TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ ఇన్ చార్జ్ గా మీనాక్షీ నటరాజన్ కు ఉద్వాసన? ఆమె స్థానంలో ఎవరంటే?

Published on: Sat Sep 5, 2026 3:28PM

తెలంగాణ కాంగ్రెస్ లో వరుసగా అనూమ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన తరువాత పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు, నేతల మధ్య విభేదాలను పరిగణనలోనికి తీసుకుని పార్టీ హైకమాండ్ కీలక మార్పులకు తెరలేపింది.  

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించిన హైకమాండ్  తెలంగాణ పీసీసీ,  జిల్లా కేడర్ మధ్య మరింత బలమైన సమన్వయాన్ని తీసుకొచ్చేందుకు  చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జిగా మీనాక్షి నటరాజన్ కు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఆమె స్థానంలో  ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, సీనియర్ నాయకుడు అయిన  భూపేష్ బగెల్‌ను నియమించనుందని తెలుస్తోంది. 

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న  రాజకీయ పరిణామాలు  ప్రభుత్వానికీ పార్టీకి మధ్య సమన్వయం లోపం ఉందన్న విషయాన్ని తేటతెల్లం చేసిన నేపథ్యంలో  కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  

పార్టీలో ఎలాంటి అసంతృప్తి, అసమ్మతికి తావు లేకుండా  కఠినమైన, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనీ, అందుకు భూపేష్ బగెల్‌ సరైన వ్యక్తి అని అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఇప్పటివరకు తెలంగాణ బాధ్యతలు నిర్వర్తించిన మీనాక్షీ నటరాజన్ ను తెలంగాణ రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించాలన్న నిర్ణయానికి పార్టీ హైకమాండ్ వచ్చిందని అంటున్నారు.  సంస్థాగతంగా పార్టీ  పటిష్ఠతకు ఢోకా లేకుండా  ఉండాలంటే  భూపేష్ బగెల్ వంటి  అగ్రనేత అవసరమని హైకమాండ్ భావిస్తోంది.  

[Telangana Congress, Bhupesh Baghel, Meenakshi Natarajan, AICC In Charge, Rahul Gandhi, Congress Party, Telugu One]