Home

»

Latest News

ఎన్టీఆర్ 'డ్రాగన్' వాయిదా: కొత్త రిలీజ్ డేట్ ఇదే.!

Sep 17, 2026 4:37PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'డ్రాగన్'. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

ఇటీవల ఎన్టీఆర్ చేతికి గాయం కావడం, దానికి సర్జరీ జరగడంతో ఆయన కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దాంతో ప్లాన్ చేసిన కీలక షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యమయ్యాయి. ఎన్టీఆర్‌తో పాటు ఇతర ప్రధాన నటీనటులు నటించాల్సిన కాంబినేషన్ సీన్స్ చాలావరకు పెండింగ్‌లో పడిపోయాయి. ఇప్పుడు వారందరి డేట్స్‌ను మళ్లీ అడ్జస్ట్ చేస్తూ కొత్త షెడ్యూల్స్ ప్లాన్ చేయడం ప్రశాంత్ నీల్‌కి పెద్ద ఛాలెంజ్‌గా మారింది.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఆయన ప్రతి సీన్‌లోనూ, ప్రతీ ఫ్రేమ్ లోనూ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడరు. పైగా, షూటింగ్ పూర్తి కావడం ఒకెత్తయితే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం నెలల తరబడి సమయం పడుతుంది. అనుకున్నట్టుగా జూన్ 11న సినిమా రావాలంటే, వచ్చే ఫిబ్రవరి నాటికే టోటల్ టాకీ పార్ట్ కంప్లీట్ కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది కష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ షూటింగ్ ఆలస్యమైతే.. 2027 దసరాకు సినిమాను తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మరి ఈ ప్రచారంలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

 

 

 

[NTR Dragon Release Date, NTR Dragon Postponed, Dragon 2027 Dasara Release, NTR Dragon Movie, Jr NTR, Prashanth Neel, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com