లో-బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ మార్కుకు సమీపిస్తూ, 'ధురంధర్' వంటి భారీ సినిమాల రికార్డులని  సైతం తుడిచిపెట్టేసిన హనుమాన్ అంశ్'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో ప్రమోషన్స్ ప్రారంభమైనప్పటికీ, చివరి నిమిషంలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నుండి వైదొలగడం, ప్రమోషనల్ ఈవెంట్లు రద్దు కావడం మరియు సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలుగు వెర్షన్ విడుదల ఆగిపోయింది. అసలు 100 శాతానికి పైగా లాభాలతో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ డివైన్ హిట్ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అని సినీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  మరోవైపు, కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన '418' మరియు 'అనుమాన పక్షి' చిత్రాల నిర్మాతలు కూడా చివరి నిమిషంలో తమ విడుదల తేదీలను వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడించారు. థియేటర్ల సర్దుబాటు లోపాలు, సాంకేతిక మరియు ప్రమోషనల్ కారణాలు, అలాగే సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియలో ఎదురైన జాప్యం వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని విశ్లేషకులు చెబుతున్నారు. 

 

ఒక్కసారిగా ఈ మూడు ప్రతిష్టాత్మక చిన్న సినిమాలు పోస్ట్‌పోన్ కావడంతో ఈ వారం థియేటర్స్ రేసులో ఇతర చిత్రాలకు లేదా హోల్డోవర్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ స్క్రీన్లు లభించే అవకాశం ఉంది.ఈ హఠాత్ పరిణామం వల్ల చిన్న చిత్రాల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.  ప్రేక్షకులు అంతకంటే.  మేకర్స్ త్వరలోనే సరికొత్త ప్రచార చిత్రాలతో పాటు, కొత్త విడుదల తేదీలను అధికారికంగా ప్రకటిస్తామని చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కాంపిటీషన్ సరిగ్గా ప్లాన్ చేసుకుని, సరైన ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రావడం ద్వారా ఈ చిత్రాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని ఎలా పరీక్షించుకుంటాయో వేచి చూడాలి! ఈ శుక్రవారం వస్తున్న సినిమాలు ఈ పాట కోరిన వారు , హ్యాపీ జర్నీ. మరి ప్రేక్షకుడు రెడీగా కాచుకొని కూర్చుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

 

[Hanuman Ansh,  418, Anumana Pakshi, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com