LATEST NEWS
కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు కోటి నజరానా.! దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాక్‌పిట్‌లో ఉన్న గొడ్డలితో కో-పైలట్ పైలట్‌పై దాడి చేసినట్లు యూఏఈ ప్రాసిక్యూటర్లు శనివారం అధికారికంగా నిర్ధారించారు.విమానం కాక్‌పిట్‌లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ‘క్రాష్ యాక్స్’తోనే ఈ దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు.  ఈ ఘటనతో విమాన భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం.. అత్యవసర పరిస్థితుల్లో విమానం నుంచి బయటపడేందుకు వీలుగా ప్రతి వాణిజ్య విమానంలోనూ క్రాష్ యాక్స్‌ను తప్పనిసరిగా ఉంచుతారు. అయితే, 9/11 ఉగ్రదాడుల తర్వాత భద్రతా కారణాలతో ఈ గొడ్డళ్లను ప్రయాణికుల క్యాబిన్‌ల నుంచి కాక్‌పిట్‌కు తరలించారు.ఇప్పుడు ప్రయాణికుల భద్రత కోసం కాక్‌పిట్‌లో ఉంచిన అదే అత్యవసర పరికరం.. పైలట్‌పై దాడికి ఆయుధంగా మారడం విమానయాన భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు భారీ నజరానా లభించింది. ఆయన ధైర్యసాహసాలను గుర్తించిన మ్యాన్‌కైండ్‌ ఫార్మా రూ.కోటి ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కెప్టెన్‌ మచ్చర్‌, ఆయన కుటుంబానికి ఈ మొత్తాన్ని అందించనున్నట్లు సంస్థ శనివారం వెల్లడించింది. సెప్టెంబర్‌ 30న దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ FZ1073 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో 174 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 27 మంది చిన్నారులు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. విమానం గాల్లో ఉండగా కాక్‌పిట్‌లో కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌పై సహ పైలట్‌ కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.  ఈ దాడిలో మచ్చర్‌ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో విమానం వేగంగా కిందకు దిగడం ప్రారంభించింది. దాదాపు 14 వేల అడుగుల మేర విమానం కేవలం కొన్ని సెకన్లలోనే దిగిపోయినట్లు రాయిటర్స్‌ నివేదించింది. తీవ్రంగా గాయపడి కాక్‌పిట్‌లో నేలపై పడిపోయినప్పటికీ కెప్టెన్‌ మచ్చర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాక్‌పిట్‌ తలుపును తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలో ఉన్న మరో ఇద్దరు ఫ్లైదుబాయ్‌ పైలట్లు విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని సౌదీ అరేబియాలోని తబూక్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానంలోని 174 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.  ఈ ఘటనలో తన ప్రాణాల కోసం పోరాడుతూనే ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు మచ్చర్‌ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనతో మాట్లాడి ధైర్యసాహసాలను అభినందించారు. ఆసుపత్రి నుంచి మోదీతో మాట్లాడిన సందర్భంగా మచ్చర్‌ తన అనుభవాన్ని వివరించారు. కెప్టెన్‌ మచ్చర్‌ సాహసాన్ని గుర్తించిన మ్యాన్‌కైండ్‌ ఫార్మా వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ జూనేజా ఆయనకు లేఖ రాశారు. “మీరు చూపిన అసాధారణ ధైర్యం, సంయమనం, బాధ్యతాభావం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని తాకింది” అంటూ ప్రశంసించారు.  ప్రాణాల విలువతో ఏ నగదు బహుమతినీ పోల్చలేమని, రూ.కోటి సాయం కేవలం తమ గౌరవం, కృతజ్ఞతలకు ప్రతీక మాత్రమేనని సంస్థ పేర్కొంది.ఇదిలా ఉండగా, కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు జాతీయ స్థాయి ధైర్య పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఆయన సాహసాన్ని గుర్తించి అత్యున్నత ధైర్య పురస్కారానికి పరిగణించాలని రాజ్యసభ సభ్యుడు మిలింద్‌ దేవరా ప్రధాని మోదీకి లేఖ రాశారు.విమానం కూలిపోయే ప్రమాదం నెలకొన్న అత్యంత క్లిష్ట సమయంలో తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్‌ తలుపు తెరిచి ప్రయాణికులకు లోపలికి వచ్చే అవకాశం కల్పించడం ద్వారా మచ్చర్‌ కీలక పాత్ర పోషించారు. కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యానికి గుర్తింపుగా మ్యాన్‌కైండ్‌ ఫార్మా ప్రకటించిన రూ.కోటి నజరానా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.     [ Captain Smith Match, Flydubai incident, Flydubai FZ1073 flight,  Nina Maneesh, Flydubai news in Telugu, cockpit incident, TeluguOne news, aviation safety, flight emergency news, Hamam Al Hamami, Crash axe attack, UAE aviation safety, Cockpit assault, Telugu News]  
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు విస్తరించిన ఈ డిజిటల్ లావాదేవీలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రాబోతున్నాయి. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, కొన్ని ప్రత్యేక లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను వర్తింపజేయనున్నారు.తాజా మార్పుల ప్రకారం, రూ.2,000 మించిన డిజిటల్ చెల్లింపులపై 0.4 శాతం మేర ఎండీఆర్ ఛార్జీలు పడనున్నాయి. అయితే ఈ నిర్ణయం వ్యాపార వర్గాల్లో భిన్నమైన స్పందనలకు దారితీస్తోంది. ఛార్జీల భారాన్ని తప్పించుకునేందుకు వ్యాపారులు మళ్లీ నగదు లావాదేవీలవైపే మొగ్గు చూపుతారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అప్రమత్తమైంది. అక్టోబర్ 15 తర్వాత మార్కెట్‌లో నగదు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉండటంతో, దేశంలోని అన్ని ఏటీఎంలలోనూ తగినంత కరెన్సీ నిల్వలు ఉండేలా చూడాలని బ్యాంకులను ఆదేశించింది. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.అయితే సామాన్య వినియోగదారులకు మాత్రం ప్రభుత్వం ఊరటనిచ్చింది. స్నేహితులు, బంధువుల మధ్య జరిపే వ్యక్తిగత (P2P) యూపీఐ లావాదేవీలు యథావిధిగా పూర్తిగా ఉచితం. ఎంత మొత్తం బదిలీ చేసినా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోరని స్పష్టం చేశారు. కేవలం రిజిస్టర్డ్ వ్యాపారులకు (Merchants) చేసే రూ.2,000 పైబడిన చెల్లింపులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ రుసుములను నేరుగా వ్యాపారి బ్యాంక్ ఖాతా నుంచే మినహాయించుకుంటారు తప్ప, కస్టమర్లపై ఎలాంటి ప్రత్యక్ష భారం ఉండదని అధికారులు వెల్లడించారు. మరోవైపు, కొన్ని కీలక రంగాలకు ఈ ఛార్జీల నుంచి మినహాయింపు లభించింది. రైల్వే టికెట్ల బుకింగ్స్, టెలికాం బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, పెట్రోల్, డీజిల్ కొనుగోళ్ల వంటి సేవలకు రూ.2,000 దాటినా వ్యాపారికి కేవలం రూ.5 మాత్రమే స్థిర ఛార్జీగా వర్తిస్తుంది.డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడమే ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ, చిన్న వ్యాపారులు ఏ విధంగా స్పందిస్తారనేది మార్కెట్‌లో ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 15 తర్వాత దేశ ఆర్థిక లావాదేవీలు ఏ మలుపు తిరుగుతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.       [ UPI Rules October 15 2026, MDR Charges on UPI, Digital Payments India, RBI ATM Cash Rules,UPI Transaction Charges, Merchants, RBI, MDR charges ]  
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంధన రంగ అవసరాల కోసం మొక్కజొన్నను భారీగా మళ్లిస్తుండటంతో పౌల్ట్రీ రంగం సంక్షోభంలో పడింది. దీనివల్ల రాబోయే రోజుల్లో కోడిగుడ్లు, చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో తయారవుతున్న ఇథనాల్‌లో ముప్పాతిక భాగం ధాన్యాల నుంచే వస్తోంది. ముఖ్యంగా మొక్కజొన్నను ఇథనాల్‌ తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు.  రికార్డు స్థాయిలో మొక్కజొన్న దిగుబడి వస్తున్నప్పటికీ, ఇంధన పరిశ్రమల నుంచి డిమాండ్ విపరీతంగా పెరగడం మార్కెట్‌లో తీవ్ర కొరతకు దారితీస్తోంది. మరోవైపు కోళ్ల దాణాలో మొక్కజొన్న అత్యంత కీలకమైన ముడిసరుకు. దాణా తయారీ ఖర్చులో దాదాపు 60 శాతం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఇథనాల్‌ డిస్టిలరీలు పెద్దఎత్తున మొక్కజొన్నను కొనుగోలు చేస్తుండటంతో పౌల్ట్రీ రైతులు తక్కువ ధరకు దాణా పొందలేక తలలు పట్టుకుంటున్నారు. గత ఐదేళ్ల కాలంతో పోలిస్తే మొక్కజొన్న ధరలు మార్కెట్‌లో భారీగా ఎగబాకాయి.  ఫలితంగా ఒక కోడిగుడ్డును ఉత్పత్తి చేయడానికి రైతు భరించే ఖర్చు గణనీయంగా పెరిగింది. గతంలో ఐదు రూపాయలకు దొరికిన గుడ్డు ఇప్పుడు మార్కెట్‌లో ఎనిమిది నుంచి పది రూపాయల వరకు పలుకుతోంది. పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటున్న ఈ కష్టాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న సాగును పెంచేందుకు ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు. లేదంటే ఈ ధరల పెరుగుదల భారం చివరికి పూర్తిగా వినియోగదారులపైనే పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇథనాల్‌ మిశ్రమం ద్వారా ఇంధన దిగుమతులు తగ్గుతున్నప్పటికీ, మరోవైపు ఆహార భద్రత వ్యవసాయ పంటల మార్పిడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. డిస్టిలరీల లాభాల కోసం సామాన్య ప్రజల నిత్యావసరాలు భారం కావడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. వర్షాభావ పరిస్థితులు మరియు దిగుబడి తగ్గే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే శీతాకాలంలో చికెన్, గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అణచివేయడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, లేదంటే పౌల్ట్రీ రంగం పూర్తిగా కుదేలయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.       [ Chicken and egg prices hike, ethanol blending policy impact, maize shortage poultry feed, TeluguOne News business, 2026 food inflation India, Egg price hike, Corn prices India, Poultry feed cost, Poultry industry India, Ethanol production corn demand ]
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత జిల్లాలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత మనుషులే ఆయనకు, ఆయన పెద్ద దిక్కుగా ఉన్న పార్టీకీ దూరం అవుతున్నారు. ఆయన సొంత మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఇది జిల్లాలో పార్టీకే కాకుండా, వ్యక్తిగతంగా కూడా బొత్స సత్యనారాయణకు గట్టి ఎదురు దెబ్బే కాకుండా పూడ్చలేని నష్టం కూడా. అయితే ఆ తరువాత కూడా జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.  తాజాగా  మాజీ ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ.. వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు.  పార్టీ అధిష్టానం తనపై వేసిన సస్పెన్షన్ వేటుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన విస్పష్టంగా ప్రకటించారు.  సొంత పార్టీ నేతల వైఖరి, నాయకత్వ సరళిపై విమర్శలు గుప్పించిన ఆయన త్వరలో తన కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా.. నేతలు పార్టీ వీడిన తరువాత, సమావేశాలు ఏర్పాటు చేసో, అసంతృప్తులను పలిపించుకునో బుజ్జగింపు చర్యలకు దిగుతుంది. పార్టీ నుంరచి వలసలు పెరగకుండా నివారణ చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా వైసీపీలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు.  మజ్జి పార్టీకి రాజీనామా చేసిన తరువాత జరిగిన విజయనగరం జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది, ఇప్పుుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు.. అప్పుడు నాడు జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తాను వైపీలోనే కొనసాగుతానని ప్రకటించారు.  అలా ఆయన ప్రకటించిన రోజు రాత్రే పార్టీ హైకమాండ్ ఆయనను నెల్లమర్ల నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతల నుంచి తొలగించింది.  దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనను పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫారసుల మేరకు అంటూ  పార్టీ నుంచే సస్పెండ్ చేసింది.     స్పెన్షన్ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే బడ్డుకొండ అప్పలనాయుడు విజయనగరంలో తన అనుచరులు, అభిమానులతో సమావేశం నిర్వహించి, పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను, అవమానాలను వారికి వివరించారు. గౌరవం లేని చోట తాను, తన అనుచరులు కొనసాగలేమని స్పష్టం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు  ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్‌పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. జగన్ వైసీపీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడుపుతున్నారని దుయ్యబట్టారు. ఆయన నియంతృత్వ పోకడల కారణంగానే ప్రజాగ్రహానికి గురై గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు.  మజ్జి శ్రీను తనకు బావ అవుతారన్న ఒకే ఒక్క కారణంతో తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా చర్యలు తీసుకున్నారని విమర్శించారు. అదే రీతిలో పరిశీలిస్తే మజ్జి శ్రీనుకి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా బంధువు అవుతారని, ధైర్యం ఉంటే ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలనీ సవాల్ విసిరారు.   [YCP Vizianagaram Crisis, Baddukonda Appalanaidu Resignation, Nellimarla Former MLA YCP, Vizianagaram Politics, Botsa Satyanarayana, Telugu One]
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఘాట్‌రోడ్డుపై బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో యాభై మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని కేసారం గ్రామం నుంచి సుమారు 54 మంది ప్రయాణికులతో ఒక ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం చింతకుంట గ్రామంలో జరగాల్సిన ఒక అంత్యక్రియల కార్యక్రమానికి బంధువులు ఈ బస్సులో ప్రయాణమవుతున్నారు. ఆనందంగా సాగాల్సిన ప్రయాణం కొద్దిసేపట్లోనే విషాదంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. అనంతగిరి ఘాట్‌రోడ్డులోని కనువలు, నిటారుగా ఉన్న డౌన్‌హిల్ ప్రాంతంలో బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘాట్‌రోడ్డులో కిందకు దిగుతున్న తరుణంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా అదుపుతప్పిన వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.ఈ ప్రమాద తీవ్రతకు బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు వేశారు. బస్సు కింద, సీట్ల మధ్య చిక్కుకుని కొందరు తీవ్రంగా నలిగిపోయారు. స్థానికులు, ప్రయాణికులుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యల్లోకి దిగారు. ప్రమాద స్థలంలో క్షతగాత్రుల ఆర్తనాదాలు కలచివేశాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్‌‌లు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. స్థానికుల సహాయంతో తీవ్రంగా గాయపడిన వారిని అత్యవసర వాహనాల్లో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే బీఆర్ఎస్ నేతలు సైతం ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని కోరారు.ఘాట్‌రోడ్డుల వంటి ప్రమాదకర ప్రాంతాల్లో డ్రైవర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఓవర్‌స్పీడ్ మరియు నిబంధనల ఉల్లంఘనలపై రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.       [ Ananthagiri Ghat Road bus accident, Vikarabad bus overturn news, Private travels bus accident Telangana, CM Revanth reddy, Telangana police, Telugu News, Telugu One ]  
ALSO ON TELUGUONE N E W S
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే, ఆ న్యూస్ సృష్టించబోయే రికార్డు తాలూకు వ్యూస్ ని గుర్తు చేస్తూ  'ఆరా' అనేది ముందుగానే మనకి హింట్ ఇస్తూనే ఉంటుంది. సేమ్ ఇప్పడు కూడా అదే పరిస్థితి.     పెద్ది సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌‌గా నిలిచింది. థియేటర్లు మరియు డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డు వ్యూస్‌ సాధించిన పెద్ది, ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.శాటిలైట్ హక్కులని  ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ జీ తెలుగు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆ సంస్థ  పెద్ది వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ అక్టోబర్ 11న సాయంత్రం 5:30 గంటలకు ‘ప్రసారం కానున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇది కూడా చదవండి: Drishyam 3: దృశ్యం 3 ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్: వీకెండ్ కి పెను తుఫాను తప్పదా!    దీంతో థియేటర్లలో, ఓటీటీలో  వీక్షించిన ప్రేక్షకులు మరోసారి టీవీలో చూసే అవకాశం లభించనుంది. అదే టైంలో పెద్ది టెలివిజన్ కి సంబంధించి టిఆర్ పి రేటింగ్స్ లో తన  హవా ఏ మేర చాటుతాడో చూడాలి.   [Ram Charan Latest News, Peddi World Television Premiere, Ram Charan Peddi TV Premiere Date, Peddi Telecast Channel Sony MAX, Peddi ZEE Telugu Telecast, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]      
  ఇండియన్ సినిమా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. వివాదాస్పద జ్యోతిష్యుడుగా పిలవబడుతున్న వేణుస్వామి.. ఈ ఇద్దరి పేర్లు పక్కన, పక్కన ప్రచురించాల్సి వస్తుందని ఏ సినీ సైటు అనుకోని ఉండదు.  కానీ చాలా గట్టిగానే ప్రచురించాల్సి వచ్చింది.  వేణుస్వామి సల్మాన్ ఖాన్ తమ్ముడికి ఫోన్ చేసి, సెప్టెంబర్ తర్వాతి కాలంలో సల్మాన్ కి  తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయని, శరీరంపై రాచపుండు లేదా దారుణమైన రుగ్మతలు వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరించాడు. దీంతో  సల్మాన్ తమ్ముడు వెనుస్వామితో ఐ విల్ టేక్ కేర్ అన్నాడు.  ఈ విషయాన్ని  వేణుస్వామినే ఒక మీడియా సమావేశంలో చెప్పాడు.  ఇది కూడా చదవండి: ఇరుముడిపై పరుచూరి బ్రదర్స్ వ్యాఖ్యలు వైరల్: గురుస్వామి రోల్ ముగింపు అలా!   దీంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు వేణు స్వామి చెప్పింది నిజామా, కాదా అనే ఆలోచనలో పడ్డారు. సల్మాన్ మాత్రం  'మాతృభూమి', వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలతో పాటు బిగ్ బాస్ సీజన్ 20 తో బిజీగా ఉన్నాడు.   [Venu Swamy About Salman Khan Health, venu swamy About Salman, Salman Khan health update, Venu Swamy astrology, Venu Swamy Salman Khan predictions,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]       
మాటలకి రిపీట్ ఆడియెన్స్ వస్తారని, వీరాభిమానులు సైతం పుట్టుకొస్తారని నిరూపించిన మాటల శిఖరం 'పరుచూరి బ్రదర్స్' లో ఒకరు పరుచూరి గోపాల కృష్ణ. సెల్యులాయిడ్ పై మాటలు పరుచూరి బ్రదర్స్ అని పడగానే విజిల్స్ కూడా మోగుతాయంటే క్రేజ్ తాలూకు  రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.పరుచూరి పలుకులు పేరుతో ఎప్పట్నుంచో సినీ విశ్లేషణలు చేస్తూ ఎంతో మంది సినీ ఆ శా కిరణాలకి సినీ రచనా భీష్మాచార్యుడుగా ఉన్నారు. రీసెంట్ గా ఇరుముడిపై మాట్లాడుతు 'సినిమా అంటే 'ఇరుముడి'లాగే ఉండాలి.  రవితేజ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఈ చిత్రం ఒక మైలురాయిగా  నిలిచిపోతుంది.తండ్రీకూతుళ్ల గాఢమైన బంధం తన డ్రీమ్ ప్రాజెక్ట్, కెరీర్ క్లాసిక్ 'సర్పయాగం' సినిమా జ్ఞాపకాలని  గుర్తుచేసింది. గురుస్వామి క్యారక్టర్ ముగింపుని మరింత ప్రభావంతంగా మలచి ఉంటే బాగుండేది. ఎందుకంటే  సాయికుమార్ పోషించిన గురుస్వామి రోల్ భక్తి, ప్రవృత్తికి ప్రతీక కాబట్టి ఆ చేతుల మీదుగా జరిగే పాపాన్ని మరింత నాటకీయంగా ఆత్మహత్య వంటి ముగింపుతో చూపిస్తే ఔచిత్యం దక్కుండేది.  అలాగే అజయ్ ఘోష్ క్యారక్టర్ లో వచ్చిన మార్పు ఇంకాస్త బలంగా చూపించడంతో పాటు చట్టపరంగా జైలు శిక్ష అనుభవించి వచ్చినట్లు చూపిస్తే న్యాయం మరింత స్పష్టంగా కనిపించేది .అలాగే క్లైమాక్స్ సన్నివేశాలలో హీరోకి కనిపించే మణెమ్మ రూపం సీన్‌ని కేవలం ఒక భావోద్వేగ భ్రమలా మాత్రమే చూపిస్తే కథనం ప్రేక్షకులకి ఇంకా బలంగా హత్తుకునేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గంజాయి ముఠాలు, పాఠశాల విద్యార్థులను వేధించే ఆకతాయిల చుట్టూ కథను తిప్పుతూ, తెరవెనుక అసలైన విలన్‌ను చివరి నిమిషం వరకూ దాచిపెట్టిన స్క్రీన్‌ప్లే నేర్పుని  దాసరి నారాయణరావు వంటి దర్శక దిగ్గజాలు చేసారు.  ఇది కూడా చదవండి: మాళవిక మోహన్ ఆసక్తికర ట్వీట్: అతను ఎంతో ప్రత్యేకం     చిత్ర పరిశ్రమలో సినిమా నిర్మాణం అనేది కేవలం ఒక వ్యాపార ప్రయోగం మాత్రమే కాదని, ఎంతోమంది కష్టంతో కూడుకున్న భారీ ఆర్థిక వ్యవహారమని పరుచూరి చెప్పుకొచ్చారు.     [Paruchuri Gopala Krishna About Irumudi, Paruchuri Gopala Krishna, Ravi Teja Irumudi, Irumudi Box Office Collections, Shiva Nirvana Irumudi, Paruchuri Palukulu,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]      
సినీ ప్రేమికుల హార్ట్ బీట్ లో ఒకరిగా మారింది మాళవిక మోహనన్. రాజాసాబ్ తో ఆకట్టుకున్న ఈ భామ రీసెంట్ గా 'సర్దార్ 2 'లో ప్రాధాన్యత గల క్యారక్టర్ తో మెప్పించింది. ప్రస్తుతం విజయ్‌ సేతుపతితో ‘పాకెట్‌ నోవెల్‌’ చేసి ఫలితం కోసం ఎదురుచూస్తూ ఉంది.  మాళవిక మోహనన్ రీసెంట్ గా 'ఎక్స్' వేదికగా' విజయ్ సేతుపతితో పనిచేయడం నా జీవితంలో అత్యంత మరపురాని, అందమైన అనుభవం. సెట్స్‌లో ఆయన చూపించిన ఆప్యాయత, తోటి నటీనటులకి  ఇచ్చే గౌరవం, ప్రతీ సన్నివేశంలో అందించే ప్రోత్సాహం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా "ఆయన అత్యంత శ్రద్ధ కలిగిన, ఉదార మనస్కుడు. ఆయన కాకుండా ఈ ప్రయాణాన్ని మరొకరితో ఊహించుకోలేను. ఇది కూడా చదవండి:  ప్రకాష్ రాజ్ సంచలన పిలుపు      షూటింగ్‌ అనేది కేవలం కెమెరా ముందు నటించడం మాత్రమే కాదు. ఒక బృందంతో కలిసి నెలల తరబడి ప్రయాణించడం, వారితో ఎన్నో అనుభవాలని పంచుకోవడం కూడా అందులో భాగమే. కొన్ని సినిమాలు చేస్తున్న సమయంలో ఆ చిత్ర బృందమే ఒక ప్రత్యేకమైన ప్రపంచంలా మారిపోతుంది.  పాకెట్‌ నోవెల్‌ కూడా నాకు అలాంటి అనుభూతినే ఇచ్చిందని చెప్పింది.    [Malavika Mohanan Comments On Vijay Sethupathi, Malavika Mohanan Latest Tweet, Vijay Sethupathi, Pocket Novel, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]              
కన్నడ చిత్రసీమలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమా విడుదలై నాలుగేళ్లు పూర్తయ్యాయి. 2022 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రిషబ్ శెట్టి కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. నాలుగో వార్షికోత్సవం సందర్భంగా రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు పెట్టారు. అయితే ఆ పోస్టులో హోంబలే ఫిల్మ్స్ పేరును ప్రస్తావించకపోవడం, అదే సమయంలో నిర్మాణ సంస్థ కూడా తన పోస్టులో రిషబ్ శెట్టి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ‘కాంతార’ విజయానికి రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్ భాగస్వామ్యం కీలకంగా ఉంది. విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించిన ఈ సినిమాకు రిషబ్ శెట్టి కథ, దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. సినిమా విడుదల తర్వాత దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు పలు సినీ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రానికి రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించగా, ‘కాంతార’కు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డు దక్కింది. అయితే ఇప్పుడు నాలుగేళ్ల వార్షికోత్సవం సందర్భంగా వచ్చిన పోస్టుల్లో ఒకరి పేరును మరొకరు ప్రస్తావించకపోవడంతో రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్ మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా? అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. రిషబ్ శెట్టి తన పోస్టులో ‘కాంతార’తో తనకున్న అనుబంధాన్ని, ప్రేక్షకులు అందించిన ప్రేమను గుర్తుచేసుకుంటూ.. ఈ సినిమా తనకు కేవలం ఒక చిత్రం కాదని, తాను జీవించిన ప్రపంచమని పేర్కొన్నారు. తనతో కలిసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అయితే హోంబలే ఫిల్మ్స్ ప్రస్తావన మాత్రం కనిపించలేదు. ఇక హోంబలే ఫిల్మ్స్ కూడా ‘కాంతార’ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే ఆ పోస్టులోనూ రిషబ్ శెట్టి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం గమనార్హంగా మారింది. దీంతో గతంలో ఈ సినిమా కోసం కలిసి పనిచేసిన టీమ్‌లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందన్న దానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్ మధ్య విభేదాలు ఉన్నాయని అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కేవలం వార్షికోత్సవ పోస్టుల్లో ఒకరి పేరును మరొకరు ప్రస్తావించకపోవడం ఆధారంగా సోషల్ మీడియాలో ఈ చర్చ మొదలైంది.     [Kantara Movie Anniversary, Rishab Shetty Kantara, Hombale Films Kantara, Rishab Shetty Hombale Films, Kantara 4th Anniversary, Kantara Movie News, Rishab Shetty Latest News, Hombale Films Latest News, Kantara Controversy, Kantara Anniversary Post, Rishab Shetty Social Media Post]
2017 నుంచి 2024 వరకు నిలిచిపోయిన నంది ఫిల్మ్ అవార్డులను పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ఏపీ స్టేట్ ఫిల్మ్, టీవీ & థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పి. భరత్ భూషణ్, మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్‌లకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల 2026 సెప్టెంబర్ 24న ఏపీ ఎఫ్‌డీసీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించిన లేఖలోని అభ్యర్థనలను పరిశీలించి.. గోల్డెన్ నంది, సిల్వర్ నంది, బ్రాంజ్ నంది అనే మూడు విభాగాల్లో అవార్డులను తిరిగి నిర్వహించేందుకు అంగీకరించినట్లు నిర్మాతల మండలి తెలిపింది. అలాగే 2017-2024 సంవత్సరాలకు సంబంధించిన ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డును కూడా పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ఈ అవార్డుల ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులను గుర్తించి సత్కరించే అవకాశం ఉంటుందని పేర్కొంది. 1964లో ప్రారంభమైన నంది ఫిల్మ్ అవార్డులకు తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు తెలుగు ప్రజల సంస్కృతితోనూ ప్రత్యేక అనుబంధం ఉందని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పేర్కొంది. ఇన్నేళ్లుగా సినీ రంగంలోని కళాకారులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారికి అవార్డులు అందించడం ద్వారా పరిశ్రమను ప్రోత్సహించే సంప్రదాయం కొనసాగిందని తెలిపింది. నంది అవార్డుల పునరుద్ధరణతో తెలుగు సినీ రంగానికి చెందిన ప్రతిభావంతులను మరోసారి అధికారికంగా సత్కరించే అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులను నంది అవార్డుల ద్వారా గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి పార్టీలను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోరింది. నంది అవార్డుల పునరుద్ధరణకు సంబంధించిన నిర్ణయాన్ని సినీ పరిశ్రమకు సంబంధించిన వర్గాలు స్వాగతిస్తున్నాయని తెలిపింది.     [Nandi Film Awards, Nandi Awards 2017-2024, Nandi Awards Revival, Telugu Film Producers Council, Andhra Pradesh Nandi Awards, Golden Nandi Award, Silver Nandi Award, Bronze Nandi Award, NTR National Film Award, Nandi Awards Latest News, Telugu Cinema Awards, AP Film Awards]
Jr NTR has strongly reacted to an objectionable AI-morphed video featuring him and Janhvi Kapoor from Chuttamalle, their popular song from Devara: Part 1. The digitally manipulated video reportedly uses AI to create explicit visuals involving the actors, taking the misuse of their images to an extremely disturbing level. NTR took to X and condemned those behind the video, making it clear that he intends to pursue legal action against both its creators and those circulating it.  He wrote: "Disgusting, Sick and Shameless. In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words. To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.” The actor also appealed to people not to contribute to the video's circulation by watching, sharing or engaging with it. NTR wrote, “Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.” He further urged governments to take stronger measures against the misuse of artificial intelligence, writing, “This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.” NTR's reaction comes at a time when AI-generated deepfakes and synthetic explicit content have become a growing concern. The Government of India has also strengthened its regulatory framework around synthetically generated information and deepfakes in 2026. Still, it is hard to accept such grave misuse of AI and with no consideration for human decency and privacy.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మహిళలను అవమానించేలా మార్ఫింగ్ వీడియోలు రూపొందించడంపై యంగ్ హీరో ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. మహిళలను తల్లులు, దేవతలుగా గౌరవించే సంస్కృతి మనదని, అలాంటి సమాజంలో ఏఐని ఉపయోగించి ఒక మహిళను అత్యంత దారుణంగా అవమానించేలా కంటెంట్ తయారు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇలాంటి దుష్ట చర్యలకు పాల్పడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తన స్పందనను వెల్లడించారు. తన పాటకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోను రూపొందించిన వారితో పాటు దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టను. వీడియోను తయారు చేసిన వారితో పాటు దాన్ని వ్యాప్తి చేస్తున్న ప్రతి ఒక్కరిపై సాధ్యమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’’ అంటూ హెచ్చరించారు. అదే సమయంలో ఇలాంటి వీడియోలను ఎవరూ చూడొద్దని, షేర్ చేయొద్దని, వాటితో ఎలాంటి విధంగానూ ఎంగేజ్ కావొద్దని అభిమానులు, నెటిజన్లను కోరారు. ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించడం వల్ల దాని బారిన పడేది ఎవరైనా కావచ్చని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మరొక మహిళకు సంబంధించిన వీడియో కావచ్చు.. రేపు అది మన తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తెకు సంబంధించినదై ఉండొచ్చని అన్నారు. అందుకే ఏఐ దుర్వినియోగంపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్ వైరల్ కావడానికి నెటిజన్లు కూడా కారణం కాకూడదని, వాటిని షేర్ చేయకుండా రిపోర్ట్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్‌ఫేక్, మార్ఫింగ్ కంటెంట్‌కు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ కోరారు. ఇలాంటి ఘటనలను అడ్డుకునేలా కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.     [Jr NTR, NTR AI Morphed Video, Chuttamalle AI Video, Chuttamalle Morphed Video, Jr NTR Latest News, NTR Social Media Post, AI Misuse, AI Deepfake Video, NTR Chuttamalle Song, NTR Reaction, AI Morphed Video Controversy]
నటన సైతం గర్వపడే నటుడు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం తన హవా తగ్గుముఖం పట్టినా మళ్ళీ సెల్యులాయిడ్ పైకి దూసుకొస్తాడనే మాటలు అభిమానులనుంచి వినిపిస్తున్నాయి. రాజమౌళి, మహేష్ ల వారణాసిలో మహేష్ తండ్రిగా ప్రకాష్ రాజ్ చేసాడనే టాక్ అయితే బలంగానే సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ ఒక పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతు 'భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత ప్రాథమిక, శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు. ఆ హక్కుకే ముప్పు వాటిల్లుతోందని, అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చిన శాంతియుత నిరసన ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.  బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన ఈ ‘ఎలక్షన్ కమిషన్ ఛలో’ మరియు శాంతియుత నిరసన కార్యక్రమం ద్వారా ఓటర్ల హక్కుల పరిరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (Special Intensive Revision - SIR) పేరుతో సాగుతున్న ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఎన్నో ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వేలాది మంది సామాన్య ప్రజల పేర్లు అకస్మాత్తుగా గల్లంతవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఎన్నికలకు ఇంకా పూర్తి స్థాయిలో 2 ఏళ్ల సమయం మిగిలి ఉన్నప్పటికీ, కేవలం 1 నెల అత్యవసర గడువుతో ఈ తరహా పరిశీలనను ఎందుకు చేపడుతున్నారని ఆయన ఎన్నికల కమిషన్‌ను నిలదీశారు.   ఈ ప్రక్రియలో భావ ప్రకటనా స్వేచ్ఛను, పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తించడం సరికాదని స్పష్టం చేసిన ప్రకాశ్ రాజ్, దీనిపై న్యాయపరంగా పోరాడేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మాత్రమే ఉండే జుడీషియల్ ఇమ్యూనిటీ లేదా న్యాయపరమైన రక్షణను ఎన్నికల కమిషన్ వంటి స్వతంత్ర వ్యవస్థకు విస్తరిస్తూ, దానికి ఎటువంటి జవాబుదారీతనం లేకుండా చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధమని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక పౌరుడు తన ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతిసారీ కోర్టుల చుట్టూ తిరగాలా అని ఘాటుగా ప్రశ్నించిన ఆయన, ‘ఫార్మ్ 6’ ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించడం కంటే ఓటర్లకు తమ అర్హతను నిరూపించుకోవడానికి సరైన సమయం, అవకాశం ఇవ్వడమే న్యాయమని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్లీజ్ నన్ను తీసుకుంటారా: ఐశ్వర్య లక్ష్మి ఆ...వ్యాఖ్యలు వైరల్!    బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ పరిసరాల్లో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్‌తో పాటు ప్రముఖ నటుడు కిశోర్, అనేక సామాజిక సంఘాలు, విద్యార్థులు మరియు వేలాది మంది సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారు. ఏ ఒక్క అర్హత ఉన్న పౌరుడి ఓటు హక్కును కూడా లాక్కునే అధికారం ఏ వ్యవస్థకూ లేదని నటుడు కిశోర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిరసన తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు ప్రకాశ్ రాజ్ సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నప్పటికీ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగుతున్న ఈ పోరాటం ఆగేది లేదని, ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను రద్దు చేసే వరకు న్యాయపోరాటం మరియు శాంతియుత నిరసనలు కొనసాగుతాయని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. ఓటు హక్కు లేని ప్రజాస్వామ్యం నిష్ప్రయోజనమని, ప్రతి పౌరుడూ ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకుని, హక్కుల పరిరక్షణకై గొంతు విప్పాలని ఈ వేదిక ద్వారా పిలుపునిచ్చారు     [Prakash Raj Latest Speech, Prakash Raj Voting Rights Protest, Election Commission Chalo, Electoral Roll Revision, SIR Process,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]      
  క్యారక్టర్ కి తగ్గ పెర్ఫార్మ్ ప్రదర్శించే సౌత్ భామల్లో ఐశ్వర్య లక్ష్మి ఒకరు.భారీ సినిమాలే తన ఖాతాలో ఉన్నాయి. ప్రెజెంట్ సాయిధరమ్ తేజ్ తో 'సంబరాల ఏటిగట్టు' తో బిజీ గా ఉంది. రీసెంట్ గా ఈ భామ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీల 'రాకా' లో ఐశ్వర్య లక్ష్మి ఓ కీలక రోల్ లో, అందునా పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్‌లో నటించబోతోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్త సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతంగా ప్రచారం కావడంతో సినీ ప్రియులతో పాటు ఆమె అభిమానులు  బిగ్ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇస్తోందని భావించారు.   అయితే ఈ ప్రచారంపై ఐశ్వర్య లక్ష్మి  ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'రాకా' లో నేను ఉన్నాననే వార్తల్లో  ఏమాత్రం నిజం లేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. ఎవరైనా దయచేసి నన్ను ఆ సినిమాలో కాస్ట్ చేయండి (Somebody please cast me in the film)" అని ఆమె ఎంతో నవ్వుతూ, సరదాగా సమాధానమిచ్చారు. ఈ ఒక్క వ్యాఖ్యతో ఆమెపై వస్తున్న ప్రచారానికి పూర్తిగా ముగింపు పడటమే కాకుండా, తన మనసులోని ఆశని చాటుకుంది. ఇది కూడా చదవండి: యూత్ మూవీ పేరిట స్కూల్ పిల్లల మధ్య ప్రేమ, రొమాన్స్: మేకర్స్ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?   మరి రాకా మేకర్స్ ఆమె మాటలని పరిగణలోకి తీసుకుంటారేమో చూడాలి. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. ఎనీ క్యారక్టర్ లో మెస్మరైజ్ చేసే సమ్మోహన సినీ రూపం ఐశ్వర్య లక్ష్మి      [Aishwarya Lekshmi Denies Raaka Movie Rumors, Aishwarya Lekshmi, Raaka movie, Allu Arjun Atlee film, Aishwarya Lekshmi statement, Somebody please cast me, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భార్యాభర్తలు ఒకరికి ఒకరు టైం కేటాయించుకోవడం ఎందుకు ముఖ్యం.! ​భార్యాభర్తలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవడం దాంపత్య జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఉద్యోగం, వ్యాపారం, పిల్లల చదువులు, ఇంటి పనులు, ఆర్థిక బాధ్యతలతో రోజంతా గడిచిపోతుంటుంది. ఈ హడావుడిలో దంపతులు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, మనసులో విషయాలను పంచుకోవడానికి సమయం దొరకడం కష్టం. అయితే, కేవలం ఒకే ఇంట్లో  జీవించడం మాత్రమే కాకుండా, ఒకరికొకరు క్వాలిటీ టైమ్ కేటాయించుకోవడం చాలా అవసరం . భార్యాభర్తలు ఒకరికొకరు టైమ్ కేటాయించుకోవడం వల్ల వైవాహిక బంధంలో జరిగే అద్భుతాలు తెలుసుకుంటే..  కష్టాలలో నిలబెడుతుంది. ఎంతటి కష్టసమయంలోనైనా దంపతులను కలిపి ఉంచేది వారి మధ్య ఉన్న అనుబంధమే. రోజూ కొంత సమయం ఒకరి కోసం ఒకరు కేటాయించుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత గట్టిపడుతుంది. ఒకరి ఆలోచనలు, ఆశయాలు, భయాలు మరొకరు అర్థం చేసుకోవడానికి ఈ సమయం సహాయపడుతుంది. దీనివల్ల భాగస్వామి పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతాయి. గొడవలు తగ్గుతాయి.. చాలా కాపురాల్లో వచ్చే చిన్న చిన్న గొడవలకు లేదా విభేదాలకు ప్రధాన కారణం సరిగ్గా మాట్లాడుకోకపోవడమే. రోజూ కాసేపు ఎలాంటి ఫోన్లు, టీవీలు లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడటం వల్ల మనసులోని భ్రమలు, అపోహలు తొలగిపోతాయి. భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినడం వల్ల మన సమస్యలను వారు అర్థం చేసుకుంటున్నారనే నమ్మకం కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.. ఆఫీసు పని, కుటుంబ బాధ్యతల వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో భాగస్వామితో గడిపే సమయం అద్భుతంగా పనిచేస్తుంది. రోజంతా పడిన కష్టాన్ని మరిచిపోయి, భాగస్వామితో కాసేపు నవ్వుతూ మాట్లాడినా లేదా చిన్న నడకకు వెళ్లినా మనసుకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. భాగస్వామి ఇచ్చే ధైర్యం ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. జీవితం ఎప్పుడూ కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది.. వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచాక చాలామందిలో జీవితం రొటీన్‌గా మారిపోయిందనే భావన వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం చాలా అవసరం. కలిసి కాఫీ తాగడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం లేదా పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వంటివి వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. పిల్లలకు మార్గదర్శనం.. పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులను చూసే విషయాలు నేర్చుకుంటారు. ఇంట్లో భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ, ప్రేమగా సమయం గడుపుతుంటే పిల్లలు కూడా ప్రేమ, అనురాగాలు ఉన్న వాతావరణంలో పెరుగుతారు. ఇది వారిలో మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో వారు కూడా మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మార్పులను గ్రహించవచ్చు.. కాలంతో పాటు మనుషుల ఆలోచనలు, అలవాట్లు మారుతుంటాయి. పెళ్లి సమయానికి ఉన్న భాగస్వామి, కొన్నేళ్ల తర్వాత శారీరకంగా, మానసికంగా మారవచ్చు. తరచూ మాట్లాడుకోవడం వల్ల భాగస్వామిలో వస్తున్న మార్పులను, వారి కొత్త అవసరాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల జీవితంలో ఏ దశలోనైనా ఒకరికొకరు అండగా నిలబడటం తేలికవుతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది దాంపత్య జీవితానికి పునాది వంటిది. రోజూ కనీసం ఒక అర గంట పాటు ఫోన్లకు దూరంగా ఉండి,  మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే, ఎలాంటి సమస్యలనైనా సులభంగా దాటవచ్చు. ఎంత బిజీగా ఉన్నా భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మాత్రమే వైవాహిక బంధం సుదీర్ఘకాలం సంతోషంగా, ఆరోగ్యకరంగా సాగుతుంది.                      *రూపశ్రీ.  
 అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..  అనుభవాల సారం వృద్దుల జీవితం.. ! వయసు పైబడిన ప్రతి ఒక్కరి అనుభవం సమాజానికి గొప్ప మార్గదర్శకం. ప్రతి ఏటా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ముసలివాళ్లు అయిపోయారు, ఇక వాళ్లతో ఏం పని అని కొందరు అనుకుంటూ ఉంటారు.  కానీ  జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో పాఠాలను నేర్చుకున్న వారు వృద్దులు.  వృద్ధుల త్యాగాలను, వారు అందించిన సేవలను గుర్తుచేసుకోవడానికి ,  వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకోవడానికి,  అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎంతగానో సహాయపడుతుంది. వృద్దుల ప్రాధాన్యత,  వారి విషయంలో ఉండాల్సిన బాధ్యత,  సమాజంలో వారి పాత్ర మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుంటే.. వృద్దుల జీవితం..  తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కష్టాలు, విజయాలు అన్నీ కలగలిపిన ఒక గొప్ప పుస్తకం వృద్ధుల జీవితం. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారు మన ఇళ్లలో ఉండటం ఒక రక్షణ కవచం లాంటిది. కుటుంబం కోసం, సమాజం కోసం తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసిన వారు వృద్ధాప్యంలో మన నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత , గౌరవం మాత్రమే. సమయమే ఇవ్వడం లేదు.. ఈనాటి వేగవంతమైన డిజిటల్ యుగంలో చాలామంది కుటుంబాల్లో పెద్దవారికి సరైన సమయం కేటాయించడం లేదు. ఒంటరితనం అనేది వారిని వేధించే అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారితో రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడటం, వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి అనుభవాలను వినడం వల్ల వారికి కొండంత బలంతో పాటు మనసుకి ఎంతో సంతోషం లభిస్తుంది. సంరక్షణ.. వృద్ధుల సంక్షేమం, భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత. వారి అనుభవాల ద్వారా లభించే జ్ఞానాన్ని  గౌరవించాలి,  వారు తమ జీవితంలో కష్టాల నుండి బాధల నుండి నేర్చుకున్న విషయాలు కుటుంబంలో ఎందరికో ముందుజాగ్రత్తలు నేర్పుతాయి.  వారి వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగేలా చూడటమే మనం వారికి ఇచ్చే నిజమైన కానుక. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ సేవ చేయడం, వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవడం కోసం కనీస చిరు ప్రయత్నం అయినా చెయ్యాలి. పిల్లలిచ్చే గౌరవమే కొండంత ఆనందం.. వృద్దులకు తమ పిల్లలు ఇచ్చే గౌరవమే కొండంత ఆనందాన్ని ఇస్తుంది.  సాధారణంగా కొన్ని ఇళ్లలో మనవళ్లు,  మనవరాళ్లు వృద్దులను చీదరించుకుంటూ,  చిరాకు పడుతూ.. వారితో మాట్లాడటానికి  ఇష్టపడరు. కానీ తమ తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తూ వారితో ఆప్యాయంగా బాధ్యతగా ఉంటే.. వారి పిల్లలు కూడా తమ అవ్వ తాతల పట్ల ఎంతో ఆదరంగా, ప్రేమగా ఉండగలుగుతారు.  కాబట్టి వృద్దులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                             *రూపశ్రీ.  
 అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..  అనుభవాల సారం వృద్దుల జీవితం.. ! వయసు పైబడిన ప్రతి ఒక్కరి అనుభవం సమాజానికి గొప్ప మార్గదర్శకం. ప్రతి ఏటా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ముసలివాళ్లు అయిపోయారు, ఇక వాళ్లతో ఏం పని అని కొందరు అనుకుంటూ ఉంటారు.  కానీ  జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో పాఠాలను నేర్చుకున్న వారు వృద్దులు.  వృద్ధుల త్యాగాలను, వారు అందించిన సేవలను గుర్తుచేసుకోవడానికి ,  వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకోవడానికి,  అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎంతగానో సహాయపడుతుంది. వృద్దుల ప్రాధాన్యత,  వారి విషయంలో ఉండాల్సిన బాధ్యత,  సమాజంలో వారి పాత్ర మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుంటే.. వృద్దుల జీవితం..  తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కష్టాలు, విజయాలు అన్నీ కలగలిపిన ఒక గొప్ప పుస్తకం వృద్ధుల జీవితం. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారు మన ఇళ్లలో ఉండటం ఒక రక్షణ కవచం లాంటిది. కుటుంబం కోసం, సమాజం కోసం తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసిన వారు వృద్ధాప్యంలో మన నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత , గౌరవం మాత్రమే. సమయమే ఇవ్వడం లేదు.. ఈనాటి వేగవంతమైన డిజిటల్ యుగంలో చాలామంది కుటుంబాల్లో పెద్దవారికి సరైన సమయం కేటాయించడం లేదు. ఒంటరితనం అనేది వారిని వేధించే అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారితో రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడటం, వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి అనుభవాలను వినడం వల్ల వారికి కొండంత బలంతో పాటు మనసుకి ఎంతో సంతోషం లభిస్తుంది. సంరక్షణ.. వృద్ధుల సంక్షేమం, భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత. వారి అనుభవాల ద్వారా లభించే జ్ఞానాన్ని  గౌరవించాలి,  వారు తమ జీవితంలో కష్టాల నుండి బాధల నుండి నేర్చుకున్న విషయాలు కుటుంబంలో ఎందరికో ముందుజాగ్రత్తలు నేర్పుతాయి.  వారి వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగేలా చూడటమే మనం వారికి ఇచ్చే నిజమైన కానుక. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ సేవ చేయడం, వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవడం కోసం కనీస చిరు ప్రయత్నం అయినా చెయ్యాలి. పిల్లలిచ్చే గౌరవమే కొండంత ఆనందం.. వృద్దులకు తమ పిల్లలు ఇచ్చే గౌరవమే కొండంత ఆనందాన్ని ఇస్తుంది.  సాధారణంగా కొన్ని ఇళ్లలో మనవళ్లు,  మనవరాళ్లు వృద్దులను చీదరించుకుంటూ,  చిరాకు పడుతూ.. వారితో మాట్లాడటానికి  ఇష్టపడరు. కానీ తమ తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తూ వారితో ఆప్యాయంగా బాధ్యతగా ఉంటే.. వారి పిల్లలు కూడా తమ అవ్వ తాతల పట్ల ఎంతో ఆదరంగా, ప్రేమగా ఉండగలుగుతారు.  కాబట్టి వృద్దులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                             *రూపశ్రీ.  
ఉలవచారు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. కానీ ఉలవలు కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు.. మన సంప్రదాయ ఆహార విధానంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా నల్ల ఉలవలను ఆహారంగా ఎలా ఉపయోగించాలి? వాటి వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోలో 35 సంవత్సరాల ఆయుర్వేద అనుభవం ఉన్న Dr. Chittibhotla Madhusudhana Sharma గారు ఉలవల గురించి సులభమైన తెలుగులో వివరించారు. నల్ల, తెల్ల, ఎర్ర ఉలవల్లో ఉన్న తేడాలు, నల్ల ఉలవలను ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారు, ఉలవల్లో ఉండే పోషకాలు, ఫైబర్ జీర్ణక్రియకు ఎలా ఉపయోగపడుతుంది వంటి విషయాలను ఇందులో తెలుసుకోవచ్చు. అలాగే ఉలవలు బరువు నియంత్రణకు ఉపయోగపడతాయా? రోజువారీ ఆహారంలో ఉలవలను ఎలా చేర్చుకోవాలి? ఉలవచారు లేదా ఇతర రూపాల్లో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవచ్చు? ఉలవలు తింటే కిడ్నీలో రాళ్లు కరుగుతాయనే ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది? వంటి ముఖ్యమైన సందేహాలకు కూడా ఈ వీడియోలో వివరణ లభిస్తుంది. మన వంటింట్లో సులభంగా లభించే ఉలవలను సరైన విధంగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వాటి పోషక విలువలను ఎలా పొందవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. గమనిక: కిడ్నీలో రాళ్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ఉలవలను ఏదైనా వ్యాధికి చికిత్సగా భావించి వైద్య చికిత్సను నిలిపివేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ప్రతిరోజూ ఉదయం ఉడకబెట్టిన గుడ్డు తినడం చాలామందికి అలవాటు. శారీరక బలానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కోడిగుడ్డును అత్యంత చౌకైన , సమర్థవంతమైన ఆహారంగా నిపుణులు చెబుతుంటారు. అయితే  చాలామంది గుడ్డు తినేటప్పుడు తెల్లసొనను మాత్రమే తిని, పచ్చసొనను తీసి పక్కన పడేస్తుంటారు. పచ్చసొన తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లేదా చెడు కొవ్వు పెరిగిపోతుందని, గుండె ఆరోగ్యానికి మంచిది కాదని, బరువు పెరుగుతారని రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అలాగే చిన్న పిల్లలకు పచ్చసొన ఇస్తే అరగదని భావించేవారు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ కేవలం శాస్త్రీయ ఆధారం లేని అపోహలు మాత్రమే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  నిజానికి గుడ్డులోని అసలైన పోషక నిధి పచ్చసొనలోనే దాగి ఉంటుంది. పచ్చసొనలో ఉన్న ముఖ్యమైన పోషకాలు , వాటి ప్రాముఖ్యత గుడ్డులోని సంపూర్ణ పోషక విలువలు మన శరీరానికి అందాలంటే పచ్చసొనను తీసివేయకుండా పూర్తిగా తినడం ఎంతో అవసరం. పచ్చసొనలో లభించే ప్రధానమైన పోషకాలు మన శరీరానికి ఏ విధంగా తోడ్పడతాయో వివరంగా తెలుసుకుంటే.. మెదడు అభివృద్ధికి.. గుడ్డు పచ్చసొనలో కోలిన్ అనే పోషక పదార్థం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది మెదడు సరైన రీతిలో పనిచేయడానికి , జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం. విశేషమేమిటంటే, ఎదుగుతున్న చిన్న పిల్లలలో మెదడు వికాసానికి , నరాల వ్యవస్థ నిర్మాణానికి కోలిన్ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. నరాల బలానికి, రక్తకణాల తయారీకి విటమిన్ బి12.. పచ్చసొనలో విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొత్త రక్తకణాలు తయారవ్వడానికి, శరీరం చురుగ్గా ఉండటానికి , నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. సాధారణంగా మనం తినే శాఖాహారంలో ఈ విటమిన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే శాఖాహార లోపాలను భర్తీ చేసుకోవడానికి గుడ్డు పచ్చసొన ఒక గొప్ప ఆహార మూలంగా పనిచేస్తుంది. కంటి చూపుకు, రోగనిరోధక శక్తికి విటమిన్ ఏ..  ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో సాయపడుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, పలురకాల ఇన్ఫెక్షన్లు , వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. థైరాయిడ్ పనితీరుకు సెలీనియం..  గుడ్డు పచ్చసొనలో సెలీనియం అనే ముఖ్యమైన ఖనిజ లవణం ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి , శరీరంలో జీవక్రియల వేగాన్ని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. గుడ్డును పూర్తిగా ఎందుకు తినాలి? గుడ్డు తెల్లసొనలో కేవలం ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది, కానీ పచ్చసొనలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ , మేలైన పోషకాలన్నీ నిండి ఉంటాయి. కేవలం తెల్లసొన మాత్రమే తింటే గుడ్డు నుంచి వచ్చే పూర్తి పోషకాహార ప్రయోజనాలను మనం కోల్పోయినట్లే అవుతుంది. అందుకే అనవసరమైన భయాలు, అపోహలు పక్కన పెట్టి రోజువారీ ఆహారంలో గుడ్డును పచ్చసొనతో సహా పూర్తిగా తీసుకోవడం వల్ల  ఆరోగ్యం ఎంతగానో మెరుగవుతుంది.                      *రూపశ్రీ.  
చేతులు వణకడం, కాళ్లలో బలహీనంగా అనిపించడం, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, చిన్న పని చేసినా త్వరగా అలసిపోవడం వంటి సమస్యలను చాలామంది సాధారణ నీరసంగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి నరాల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు సంకేతాలు కావచ్చు. నరాల బలహీనతకు కారణాలు ఏమిటి? నరాలపై ప్రభావం చూపించే సమస్యలు ఏంటి? చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నొప్పి, వణుకు, బలహీనత ఎందుకు వస్తాయి? నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం, జీవనశైలి పాటించాలి? ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ నరాల బలహీనతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అలాగే నరాల ఆరోగ్యానికి ఉపయోగపడే సంప్రదాయ పద్ధతిలో అశ్వగంధ, వాము, దాల్చిన చెక్క, లవంగాలతో తయారు చేసుకునే చిట్కా గురించి కూడా తెలుసుకోవచ్చు. నరాల బలహీనత, నరాల నష్టం, తాత్కాలిక నీరసం మధ్య తేడా ఏమిటి? నరాలు దెబ్బతిన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? నరాల ఆరోగ్యానికి మంచి ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎందుకు అవసరం? వంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నరాలకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, లక్షణాలు కొనసాగితే వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. నరాల ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)