
ఆర్ఎక్స్ 100 తో తెలుగు ప్రేక్షకుల హార్ట్స్ లో హోల్ లాగా ఉండి పోయాడు కార్తికేయ. దీంతో తెలుగు పరిశ్రమకి కాబోయే యూత్ స్టార్ అనే టాగ్ లైన్ కూడా పొందాడు. కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ లని ఎంచుకునే ప్రాసెస్ లో రాంగ్ స్టెప్ వేయడంతో హిట్ అనేది కార్తికేయ తో నన్ను అందుకోలేవు అనే పరిస్థితి.
Also Read: 'వారణాసి'పై ప్రియాంక చోప్రా కీలక వ్యాఖ్యలు.. ఆ ఒక్క మాట మాట్లాడకుండా ఉండి ఉంటే

అందుకే ఇప్పుడు హిట్ కి సవాలు విసురుతు హీరోగానే కాకుండా దర్శక నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. 'కార్తికేయ క్రియేటివ్ వర్క్స్' (Kartikeya Creative Works) పేరుతో ఒక నూతన ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించి, కేవలం సినిమాలు నిర్మించడమే కాకుండా, స్వయంగా మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించడానికి కూడా కార్తికేయ సిద్దమవుతున్నాడు. ఒక నటుడు స్వయంగా దర్శకుడిగా, నిర్మాతగా మారి తన కథా దృక్పథాన్ని పూర్తి స్వేచ్ఛతో తెరకెక్కించడం టాలీవుడ్‌లో ఎంతో అరుదైన విషయం.
కొత్త రకం కథలను, పరిశ్రమలోకి వచ్చే నూతన ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, తన మార్క్ మేకింగ్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనేది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.ఈ నూతన ప్రొడక్షన్ హౌస్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా, చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల నుంచి మరియు అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువను అందుకుంటోంది. మరో ఈ డేరింగ్ స్టెప్ తో అయినా పరాజయం కార్తికేయ ముఖాన్ని చూడటానికి ఇష్టపడదేమో చూడాలి.
karthikeya, Karthikeya Creative Works, karthikeya Directorial Debut , RX 100 Hero, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News





