
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఒక ఊహించని సంచలనం పేలింది. ధరణి పోర్టల్ వేదికగా జరిగిన అక్రమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక విక్టిమ్ అంటూ అసెంబ్లీ వేదికగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ధరణి పోర్టల్ అక్రమాలపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ని అడ్డం పెట్టుకుని అనేక భూమి రికార్డులను ఇష్టారాజ్యంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూములకు సైతం దొంగ పట్టాలు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే ఆయన ప్రస్తావించిన ఒక పాయింట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ధరణి అక్రమాలకు హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక 'బాధితుడు' (విక్టిమ్) గా మారారని నవీన్ యాదవ్ తెలిపారు. దాదాపు 150 ఎకరాల ప్రభుత్వ భూమి రికార్డులు మార్చి.. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మరికొందరికి ఆ భూమిని మోసపూరితంగా అమ్మేశారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, ధరణి పోర్టల్‌లో జరిగిన ప్రతీ ఒక్క అక్రమాన్ని బయటకు తీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ శాసనసభలో డిమాండ్ చేశారు.
[Jr NTR Dharani Victim, Jr NTR Dharani Issue, Jr NTR Land Dispute, Jr NTR Naveen Yadav, Telangana Assembly, MLA Naveen Yadav, NTR Property, Jr NTR Latest News, Telugu News]





