
క్యారక్టర్ కి తగ్గ పెర్ఫార్మ్ ప్రదర్శించే సౌత్ భామల్లో ఐశ్వర్య లక్ష్మి ఒకరు.భారీ సినిమాలే తన ఖాతాలో ఉన్నాయి. ప్రెజెంట్ సాయిధరమ్ తేజ్ తో 'సంబరాల ఏటిగట్టు' తో బిజీ గా ఉంది. రీసెంట్ గా ఈ భామ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీల 'రాకా' లో ఐశ్వర్య లక్ష్మి ఓ కీలక రోల్ లో, అందునా పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్‌లో నటించబోతోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్త సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతంగా ప్రచారం కావడంతో సినీ ప్రియులతో పాటు ఆమె అభిమానులు బిగ్ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇస్తోందని భావించారు. అయితే ఈ ప్రచారంపై ఐశ్వర్య లక్ష్మి ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'రాకా' లో నేను ఉన్నాననే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. ఎవరైనా దయచేసి నన్ను ఆ సినిమాలో కాస్ట్ చేయండి (Somebody please cast me in the film)" అని ఆమె ఎంతో నవ్వుతూ, సరదాగా సమాధానమిచ్చారు. ఈ ఒక్క వ్యాఖ్యతో ఆమెపై వస్తున్న ప్రచారానికి పూర్తిగా ముగింపు పడటమే కాకుండా, తన మనసులోని ఆశని చాటుకుంది.
ఇది కూడా చదవండి: యూత్ మూవీ పేరిట స్కూల్ పిల్లల మధ్య ప్రేమ, రొమాన్స్: మేకర్స్ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?

మరి రాకా మేకర్స్ ఆమె మాటలని పరిగణలోకి తీసుకుంటారేమో చూడాలి. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. ఎనీ క్యారక్టర్ లో మెస్మరైజ్ చేసే సమ్మోహన సినీ రూపం ఐశ్వర్య లక్ష్మి
[Aishwarya Lekshmi Denies Raaka Movie Rumors, Aishwarya Lekshmi, Raaka movie, Allu Arjun Atlee film, Aishwarya Lekshmi statement, Somebody please cast me, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
.webp)
.webp)





