LATEST NEWS
జగన్ హయాంలో లవ్ జిహాద్ లు, మతమార్పిడులు జరిగాయని గతంలో ఆరోపించిన విజయసాయిరెడ్డి తాజాగా జగన్ హయాంలో ఆయన మెప్పు పొందడం కోసం పెద్ద ఎత్తున బలవంతపు మతమార్పిళ్లకు వైసీపీయులు పాల్పడ్డారని మరో బాంబు పేల్చారు. వైసీపీలో గతంలో నంబర్ 2 స్థానంలో చక్రం తిప్పిన విజయసాయి, ఆ పార్టీ తరఫున రెండు సార్లు రాజ్యసభకు వెళ్లారు. వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ మాజీ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. మత మార్పిడి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ప్రకటనలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారానికి దారితీశాయి.   తాజాగా విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్టులో  జగన్ విధానాలపై  విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా జగన్ హయాంలో రాష్ట్రంలో మత మార్పిడిలను ప్రోత్సహించారన్న కోణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వేదికలపైనా కూడా హాట్ టాపిక్ గా మారాయి. చాలా కాలం పాటు వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, మరీ ముఖ్యంగా జగన్ సన్నిహితుడిగా, వైసీపీలో    కీలక పదవులు నిర్వహించిన వ్యక్తిగా విజయసాయి నుంచి వచ్చిన వ్యాఖ్యలు వైసీపీని డిఫెన్స్ లో పడేశాయి.   వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ కూడా జగన్ కు రాజకీయ సలహాదారుగా, కుడి భుజంగా మెలిగిన విజయసాయి జగన్ అధికారంలో ఉండగా మతమార్పిళ్లు జరిగాయని చేసిన వ్యాఖ్యలను చాలా మంది నమ్ముతున్నారు. దీంతో వైసీపీ డిఫెన్స్ లో పడి విజయసాయి వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమేనంటూ ఎదురుదాడికి దిగింది.  ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ ఆరోపణలను   ఖండించారు. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవన్న సజ్జల. వైయస్ జగన్ మోహన్ రెడ్డి   అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని, ఏ ఒక్క మతానికి వ్యతిరేకంగా, లేదా ఒక మతాన్ని బలవంతంగా ప్రోత్సహించే విధంగా  ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, అధికారంలో లేని  సమయంలోనూ కూడా జగన్ అన్ని వర్గాల ప్రజల విశ్వాసాలను కాపాడే చర్యలు తీసుకున్నారన్నారు.   విజయసాయి రెడ్డి వైసీపీని   వీడి చాలా కాలం గడిచిపోయిందని, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లారన్న ఆయన..   విజయసాయి పార్టీని వీడినప్పుడు ఆయనపై జగన్ ఎటువంటి విమర్శలూ చేయలేదని గుర్తు చేశారు. విజయసాయి మాటలు పట్టించుకోనవసరం లేదు కానీ, ఇప్పుడు మత మార్పిడులపై విజయసాయి చేసిన వ్యాఖ్యలపై మౌనంగా ఉంటే..   ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందనే ఉద్దేశంతోనే తాను మీడియా ముందుకు వచ్చి స్పందిస్తున్నానన్నారు.  దశాబ్దాలుగా జగన్ కుటుంబంతో కలిసి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.  మొత్తంగా స్థానిక ఎన్నికల ముంగిట విజయసాయి చేసిన వ్యాఖ్యలు వైసీపీకి పెద్ద మైనస్ అవుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ వినా ఆయన కుటుంబం నుంచి ఎవరూ కూడా ఇంత వరకూ తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరు కాకపోవడం, జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించడం వంటి విషయాలను గుర్తు చేస్తున్నారు. మొత్తంగా జగన్ హయాంలో బలవంతపు మతమార్పిళ్లు అన్న విజయసాయి వ్యాఖ్యలు వైసీపీకి పెద్ద శరాఘాతంగా మారతాయనడంలో సందేహం లేదని అంటున్నారు.  [Vijayasai Reddy, YS Jagan Mohan Reddy, YSRCP, Sajjala Ramakrishna Reddy, Andhra Pradesh Politics,Telugu One]
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత పటిష్టం చేయడంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. పలు రాష్ట్రాలకు కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జ్‌లను నియమించే ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ఐదారు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను నియమించే అంశంపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ మార్పుల్లో భాగంగానే తెలంగాణకు కూడా కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య కోసం లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు వెళ్లనున్నారు. సుమారు పది నెలల పాటు ఆమె లండన్‌లో ఉండనున్న నేపథ్యంలో తెలంగాణ వంటి క్రియాశీలక రాష్ట్ర బాధ్యతలను మరో సీనియర్ నేతకు అప్పగించాలని అధిష్ఠానం భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ ఎ. చెల్లకుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు పార్టీ వ్యవహారాలపై ఉన్న అనుభవం, వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన నేపథ్యం తెలంగాణ బాధ్యతలకు ఉపయోగపడుతుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.డాక్టర్ ఎ. చెల్లకుమార్ తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కాంగ్రెస్ నేత. 1991లో అన్నా నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1996లో టి.నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్ వర్గం) తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2011లో టి.నగర్ నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటమి ఎదురైంది. అనంతరం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన చెల్లకుమార్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. పార్టీలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసిన చెల్లకుమార్.. గోవా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి రాజకీయాలతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఆయనకు ఉన్న అనుభవం ఇప్పుడు తెలంగాణకు ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ వ్యవహారాలను సమర్థవంతంగా పర్యవేక్షించడంతో పాటు ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేడర్‌తో సన్నిహితంగా పనిచేసే స్వభావం, పార్టీ వ్యవహారాలపై అనుభవం ఉన్న సీనియర్ నేతను తెలంగాణ ఇన్‌చార్జ్‌గా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే డాక్టర్ ఎ. చెల్లకుమార్ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పటివరకు చెల్లకుమార్ పేరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగానే కొనసాగనుంది.       [ New in-charge for Telangana Congress, Dr. A. Chellakumar, Telangana Congress Party,  CM Revanth reddy, Meenakshi Natarajan, Telangana Congress Incharge, AICC, Congress Party, Telangana Politics, PCC Chief Mahesh Kumar Goud ]  
తెలంగాణ రాజయాలలో పెను సంచలనంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంటోందా? కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన పలికిన తరువాత.. ఆమె పార్టీకి రాజీనామా చేయకపోవడానికి హస్తిన స్థాయిలో ఆమెకు దక్కిన హామీలే కారణమా? ఆమె విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సాఫ్ట్ కార్నర్ తో ఉందా? అంటే తాజాగా జరుగుతన్న ప్రచారాన్ని బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైకమాండ్ పిలుపు మేరకుఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.  గతంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖకు ఏర్పడిన విభేదాల కారణంగా.. క్రమశిక్షణ చర్య అంటూ ఆమెకు రేవంత్ కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. సాధారణంగా కాంగ్రెస్ రాజకీయాలలో ఇటువంటి కఠిన చర్య చాలా అరుదు. దీంతో కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం పార్టీ వర్గాలలో సంచలనంగా మారింది.   అయితే,   సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలిగా  కొండా సురేఖను పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదని భావించిన హైకమాండ్.. కేబినెట్ మంత్రిగా ఉద్వాసనకు గురైన ఆమెకు మరో కీలక పదవిని అప్పగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలగకుండా ఆమె సేవలను పార్టీకి అందేలా చేయాలని నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొండా సురేఖకు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసే     అవకాశం ఉందని తెలుస్తోంది ఆర్టీసీ చైర్మన్ పదవికి   కేబినెట్ హోదా  ఉండటంతో ఆమె గౌరవానికి తగిన పదవి అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.   కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైనప్పటికీ..  కొండా సురేఖ   పార్టీ నాయకత్వంపై  దుందుడుకుగా ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలూ చేయలేదు. ఆమె సహజ వైఖరికి ఇది పూర్తి విరుద్ధం.  రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన అంతిమ లక్ష్యమని కస్పష్టం చేసిన సురేఖ.. తనకు అవమానం జరిగినా..  తాను కాంగ్రెస్ ను వీడే ప్రశక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.   కేవలం తన పదవి కోల్పోవడం పట్ల కాకుండా, సరైన కారణం లేకుండా తనను తప్పించారనే చిన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్న కొండా సురేఖ.. ఆ అసంతృప్తి వినా.. పార్టీని వీడాలన్న యోచన తనలో ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. ఆమెఅనుసరించిన ఈ వైఖరే కొండా పట్ల హైమాండ్ లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి కరాణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    [Konda Surekha, Telangana Congress Politics, Cabinet Rank Post,  RTC Chairman, Revanth Reddy, Telugu One]
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..! తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త చర్చనీయాంశంగా మారిన పరిణామంలో, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంచలన సవాల్ విసిరారు. మాక్ అసెంబ్లీలు పెట్టి బీసీ నేతకు ముఖ్యమంత్రి స్థానం కల్పించడం కేవలం డ్రామాలని, నిజంగా దమ్ముంటే బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.  ఎలాగో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభకు రారూ కదా, మరి బీసీలు  ఎస్సీలపై ఈ కపట ప్రేమ ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ తన స్థానంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగిస్తే, ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ దళితులు, బీసీలను మోసం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు ఏమాత్రం లేదని మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పుగా మలిచారని, మూడెకరాల భూమి పంపిణీ గానీ, ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకం అమలును గానీ పూర్తిగా విస్మరించారని గుర్తుచేశారు. కేవలం ఎన్నికల సమయంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం సరికాదని, ఆయన ఆశయాలను, సూచనలను నిజ జీవితంలో పాటించాలని హితవు పలికారు.  నాటి TRS 2003 డాక్యుమెంట్‌ను కూడా సరిగా పట్టించుకోని చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తామనడం సరికాదని, ముందుగా తమ బుర్రలోని పాత, కుహనా ఆలోచనలను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చురకలంటించారు. కాలం మారిపోయిందని, నేడు దళితులు నగరాలకు వచ్చి ఉన్నత స్థాయికి చేరుకున్నారని, కాలం చెల్లిన దొరలను ప్రజలు ఫామ్ హౌస్‌లకు పరిమితం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి దళితులకు, వెనుకబడిన వర్గాలకు తీవ్రమైన అవమానాలు జరిగినా కేసీఆర్ నుంచి ఎన్నడూ సరైన స్పందన రాలేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను చూసి 'అధ్యక్షా' అనాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎలాంటి స్పష్టమైన విజన్ లేకుండా రాష్ట్రాన్ని పాలించి, రాష్ట్రాన్ని తీవ్రమైన అప్పులపాలు చేశారని మండిపడ్డారు.  అయినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే, మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిగిలిన రెండున్నరేళ్ల పాలనా కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నికల హామీని కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పీసీసీ చీఫ్ తన ప్రసంగాన్ని ముగించారు.       [ MLC Mahesh Kumar Goud, Talasani Srinivas Yadav, KCR, PCC Chief, BRS, Congress,  BRS, CM Revanth reddy, KCR, KTR, Telugu One, Telugu News ]
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు. కొండా కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు.“కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు” అని కొండా మురళి స్పష్టం చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. కొండా సురేఖకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలు ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  “కొండాను ఢీకొట్టడం ఈ గొర్రెల వల్ల కాదు” అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని గొర్రెలు, గుంటనక్కలు అన్నీ ఒక్కటై కొండాను ఢీకొట్టాలని చూస్తున్నాయని, అయితే అది సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా కార్యక ర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “పులి.. పులి.. పులి.. బెబ్బులి.. కొండా మురళి వేట పులి” అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొండా కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కార్యకర్తలు తెలిపారు. “మీరు నక్సల్స్‌లోకి వెళ్తే.. మీతోనే నక్సల్స్‌లోకి వస్తాం” అంటూ కొండా మురళికి, కొండా సురేఖకు అభయం ఇచ్చారు. కొండా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. తాజా పరిణా మాలతో స్థానికంగా కొండా వర్గం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.       [ Konda Murali, Konda Surekha, Congress party, Warangal, CM Revanth reddy, Konda sushmitha, Telugu One, Telugu News]  
ALSO ON TELUGUONE N E W S
భారతీయ సినీ రంగానికి ఐదు దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తున్న దిగ్గజ నటుడు అనంత్ నాగ్ కి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024' వరించింది. కన్నడ, హిందీ, తెలుగు తదితర భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయనకు ఈ గౌరవం దక్కడంపై సినీ లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో ఆయన ఈ అవార్డును స్వీకరించనున్నారు. నేటి తరం ఆడియన్స్‌కి అనంత్ నాగ్ అనగానే 'KGF' సినిమాలో రాకీ భాయ్ సామ్రాజ్యం గురించి, KGF హిస్టరీ గురించి గంభీరమైన స్వరంతో వివరించే పాత్ర గుర్తుకొస్తుంది. ఆ గంభీరమైన వాయిస్, ఆయన ముఖంలో కనిపించే గాంభీర్యం ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్తాయి. అనంత్ నాగ్ నటనా ప్రయాణం కేవలం ఇటీవల వచ్చిన పాన్ ఇండియా హిట్స్‌కే పరిమితం కాదు. ఆయన ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి సేవలు అందిస్తూ, 300కు పైగా చిత్రాల్లో అద్భుతమైన పాత్రలను పోషించారు. కన్నడ, హిందీ, మరాఠీ, మలయాళ, తెలుగు భాషల్లో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఇంతటి ఘనమైన కెరీర్ కలిగిన అనంత్ నాగ్ కి భారత ప్రభుత్వం అత్యంత గౌరవప్రదమైన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డును ప్రకటించడం సినీ సమాజానికే ఒక గొప్ప గౌరవంగా నిలిచింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సెలక్షన్ కమిటీ సిఫారసుల మేరకు ఈ ఎంపిక జరిగింది. 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో అనంత్ నాగ్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఆయన అందించిన కళా సేవలకు, తరతరాల ప్రేక్షకులను అలరిస్తూ, నటులను ప్రభావితం చేసిన ఆయన నటనా వైభవానికి ఈ పురస్కారం సరైన నజరానా అని సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. https://www.instagram.com/p/DdWNrUPk-rq/       [Anant Nag Dadasaheb Phalke Award, Actor Anant Nag, Dadasaheb Phalke Award, 72 National Film Awards, KGF Anant Nag, Telugu Film News, Telugu News]  
Nani and Kayadu Lohar's Jadal and Subbu are in a different romantic zone in the latest poster of The Paradise. The new glimpse showcases the lead pair sharing a fire stick to light their cigarettes, offering a bold and unconventional take on romance.  While Nani appears with blood-soaked hands and an intense expression, Kayadu's composed look creates an interesting contrast, hinting at the unusual relationship between their characters.Directed by Srikanth Odela, The Paradise marks his second collaboration with Nani after the blockbuster Dasara.  The latest poster adds another layer to the film's intrigue, as Jadal's violent world and the revolution he is set to lead appear to intersect with his relationship with Subbu. The makers are building curiosity with regular promotional updates ahead of the film's release. The film features Mohan Babu, Raghav Juyal and Sampoornesh Babu in prominent roles. Anirudh Ravichander is composing the music, with the songs “Aaya Sher” and “Yasha Nagula” already generating buzz among audiences. Produced by Sudhakar Cherukuri on a lavish scale, The Paradise is Nani's career-highest-budget film. The action drama is scheduled for a worldwide theatrical release on September 24, with post-production progressing at a brisk pace. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Sandeep Kishan is gearing up for the release of Sigma, a heist drama directed by Jason Sanjay, son of Tamil Nadu Chief Minister Vijay. The film marks Jason Sanjay’s directorial debut, with Faria Abdullah playing the female lead. The team recently interacted with the press as part of the promotional campaign for the October 2 release. Speaking about the film, Sandeep Kishan described Sigma as an original and entertaining ride with a relatable story and emotional core. He said he was impressed by Jason Sanjay’s script, passion and clarity as a filmmaker. The actor also revealed that Jason planned to complete the film in 70 days but wrapped up the shoot in just 63 days. Jason Sanjay said, "Sigma revolves around a man fighting for his identity and is designed as a character-driven film with a fun heist narrative." He added that he wrote the screenplay with universal appeal in mind rather than limiting it to a particular language or audience. The director also spoke about learning filmmaking and screenplay writing during his studies, while crediting his grandfather, director S. A. Chandrasekhar, for teaching him about handling film sets and time management.  Sandeep Kishan praised Jason’s confidence and approach, stating that the director brought exactly what he had written onto the screen. Produced by Lyca Productions, Sigma had been delayed due to Vijay's final film, Jana Nayagan release but it is getting huge release now. Mythri Distribution is releasing it in Telugu. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు' ఐబొమ్మ రవి'. ముఖ్యంగా పైరసీ ప్రేమికులైతే రవిని రోల్ మోడల్ గా తీసుకుంటారు. తాజాగా రవి మరోసారి న్యాయస్థానం మెట్లు ఎక్కి పలు సంచలన వ్యాఖ్యలు చేసాడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, తన కుటుంబ పోషణతో పాటు రోజువారీ నిత్యవసరాలు, మెడికల్ ఖర్చులు భరించడం కూడా కష్టంగా మారిందని పేర్కొంటూ హైదరాబాద్ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. సినీ పైరసీ, డేటా దొంగతనం, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వంటి తీవ్ర ఆరోపణలతో ఇమంది రవిపై మొత్తం 5 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.  సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇమంది రవికి చెందిన వివిధ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయగా, అందులో దాదాపు 3 కోట్ల మేర నిధులు నిలిచిపోయాయి. తన అకౌంట్లను పూర్తిగా ఫ్రీజ్ చేయడంతో చేతిలో డబ్బులు లేక తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నానని, కనీసం కుటుంబ అత్యవసరాల దృష్ట్యా ఆ రూ.3 కోట్ల నిధులలో కొన్ని అకౌంట్లనైనా లేదా కొంత మొత్తాన్ని అయినా అన్‌ఫ్రీజ్ చేసి వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు Also Read: మీనా పిక్స్ వైరల్: బర్త్ డే రోజున కావాలనే రిలీజ్ చేసిన ఆ హీరోయిన్ ఎవరు! విశాఖపట్నం నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి డిజిటల్ నెట్‌వర్క్‌లో అడుగుపెట్టిన రవి, ఆ తర్వాత విదేశాల్లో ఉంటూ ఐబొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ వెబ్‌సైట్లతో పాటు బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లకు ట్రాఫిక్ మళ్లించి కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, సుదీర్ఘ దర్యాప్తు అనంతరం చంచల్‌గూడ జైలులో దాదాపు 90 రోజులకు పైగా రిమాండ్‌లో ఉన్న రవికి 2026 ఫిబ్రవరి 17న తెలంగాణ హైకోర్టు రూ.25,000 సూచీలు, పాస్‌పోర్ట్ సమర్పణ, ఇంటర్నెట్ వినియోగంపై పరిమితులతో బెయిల్ మంజూరు చేసింది.  బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ, పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంక్ డిపాజిట్లు ఇంకా సీజ్ అయి ఉండటంతో కుటుంబ నిర్వహణ భారంగా మారిందని రవి పిటిషన్‌లో స్పష్టం చేశారు. గతంలో విలాసవంతమైన జీవితం గడిపిన వ్యక్తి ఇప్పుడు రోజువారీ వైద్య ఖర్చులకూ నిధులు లేవని విన్నవించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో, టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రవి సమర్పించిన ఈ అన్‌ఫ్రీజింగ్ పిటిషన్‌పై నాంపల్లి క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టి ఏ నిర్ణయం ప్రకటిస్తుందోనని తీవ్ర ఆసక్తి నెలకొంది.        [ I Bomma Ravi, Nampally  Court, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
    తెలుగు సినిమాని తన నవ్వుతోనే ఏలిన నటి మీనా.. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ఆమె సృష్టించిన ఆరా అపారం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తో నేటికీ మెస్మరైజ్ చేసే సూపర్ డూపర్ హిట్స్ మీనా సొంతం. సోలో హీరోయిన్ గా సిల్వర్ జూబ్లీ ని తన ఇంటి ముందే కట్టేసుకున్న రికార్డు కూడా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లోను  సత్తా చాటుతున్న మీనా పిక్స్ రీసెంట్ గా సోషల్ మీడియాని కోటి ఆశలతో పరిగెత్తిస్తున్నాయి. సెప్టెంబర్ 16న మీనా పుట్టిన రోజు. అంటే ఈ రోజే. తన  48వ పుట్టినరోజు సందర్భంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు, నటీనటులు మరియు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు వెల్లువలా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, ఈ సంవత్సరం మీనా బర్త్‌డే వేడుకలు కేవలం సాధారణ వేడుకగా కాకుండా, ఆమె ఆప్తమిత్రుల మధ్య ఎంతో ఆత్మీయంగా, ప్రత్యేకంగా నిర్వహించబడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రత్యేకమైన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన అరుదైన మరియు ఆకట్టుకునే ఫోటోలను ప్రముఖ నటి మహేశ్వరి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నాటి తరం కథానాయికలు మరియు ఆత్మీయ స్నేహితులు అందరూ ఒకే చోట చేరి మీనాకు మర్చిపోలేని సర్‌ప్రైజ్ అందించారు. ఈ వేడుకలో నటి మహేశ్వరితో పాటు సంగీత, రాధిక, సంఘవి, స్నేహ వంటి ప్రముఖ నటీమణులు పాల్గొని సందడి చేశారు. దాదాపు 90వ దశకం నుండి నేటివరకు కొనసాగుతున్న వీరి సుదీర్ఘ బంధం, నేటి సినీ ప్రపంచంలో ఎంతో అరుదైనదిగా నిలిచింది. స్నేహితులందరూ కలిసి కేక్ కట్ చేయించి, మీనాకు తినిపిస్తూ నవ్వులు రువ్వుతున్న దృశ్యాలు అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి.     Also Read: దర్శకుడిగా మారనున్న కార్తికేయ: అది కూడా కార్తికేయనే చేస్తాడంట!  సోషల్ మీడియాలో మహేశ్వరి పోస్ట్ చేసిన ఈ ఫోటోల గ్యాలరీ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన కేవలం కొన్ని గంటల్లోనే వేలాది లైక్స్ మరియు శతాధిక కామెంట్లు రావడం ఈ నటీమణుల క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్లుగా సినీ గ్లామర్ ప్రపంచంలో ఉంటూ, జీవితంలోని అనేక కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా నిలిచిన ఈ 90s క్లబ్ హీరోయిన్ల బాండింగ్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. "రియల్ ఫ్రెండ్‌షిప్ అంటే ఇదే" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కలర్‌ఫుల్ డ్రెస్‌లలో దేవతల్లా మెరిసిపోతున్న ఈ భామలు, అందమైన కేక్‌తో కలిసి తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్స్‌గా నిలిచాయి.               [Meena, Maheswari, Chiranjeevi, Balakrishna, Nagarjuna, venkatesh, Birthday Pics, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
  ఆర్ఎక్స్ 100 తో తెలుగు ప్రేక్షకుల హార్ట్స్ లో హోల్ లాగా ఉండి పోయాడు కార్తికేయ. దీంతో తెలుగు పరిశ్రమకి కాబోయే యూత్ స్టార్ అనే టాగ్ లైన్ కూడా పొందాడు. కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ లని ఎంచుకునే ప్రాసెస్ లో రాంగ్ స్టెప్ వేయడంతో హిట్ అనేది కార్తికేయ తో  నన్ను అందుకోలేవు అనే పరిస్థితి. Also Read: 'వారణాసి'పై ప్రియాంక చోప్రా కీలక వ్యాఖ్యలు.. ఆ ఒక్క మాట మాట్లాడకుండా ఉండి ఉంటే     అందుకే ఇప్పుడు హిట్ కి సవాలు విసురుతు హీరోగానే కాకుండా దర్శక నిర్మాతగా  కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. 'కార్తికేయ క్రియేటివ్ వర్క్స్' (Kartikeya Creative Works) పేరుతో ఒక నూతన ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించి, కేవలం సినిమాలు నిర్మించడమే కాకుండా, స్వయంగా మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించడానికి కూడా కార్తికేయ సిద్దమవుతున్నాడు. ఒక నటుడు స్వయంగా దర్శకుడిగా, నిర్మాతగా మారి తన కథా దృక్పథాన్ని పూర్తి స్వేచ్ఛతో తెరకెక్కించడం టాలీవుడ్‌లో ఎంతో అరుదైన విషయం. కొత్త రకం కథలను, పరిశ్రమలోకి వచ్చే నూతన ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, తన మార్క్ మేకింగ్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనేది  ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.ఈ నూతన ప్రొడక్షన్ హౌస్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా, చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల నుంచి మరియు అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువను అందుకుంటోంది. మరో ఈ డేరింగ్ స్టెప్ తో అయినా పరాజయం కార్తికేయ ముఖాన్ని చూడటానికి ఇష్టపడదేమో చూడాలి.      karthikeya, Karthikeya Creative Works, karthikeya Directorial Debut ,  RX 100 Hero, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News
    ప్రియాంక చోప్రా.. ప్రపంచ సినిమా భారతీయ సినిమా గుమ్మం తొక్కేలా చేసిన నటి. అందుకు సజీవ సాక్ష్యం ఆమె చేసిన ఇంగ్లీష్ సినిమాలు. ఇప్పుడు  రాజమౌళి, మహేష్ బాబు ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ వారణాసిలో చేస్తుంది. దీన్ని బట్టి ప్రపంచ సినీ ప్రేమికుల మైండ్ లో వారణాసి కొలువుతీరి ఉంటుందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.    ప్రియాంక చోప్రా రీసెంట్ గా ఒక స్పెషల్ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'లాస్ ఏంజెలిస్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ వేడుకల్లో రాజమౌళిని తొలిసారిగా కలిశాను. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కూడా మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం జరిగిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత రాజమౌళి నుంచి నాకు  కాల్ వచ్చింది. ఫోన్ సంభాషణలో రాజమౌళి 'వారణాసి' కథలోని మందాకిని పాత్ర గురించి వివరిస్తూ.. "ఈ కథానాయిక పాత్ర కోసం నేను మిమ్మల్నే  ఊహించుకున్నానని   అన్నారు. ఆ ఒక్క మాట నా మనసుని  ఎంతగానో తాకింది. మరో ఆలోచన లేకుండా వెంటనే  ఒప్పుకున్నాను.  తెలుగు భాష సరిగ్గా రాకపోవడంతో ఆరంభంలో నటన విషయంలో కొంత ఇబ్బంది పడ్డాను,అదో పెద్ద సవాలుగా అనిపించిందని ఆమె ఓపెన్ అయ్యారు. అయితే, సెట్స్‌లో రాజమౌళి తనపై చూపించిన నమ్మకం, ప్రతి సీన్ పరిపూర్ణంగా వచ్చేలా  అందించిన మార్గదర్శకత్వం ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. గ్లోబల్ స్కేల్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో భాగమవ్వడం తన సినీ ప్రయాణంలో ఓ మరచిపోలేని అనుభూతిని ఇస్తోందని ప్రియాంక చోప్రా ఎంతో గర్వంగా చెప్పుకొచ్చింది.     Also Read: ధురంధర్ రికార్డ్స్ ని పక్కకు నెట్టిన హనుమాన్ అంశ్: ట్రేడ్ సర్కిల్స్ షాక్    అత్యంత క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్సులతో పాటు ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ డ్రామాను సమానంగా పండించగలిగే సత్తా ప్రియాంకలో ఉందని భావించే జక్కన్న ప్రియాంకని ఎంపిక చేసుకున్నాడు. నెక్స్ట్ ఇయర్  ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ అనే విషయం తెలిసిందే.        [Priyanka Chopra, Varanasi, ss Rajamouli, Mandakini Role Priyanka, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
సాధారణంగా హాలీవుడ్ హిట్స్ మన దగ్గర రీమేక్ అవ్వడం చూస్తుంటాం. కానీ, మన ఇండియన్ సినిమాను, అందులోనూ ఒక తమిళ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘మహారాజ’ మూవీ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌లో రీమేక్ కాబోతోంది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి 50వ చిత్రంగా వచ్చిన ‘మహారాజ’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో, మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్టులతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను అలరించింది. విజయ్ సేతుపతి నటన, ఆయన పండించిన ఎమోషన్స్ ఈ సినిమాను కేవలం తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా, ఏకంగా చైనా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయంగా నిలబెట్టాయి. ఈ సినిమా సాధించిన సక్సెస్ విజయ్ సేతుపతి కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇన్నాళ్లూ ఈ సినిమా హాలీవుడ్ రీమేక్‌పై అనేక రకాల వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ, తాజాగా ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ప్యాషన్ స్టూడియోస్’ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో వార్త నిజమని తేలిపోయింది. హాలీవుడ్‌లో రీమేక్ కాబోతున్న మొట్టమొదటి తమిళ సినిమాగా ‘మహారాజ’ చరిత్ర సృష్టించిందని వారు అధికారికంగా వెల్లడించారు. ఒక రీజనల్ సినిమా కాన్సెప్ట్ ప్రపంచ సినిమా రాజధాని అయిన హాలీవుడ్‌ను సైతం ఆకర్షించిందంటే ఆ స్క్రిప్ట్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ హాలీవుడ్ రీమేక్‌కి సంబంధించిన మరో సంచలన వార్త ఏంటంటే.. ఈ సినిమాలో హీరోగా హాలీవుడ్ స్టార్, ఆస్కార్ అవార్డ్ విజేత మాథ్యూ మెక్‌కానాగే నటించబోతున్నారనే టాక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. 'ఇంటర్‌స్టెల్లార్', 'డల్లాస్ బయ్యర్స్ క్లబ్' లాంటి ఎపిక్ చిత్రాలతో మెప్పించిన ఆస్కార్ విన్నర్ మాథ్యూ గనక ఈ రోల్ చేస్తే, ఈ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళడం ఖాయం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను త్వరలోనే హాలీవుడ్ మేకర్స్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.       [Maharaja Hollywood Remake, Vijay Sethupathi Maharaja, Matthew McConaughey Maharaja, Maharaja Movie, Nithilan Saminathan, Vijay Sethupath, Telugu Film News, Telugu News]  
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఒక ఊహించని సంచలనం పేలింది. ధరణి పోర్టల్ వేదికగా జరిగిన అక్రమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక విక్టిమ్‌ అంటూ అసెంబ్లీ వేదికగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ధరణి పోర్టల్ అక్రమాలపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ని అడ్డం పెట్టుకుని అనేక భూమి రికార్డులను ఇష్టారాజ్యంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూములకు సైతం దొంగ పట్టాలు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తావించిన ఒక పాయింట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ధరణి అక్రమాలకు హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక 'బాధితుడు' (విక్టిమ్) గా మారారని నవీన్ యాదవ్ తెలిపారు. దాదాపు 150 ఎకరాల ప్రభుత్వ భూమి రికార్డులు మార్చి.. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మరికొందరికి ఆ భూమిని మోసపూరితంగా అమ్మేశారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, ధరణి పోర్టల్‌లో జరిగిన ప్రతీ ఒక్క అక్రమాన్ని బయటకు తీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ శాసనసభలో డిమాండ్ చేశారు.        [Jr NTR Dharani Victim, Jr NTR Dharani Issue, Jr NTR Land Dispute, Jr NTR Naveen Yadav, Telangana Assembly, MLA Naveen Yadav, NTR Property, Jr NTR Latest News, Telugu News]  
    రికార్డులని సైతం ఉలిక్కిపడేలా చేసిన సిరీస్. ధురంధర్.  పైగా స్టిల్  ఈ సెకను ధురంధర్ రికార్డ్స్ లని చెప్పమంటే సినీ ప్రేమికులు గుక్క తిప్పుకోకుండా చెప్తారు. ఇప్పుడు ఆ అందరి కలెక్షన్ ల నాలెడ్జిలో కి  'హనుమాన్ అంశ్'   వచ్చి చేరింది. దీంతో వాళ్లంతా  'జై హనుమాన్' అనే పరిస్థితి. ఆగష్టు 7 న 'హనుమాన్ అంశ్' వరల్డ్ వైడ్ గా రిలీజయింది. అంటే ఇప్పటికి 6వ వారంలో. ఈ ఆరో వారమే ధురంధర్ రికార్డుకి ఎసరు పెట్టింది.  6వ వారంలో 64.87 కోట్ల రూపాయలు వసూలు చేసి, గతంలో 'ధురంధర్' సాధించిన 28.95 కోట్ల రికార్డుని  ఘోరంగా బద్దలు కొట్టింది. మరి ముందు ముందు ఎన్ని రికార్డ్స్  హనుమాన్ అంశ్ అందుకుంటుందో చూడాలి. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎటువంటి భారీ అంచనాలు, పెద్ద నటీనటులు లేకుండా వచ్చి న 'హనుమాన్ అంశ్'. కేవలం ₹2 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి ఇప్పటికే ₹218.03 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించింది. అంతేకాకుండా, గ్లోబల్ వైడ్‌గా ఇది రికార్డు స్థాయిలో ₹300 కోట్ల మార్కుకు అతిచేరువలో నిలిచి ట్రేడ్ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది.       Also Read: పిల్లల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకున్న సూర్య.. పిక్స్ రిలీజ్ చేసిన జ్యోతిక లక్ష్మణ్ నారాయణ్ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబాగా మారిన జీవిత ప్రయాణం ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రధాన పాత్రలో శోభినవ్ సత్య నటించిన ఈ సినిమా, ప్రచారానికి డబ్బులు లేకపోవడంతో ప్రారంభంలో ఉత్తరాదిలోని 8 ప్రదేశాల్లో సామూహిక అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వినూత్నంగా వార్తల్లో నిలిచింది.  మొదటి రోజు కేవలం 10 లక్షల ఓపెనింగ్స్ రాబట్టి , తొలి వారంలో ₹1.08 కోట్లు, రెండో వారంలో 40 లక్షల వసూళ్లతో సాధారణంగా సాగింది. కానీ, మూడో వారం నుంచి  మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో అనూహ్యంగా పుంజుకుని ఏకంగా 10.4 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చూపించిన విశ్వరూపం ఇండియన్ సినిమా చరిత్రలోనే నిలిచిపోతుంది. 22వ రోజు 6.25 కోట్లు, 23వ రోజు 9.25 కోట్లు, 24వ రోజు 12.75 కోట్లు దక్కించుకుని దండయాత్ర కొనసాగించింది.  తెలుగులో ఈ నెల 18 న హనుమాన్ అంశగా రిలీజ్ కావాల్సి ఉండగా ఆగిపోయినట్టుగా టాక్ .       [Hanuman Ansh,  Dhurandhar, Dhurandhar Box Office Record, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
అందమైన జీవితం.. బంగారం లాంటి భార్యాభర్తల బంధానికి మూలస్థంబాలు ఇవే..! ప్రపంచంలో అపురూపమైన బంధాలలో వైవాహిక బంధం ఎంతో ప్రత్యేకమైనది. ​వివైవాహిక జీవితంలో కొంతకాలం గడిచాక చాలామంది దంపతులు తమ భాగస్వామితో చిన్నపాటి అసంతృప్తులు, నిరాశలను ఎదుర్కొంటూ ఉంటారు. అలవాట్లు, అభిరుచులు, కుటుంబ బంధాలు, ప్రయాణాలు లేదా ఇష్టాయిష్టాల విషయంలో విభేదాలు రావడం సహజం. అయితే ఇటువంటి వ్యత్యాసాలు రాగానే బంధం విఫలమైందని లేదా సరైన భాగస్వామి దొరకలేదని అనుకోవడం పొరపాటు. నిజానికి, మనం ఒక బంధం నుంచి ఏమేమి ఆశించాలి అనే విషయంలో అనవసరమైన పిచ్చి ఆలోచనలను పెంచుకోవడమే దీనికి ప్రధాన కారణం. ​సాధారణంగా పెద్దల నుండి సమాజంలోని ఎంతో మంది  దంపతులంటే ప్రతి విషయంలోనూ ఒకేలా ఉండాలని, ఒకే ఆలోచనలు కలిగి ఉండాలని, ప్రతి క్షణం కలిసి గడపాలని చెబుతూ ఉంటారు.భార్యాభర్తలు కూడా అలాగే ఉండాలని  అనుకుంటారు. కానీ  ఇలాంటి  అంచనాలు ఎదుటి మనిషిపై ఒత్తిడి పెంచుతాయి. నిజంగా సంతోషాన్ని ఇచ్చే బంధంలో ఇవన్నీ అవసరం లేదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు.  దంపతుల మధ్య బంధం బలంగా, ఆనందంగా ఉండటానికి ప్రధానంగా మూడు మూలస్థంబాలు అవసరం. అవేంటో తెలుసుకుంటే.. దయ, ఓర్పు.. మనలోని లోపాలను, బలహీనతలను సహృదయంతో అర్థం చేసుకుంటూ, మంచి మనసుతో స్వీకరించే భాగస్వామి లభించడం ఎంతో ముఖ్యం. మన అసలైన స్వభావాన్ని ఎలాంటి విమర్శలు లేకుండా అంగీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు బంధంలో ప్రశాంతత ఉంటుంది. ​మానసికంగా దగ్గర కావడం..బలాన్ని, బలహీనతను పంచుకోవడం..  సమాజం ముందు మనం ఎంత దృఢంగా నటించినా, భాగస్వామి ముందు మాత్రం మన భయాలు, ఆందోళనలు, బలహీనతలను ధైర్యంగా పంచుకోగలగాలి. ఎదుటివారి ముందు ఎలాంటి ముసుగు లేకుండా నిజాయితీగా ఉండగలగడం, అలాగే భాగస్వామి బలహీనతలను కూడా గౌరవించడం  బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. అర్థం చేసుకునే తత్వం.. మన ఆలోచనా శైలి, మన ఆసక్తులు, మన మనసులోని అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపడం , ఎదుటివారి మనసులో ఉన్న విషయాన్ని  గ్రహించడం అత్యంత అవసరం. ఈ మూడు  దంపతుల మధ్య ఉన్నప్పుడు,  రోజువారీ విషయాల్లో ఎన్ని విబేధాలు  ఉన్నప్పటికీ ఆ బంధం ఆనందంగా సాగుతుంది. అభిరుచులు, అలవాట్లు, సోషల్ సర్కిల్ ఒకేలా ఉన్నంత మాత్రాన మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పలేం. ఒకరికొకరు దయతో ఉంటూ, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటూ ఆసరాగా నిలిచినప్పుడు మాత్రమే బంగారం లాంటి జీవితం సాధ్యమవుతుంది.                      •రూపశ్రీ.  
మహిళల జీవితంలో ప్రతి నెలా ఎదురయ్యే శారీరక, మానసిక సవాళ్లలో ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లేదా పిఎమ్‌ఎస్ (PMS) అత్యంత ప్రధానమైనది. బహిష్టు లేదా పీరియడ్స్ ప్రారంభం కావడానికి కనీసం ఒక వారాలు లేదా రెండు వారాల ముందు మహిళల్లో కనిపించే రకరకాల శారీరక, భావోద్వేగ మార్పుల సమాహారమే ఈ పిఎమ్‌ఎస్. నెలసరి సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పులు, శరీరంలో నీరు చేరి ఉబ్బరంగా అనిపించడం, రొమ్ముల్లో తీవ్రమైన నొప్పి, తలనొప్పి, అలసట, అధికంగా తియ్యటి పదార్థాలు లేదా జంక్ ఫుడ్ తినాలనే కోరికలు కలగడం వంటి శారీరక అసౌకర్యాలు ఒకవైపు వేధిస్తుంటాయి. మరొకవైపు కారణం లేకుండానే విపరీతమైన కోపం రావడం, చిన్న విషయాలకే తీవ్రమైన ఆందోళన చెందడం, డిప్రెషన్ లేదా చిరాకు వంటి మూడ్ స్వింగ్స్ కలగడం పిఎమ్‌ఎస్ యొక్క ప్రధాన సంకేతాలుగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసవ వయస్సులో ఉన్న దాదాపు 75 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ప్రతి నెలా ఏదో ఒక రకమైన పిఎమ్‌ఎస్ లక్షణాలను అనుభవిస్తున్నారని పలు అధ్యయనాల డేటా స్పష్టం చేస్తోంది. చాలామంది మహిళల మనస్సులో తరచుగా మెదిలే ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే, వయస్సు పెరిగే కొద్దీ లేదా నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఈ పిఎమ్‌ఎస్ సమస్యలు నిదానంగా క్రమంగా మాయమవుతాయా? ఈ ఆసక్తికరమైన అంశంపై ప్రముఖ గైనికాలజిస్టులు మరియు మహిళా ఆరోగ్య నిపుణులు అత్యంత కీలకమైన శాస్త్రీయ నిజాలను వెల్లడించారు. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ పిఎమ్‌ఎస్ పూర్తిగా మాయమవ్వకపోగా, నలభై ఏళ్ల వయస్సు దాటిన తర్వాత లేదా పెరిమెనోపాజ్ (మెనోపాజ్ ముందస్తు దశ) సమయానికి చేరుకునేసరికి దీని తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ల స్థాయిలలో నిరంతరం జరిగే తీవ్రమైన మార్పులే దీనికి ముఖ్య కారణం. 20ల మరియు 30ల వయస్సులో ఉన్న యువతులలో పిఎమ్‌ఎస్ లక్షణాలు సాధారణ హార్మోన్ల మార్పుల వల్ల ఒక క్రమపద్ధతిలో వచ్చిపోతుంటాయి. అయితే, 40ల వయస్సులోకి అడుగుపెట్టిన మహిళల్లో పెరిమెనోపాజ్ కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మెనోపాజ్‌కు ముందు శరీరం సిద్ధమవుతున్నప్పుడు ఈస్ట్రోజెన్ స్థాయిలు చాలా వేగంగా హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల గతంలో అనుభవించిన పిఎమ్‌ఎస్ లక్షణాల కంటే మరింత తీవ్రమైన ఆందోళన, నిద్రలేమి, తీవ్రమైన మూడ్ స్వింగ్స్ మరియు హ్యాట్ ఫ్లషెస్ (శరీరం వేడెక్కడం) వంటి సమస్యలు పెరిగిపోతాయి. అధ్యయనాల ప్రకారం, నలభై ఏళ్ల దాటిన మహిళల్లో దాదాపు 20 శాతం నుండి 30 శాతం మందిలో పిఎమ్‌ఎస్ లక్షణాలు అత్యంత క్లిష్టమైన పిఎమ్‌డిడి (PMDD ,Premenstrual Dysphoric Disorder) అనే తీవ్రమైన మానసిక సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఈ పిఎమ్‌ఎస్ ప్రభావం కేవలం మెనోపాజ్ దిశగా వెళ్తున్న మహిళల్లో మాత్రమే కాకుండా జీవితంలోని వివిధ దశల్లో కూడా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, గర్భధారణ సమయంలో హార్మోన్ల స్థితి పూర్తిగా వేరుగా ఉండటం వల్ల పిఎమ్‌ఎస్ లక్షణాలు ఉండవు. అలాగే పిల్లలకు పాలు ఇచ్చే పాలిచ్చే తల్లి దశలో కూడా ఈ సమస్య తగ్గుతుంది. అయితే ప్రసవం ముగిసిన తర్వాత తిరిగి క్రమం తప్పకుండా పీరియడ్స్ ప్రారంభమైనప్పుడు చాలామందిలో పిఎమ్‌ఎస్ లక్షణాలు మునుపటి కంటే ఎక్కువగా కనిపిస్తాయి. అంతిమంగా మహిళల్లో మెనోపాజ్ దశ (పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయే దశ) పూర్తయిన తర్వాత మాత్రమే ఈ హార్మోన్ల హెచ్చుతగ్గులు నిలిచిపోయి పిఎమ్‌ఎస్ సమస్యకు శాశ్వత విముక్తి లభిస్తుంది. ఈ పిఎమ్‌ఎస్ లేదా పెరిమెనోపాజ్ అసౌకర్యాల తీవ్రతను తగ్గించుకోవడానికి మహిళలు సరైన జీవనశైలి మార్పులు చేసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం 30 నుండి 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, ఆహారంలో ఉప్పు, చక్కెర, కెఫిన్ మరియు ఆల్కహాల్‌ను తగ్గించడం వల్ల శరీరంలో నీరు చేరే సమస్య మరియు మూడ్ స్వింగ్స్ అదుపులోకి వస్తాయి. ఆహారంలో పీచు పదార్థాలు, ఆకుకూరలు, క్యాల్షియం మరియు విటమిన్ బి6 అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వల్ల హార్మోన్ల వ్యవస్థ సమతుల్యమవుతుంది. ఒకవేళ పిఎమ్‌ఎస్ లక్షణాలు రోజువారీ పనులకు తీవ్రమైన అంతరాయం కలిగిస్తుంటే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గైనికాలజిస్ట్‌ను సంప్రదించి తగిన వైద్య సలహా లేదా హార్మోనల్ థెరపీ తీసుకోవడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.         [PMS, Premenstrual Syndrome, PMDD, Perimenopause, Menopause, Womens Health, Hormonal Changes, Menstrual Cycle, Estrogen, Progesterone]
  మానవ శరీరంలో అత్యంత సంక్లిష్టమైన, కీలకమైన అవయవమైన మెదడును ఆరోగ్యం గలదిగా ఉంచడంలో నాడీ వ్యవస్థతో పాటు రోగనిరోధక కణాలు కూడా అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అయితే మెదడులో ఏర్పడే క్రోనిక్ న్యూరోఇన్‌ఫ్లమేషన్ అంటే దీర్ఘకాలిక వాపు లేదా శోథ వల్ల ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ మరియు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వంటి భయంకరమైన నాడీ సంబంధిత రుగ్మతలు తలెత్తుతుంటాయి. ఇప్పటివరకు ఈ మెదడు వాపును ఎలా అరికట్టాలో సరైన మార్గం లభించక ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ న్యూరోసైంటిస్టులు మరియు మెడికల్ పరిశోధకులు మెదడులోని రోగనిరోధక కణాలను నియంత్రించే  డాక్స్  (DAXX Death Domain Associated Protein) అనే క్రోమాటిన్ ప్రోటీన్ పాత్రను కనుగొని నాడీ వైద్య రంగంలో ఒక సరికొత్త విప్లవానికి తెరతీశారు. మన మెదడులో  మైక్రోగ్లియా  (Microglia) అనే ప్రత్యేకమైన రోగనిరోధక కణాలు నిరంతరం కాపలాదారులుగా వ్యవహరిస్తాయి. మెదడులోకి ప్రవేశించే హానికర బ్యాక్టీరియా, వైరస్‌లు మరియు వ్యర్థాలను ఏరిపారేయడం వీటి ముఖ్య విధి. సాధారణ పరిస్థితుల్లో ఇవి మెదడుకు రక్షణగా పనిచేస్తాయి, కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా జన్యు మార్పులు సంభవించినప్పుడు ఇవి తీవ్రమైన వాపును లేదా ఇన్‌ఫ్లమేషన్‌ను ప్రేరేపించే సంకేతాలను విడుదల చేస్తాయి. ఈ మైక్రోగ్లియా కణాలలోని జన్యు వ్యక్తతను మరియు వాటి అతిగా స్పందించే స్వభావాన్ని అదుపులో ఉంచడంలో  DAXX  అనే క్రోమాటిన్ ప్రోటీన్ ఒక ప్రధాన బ్రేక్ సిస్టమ్‌లా లేదా మాస్టర్ స్విచ్‌లా పనిచేస్తుందని శాస్త్రవేత్తల ప్రయోగాల్లో వెల్లడైంది. క్రోమాటిన్ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం ద్వారా ఈ ప్రోటీన్ హానికరమైన ఇన్ఫ్లమేటరీ జన్యువులు యాక్టివేట్ కాకుండా నిరోధిస్తుంది. పరిశోధనాత్మక ప్రయోగాల డేటా ప్రకారం, మెదడులోని మైక్రోగ్లియా కణాలలో  DAXX  ప్రోటీన్ స్థాయిలు తగ్గినప్పుడు లేదా అది సక్రమంగా పనిచేయకుండా లోపించినప్పుడు, ఇన్‌ఫ్లమేషన్ సంకేతాలు దాదాపు 300 శాతం నుండి 400 శాతం వరకు విపరీతంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తీవ్రమైన వాపు వల్ల మెదడులోని ఆరోగ్యకరమైన న్యూరాన్లు మరియు సైనాప్స్‌లు నశించిపోయి, క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణించడం, మేధోశక్తి పడిపోవడం వంటి ఆల్జీమర్స్ సంకేతాలు వేగంగా విస్తరిస్తాయి. అయితే జీన్ థెరపీ లేదా ప్రత్యేక మాలిక్యూల్స్ ద్వారా ఈ DAXX  ప్రోటీన్ పనితీరును తిరిగి పునరుద్ధరించినప్పుడు, మెదడులోని వాపు స్థాయిలు దాదాపు 70 శాతం నుండి 80 శాతం వరకు తగ్గిపోయి, నాడీ కణాలు నశించకుండా సురక్షితంగా రక్షించబడ్డాయని ప్రయోగశాల ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ సంచలన ఆవిష్కరణ మానసిక మరియు నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ ఆశాకిరణంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సాంప్రదాయ మందులు కేవలం రోగ లక్షణాల తీవ్రతను మాత్రమే తాత్కాలికంగా తగ్గిస్తాయి తప్ప, వ్యాధి మూల కారణమైన మెదడు వాపును అరికట్టలేకపోతున్నాయి. కానీ,  DAXX  క్రోమాటిన్ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుని తయారుచేసే  టార్గెటెడ్ ఎపిజెనెటిక్ థెరపీ  అందుబాటులోకి వస్తే, ఆల్జీమర్స్ మరియు పక్షవాతం వంటి వ్యాధుల పురోగతిని ప్రారంభ దశలోనే ఆపడం సాధ్యమవుతుంది. అతి త్వరలోనే ఈ సాంకేతికత ఆధారంగా సరికొత్త ఔషధాలను రూపొందించి మానవ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని పరిశోధకులు ప్రణాళికలు రచిస్తున్నారు.         [DAXX Protein, Neuroinflammation, Brain Health, Microglia, Alzheimer's Disease, Parkinson's Disease, Autism Spectrum Disorder, Epigenetic Therapy, Neuroscience Research, Brain Inflammation]
ఆరోగ్యం కోసం వాకింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. వాకింగ్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. బ్రిస్క్ వాకింగ్ , బ్యాక్ వాకింగ్.. అంటూ చాలా రకాలు ఉన్నాయి. వీటిలో 8 ఆకారంలో వాకింగ్ చేయడం చాలా పవర్ఫుల్ అంటున్నారు. దీన్ని అష్టాంగ నడక లేదా ఎనిమిది ఆకారపు నడక అని కూడా అంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన సాంప్రదాయ వ్యాయామ పద్ధతి. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. అష్టాంగ నడక.. సాధారణంగా మనం ప్రతిరోజూ నేరుగా లేదా పార్కుల్లో రౌండ్‌గా నడుస్తుంటాం. కానీ ఒకే రీతిలో నడిచే నడక కంటే,  ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల శరీరానికి ఎన్నో రెట్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. సరైన పద్ధతిలో ఈ నడకను  దినచర్యలో భాగం చేసుకుంటే, కొద్దిరోజుల్లోనే శరీరంలో వచ్చే మార్పులను ప్రత్యక్షంగా చూడవచ్చు. చిన్న స్థలం చాలు.. ఈ నడకను సాధన చేయడానికి పెద్దగా స్థలం లేదా ఖరీదైన పరికరాలు అవసరం లేదు.  ఇంటి ఆవరణలో లేదా ఒక ఖాళీ గదిలో దక్షిణం నుండి ఉత్తర దిశగా ఎనిమిది ఆకారాన్ని ఊహించుకుని లేదా సుద్ద ముక్కతో గీసుకుని నడవడం ప్రారంభించాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పరగడుపున పరధ్యానం లేకుండా పాదరక్షలు లేకుండా నడవడం చాలా మంచిది. ఎలా నడవాలి?  నడిచేటప్పుడు శ్వాసపై ధ్యాస ఉంచుతూ ప్రశాంతంగా, నిలకడగా అడుగులు వేయాలి. దాదాపు పదిహేను నిమిషాలు ఒక దిశలో నడిచిన తర్వాత, తదుపరి పదిహేను నిమిషాలు వ్యతిరేక దిశలో నడవడం ఈ పద్ధతి లో ఉండే  ముఖ్య నియమం. అష్టాంగ నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. గుండె ఆరోగ్యం.. ఎనిమిది ఆకారంలో తిరుగుతూ నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ ఎంతో మెరుగుపడుతుంది. రెండు వైపులా  అడుగులు వేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు, ముఖ్యంగా గుండెకు తగినంత ప్రాణవాయువు అందుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థ.. కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఎనిమిది ఆకారంలో నడిచేటప్పుడు మోకాళ్లు, తుంటి భాగాలు, వెన్నుముక సహజంగా వంగుతాయి. దీనివల్ల వెన్నుముక బలపడి, నడుము నొప్పి , సయాటికా వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పాదాల కింద ఉండే ఆక్యుప్రెజర్ పాయింట్లు నేలను తాకడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. మానసిక ఆరోగ్యం.. అష్టాంగ నడక మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎనిమిది ఆకారాన్ని అనుసరిస్తూ నడిచేటప్పుడు మనస్సు పూర్తిగా ఆకారం పైన నడక పైన దృష్టి పెడుతుంది. దీనివల్ల అనవసరమైన ఆలోచనలు తగ్గి, మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ నడకను సాధన చేస్తే మంచి నిద్ర పడుతుంది. డయాబెటిస్ కు మంచిది.. అష్టాంగ నడక వల్ల జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు భాగంలో కదలికలు ఏర్పడి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగి, బరువు అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ స్థాయిలు సమతుల్యంగా ఉండటానికి, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ఈ నడక ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం.. సాధారణ నడకతో పోలిస్తే అష్టాంగ నడక శరీరంలోని రెండు వైపుల కండరాలను సమంగా ఉపయోగిస్తుంది. దీనివల్ల శరీర సమతుల్యత పెరుగుతుంది. వయసు పైబడిన వారు పడిపోకుండా స్థిరంగా నడవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ  నార్మల్ బ్యాకింగ్  కు బదులుగా  ప్రతిరోజూ కనీసం అర్ధగంట సేపు ఈ అష్టాంగ నడకను సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని , కొత్త ఉత్సాహాన్ని సొంతం చేసుకోవచ్చు.                          *రూపశ్రీ.  
గర్భనిరోధక మాత్రలు మహిళల జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. కుటుంబ నియంత్రణతో పాటు నెలసరి సరిగ్గా రానప్పుడు వాటిని రీసెట్ చేయడానికి, తీవ్రమైన కడుపునొప్పి, పిసిఓడి వంటి హార్మోన్ల సమస్యల చికిత్సకు కూడా వైద్యులు వీటిని సూచిస్తుంటారు. అయితే వీటిని కొద్దికాలం  పాటు వైద్యుల పర్యవేక్షణలో వాడటం సురక్షితమే..  అయినప్పటికీ, ఎక్కువ కాలం పాటు ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా క్రమం తప్పకుండా వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  ముఖ్యంగా మహిళలు వైద్యుల సలహాతో అయినా సరే.. ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం మంచిది కాదు.. దీర్ఘకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు , సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి?  వివరంగా తెలుసుకుంటే.. హార్మోన్ల అసమతుల్యత , మూడ్ స్వింగ్స్...  గర్భనిరోధక మాత్రలలో ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టిన్ అనే హార్మోన్లు ఉంటాయి. వీటిని ఎక్కువకాలం తీసుకోవడం వల్ల శరీరంలో సహజమైన హార్మోన్ల ఉత్పత్తి ప్రభావితమవుతుంది. దీనివల్ల మానసిక ఆందోళన, నిరాశ, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు తరచూ ఎదురవుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం..  ఎక్కువకాలం పాటు గర్భనిరోధక  మాత్రలు వాడటం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ముప్పు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాళ్లలోని నాళాలలో లేదా ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధిక బరువు ఉన్నవారిలో,   ముప్పై ఐదేళ్లు పైబడిన మహిళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు , అధిక రక్తపోటు..  గర్భనిరోధక మాత్రల వల్ల కొందరిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా చాలా ఏళ్ల పాటు వీటిని వాడటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ,  స్ట్రోక్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది. విటమిన్లు , ఖనిజాల లోపం..  ఈ మాత్రలు ఎక్కువ కాలం పాటు వాడటం వల్ల జీర్ణ వ్యవస్థలో పోషకాల శోషణ తగ్గుతుంది. ముఖ్యంగా విటమిన్ బి6, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి , మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల లోపం శరీరంలో ఏర్పడుతుంది. దీనివల్ల ఎప్పుడూ అలసట, నీరసం , రోగనిరోధక శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.  రొమ్ము నొప్పులు.. ఎక్కువ కాలం ఈ మాత్రల  వాడకం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పుల కారణంగా రొమ్ములో బరువుగా అనిపించడం, వాపు లేదా నొప్పి రావడం జరుగుతుంది. కాలేయం , పిత్తాశయ సమస్యలు.. మాత్రల రూపంలో తీసుకునే ఈ హార్మోన్లను కాలేయం జీర్ణం చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం వీటిని వాడటం వల్ల కాలేయ పనితీరుపై ప్రభావం పడి కాలేయ గడ్డలు ఏర్పడటం లేదా పిత్తాశయంలో రాళ్లు తయారయ్యే ప్రమాదం ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదం..  ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల గర్భాశయ ముఖద్వారం , రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు కొద్దిగా  పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే అదే సమయంలో ఇవి అండాశయ , గర్భాశయ క్యాన్సర్ల నుండి రక్షణ ఇస్తాయట. మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడే ముందు , వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. సొంత వైద్యం చేసుకోవద్దు. వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రారంభించాలి. ప్రతి కొన్ని నెలలకోసారి సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. కొందరు వైద్యులు కేవలం సమస్యను తగ్గించాలనే కారణంతో ఈ మాత్రలను ఎక్కువ నెలలు రికమెండ్ చేస్తూ ఉంటారు. అవగాహన లోపం వల్ల కంటిన్యు గా ఎక్కువ నెలలు ఈ మాత్రలు రికమెండ్ చేయడం లేదా వాడటం మంచిది కాదు. రక్తపోటు , కాలేయ పనితీరును తరచూ సరిచూసుకోవాలి. మాత్రలు వాడుతున్న సమయంలో తరచూ తలనొప్పి, కాళ్ల వాపు, తీవ్రమైన కడుపునొప్పి లేదా చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.                        *రూపశ్రీ.  
ఎక్కువగా తింటేనే కడుపు నిండినట్లు అనిపించడం అనేది ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. దీనివల్ల బరువు పెరగడం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనం ఎంత తింటున్నాం అనే దానికంటే, మన మెదడుకు కడుపు నిండిందనే సంకేతం ఎప్పుడు అందుతోంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి ముగింపు పలికి, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ఎలా అలవర్చుకోవాలి. ఎక్కువగా తింటేనే కడుపు నిండింది అని అనుకునే సమస్యకు ఎలా చెక్ పెట్టాలి? వివరంగా తెలుసుకుంటే.. ఎక్కువ తింటేనే కడుపు నిండిన ఫీలింగ్ ఎందుకు వస్తుంది? మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు కడుపు నిండింది అనే విషయాన్ని మెదడుకు చేరవేసేందుకు కొన్ని రకాల హార్మోన్లు పనిచేస్తాయి. అయితే కొన్ని తప్పుడు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.. ఆహారాన్ని వేగంగా తినడం.. త్వరత్వరగా ఆహారాన్ని మింగేయడం వల్ల కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరేలోపే మనం తినాల్సిన దానికంటే ఎక్కువ ఆహారాన్ని తినేస్తాం. సాధారణంగా కడుపు నిండిన భావన మెదడుకు చేరడానికి దాదాపు ఇరవై నిమిషాల సమయం పడుతుంది. ఆలోచనలు వేరే చోట ఉంచి తినడం..  టీవీ చూస్తూ, ఫోన్ వాడుతూ లేదా ఏదైనా పనిలో మునిగిపోయి తిన్నప్పుడు ఎంత తింటున్నామో గమనించలేం. దీనివల్ల సాధారణ పరిమాణంలో తిన్నా కడుపు నిండిన తృప్తి లభించదు. తక్కువ పీచు, ఎక్కువ ప్రాసెస్డ్ ఆహారం..  మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు తక్కువగా ఉండి, మైదా, షుగర్ వంటి ప్రాసెస్డ్ పదార్థాలు ఎక్కువగా ఉంటే అవి త్వరగా అరిగిపోతాయి. దీనివల్ల కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండదు. మానసిక ఒత్తిడి, నిద్రలేమి.. తీవ్రమైన ఒత్తిడి లేదా సరిపడా నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువై, కడుపు నిండినా ఇంకా తినాలనే భావన కలుగుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి పాటించాల్సిన మార్గాలు.. ఆహారాన్ని నమిలి నెమ్మదిగా తినడం.. ప్రతి ముద్దను బాగా నమిలి మింగడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా తినడం వల్ల మెదడుకు కడుపు నిండుతున్న సంకేతాలు సమయానికి అందుతాయి. దీనివల్ల తక్కువ ఆహారంతోనే పూర్తి తృప్తి లభిస్తుంది. మైండ్‌ఫుల్ ఈటింగ్ అలవాటు చేసుకోవడం..  తినే సమయంలో ఫోన్లు, టీవీలు, పుస్తకాలు పక్కన పెట్టాలి. ఆహారం రంగు, రుచి, సువాసనను ఆస్వాదిస్తూ ద్యాస అంతా తిండిపైనే ఉంచి తినాలి. ఇది అతిగా తినడాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటుంది. పీచు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం.. భోజనంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు , ప్రోటీన్ సమృద్ధిగా ఉండే పప్పుధాన్యాలు, గుడ్లు, పనీర్ వంటివి చేర్చుకోవాలి. ఇవి పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. భోజనానికి ముందు నీళ్లు తాగడం..  భోజనం చేయడానికి ఒక అరగంట ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సిద్ధమవ్వడమే కాకుండా, అతిగా తినే అలవాటు తగ్గుతుంది. అయితే తింటున్న సమయంలో లేదా తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగడం మంచిది కాదు. చిన్న ప్లేట్లు వాడడం..  పెద్ద ప్లేట్లలో ఆహారం తింటే తక్కువగా ఉన్నా ఖాళీగా కనిపిస్తుంది. అదే చిన్న ప్లేట్ వాడితే తక్కువ ఆహారమే ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది మానసికంగా త్వరగా తృప్తిని కలిగిస్తుంది. ఆకలికి, దాహానికి తేడా గుర్తించడం.. చాలాసార్లు శరీరానికి దాహం వేసినప్పుడు కూడా ఆకలి వేస్తున్నట్లే అనిపిస్తుంది. కాబట్టి ఆకలిగా అనిపించినప్పుడు ముందుగా ఒక గ్లాసు నీళ్లు తాగి కొన్ని నిమిషాలు వేచి చూడడం మంచిది. సరిపడా నిద్ర, ఒత్తిడి నిర్వహణ..  ప్రతిరోజూ ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలాగే యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటే ఆకలిని నియంత్రించే హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. చివరగా తెలుసుకోవాల్సింది.. ఎక్కువ తింటేనే కడుపు నిండుతుంది అనుకోవడం ఒక తప్పుడు జీవనశైలి అలవాటు మాత్రమే. కొద్దిరోజుల పాటు పైన పేర్కొన్న నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే, తక్కువగా,  సరైన పరిమాణంలో ఆహారం తీసుకుంటూనే కడుపు నిండిన అనుభూతిని పొందవచ్చు. ఇది కేవలం బరువును అదుపులో ఉంచడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరిచి రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.                          *రూపశ్రీ.