Home

»

Latest News

'మహారాజ' హాలీవుడ్‌ రీమేక్: హీరోగా ఆస్కార్ విన్నర్.. కోలీవుడ్‌ హిస్టరీలో ఫస్ట్ టైమ్.!

Sep 16, 2026 4:41PM

సాధారణంగా హాలీవుడ్ హిట్స్ మన దగ్గర రీమేక్ అవ్వడం చూస్తుంటాం. కానీ, మన ఇండియన్ సినిమాను, అందులోనూ ఒక తమిళ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘మహారాజ’ మూవీ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌లో రీమేక్ కాబోతోంది.

నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి 50వ చిత్రంగా వచ్చిన ‘మహారాజ’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో, మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్టులతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను అలరించింది. విజయ్ సేతుపతి నటన, ఆయన పండించిన ఎమోషన్స్ ఈ సినిమాను కేవలం తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా, ఏకంగా చైనా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయంగా నిలబెట్టాయి. ఈ సినిమా సాధించిన సక్సెస్ విజయ్ సేతుపతి కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఇన్నాళ్లూ ఈ సినిమా హాలీవుడ్ రీమేక్‌పై అనేక రకాల వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ, తాజాగా ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ప్యాషన్ స్టూడియోస్’ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో వార్త నిజమని తేలిపోయింది. హాలీవుడ్‌లో రీమేక్ కాబోతున్న మొట్టమొదటి తమిళ సినిమాగా ‘మహారాజ’ చరిత్ర సృష్టించిందని వారు అధికారికంగా వెల్లడించారు. ఒక రీజనల్ సినిమా కాన్సెప్ట్ ప్రపంచ సినిమా రాజధాని అయిన హాలీవుడ్‌ను సైతం ఆకర్షించిందంటే ఆ స్క్రిప్ట్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ హాలీవుడ్ రీమేక్‌కి సంబంధించిన మరో సంచలన వార్త ఏంటంటే.. ఈ సినిమాలో హీరోగా హాలీవుడ్ స్టార్, ఆస్కార్ అవార్డ్ విజేత మాథ్యూ మెక్‌కానాగే నటించబోతున్నారనే టాక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. 'ఇంటర్‌స్టెల్లార్', 'డల్లాస్ బయ్యర్స్ క్లబ్' లాంటి ఎపిక్ చిత్రాలతో మెప్పించిన ఆస్కార్ విన్నర్ మాథ్యూ గనక ఈ రోల్ చేస్తే, ఈ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళడం ఖాయం.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను త్వరలోనే హాలీవుడ్ మేకర్స్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

 

 

 

[Maharaja Hollywood Remake, Vijay Sethupathi Maharaja, Matthew McConaughey Maharaja, Maharaja Movie, Nithilan Saminathan, Vijay Sethupath, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com