Home

»

Latest News

షాక్ ఇచ్చిన ఐబొమ్మ రవి: నాంపల్లి కోర్టులో 3 కోట్ల పిటిషన్: వాళ్ళకి రోల్ మోడల్!

Sep 16, 2026 6:10PM

 

 

సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు' ఐబొమ్మ రవి'. ముఖ్యంగా పైరసీ ప్రేమికులైతే రవిని రోల్ మోడల్ గా తీసుకుంటారు. తాజాగా రవి మరోసారి న్యాయస్థానం మెట్లు ఎక్కి పలు సంచలన వ్యాఖ్యలు చేసాడు

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, తన కుటుంబ పోషణతో పాటు రోజువారీ నిత్యవసరాలు, మెడికల్ ఖర్చులు భరించడం కూడా కష్టంగా మారిందని పేర్కొంటూ హైదరాబాద్ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. సినీ పైరసీ, డేటా దొంగతనం, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వంటి తీవ్ర ఆరోపణలతో ఇమంది రవిపై మొత్తం 5 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.  సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇమంది రవికి చెందిన వివిధ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయగా, అందులో దాదాపు 3 కోట్ల మేర నిధులు నిలిచిపోయాయి. తన అకౌంట్లను పూర్తిగా ఫ్రీజ్ చేయడంతో చేతిలో డబ్బులు లేక తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నానని, కనీసం కుటుంబ అత్యవసరాల దృష్ట్యా ఆ రూ.3 కోట్ల నిధులలో కొన్ని అకౌంట్లనైనా లేదా కొంత మొత్తాన్ని అయినా అన్‌ఫ్రీజ్ చేసి వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు

Also Read: మీనా పిక్స్ వైరల్: బర్త్ డే రోజున కావాలనే రిలీజ్ చేసిన ఆ హీరోయిన్ ఎవరు!

విశాఖపట్నం నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి డిజిటల్ నెట్‌వర్క్‌లో అడుగుపెట్టిన రవి, ఆ తర్వాత విదేశాల్లో ఉంటూ ఐబొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ వెబ్‌సైట్లతో పాటు బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లకు ట్రాఫిక్ మళ్లించి కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, సుదీర్ఘ దర్యాప్తు అనంతరం చంచల్‌గూడ జైలులో దాదాపు 90 రోజులకు పైగా రిమాండ్‌లో ఉన్న రవికి 2026 ఫిబ్రవరి 17న తెలంగాణ హైకోర్టు రూ.25,000 సూచీలు, పాస్‌పోర్ట్ సమర్పణ, ఇంటర్నెట్ వినియోగంపై పరిమితులతో బెయిల్ మంజూరు చేసింది.  బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ, పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంక్ డిపాజిట్లు ఇంకా సీజ్ అయి ఉండటంతో కుటుంబ నిర్వహణ భారంగా మారిందని రవి పిటిషన్‌లో స్పష్టం చేశారు. గతంలో విలాసవంతమైన జీవితం గడిపిన వ్యక్తి ఇప్పుడు రోజువారీ వైద్య ఖర్చులకూ నిధులు లేవని విన్నవించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో, టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రవి సమర్పించిన ఈ అన్‌ఫ్రీజింగ్ పిటిషన్‌పై నాంపల్లి క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టి ఏ నిర్ణయం ప్రకటిస్తుందోనని తీవ్ర ఆసక్తి నెలకొంది. 

 

 

 


[ I Bomma Ravi, Nampally  Court, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com