
రికార్డులని సైతం ఉలిక్కిపడేలా చేసిన సిరీస్. ధురంధర్. పైగా స్టిల్ ఈ సెకను ధురంధర్ రికార్డ్స్ లని చెప్పమంటే సినీ ప్రేమికులు గుక్క తిప్పుకోకుండా చెప్తారు. ఇప్పుడు ఆ అందరి కలెక్షన్ ల నాలెడ్జిలో కి 'హనుమాన్ అంశ్' వచ్చి చేరింది. దీంతో వాళ్లంతా 'జై హనుమాన్' అనే పరిస్థితి.
ఆగష్టు 7 న 'హనుమాన్ అంశ్' వరల్డ్ వైడ్ గా రిలీజయింది. అంటే ఇప్పటికి 6వ వారంలో. ఈ ఆరో వారమే ధురంధర్ రికార్డుకి ఎసరు పెట్టింది. 6వ వారంలో 64.87 కోట్ల రూపాయలు వసూలు చేసి, గతంలో 'ధురంధర్' సాధించిన 28.95 కోట్ల రికార్డుని ఘోరంగా బద్దలు కొట్టింది. మరి ముందు ముందు ఎన్ని రికార్డ్స్ హనుమాన్ అంశ్ అందుకుంటుందో చూడాలి. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎటువంటి భారీ అంచనాలు, పెద్ద నటీనటులు లేకుండా వచ్చి న 'హనుమాన్ అంశ్'. కేవలం ₹2 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి ఇప్పటికే ₹218.03 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించింది. అంతేకాకుండా, గ్లోబల్ వైడ్‌గా ఇది రికార్డు స్థాయిలో ₹300 కోట్ల మార్కుకు అతిచేరువలో నిలిచి ట్రేడ్ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది.

Also Read: పిల్లల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకున్న సూర్య.. పిక్స్ రిలీజ్ చేసిన జ్యోతిక
లక్ష్మణ్ నారాయణ్ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబాగా మారిన జీవిత ప్రయాణం ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రధాన పాత్రలో శోభినవ్ సత్య నటించిన ఈ సినిమా, ప్రచారానికి డబ్బులు లేకపోవడంతో ప్రారంభంలో ఉత్తరాదిలోని 8 ప్రదేశాల్లో సామూహిక అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వినూత్నంగా వార్తల్లో నిలిచింది. మొదటి రోజు కేవలం 10 లక్షల ఓపెనింగ్స్ రాబట్టి , తొలి వారంలో ₹1.08 కోట్లు, రెండో వారంలో 40 లక్షల వసూళ్లతో సాధారణంగా సాగింది. కానీ, మూడో వారం నుంచి మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో అనూహ్యంగా పుంజుకుని ఏకంగా 10.4 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చూపించిన విశ్వరూపం ఇండియన్ సినిమా చరిత్రలోనే నిలిచిపోతుంది. 22వ రోజు 6.25 కోట్లు, 23వ రోజు 9.25 కోట్లు, 24వ రోజు 12.75 కోట్లు దక్కించుకుని దండయాత్ర కొనసాగించింది. తెలుగులో ఈ నెల 18 న హనుమాన్ అంశగా రిలీజ్ కావాల్సి ఉండగా ఆగిపోయినట్టుగా టాక్ .
[Hanuman Ansh, Dhurandhar, Dhurandhar Box Office Record, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






