LATEST NEWS
ఆంధ్రప్రదేశ్‌లో  సాగునీటి రంగం చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల,  ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి రాష్ట్ర రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారింది. వైసీపీ  అధినేత జగన్ పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ ప్రాజెక్టులపై ఇటీవల చేసిన ట్వీట్లు, విమర్శలపై తెలుగుదేశం ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై  తెలుగుదేశం అధికార ప్రతినిథి, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.  గత వైసీపీ  ప్రభుత్వ హయాంలో పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని అప్పసాని రాజేష్ వివరించారు. కాలువ నిర్మాణంలో అత్యంత కీలకమైన సివిల్ వర్క్స్, అక్విడెక్ట్‌లు, కల్వర్టులు పూర్తి చేయడంలో గత పాలకులు విఫలమయ్యాయన్నారు. ఒకవేళ గత ఐదేళ్లలో లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి ఉంటే, నేడు పురుషోత్తపట్నం నుంచి నీటిని లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని అయన చెప్పారు. ప్రస్తుతం ఎల్లినో పరిస్థితులు, వర్షాభావ వాతావరణం నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం వరద జలాలను సమర్థవంతంగా ఒడిసిపట్టి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల మెట్ట ప్రాంతాలకు నీరు అందిస్తోందన్నారు. దీనివల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్యలు కూడా తీరుతాయని పేర్కొన్నారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారని, కానీ ఆనాటి ఆ నిర్ణయమే నేడు కృష్ణా డెల్టాను కాపాడిందని గుర్తుచేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.  ఇక వైఎస్ హయాంలో జలయజ్ణం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా అప్పసారి రాజేష్ ఖండించారు. వైఎస్ హయాంలో కేవలం మట్టిపనులు పూర్తి చేసి డబ్బులు దండుకుని చేసింది జలయజ్ణం కాదు, ధనయజ్ణమని విమర్శించారు.  [Polavaram Left Canal, Veligonda, Polavaram Left Canal, Chandrababu Naidu Irrigation,  Jagan Credit Chori, Purushothapatnam lift irrigation, AP Politics News, Telugu One]
తెలుగువన్ ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వరుసగా ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, నీటి విడుదల జరుగుతోంది. అంటే ఏ ప్రాంతానికి నీరు అందని పరిస్థితి ఉందో ఆ ప్రాంతానికి నీటిని అందించే కార్యక్రమం ఏపీలో మొదలవ్వడమే కాదు అది సాకారమయ్యే పరిస్థితి కూడా వచ్చేసింది. ఈ సందర్భంగా వైసీపీ ఆ క్రెడిట్ అంతా తమదేనని బాకాలూదుతోంది. క్రెడిట్ చోరీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నా వైసీపీ వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రముఖ విశ్లేషకుడు విక్రమ్ పూల వాస్తవాలను కళ్లకు కట్టారు.  రాష్ట్రంలో ఇరిగేషన్ పురోగతి వైఎస్ జలయజ్ణంతో మొదలైందనీ, ఆయన తరువాత చేసింది తామేనని చెప్పుకుంటూ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న విక్రమ్ పోలా అసలు జలయజ్ణం కథ ఇదీ అంటూ ఆయన..  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో  జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి దశలో భారీ మరియు మధ్యతరహా ప్రాజెక్టులతో కూడిన సుమారు 26 ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. అయితే, ఆ సమయంలో రాష్ట్ర బడ్జెట్ పరిమితులకు మించి ప్రాజెక్టులు చేపట్టడం, భారీగా రుణాలు సేకరించడం జరిగిందని చెప్పారు.  ఈ ప్రాజెక్టుల అమలులో భాగంగా కాంట్రాక్టర్ల ఎంపికలో ఈపీఎస్  విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, పెద్దఎత్తున ప్రాజెక్టులు చేపట్టడం, అనుమతులు రాకముందే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం వంటి పరిణామాలు వివాదాస్పదమన్నారు. జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.  ఇక రాష్ట్ర విభజన తర్వాత  నవ్యాంధ్రప్రదేశ్ తొలి సీఎంగా చంద్రబాబు పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత..  సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపట్టారు. ఆయన  హయాంలో నిధుల కేటాయింపు,  పట్టిసీమ వంటి అనుసంధాన ప్రాజెక్టుల పూర్తి ద్వారా  సాగు, తాగునీరు అందించడంలో పురోగతి సాధించింది.  ఏది ఏమైనా రాజకీయ శంకుస్థాపనలు కాదు.. వాటి ఫలితాలను ప్రజలకు ఎవరైతే అందించారో వారికే క్రెడిట్ దక్కుతుందని విక్రమ్ పూల అన్నారు. జగన్ చేస్తున్నది క్రెడిట్ చోరీ ప్రయత్నమే తప్ప చేసిందేమీ లేదని కుండబద్దలు కొట్టారు.   [What Happened Actually In Jalayagnam, YSR Irrigation Projects, AP Politics, Telugu One, Polavaram Project, Jagan Credit Chori]
తెలంగాణ కాంగ్రెస్ లో వరుసగా అనూమ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన తరువాత పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు, నేతల మధ్య విభేదాలను పరిగణనలోనికి తీసుకుని పార్టీ హైకమాండ్ కీలక మార్పులకు తెరలేపింది.   తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించిన హైకమాండ్  తెలంగాణ పీసీసీ,  జిల్లా కేడర్ మధ్య మరింత బలమైన సమన్వయాన్ని తీసుకొచ్చేందుకు  చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జిగా మీనాక్షి నటరాజన్ కు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఆమె స్థానంలో  ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, సీనియర్ నాయకుడు అయిన  భూపేష్ బగెల్‌ను నియమించనుందని తెలుస్తోంది.  ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న  రాజకీయ పరిణామాలు  ప్రభుత్వానికీ పార్టీకి మధ్య సమన్వయం లోపం ఉందన్న విషయాన్ని తేటతెల్లం చేసిన నేపథ్యంలో  కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.   పార్టీలో ఎలాంటి అసంతృప్తి, అసమ్మతికి తావు లేకుండా  కఠినమైన, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనీ, అందుకు భూపేష్ బగెల్‌ సరైన వ్యక్తి అని అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఇప్పటివరకు తెలంగాణ బాధ్యతలు నిర్వర్తించిన మీనాక్షీ నటరాజన్ ను తెలంగాణ రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించాలన్న నిర్ణయానికి పార్టీ హైకమాండ్ వచ్చిందని అంటున్నారు.  సంస్థాగతంగా పార్టీ  పటిష్ఠతకు ఢోకా లేకుండా  ఉండాలంటే  భూపేష్ బగెల్ వంటి  అగ్రనేత అవసరమని హైకమాండ్ భావిస్తోంది.   [Telangana Congress, Bhupesh Baghel, Meenakshi Natarajan, AICC In Charge, Rahul Gandhi, Congress Party, Telugu One]
If Radhakrishnan Were Our Teacher Today.. Every year on September 5, India celebrates Teachers' Day in memory of Dr. Sarvepalli Radhakrishnan. We remember his photographs. We remember his achievements. We send wishes to our teachers. But this year, I want to look at him differently. Instead of asking who Dr. Radhakrishnan was, I want to ask what he would teach us if he were our teacher today. Because the world he lived in and the world we live in are very different. But one question remains the same: What is the real purpose of education? We have educated people. But are we creating an educated society? Today, knowledge is everywhere. A student can access the world's greatest books, universities, lectures and information through a mobile phone. Artificial intelligence can answer questions in seconds. Technology can teach us almost anything. But having information is not the same as having wisdom. We may know how to use technology, but do we know how to use it responsibly? We may have excellent qualifications, but do we have character? We may know how to build successful careers, but do we know how to build a better society? Perhaps Radhakrishnan would remind us that education should not only change our income. It should change our thinking. If he walked into today's classroom.. Perhaps he wouldn't begin by asking students how many marks they scored. He might ask: “What have you learned that has made you a better human being?” Because marks can measure performance. Degrees can prove qualification. But neither automatically measures wisdom, empathy, courage or responsibility. A truly educated person should be able to think independently, question intelligently and respect another person's point of view. If he saw our relationship with technology.. I don't think he would tell us to reject technology. He would probably tell us to master it. Use the internet. Use artificial intelligence. Use every tool that can expand human potential. But never surrender your ability to think. Because a machine can give us an answer. Human beings still have to decide what is right. That distinction will become even more important as AI becomes a larger part of our lives. If he saw today's parents.. Perhaps he would ask us to redefine what we mean by success. We want our children to become doctors, engineers, entrepreneurs, scientists, administrators and leaders. Nothing wrong with that. But are we equally concerned about the kind of human beings they become? A child can achieve everything society considers successful - and still lack compassion. A child can win every competition - and still be unable to accept failure. A child can earn millions - and still not know how to contribute meaningfully to society. Education must prepare a child not only to earn a living, but to live responsibly. If he saw today's teachers.. Perhaps he would remind us that a teacher's influence goes far beyond the classroom. A teacher can create confidence in a child who has none. A teacher can discover talent that nobody else noticed. A teacher can change the direction of an entire life. That is why teaching is not simply a profession. It is nation-building at its earliest stage. The classroom of today can become the society of tomorrow. If he looked at India.. This is where his message becomes even more important. We often talk about building a developed India. We talk about world-class infrastructure. Modern cities. Advanced technology. Economic growth. Global leadership. All of these matter. But a truly developed nation cannot be created only with buildings, roads, technology and money. It needs developed citizens. Citizens who follow rules even when nobody is watching. Citizens who keep their surroundings clean. Citizens who respect women, workers and fellow citizens. Citizens who can disagree without hatred. Citizens who question leaders without destroying institutions. Citizens who understand that freedom also comes with responsibility. Perhaps this is where education has its greatest role. The India we build begins with the person we educate We often ask: “What kind of India do we want?” Perhaps we should first ask: “What kind of Indian are we creating?” Because a nation is ultimately a reflection of its people. If we want cleaner cities, we need responsible citizens. If we want honest institutions, we need people who value integrity. If we want innovative India, we need curious minds. If we want compassionate India, we need empathetic people. If we want strong leadership, we need educated citizens capable of thinking beyond themselves. And that transformation begins long before someone enters Parliament, a government office, a company or a laboratory. It begins in the classroom. Perhaps that is the real meaning of Teachers' Day Maybe Teachers' Day should not be only about remembering our teachers. It should also be about remembering what education is supposed to accomplish. Radhakrishnan rose from a teacher and philosopher to become one of the highest constitutional authorities in India. Yet his identity as a teacher remained central to his legacy. There is something profound in that. He reached the highest office. But he did not make power the centre of his identity. Knowledge was. Education was. Learning was. That is a lesson worth remembering. So today, instead of simply saying: “Happy Teachers' Day,” perhaps we should ask ourselves a more difficult question: Are we actually becoming the people our teachers wanted us to become? Are we thinking more deeply? Are we becoming more responsible? Are we using knowledge to help others? Are we raising children who will build a better India? Are we creating an education system that produces not just successful professionals, but responsible citizens? Because the real tribute to Dr. Sarvepalli Radhakrishnan is not remembering his birthday once a year. It is creating the kind of educated, thoughtful and responsible India that education was meant to build. And perhaps that is the question we should carry beyond September 5: If education is the foundation of a nation, then what kind of nation are we building through the education we give our children today? The future of India may not be decided only by what we teach our children. It will be decided by what our children become because of what we taught them.   Written by Sreekanth Damacharla Ideas for a Better India
తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు మాజీ మంత్రి కొండా సురేఖ అడుగులు ఎటు అన్న చర్చ ఓ రేంజ్ లో జరుగుతోంది. కేబినెట్ నుంచి తనను బర్త్ రఫ్ చేసిన తరువాత  మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన కొండా సురేఖ.. తాను కాంగ్రెస్ ను వీడేది లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ రాజకీయ పరిశీలకులు మాత్రం ఆమె ఇంకెంత మాత్రం కాంగ్రెస్ లో కొనసాగే అవకాశాలు లేవనే అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే.. ఇప్పటికే ఆమె తన ముఖ్య అనుచరులు, మద్దతుదారులతో వరుస భేటీలు జరుపుతూ భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చిస్తున్నారు.  విశ్వసనీయ వర్గాల భోగట్టా మేరకు ఆమె ఇహనో, ఇప్పుడో పార్టీ మార్పు విషయంపై ఒక ప్రకటనచేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కుమార్తె సుస్మిత రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొండా కుటుంబం అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.  ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే, కొండా సురేఖ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే ఆమెకు బీజేపీనుంచి ఆహ్వానం అందిందని కూడా చెబుతున్నారు. కొండా సురేఖ బీజేపీ గూటికి వస్తే తమకు  అభ్యంతరం లేదని ఆ పార్టీ రాష్ట్ర నాయకుల నుంచి ఆమెకు స్పష్టమైన సంకేతాలు అందాయని చెబుతున్నారు.   అయితే కొండా సురేఖ మాత్రంరాష్ట్ర నాయకత్వం కంటే నేరుగా ఢిల్లీలోని జాతీయ హైకమాండ్ సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకోవాలని కొండా సురేఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను మాత్రమే కాకుండా భర్త కొండా మురళి, కుమార్తె సుష్మితతో కలిసి హస్తిన వేదికగా బీజేపీ అగ్రనేతల సమక్షంలో ఆమె కాషాయం జెండా పట్టాలని భావించడమే కాకుండా, తన చేరికకు కొన్ని షరతులు కూడా విధించినట్లు తెలుస్తోంది.   ఇక బీజేపీ కూడా కొండా రాకను స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. ఇందుకు  కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేసిన తరువాత బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, సీనియర్ నాయకురాలు డీకే అరుణ తదితరులు రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.  ఒక బీసీ మహిళా మంత్రిని  బర్త్ రఫ్ చేయడం సరికాదని విరుచుకుపడడమే సంకేతమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [Konda Surekha Join BJP, Telangana politics, Congress party,  Konda couple, Daughter Sushmita, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెగసీ’ విడుదల తేదీ ఖరారైంది. ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.  డిసెంబర్ 3న ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఫౌజీ' విడుదల కానుంది. ఆ భారీ సినిమా విడుదలవుతున్న మరుసటి రోజే 'లెగసీ' వస్తుందంటే రిస్క్ అనే చెప్పొచ్చు. కంటెంట్ మీద నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది ఆసక్తికరంగ్ మారింది.  సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెగసీ’ చిత్రాన్ని కలాహి మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మాతలు. చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్ట్రైకింగ్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. విశ్వక్ సేన్, ఏక్తా రాథోడ్ కనిపిస్తున్న ఈ కొత్త పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో డిసెంబర్ 4న ‘లెగసీ’తో విశ్వక్ సేన్ ఎలాంటి పవర్‌ఫుల్ అనుభూతిని అందించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ‘పిండం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాయికిరణ్ రెడ్డి దైదా, ‘లెగసీ’తో తన రెండో ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘పిండం’ తర్వాత కలాహి మీడియా నిర్మిస్తున్న రెండో చిత్రం కూడా ఇదే కావడం విశేషం. పవర్‌ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘లెగసీ’లో అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం వంటి అంశాల మధ్య జరిగే ఆసక్తికర సంఘర్షణను ఆవిష్కరించనున్నారు. తన తండ్రి వదిలిన వారసత్వం కారణంగా ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడి ప్రయాణంలో విశ్వక్ సేన్ పాత్ర సాగుతుంది.        [Vishwak Sen, Legacy Movie, Release Date, Prabhas, Fauzi Movie, Telugu Film News, Telugu News]  
Mass Ka Das Vishwak Sen’s upcoming intense political action drama ‘LEGACY’ has locked its worldwide theatrical release date. The film, directed by Saikiran Reddy Daida and produced under the Kalaahi Media banner, will release worldwide on December 4, 2026. The intense political action drama is being produced by Yeshwanth Daggumati and Saikiran Reddy Daida, with Sanjay Sambrani and V.V.N. Prasad as co-producers. The makers unveiled a striking new release-date poster featuring Vishwak Sen and Ekta Rathod, officially announcing December 4th as the date audiences can mark on their calendars. Written and directed by Saikiran Reddy Daida, LEGACY marks his second feature film after his directorial debut Pindam. The film also marks the second production venture from Kalaahi Media, following Pindam.  Set against a powerful political backdrop, LEGACY explores the collision of power, family, love and betrayal. Vishwak Sen plays a character who is drawn into a dangerous world shaped by his father’s legacy, while acclaimed Hindi actor Kay Kay Menon takes on a powerful antagonist role.  The film features a strong ensemble cast including Rao Ramesh, Sachin Khedekar, Murali Mohan, Ekta Rathod, Raja Ravindra, Rajeev Kanakala, Aneesh Kuruvilla, Khushee Ravi, Kalyani Natarajan, Ravi Kaale, Amit Tiwari and others.  The technical team includes Jiju Sunny as cinematographer, Govind Vasantha as music composer, Sirish Prasad as editor, Rajeev Nair as production designer and Jashuva as action choreographer. The final leg of shooting is currently underway   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
    కొంత కాలంగా హిట్ నే కేర్ ఆఫ్ అడ్రస్స్ గా మార్చుకున్న  శ్రీ విష్ణు ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' తో రాబోతున్నాడు.  జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కగా కొంత సేపటి టీజర్ విడుదలైంది. అలా రిలీజ్ అయ్యిందో లేదో టీజర్ ని చూస్తూ ఉండటం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల ఫ్యాషన్ అయిపోయింది. దీంతో ఆటో మాటిక్ గా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. టీజర్ చూస్తుంటే ఈ సారి కూడా ఎప్పటిలాగానే  వినూత్నమైన కథలతో ప్రేక్షకులను అలరించే శ్రీ విష్ణు,వస్తున్నట్లు అర్ధం అవుతుంది. 1992వ సంవత్సరం నాటి కాలఘట్టంలో, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా మాడుగుల అనే గ్రామం నేపథ్యంలో ఈ కథ రూపుదిద్దుకుంది. సరిగ్గా రేడియోలో నక్సలైట్‌ ముప్పు పెరుగుతోందని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఒక అనౌన్స్‌మెంట్ రావడంతో టీజర్ ఎంతో ఉత్కంఠభరితంగా ప్రారంభమవుతుంది. అత్యంత ప్రమాదకరమైన నక్సలైట్ లీడర్ 'కామ్రేడ్ కళ్యాణ్'ను ఎలాగైనా వేటాడి పట్టుకోవాలని గ్రేహౌండ్స్ బలగాలు మరియు ప్రత్యేక పోలీస్ బృందాలు ఆ గ్రామాన్ని చుట్టుముడతాయి. అక్కడ మొదలైన తీవ్రమైన వేట, ఊహించని మలుపులు, రోమాంచితమైన సీన్లు ప్రేక్షకులను క్షణం కూడా పక్కకు తప్పుకోకుండా టీజర్‌కు కట్టిపడేస్తాయి. అయితే, ఈ  క్రైమ్ అండ్ మ్యాన్‌హంట్ నేపథ్యానికి దర్శకుడు ఎంతో తెలివిగా కామెడీని జతచేశాడు. సీరియస్ పోరాటాలు, రాజకీయ ఉద్రిక్తతల నడుమ శ్రీ విష్ణు మార్క్ వినోదం, ఆయన టైమింగ్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇందులో శ్రీ విష్ణు ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) చేస్తున్నట్లు అందుతున్న సంకేతాలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి.  తెలంగాణ మరియు ఆంధ్ర యాసలతో పలికించిన సంభాషణలు, డిఫరెంట్ లుక్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రతి సన్నివేశంలోనూ హైలైట్‌గా నిలిచాయి. శ్రీ విష్ణు కామెడీ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయడం ఖాయమనిపిస్తోంది.   Also read: హనుమాన్ అంశ చిత్రానికి పన్ను మినహాయింపు: మన ముఖ్యమంత్రిపై ప్రశంసలు  సాంకేతిక పరంగా కూడా ఈ టీజర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. 1990ల కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా సహజంగా, రిచ్‌గా కనిపిస్తోంది. ఇక విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని యాక్షన్, వినోదాన్ని పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ టీజర్‌కు మంచి రేసింగ్ పేస్‌ను తెచ్చిపెట్టింది. అలాగే సినిమాలో రాధికా శరత్ కుమార్, అపేంద్ర లిమాయే, షైన్ టామ్ చాకో వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. మొత్తంగా చూస్తే, 'కామ్రేడ్ కళ్యాణ్' టీజర్ వింటేజ్ కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పక్కా యాక్షన్-కామెడీ రైడ్‌ను ప్రామిస్ చేస్తోంది. స్టార్ రైటర్ కోన వెంకట్ నిర్మాత.అక్టోబర్ 9 వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ . [Comrade Kalyan Teaser, Sree Vishnu, Kona venkat, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]
కంటెంట్ ని నమ్ముకొని మూవీ తెరకెక్కిస్తే 'కరోడ్ పతి' అవ్వడంతో పాటు కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోతారని నిరూపించిన మూవీ "హనుమాన్ అంశ'. ఎటువంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్, సెల్యులాయిడ్ వద్ద  సంచలనాలు సృష్టిస్తుంది. ఆధ్యాత్మిక సత్యంతో కూడిన పకడ్బందీ స్క్రిప్ట్   నిష్కల్మషమైన భక్తి ముందర కోట్లాది రూపాయల బడ్జెట్లు కూడా చిన్నబోతాయనే సత్యాన్ని కూడా బలంగా చాటి చెప్పిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మూవీకి అనూహ్య గౌరవం దక్కింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ అద్భుత ఆధ్యాత్మిక కావ్యానికి రాష్ట్రవ్యాప్తంగా పన్ను మినహాయింపు (ట్యాక్స్ ఫ్రీ) ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.  డెహ్రాడూన్‌లోని ఒక ప్రముఖ సినిమా హాళ్లలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తన ధర్మపత్ని గీతా ధామీతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు గణేష్ జోషి, ప్రదీప్ బాత్రా మరియు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించారు. సినిమా చూసిన అనంతరం పరవశించిపోయిన ముఖ్యమంత్రి, బాబా నీమ్ కరోలీ మహారాజ్ జీ త్యాగం, సేవా నిరతి, హనుమంతుడిపై ఆయనకున్న అచంచలమైన భక్తి విశ్వాసాలని కళ్లకు కట్టినట్లు చూపించింది. భక్తి అంటే కేవలం ఆరాధన మాత్రమే కాదు, అదొక సేవ మరియు మానవాళి సంక్షేమానికి ఆత్మసమర్పణ అనే గొప్ప సందేశాన్ని ఈ సినిమా అందిస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దేవభూమి ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక వైభవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని దేశ విదేశాలకు చాటిచెప్పడంలో 'హనుమాన్ అంశ' వంటి సినిమాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ధామీ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు కైంచి ధామ్ ఒక పవిత్రమైన శ్రద్ధా కేంద్రంగా మారిన వేళ, ఈ నిర్ణయం భక్తులకు ఎంతో ప్రాధాన్యమైనదిగా నిలిచింది.     Also Read: వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలి: పూనమ్ పాండే సంచలన కామెంట్స్ విశాల్ చతుర్వేది దర్శకత్వంలో కేవలం 1.75 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల అత్యంత స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కగా, ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైనప్పుడు ఎటువంటి ఆర్బాటాలు లేవు. తొలి రెండు వారాల్లో బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా సాగి  మౌత్ టాక్ ముందు ఎన్ని పబ్లిసిటీ జిమ్మికులైనా జూజిబీ అని నిరూపించింది. ఈ విషయం భారతీయ సినిమా పుట్టుక నుంచి నిరూపితమవుతూ వస్తుంది. అందుకే  100 కోట్లకి  చేరువలో ఉంది.     [Hanuman Ansh, Tax Free, Neem Karoli Baba Biopic, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]  
A Naxal story is usually expected to come with violence, ideology and political intensity. Comrade Kalyan appears to have other plans. The teaser takes a backdrop associated with serious conflict and gives it an unexpectedly irreverent spin, with Sree Vishnu playing a man who seems far more interested in his own agenda than revolutionary ideology. Set against a Naxal-dominated village on the Andhra-Odisha border, the teaser hints at a story involving an old theatre, a Naxal group and the kidnapping of one of its leaders. The reasons behind his actions are deliberately kept unclear, giving the film a mystery beyond its comedy. The biggest takeaway, however, is Sree Vishnu’s performance. He approaches the character with a straight face even when the situations around him become increasingly absurd. That deadpan delivery, combined with his one-liners, gives the teaser its distinctive flavour. Shine Tom Chacko appears to be on the opposite side of the conflict, with their cat-and-mouse dynamic providing several comic moments. Radhikaa Sarathkumar, Satya and Sudharshan also contribute to the humour, while Mahima Nambiar appears as the female lead. The teaser also benefits from Vijai Bulganin’s background score, which matches the film’s quirky tone. Directed by Janikram Marella, Comrade Kalyan is scheduled to release on October 9. https://www.youtube.com/embed/Tr-4d0FYNB8?si=UFeFpVSpwNCGHAw8   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.     
    పర్టిక్యులర్ ఏజ్ తర్వాత ఆడ, మగ ఒకరినొకరు ఇష్టపడి శృంగారం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అది నేరం కూడా కాదని చట్టాలే చెపుతున్నాయి. ఇప్పుడు అంతకు మించి ప్రముఖ నటి, శృంగార తార  పూనమ్ పాండే చేసిన వ్యాఖ్యలు సంచలనం నుంచి మరో కొత్త మోడ్ ని వెతుక్కుంటున్నాయి.     తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో  పూనమ్ పాండే మాట్లాడుతూ 'భారతదేశంలో వ్యభిచారాన్ని (వేశ్యావృత్తిని) చట్టబద్ధం చేయాలి. నేను రూపొందించే బోల్డ్ వీడియోలు, అడల్ట్ కంటెంట్ ఒక రకమైన సామాజిక సేవ. సమాజంలో చాలా మంది పురుషులు బయటకు చెప్పుకోలేని తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిరాశని  అనుభవిస్తుంటారు. నా వీడియోల్లో ఒక్కటి చూసి అయినా వారి ఒత్తిడి కొద్దిగా తగ్గితే అందులో తప్పేముంది. ఈ విధమైన కంటెంట్‌ను కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తాను ఒక సామాజిక సేవగానే భావిస్తున్నాను.     Also read: మిర్జాపూర్ బాక్సాఫీస్ సునామీ: డే 1 వసూళ్లు తెలిస్తే మైండ్ బ్లాంక్    అంతేకాకుండా, భారతదేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయడం వల్ల సమాజంలో మహిళలపై జరిగే లైంగిక నేరాలు, దాడులు తగ్గే అవకాశం ఉంది. అయితే, తాను చేసే ఇటువంటి బోల్డ్ కంటెంట్ వల్ల సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మరియు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అభిమానులు మాత్రం  పూనమ్  మాటలని ఏకీభవిస్తున్నారు.         [ Poonam Pandey, Legalising Prostitution, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]    
  ఓటీటీలో సంచలనం సృష్టించిన క్రైమ్ డ్రామా 'మిర్జాపూర్' ఇప్పుడు వెండితెరపై కూడా అదే స్థాయి విధ్వంసం సృష్టిస్తోంది. అభిమానుల కోరిక సెల్యులాయిడ్ పై అడుగుపెట్టి మొదటి రోజే ఊహించని రేంజ్ లో వసూళ్లు సాధించి, ట్రేడ్ విశ్లేషకులని  ఆశ్చర్యానికి గురిచేసింది.   ఫస్ట్ డే అక్షరాలా 29.70 కోట్ల రూపాయల మార్కును తాకింది. (24.75 కోట్ల రూపాయల నెట్ ) దేశవ్యాప్తంగా దాదాపు 11,135 షోలలో ప్రదర్శితమవ్వగా, అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల సరసన నిలిచింది.  హిందీ బెల్ట్ తో పాటు ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బిహార్, ఢిల్లీ వంటి మాస్ సెంటర్లలో 42.7 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయడం మిర్జాపూర్ క్రేజ్ కు నిదర్శనం. విశ్లేషకులు ముందుగా 18 నుంచి 20 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వస్తాయని అంచనా వేయగా, సినిమా మాత్రం వాటన్నింటినీ దాటుకుని 24.75 కోట్ల మార్కును అందుకుంది.     Also Read: కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్: అంతకు మించి మజా మొదలు  ఈ మూవీ హిందీ వెర్షన్ నుంచి దాదాపు 24.60 కోట్ల రూపాయల భారీ నెట్ వసూళ్లు రాగా, తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో కలిపి మిగతా భాగం నమోదైంది. బాక్సాఫీస్ రేసులో ఇటీవల వచ్చిన పలు క్రేజీ ప్రాజెక్టులను, ముఖ్యంగా 'అవారాపన్ 2' వంటి సినిమాల రికార్డులను కూడా 'మిర్జాపూర్: ది మూవీ' అధిగమించడం విశేషం. 2018 నాటి పాత కథాంశంతో, అప్పటి పాత్రల పునరాగమనంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను అందిస్తోంది. పంకజ్ త్రిపాఠి మరోసారి కాలీన్ భయ్యాగా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకోగా, గుడ్డూ పండిత్‌గా అలీ ఫజల్, మున్నా త్రిపాఠిగా దివ్యేందు శర్మ నటన థియేటర్లలో సీట్ల అంచున కూర్చోబెడుతోంది. వీరితో పాటు రవి కిషన్ ప్రవేశపెట్టిన 'బబ్బన్ యాదవ్' పాత్ర సినిమా కథను మలుపు తిప్పుతూ సరికొత్త వినోదాన్ని పంచుతోంది. జితేంద్ర కుమార్, రసిక దుగల్, అభిషేక్ బెనర్జీ వంటి నటీనటులు తమ నటనతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. వీకెండ్ ముగిసేసరికి మరిన్ని భారీ కలెక్షన్స్ వస్తాయనే అంచనాలు ఉన్నాయి.     [Mirzapur, Pankaj Tripathi, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]
    కింగ్ నాగార్జున, కార్తీ ఊపిరి మూవీలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొని ఫ్యాన్స్, ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వాళ్ళందరి నుంచి మరోసారి ఆ హాయిని అందించాలనే డిమాండ్ ఎప్పట్నుంచో వ్యక్తమవుతుంది. ఆ డిమాండ్ నెరవేరడానికి టైం పట్టవచ్చేమో గాని వాళ్ల హాయి విషయంలో మాత్రం నో కాంప్రమైజ్  తెలుగు బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో 10వ సీజన్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ 10 లాంచ్ ఎపిసోడ్‌కు సరికొత్త ఊపు తెస్తూ, కార్తీ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. బిగ్ బాస్ వేదికపై నాగార్జున, కార్తీ కలయిక అభిమానులకు కన్నుల పండుగగా మారింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో కార్తీ తన అప్ కమింగ్ మూవీ 'సర్దార్ 2' గురించి పంచుకున్న విశేషాలు మూవీపై  అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేశాయి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై లక్ష్మణ్ కుమార్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను పి.ఎస్. మిత్రన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. బిగ్ బాస్ 10 వంటి అతిపెద్ద ప్లాట్‌ఫారమ్ ద్వారా 'సర్దార్ 2' తెలుగు ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా షురూ చేయడంతో, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి భారీ స్థాయిలో పాజిటివ్ హైప్ క్రియేట్ అయ్యింది.   Also Read: 9 ఏళ్ల వయసులో చేసిన భరతనాట్యం వీడియో వైరల్: ఇప్పటి మీ అభిమాన హీరోయిన్  గతంలో వచ్చిన 'సర్దార్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ విజయంతో వచ్చిన సీక్వెల్ 'సర్దార్ 2' పై మరింత భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ సుమారు  100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించడం విశేషం. కార్తీ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రలలో నటించి తన నటనతో అలరించబోతున్నారు. ఒకటి మాజీ రా ఏజెంట్ సర్దార్ పాత్ర కాగా, మరొకటి ఉత్సాహవంతుడైన పోలీస్ ఆఫీసర్ విజయ్ పాత్ర. విలన్‌గా ఎస్‌.జె. సూర్య నటిస్తుండగా, మాలవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంలగ్నమైన ఈ తారాగణంతో భారీ పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 10 రిలీజ్ డేట్.     [Nagarjuna, Karthi, BiggBoss 10, Sardar 2 , Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]    
  భరత నాట్యం.. భరత మాత నుదిటిన ఉండే సిందూరంలో నుంచే భరత నాట్యం పుట్టిందని కళా శిఖామణులు చెప్తారు. వాళ్ళు చెప్పారని కాదు కానీ భరత నాట్యం చూస్తుంటే మన మనసులో ఉన్న సర్వరోగాలతో పాటు, మైండ్ లో ఉన్న చెడు ఆలోచనలు మాయమవుతాయి.  దైవత్వంతో కూడిన హావభావాలు సైతం భరత నాట్యంలో కనిపిస్తాయి. అందుకే చిన్న వయసు నుంచే భరత నాట్యం నేర్చుకుంటారు. ఈ కోవలోనే ఇప్పటి స్టార్ హీరోయిన్ తొమ్మిదేళ్ల వయసులో భరత నాట్యం ప్రదర్సన ఇచ్చి ఒక రేంజ్ లో రఫ్ఫాడించింది. ఆమె ఎవరో కాదు ఇప్పుడు తన డాన్స్ లతో ఉర్రుతలూగిస్తున్న శ్రీలీల..కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా తన చిన్ననాటి భరతనాట్యం వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కేవలం 9 సంవత్సరాల చిన్న వయసులోనే ఆమె స్టేజ్ పై చూపించిన అద్భుతమైన హావభావాలు, ముద్రలు, ఎంతో కష్టమైన నాట్య భంగిమలు, లయబద్ధమైన మూమెంట్స్ చూసి నెటిజన్లు, సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. ఈ నాట్య ప్రదర్శన శ్రీలీల నాట్య ప్రావీణ్యాన్ని, చిన్ననాటి నుంచే ఆమెకున్న అంకితభావాన్ని స్పష్టంగా నిరూపిస్తోంది. ఈ వైరల్ వీడియో వెనుక ఒక చిన్న సరదా కుటుంబ కథ దాగి ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీలీల తల్లిగారు వారి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఈ పాత నాట్య జ్ఞాపకాలను షేర్ చేశారట. ఆ వీడియోను చూసిన శ్రీలీలకు ఎంతో ముచ్చటేసి, "9 ఏళ్ల లీల నుంచి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు" అని క్యాప్షన్ జోడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశారు. తల్లి వాట్సాప్ గ్రూప్‌ లో షేర్ చేసిన ఈ చిన్ననాటి తీపి జ్ఞాపకం, క్షణాల్లోనే నెట్టింట హల్‌చల్ చేస్తూ మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తోంది.     Also Read: సూపర్ స్టార్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, శ్రీలీల డ్యాన్స్ ప్రయాణం చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది. ఆమె కేవలం 3 సంవత్సరాల వయసులోనే శాస్త్రీయ నృత్యమైన భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. కఠినమైన శిక్షణ, క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధనతో కేవలం 5 సంవత్సరాల వ్యవధిలోనే, అంటే తన 8 ఏళ్ల వయసులోనే తొలిసారిగా రంగస్థలంపై అరంగేట్రం చేసి లైవ్ ప్రదర్శన ఇచ్చారు. ఆ క్రమంలోనే 9 ఏళ్ల వయసులో చేసిన ఈ విశిష్టమైన భరతనాట్య ప్రదర్శన వీడియో ఇప్పుడు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక వీడియో చూసిన అభిమానులు, నెటిజెన్స్ పోటాపోటీగా స్పందిస్తూ' ఆ రకంగా చిన్న వయసు నుంచే డాన్స్ పట్ల అంకిత భావం ఉండబట్టే ఈజీ డాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్స్ గా ఉందనే కామెంట్స్ చేస్తున్నారు.      [ Sreeleela , Bharatha Natyam, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]    
  కళ్ళతోనే తన క్యారక్టర్ రూపురేఖలు మొత్తాన్ని ప్రెజెంట్ చేయగల భామ భాగ్యశ్రీ బోర్సే. నెంబర్ వన్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమనే మాటలు కూడా సినీ సర్కిల్స్ లో పరిచయం అవుతున్నాయి. లెనిన్ తో తొలి సూపర్ హిట్ అందుకున్న  ఈ ముద్దుగుమ్మ ఖాతాలోకి భారీ ఆఫర్ వచ్చి చేరింది. మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం ‘ఆపరేషన్ గంగ’లో భాగ్యశ్రీ బోర్సే  ఫిక్స్ అయినట్టుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు..తొలి మలయాళ డెబ్యూనే మోహన్‌లాల్ వంటి  సీనియర్ స్టార్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకోవడంతో భాగ్యశ్రీ కెరీర్‌కి   మరో కీలక మలుపుగా మారనుంది.అయితే సినిమాలో ఆమె పోషించబోయే పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. దీంతో మోహన్‌లాల్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది? ఆమె పాత్ర కథలో ఎంత కీలకంగా ఉండబోతోంది? అనే ఆసక్తి నెలకొంది.   Also Read: థియేటర్స్ లో ఉన్నప్పడే: ఇరుముడి ఓటిటి రిలీజ్ డేట్ ఇదే!  ‘ఆపరేషన్ గంగ’ కి విష్ణు మోహన్ దర్శకుడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి  సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ‘ధురంధర్’ వంటి భారీ చిత్రానికి సంగీతం అందించిన సస్వత్ సింగ్ సచ్ దేవ్ ‘ఆపరేషన్ గంగ’కు మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. మొత్తానికి.. ‘లెనిన్’తో సక్సెస్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సేకి  మోహన్‌లాల్‌తో కలిసి నటించే ఛాన్స్ రావడం ఆమె కెరీర్ కి మంచి బూస్టప్ అని చెప్పవచ్చు.     [Bhagya Shree Borse,  Mohanlal, Operation Ganga, Vishnu Mohan, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]
సమాజంలో అత్యంత పవిత్రమైన, బాధ్యతాయుతమైన పాత్ర గురువుది. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి, జ్ఞానమనే వెలుగును నింపే మహోన్నత మూర్తి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులు జన్మనిస్తే, ఆ జన్మకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ప్రసాదించే శక్తి గురువుకు మాత్రమే ఉంది. కేవలం పుస్తకాల్లోని పాఠాలను మాత్రమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొవాలో నేర్పించే మార్గదర్శి ఉపాధ్యాయుడు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ, మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ వేసుకోవాల్సిన ఆత్మపరిశీలన ప్రశ్న..  జ్ఞానం నేర్పే గురువుకు మనం నిజంగా ఏమిస్తున్నాం? అని. టీచర్స్ డే అంటే కేవలం గురువుకు శుభాక్షంకలు చెప్పడం, చిన్న బహుమతులు ఇవ్వడం కాదు.. టీచర్స్ డే రోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన విషయాలు ఉన్నాయి. గురువుల నుండి జ్ఞానం పొందిన ప్రతి విద్యార్థి.. ఎంత వయసు అయిన  వారైనా సరే.. కొన్ని విషయాలు తెలుసుకోవాలి..   మనోభావాల రూపంలో ప్రతిఫలం.. ఒకప్పుడు గురుకులాశ్రమాల్లో విద్య పూర్తయిన తర్వాత శిష్యులు తమ శక్తిమేరకు గురుదక్షిణ సమర్పించుకునేవారు. గురువులు కూడా ఏనాడూ ధనాన్ని ఆశించకుండా సన్మార్గంలో నడిచే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడమే ధ్యేయంగా జీవించారు. మరి నేటి ఆధునిక కాలంలో మనం గురువులకు ఇస్తున్న ప్రతిఫలం ఏమిటి? కాలం మారే కొద్ది  విద్య వ్యాపారంగా మారిపోయిన నేటి సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం, వారికి లభిస్తున్న గౌరవం ఎటువైపు పయనిస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎదిగినా ఒదిగి ఉండటం లేదు.. చాలామంది విద్యాభ్యాసం పూర్తయి, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత తాము చదువుకున్న పాఠశాలలను, మార్గదర్శకత్వం వహించిన గురువులను మరిచిపోతున్నారు. కార్పొరేట్ విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులను కేవలం జీతం తీసుకునే ఉద్యోగులుగా మాత్రమే చూసే ధోరణి పెరుగుతోంది. తల్లిదండ్రులు కూడా ఫీజులు చెల్లిస్తున్నాం కదా అనే భావనతో ఉపాధ్యాయుల శ్రమను, వారి ఆవేదనను గుర్తించలేకపోతున్నారు. తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం తపించే ఉపాధ్యాయుడికి మనం తిరిగి ఇస్తున్నది కేవలం కొన్ని పూలమాలలు, షాళ్ళు లేదా ఒక రోజు ఇచ్చే తాత్కాలిక గౌరవం మాత్రమేనా? గురువు ఆశించే అసలైన గురుదక్షి.. ఒక గురువు తన శిష్యుడి నుంచి గిఫ్ట్ లు , ధనాన్ని ఏనాడూ ఆశించడు. ఒక ఉపాధ్యాయుడికి లభించే అతిపెద్ద బహుమతి తన విద్యార్థి ఉన్నత స్థానంలో నిలబడటమే. మనం గురువుకు ఇవ్వాల్సిన మొదటిది గౌరవం. ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా, ఎంతటి సంపదను ఆర్జించినా, తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయుడిని చూసినప్పుడు వినయంతో నమస్కరించడం, వారి సేవలను గుర్తుంచుకోవడం నిజమైన గౌరవం. గుర్తింపు... తరగతి గదిలో విద్యార్థి క్రమశిక్షణతో ఉంటూ, గురువు నేర్పిన విలువలను జీవితంలో పాటించినప్పుడు ఆ ఉపాధ్యాయుడి శ్రమకు సార్థకత లభిస్తుంది. సమాజంలో మంచి పౌరుడిగా ఎదిగి, పదిమందికి ఉపయోగపడే పనులు చేసినప్పుడు ఫలానా ఉపాధ్యాయుడి శిష్యుడు..  అని సమాజం మెచ్చుకుంటే, ఆ మాట గురువుకు ఇచ్చే అతిపెద్ద ఆనందం. కృతజ్ఞతా భావం.. కాలం మారినా, ఏళ్లు గడిచినా తమ జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులను తరచూ గుర్తుచేసుకోవడం, వీలైతే వారిని కలసి పలకరించడం ఉపాధ్యాయులకు ఎంతో మానసిక తృప్తినిస్తుంది. మార్పు అవసరం.. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనం కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, గురువుల పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చుకోవాలి. ఉపాధ్యాయులను కేవలం సమాచారం అందించే యంత్రాలుగా చూడకుండా, ఒక తరాన్ని నిర్మించే శిల్పులుగా గుర్తించాలి. పాఠశాలల్లో , సమాజంలో వారికి తగిన గౌరవాన్ని, భద్రతను, అనుకూల వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. గురువు ఇచ్చిన జ్ఞానం అమూల్యమైనది. దానికి ఏ భౌతిక వస్తువూ సాటి రాదు. మనం గురువుకు తిరిగి ఇవ్వగలిగింది కేవలం హృదయపూర్వక గౌరవం, కృతజ్ఞత, వారు చూపిన సన్మార్గంలో నడవడం మాత్రమే. ఉపాధ్యాయులు నేర్పిన సద్గుణాలను, విలువలను మన జీవితంలో ఆచరిస్తూ, సమాజ శ్రేయస్సుకు తోడ్పడటమే మనం గురువులకు సమర్పించగల నిజమైన గురుదక్షిణ.                         *రూపశ్రీ.
మనలో చాలామంది నిద్ర తక్కువైతే ఆరోగ్యానికి హానికరం అని భావిస్తుంటారు. రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు అలసటగా అనిపించడం, పనిపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయని మనందరికీ తెలిసిందే. కానీ, ప్రతిరోజూ 8 నుంచి 10 గంటలకు మించి ఎక్కువసేపు నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేయకపోగా, అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సూచికగా మారుతుందని మీకు తెలుసా? ఇటీవల దాదాపు 5 లక్షల మంది వ్యక్తుల సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన ఒక కీలక పరిశోధనలో నిద్ర వ్యవధికి, మానవ ఆరోగ్యానికి ఉన్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ రాత్రి సమయంలో సుమారు 6.4 గంటల నుండి 7.8 గంటల మధ్య సరైన రీతిలో నిద్రపోయే వారిలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి సంబంధించిన సంకేతాలు, లక్షణాలు ఎక్కువగా కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, దీని అర్థం ప్రతి ఒక్కరూ కచ్చితంగా 7 గంటలే నిద్రపోవాలని కాదు. ఒక వ్యక్తికి అవసరమయ్యే నిద్ర సమయం అనేది వారి వయసు, జన్యుపరమైన అంశాలు, అనుసరించే జీవనశైలి, చేసే శారీరక శ్రమ మరియు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేవలం నిద్రపోయే గంటల సంఖ్యను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని నిద్ర సరిపోతుందో లేదో నిర్ణయించలేము. అయితే రోజువారీగా అతిగా నిద్రపోవడం అనేది మీ శరీరంలో లేదా మానసిక స్థితిలో ఏవైనా అంతర్గత సమస్యలు ఉన్నాయనడానికి ఒక స్పష్టమైన హెచ్చరిక కావచ్చు. డిప్రెషన్, స్లీప్ అప్నియా, శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే వాపులు వంటి ప్రమాదకర పరిస్థితులతో అతి నిద్రకు ప్రత్యక్ష సంబంధం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా, అల్జీమర్స్ లేదా పార్కిన్సన్స్ వంటి న్యూరోడిజెనరేటివ్ వ్యాధులు, ఇతర తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఒక వ్యక్తిలో నిద్రపోవాల్సిన వ్యవధిని అసాధారణంగా పెంచుతాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎక్కువసేపు నిద్రపోవడం వల్లనే ఈ వ్యాధులు వస్తున్నాయని పరిశోధన చెప్పడం లేదు; ఇప్పటికే శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యల కారణంగానే వ్యక్తి ఎక్కువగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.       oversleeping health risks telugu guide,healthy sleep duration research details.
చిన్న పిల్లలు ఏది తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఏది తింటే అనారోగ్యం పాలవుతారు అనే విషయంలో ప్రతి తల్లిదండ్రులూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత వారికి ఇచ్చే ఆహారంలో చక్కెర, తీపి పదార్థాలు, ప్రాసెస్ చేసిన స్వీట్లు ఎంతవరకు సురక్షితం అనే చర్చ చాలాకాలంగా నడుస్తోంది. చిన్నతనంలోనే పిల్లలకు విపరీతంగా తీపి అలవాటు చేయడం వల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల వెలువడిన ఒక సంచలనాత్మక పరిశోధన ఈ అంశంపై మరింత స్పష్టతనిచ్చింది. జీవిత ప్రారంభ దశలో, ముఖ్యంగా రెండేళ్ల వయసు లోపు పిల్లలకు చక్కెర వినియోగాన్ని తగ్గించడం వల్ల వారు పెద్దయిన తర్వాత తీవ్రమైన క్యాన్సర్ వ్యాధుల బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ ఆసక్తికరమైన అంశాన్ని పరిశోధించడానికి శాస్త్రవేత్తలు బ్రిటన్‌లో 1953 నాటి చారిత్రక పరిణామాలను నిశితంగా పరిశీలించారు. ఆ కాలంలో రేషనింగ్ వ్యవస్థ కారణంగా బ్రిటన్‌లో చక్కెర అందుబాటుపై కఠినమైన నియంత్రణలు ఉండేవి. దీనివల్ల ఆ సమయంలో పుట్టిన పిల్లలకు చిన్నతనంలో చాలా తక్కువ మొత్తంలో చక్కెర లభించింది. ఈ పరిస్థితులను ప్రామాణికంగా తీసుకుని, పరిశోధకులు ఏకంగా 64,000 మందికి పైగా వ్యక్తుల దశాబ్దాల కాలపు ఆరోగ్య సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. చిన్నతనంలో తక్కువ చక్కెర తిని పెరిగిన వారి ఆరోగ్య ఫలితాలను, సాధారణంగా చక్కెర తిన్నవారితో పోల్చి చూసినప్పుడు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నతనంలో పంచదార వినియోగాన్ని పరిమితంగా ఉంచిన వారిలో, దశాబ్దాల తర్వాత కొన్ని రకాల ప్రాణాంతక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సుమారు 36 శాతం నుండి 69 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా కాలేయ క్యాన్సర్ విషయంలో ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా మరియు ఎక్కువగా కనిపించింది. దీనితో పాటు రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు కూడా వారిలో గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్న వయసులో చక్కెర పరిమితి వల్ల శరీరంలో కలిగే మార్పులు దీర్ఘకాలికంగా రక్షణ కవచంలా పనిచేస్తాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.         kids sugar restriction health benefits,childhood sugar intake cancer study.
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి? కొల్లాజెన్, Vitamin D లోపం వృద్ధాప్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇవి ఆహారం ద్వారా మాత్రమే అందుకోవచ్చా? లేక supplements అవసరమా? ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్, Celebrity Medical Aesthetic Specialist డాక్టర్ శ్రీ సత్య జగదీష్ ఈ వీడియోలో వయసు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే ముఖ్యమైన మార్పుల గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా Hormonal Imbalance, Collagen తగ్గడం, Vitamin D, Zinc, Omega nutrients వంటి అంశాలు ఆరోగ్యం, చర్మం మరియు వృద్ధాప్య ప్రక్రియపై ఎలా ప్రభావం చూపుతాయో సులభంగా తెలియజేస్తున్నారు. 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఆరోగ్యం, చర్మ సౌందర్యం, పోషకాహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొల్లాజెన్, Vitamin D వంటి పోషకాలు ఆహారం నుంచే సరిపోతాయా? Supplements ఎప్పుడు అవసరం కావచ్చు? ఈ ప్రశ్నలకు డాక్టర్ చెప్పిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి. వయసు పెరగడం సహజమే అయినా, సరైన ఆహారం, పోషకాలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో శరీరంలో వచ్చే మార్పులను సమర్థంగా నిర్వహించుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
వెన్నునొప్పి తర్వాత మానవులలో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. వయస్సు పైబడటం వల్ల లేదా మోకాలిలోని కార్టిలేజ్ , సాఫ్ట్ టిష్యూలకు గాయాలవడం వల్ల ఈ నొప్పి ఏ వయస్సు వారికైనా రావచ్చు. దీర్ఘకాలం పాటు వేధించే ఈ మోకాళ్ల నొప్పి మనుషులను శారీరకంగా, ఆర్థికంగా , మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. అయితే ఈ నొప్పి రాగానే నేరుగా సర్జరీ అవసరం పడుతుందని భయపడాల్సిన పనిలేదు. శస్త్రచికిత్స కంటే ముందే అసలు ఈ మోకాళ్ల నొప్పి ఏ కారణం వల్ల వస్తుందో మరియు దానిని ఎలా అధిగమించవచ్చో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటి గురించి వివరంగా తెలుసుకుంటే.. మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణాలు, వాటి లక్షణాలు.. సాధారణంగా 55 నుండి 60 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో మోకాళ్ల నొప్పి రావడానికి ఆస్టియోఆర్థరైటిస్ ప్రధాన కారణం. ఇందులో మోకాలి జోళ్లలోని కార్టిలేజ్ అరిగిపోయి, బరువును మోసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల మోకాళ్లలో వాపు, తీవ్రమైన నొప్పి ఏర్పడి రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ రకమైన నొప్పి మోకాలి కింద లేదా ఇరువైపులా రావచ్చు. ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నవారికి ఉదయం పూట మోకాళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తాయి. మరొకవైపు, శారీరక శ్రమ మరియు వ్యాయామం ఎక్కువగా చేసే యువత లేదా క్రీడాకారులలో మోకాళ్ల నొప్పి గాయాల వల్ల వస్తుంది. ఎక్కువగా రన్నింగ్ లేదా వర్కౌట్లు చేయడం వల్ల ఐటీ బ్యాండ్ సిండ్రోమ్ రావచ్చు.  తొడ కండరాలు బలహీనంగా ఉండటం, మోకాలి నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల పాటెల్లోఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్ లేదా రన్నర్స్ నీ అనే సమస్య వస్తుంది. దీనివల్ల మోకాలిచిప్ప కింద నొప్పి అనిపిస్తుంది. మోకాళ్ల నొప్పులు హఠాత్తుగా ఎందుకు వస్తాయి? కొన్నిసార్లు మోకాళ్ల నొప్పి కింద పడటం, ప్రమాదాలు జరగడం, ఆటలు ఆడేటప్పుడు లేదా వంగి పనులు చేసేటప్పుడు అకస్మాత్తుగా రావచ్చు.  మోకాలికి అయ్యే గాయాల్లో మెనిస్కస్ చిరగడం చాలా సాధారణం. ఇది మోకాలిని స్థిరంగా ఉంచే ఒక అర్ధచంద్రాకార కార్టిలేజ్. కాళ్లు అనుకోకుండా మెలిక తిరిగినప్పుడు ఇది చిరిగిపోయి తీవ్రమైన నొప్పి, వాపుకు కారణమవుతుంది. మోకాలిని అనుసంధానించే లిగమెంట్లు అతిగా సాగడం లేదా చిరగడం వల్ల కూడా నొప్పి వస్తుంది. ప్రత్యేకించి ఎమ్‌సిఎల్ , ఏసిఎల్ అనే లిగమెంట్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థరైటిస్ నొప్పి నివారణ , సంరక్షణ మార్గాలు.. నొప్పి నెమ్మదిగా ప్రారంభమై పెరుగుతున్నట్లయితే ఫిజియోథెరపిస్ట్ లేదా వైద్యుడిని సంప్రదించాలి. నడక తీరులో లోపాలు, నడుము భాగం బలహీనంగా ఉండటం వల్ల కూడా మోకాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. ఇది నొప్పి నివారణ మందుల కంటే బాగా పనిచేస్తుంది. నొప్పి ఎక్కువగా ఉన్నవారు సైక్లింగ్, ఈత కొట్టడం లేదా ఎలిప్టికల్ మెషిన్ వాడటం వంటి తక్కువ ఒత్తిడి ఇచ్చే వ్యాయామాలు చేయాలి. మంచి సపోర్ట్ ఇచ్చే బూట్లు ధరించడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. వైద్య చికిత్సలు , జాగ్రత్తలు.. జీవనశైలి మార్పులు , సాధారణ మందులతో ఉపశమనం లభించనప్పుడు వైద్యులు స్టెరాయిడ్ ఇంజెక్షన్లను సూచిస్తారు. అయితే వీటిని పదే పదే వాడకూడదు. ప్రారంభ దశలోని ఆస్టియోఆర్థరైటిస్ రోగులకు హైలురోనిక్ యాసిడ్ లేదా ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్లు కొంతవరకు సహాయపడవచ్చు. ఏ చికిత్స పనిచేయనప్పుడు చివరి ఛాయిస్ గా మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. మోకాళ్ల గాయాల నివారణకు ప్రథమ చికిత్స .. వ్యాయామం లేదా పనులు చేసేటప్పుడు గాయం వల్ల నొప్పి వస్తే ఆ పనిని వెంటనే ఆపేయాలి. మోకాలి చుట్టూ మంచు గడ్డలతో ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. మెనిస్కస్ లేదా ఏసిఎల్ చిరిగిన సందర్భాలలో వైద్యుడి సలహా మేరకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మోకాలు పట్టు కోల్పోయినట్లు అనిపించినా, నిలబడటం లేదా మెట్లు ఎక్కడం కష్టంగా మారినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాలు.. వయస్సు లేదా జన్యుపరమైన అంశాలను మార్చలేము కానీ శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మోకాళ్లపై పడే భార తీవ్రతను తగ్గించవచ్చు. వ్యాయామం చేయడం వల్ల మోకాళ్లు పాడవుతాయనేది అపోహ మాత్రమే. శారీరక శ్రమ లేకపోతే కండరాలు బలహీనపడి ఆస్టియోఆర్థరైటిస్ ప్రమాదం మరింత పెరుగుతుంది. సరైన పౌష్టికాహారం తీసుకోవడం, కండరాలను బలంగా ఉంచుకోవడం , తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మోకాళ్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవడం  సాధ్యమవుతుంది.                *రూపశ్రీ.
బరువు తగ్గాలని అన్నం మానేశారు… అయినా బరువు తగ్గడం లేదా? రోజూ డైట్ చేసినా వెయిట్ పెరుగుతుందా? అయితే మీ బరువు పెరగడానికి కేవలం ఎక్కువగా తినడమే కారణమా? లేక థైరాయిడ్, PCOS, హార్మోన్ల మార్పులు, ఇన్ఫ్లమేషన్ వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయా? 100 కిలోల బరువు ఉన్నవారు ఒక్క నెలలోనే మొత్తం బరువు తగ్గడం సాధ్యమేనా? కొబ్బరి నూనె తాగడం, ఫ్యాట్ బర్నర్ ట్యాబ్లెట్లు వాడటం నిజంగా ఉపయోగపడతాయా? Mounjaro, Ozempic వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లు ఎంతవరకు సురక్షితం? Bariatric Surgery చేయించుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రవి కుమార్ చింత ఊబకాయం (Obesity) గురించి ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. బరువు పెరగడానికి అసలు కారణాలు ఏమిటి? ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే ఏం చేయాలి? డైట్ విషయంలో ఎలాంటి అపోహలకు దూరంగా ఉండాలి? వంటి విషయాలను తెలుసుకోవచ్చు. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? థైరాయిడ్ లేదా PCOS వల్ల బరువు పెరుగుతోందని అనుమానం ఉందా? అయితే ఈ వీడియో మీకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది. గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా చికిత్స లేదా బరువు తగ్గించే విధానాన్ని ఎంచుకునే ముందు వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)