Home

»

Latest News

ఇరుముడిపై పరుచూరి బ్రదర్స్ వ్యాఖ్యలు వైరల్: గురుస్వామి రోల్ ముగింపు అలా!

Oct 3, 2026 2:56PM


మాటలకి రిపీట్ ఆడియెన్స్ వస్తారని, వీరాభిమానులు సైతం పుట్టుకొస్తారని నిరూపించిన మాటల శిఖరం 'పరుచూరి బ్రదర్స్' లో ఒకరు పరుచూరి గోపాల కృష్ణ. సెల్యులాయిడ్ పై మాటలు పరుచూరి బ్రదర్స్ అని పడగానే విజిల్స్ కూడా మోగుతాయంటే క్రేజ్ తాలూకు  రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.పరుచూరి పలుకులు పేరుతో ఎప్పట్నుంచో సినీ విశ్లేషణలు చేస్తూ ఎంతో మంది సినీ ఆ శా కిరణాలకి సినీ రచనా భీష్మాచార్యుడుగా ఉన్నారు.


రీసెంట్ గా ఇరుముడిపై మాట్లాడుతు 'సినిమా అంటే 'ఇరుముడి'లాగే ఉండాలి.  రవితేజ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఈ చిత్రం ఒక మైలురాయిగా  నిలిచిపోతుంది.తండ్రీకూతుళ్ల గాఢమైన బంధం తన డ్రీమ్ ప్రాజెక్ట్, కెరీర్ క్లాసిక్ 'సర్పయాగం' సినిమా జ్ఞాపకాలని  గుర్తుచేసింది. గురుస్వామి క్యారక్టర్ ముగింపుని మరింత ప్రభావంతంగా మలచి ఉంటే బాగుండేది. ఎందుకంటే  సాయికుమార్ పోషించిన గురుస్వామి రోల్ భక్తి, ప్రవృత్తికి ప్రతీక కాబట్టి ఆ చేతుల మీదుగా జరిగే పాపాన్ని మరింత నాటకీయంగా ఆత్మహత్య వంటి ముగింపుతో చూపిస్తే ఔచిత్యం దక్కుండేది.  అలాగే అజయ్ ఘోష్ క్యారక్టర్ లో వచ్చిన మార్పు ఇంకాస్త బలంగా చూపించడంతో పాటు చట్టపరంగా జైలు శిక్ష అనుభవించి వచ్చినట్లు చూపిస్తే న్యాయం మరింత స్పష్టంగా కనిపించేది .అలాగే క్లైమాక్స్ సన్నివేశాలలో హీరోకి కనిపించే మణెమ్మ రూపం సీన్‌ని కేవలం ఒక భావోద్వేగ భ్రమలా మాత్రమే చూపిస్తే కథనం ప్రేక్షకులకి ఇంకా బలంగా హత్తుకునేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గంజాయి ముఠాలు, పాఠశాల విద్యార్థులను వేధించే ఆకతాయిల చుట్టూ కథను తిప్పుతూ, తెరవెనుక అసలైన విలన్‌ను చివరి నిమిషం వరకూ దాచిపెట్టిన స్క్రీన్‌ప్లే నేర్పుని  దాసరి నారాయణరావు వంటి దర్శక దిగ్గజాలు చేసారు. 


ఇది కూడా చదవండి: మాళవిక మోహన్ ఆసక్తికర ట్వీట్: అతను ఎంతో ప్రత్యేకం

 

 


చిత్ర పరిశ్రమలో సినిమా నిర్మాణం అనేది కేవలం ఒక వ్యాపార ప్రయోగం మాత్రమే కాదని, ఎంతోమంది కష్టంతో కూడుకున్న భారీ ఆర్థిక వ్యవహారమని పరుచూరి చెప్పుకొచ్చారు.

 

 

[Paruchuri Gopala Krishna About Irumudi, Paruchuri Gopala Krishna, Ravi Teja Irumudi, Irumudi Box Office Collections, Shiva Nirvana Irumudi, Paruchuri Palukulu,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com