TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్‌ను వీడేది లేదు.. గెలిచే వారికే టికెట్లు : కొండా మురళి

Published on: Sun Sep 13, 2026 3:16PM

మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు. కొండా కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు.“కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు” అని కొండా మురళి స్పష్టం చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. కొండా సురేఖకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలు ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

“కొండాను ఢీకొట్టడం ఈ గొర్రెల వల్ల కాదు” అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని గొర్రెలు, గుంటనక్కలు అన్నీ ఒక్కటై కొండాను ఢీకొట్టాలని చూస్తున్నాయని, అయితే అది సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా కార్యక ర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “పులి.. పులి.. పులి.. బెబ్బులి.. కొండా మురళి వేట పులి” అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొండా కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కార్యకర్తలు తెలిపారు. “మీరు నక్సల్స్‌లోకి వెళ్తే.. మీతోనే నక్సల్స్‌లోకి వస్తాం” అంటూ కొండా మురళికి, కొండా సురేఖకు అభయం ఇచ్చారు. కొండా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. తాజా పరిణా మాలతో స్థానికంగా కొండా వర్గం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.

 

 

 

[ Konda Murali, Konda Surekha, Congress party, Warangal, CM Revanth reddy, Konda sushmitha, Telugu One, Telugu News]