Home

»

Latest News

ఆకాశంలో ఒక తార: దుల్కర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరో సీతారామం అవుతుందా.?

Sep 17, 2026 5:29PM

'మహానటి', 'సీతారామం', 'లక్కీ భాస్కర్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఇప్పుడు ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ హార్ట్ టచింగ్ డ్రామా 'ఆకాశంలో ఒక తార' సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది.

ఈ చిత్రాన్ని నవంబర్ 20న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. "ది జర్నీ టు ది స్టార్స్ బిగిన్స్.. ఆకాశంలో ఒక తార నవంబర్ 20న థియేటర్లలోకి వస్తోంది.. ఒక అందమైన ప్రపంచం మీ కోసం వేచి చూస్తోంది" అంటూ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

పవన్ సాదినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో, ఎమోషనల్ అండ్ రొమాంటిక్ రైడ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తోంది. 

స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్, లైట్‌బాక్స్ మీడియా సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. స్వప్న సినిమాస్ - దుల్కర్ కాంబినేషన్ అనగానే మనకి 'మహానటి', 'సీతారామం' లాంటి ఆల్ టైమ్ క్లాసిక్స్ గుర్తుకొస్తాయి. ఆ సెంటిమెంట్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో, ఈ సినిమాతో హ్యాట్రిక్ క్లాసిక్ హిట్ పక్కా అని సినీ ప్రియులు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండటం విశేషం.

తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో నవంబర్ 20, 2026న రాబోతున్న ఈ 'ఆకాశంలో ఒక తార' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

 

 

 

[Aakasamlo Oka Tara Release Date, Dulquer Salmaan Aakasamlo Oka Tara, Dulquer Salmaan Telugu Movie, Aakasamlo Oka Tara Movie, Dulquer Salmaan, Pavan Sadineni, Swapna Cinema, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com