
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే, ఆ న్యూస్ సృష్టించబోయే రికార్డు తాలూకు వ్యూస్ ని గుర్తు చేస్తూ 'ఆరా' అనేది ముందుగానే మనకి హింట్ ఇస్తూనే ఉంటుంది. సేమ్ ఇప్పడు కూడా అదే పరిస్థితి.
పెద్ది సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. థియేటర్లు మరియు డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డు వ్యూస్ సాధించిన పెద్ది, ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.శాటిలైట్ హక్కులని ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ జీ తెలుగు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆ సంస్థ పెద్ది వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అక్టోబర్ 11న సాయంత్రం 5:30 గంటలకు ‘ప్రసారం కానున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Drishyam 3: దృశ్యం 3 ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్: వీకెండ్ కి పెను తుఫాను తప్పదా!

దీంతో థియేటర్లలో, ఓటీటీలో వీక్షించిన ప్రేక్షకులు మరోసారి టీవీలో చూసే అవకాశం లభించనుంది. అదే టైంలో పెద్ది టెలివిజన్ కి సంబంధించి టిఆర్ పి రేటింగ్స్ లో తన హవా ఏ మేర చాటుతాడో చూడాలి.
[Ram Charan Latest News, Peddi World Television Premiere, Ram Charan Peddi TV Premiere Date, Peddi Telecast Channel Sony MAX, Peddi ZEE Telugu Telecast, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
.webp)
.webp)






