LATEST NEWS
కాంగ్రెస్ తనంత తానుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి సర్కార్ కు ప్రయోజనం చేకూర్చిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మోడీ సర్కార్ కు ఆయాచిత వరంగా పరిణమించింది. తమిళనాడు విషయంలో కాంగ్రెస్ తీసుకున్న ఒక రాజకీయ నిర్ణయం  జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు  అనూహ్య లబ్ధిని చేకూర్చిపెట్టింది.  ఆ నిర్ణయమే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో సంబంధాలను సమన్వయం చేసుకోవడం, బలోపేతం చేసుకోవడంలో కాంగ్రెస్ వైఫల్యాలను జాతీయ స్థాయిలో తిరుగులేని విధంగా బదనాం చేసింది.  తమిళనాడులో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పలకడం ద్వారా దశాబ్దాలుగా తోడుగా ఉన్న డీఎంకేను కాంగ్రెస్ చేజేతులా దూరం చేసుకుంది. ఇప్పుడు అదే ఎన్డీయే కూటమికి కలిసి వచ్చింది. అంతే కాకుండా ఇండియా కూటమిని బలహీన పరిచి.. కాంగ్రెస్ కు ఇసుమంతైనా రుచించని, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేందుకు దోహదం చేస్తున్నది. గత ఏప్రిల్‌లో పార్లమెంటులో అవసరమైన మెజారిటీ లేక డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సమయం కోసం వేచి చూసిన మోదీ-షా ద్వయం.. అదును చూసి పార్లమెుంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఆ బిల్లుకు ఆమోదం పొందేందుకు పక్కాగా వ్యూహరచన చేసింది.  ఈ బిల్లు ఆమోదంలో ఇప్పుడు 22 మంది లోక్‌సభ సభ్యులున్న డీఎంకే కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో ఎప్పుడూ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి వెన్నెముకగా నిలిచిన డీఎంకే.. తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కు దూరం జరుగుతూ వచ్చింది.  ఇప్పుడు  22 మంది ఎంపీల బలం ఉన్న డీఎంకే డీలిమిటేషన్ బిల్లుకు సానుకూలంగా ఉందన్న వార్తలు, గతంలో టీవీకేకు మద్దతు ఇవ్వడం రాజకీయంగా కాంగ్రెస్ కు ఆత్మహత్యాసదృసంగా మారిందన్న విషయాన్ని ఎత్తి చూపుతున్నాయి.  సరిగ్గా ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకున్న బీజేపీ అగ్రనాయకత్వం, డీఎంకే ప్రధాన డిమాండ్లకు అనుగుణంగా బిల్లులో మార్పులు చేసి వారి మద్దతు  సాధించింది. తమిళనాడు సహా ఏ   రాష్ట్రంలోనూ సీట్ల నిష్పత్తి తగ్గకుండా అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం మేర లోక్‌సభ స్థానాలను పెంచేందుకు కేంద్రం అంగీకరించడం ద్వారా డీఎంకే మద్దతు సాధించడమే కాకుండా, కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీయగలిగింది.   దీనికి తోడు, పాతికేళ్ల  రాష్ట్రాల మధ్య సీట్ల సంఖ్య వాటాను స్థిరంగా కొనసాగించాలన్న డీఎంకే మరో ప్రధాన షరతుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపడం, అలాగే ఎన్సీపీ( శరద్ పవార్ )వర్గంతోనూ   సంప్రదింపులు జరిపి మద్దతు కూడగట్టడంలో మోడీ షా ద్వయం సక్సెసయ్యింది. ఈ విధంగా టీవీకేకు తమిళనాడులో మద్దతు పలకడం ద్వారా కాంగ్రెస్ ఇండియా కూటమికి రెండు కీలక రాజకీయపార్టీలు దూరం కావడానికి కారణమైంది. ఇది కూడా చదవండి:  ఇండియా కూటమిలో సంక్షోభం.. కాంగ్రెస్ ను వీడుతున్న మిత్రపక్షాలు​ ఇప్పుడు డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీల మద్దతుతో పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీకి ఎన్డీయే చేరువ అయ్యింది. తద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా..  మహిళా రిజర్వేషన్ల అమలు క్రెడిట్‌ను,   మరోవైపు డీలిమిటేషన్ ఘనతను మోడీషా ద్వయం తమ ఖాతాలో వేసుకునే అవకాశం దక్కించుకుంది. అదే సమయంలో కూటమి విభేదాలు జాతీయ స్థాయిలో రచ్చకెక్కేలా చేయగలిగింది.    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మీకు నచ్చవచ్చు: ప్రధాని అభ్యర్థిగా రాహుల్.. ఇండియా కూటమి పార్టీలు ఓకే.!​ ఇండియా కూటమిలోకి జగన్?​ [Congress, StratagicFailur, Tamilnadu, TVK Support, Delimitation,  Cut, DMK, INDIA Alliance, TeluguOne]
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు క్షేత్రస్థాయిలో వైసీపీ దయనీయ పరిస్థితికి మరోమారు అద్దంపట్టాయి.  పట్టణ ప్రాంతాలు, ఆ  తర్వాత గ్రామీణ ఓటర్లలో తమకు గట్టి పట్టు ఉందంటూ వైసీపీ వర్గాలు తమ భుజాలను తామే చరుచుకుంటే చేస్తున్న ఆర్భాటం అంతా ఉత్తిదేననీ స్పష్టం చేస్తూ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలు వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టాయి.  తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు.  గతంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీకి ప్రతికూల ఫలితాలు ఎదురైన విషయం తెలిసిందే. ఇప్పుడు గ్రామపంచాయతీ స్థాయిలోనూ అదే పరిస్థితి కొనసాగడంతో వైసీపీయులలో తీవ్ర నిరాశా నిస్ఫృహలు వ్యక్తమౌతున్నాయి.  ఏకగ్రీవమైన పంచాయతీల నుంచి పోలింగ్ జరిగిన స్థానాల వరకు అత్యధిక స్థానాలలో  కూటమి మద్దతుదారులే జయభేరి మోగించారు.  పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థులు పార్టీ గుర్తులపై పోటీ చేయకపోయినా..  అభ్యర్థుల వెనుక రాజకీయ పార్టీల మద్దతు కీలకంగా ఉంటుంది. మండల కేంద్రాలు, మేజర్ గ్రామపంచాయతీలలో అసెంబ్లీ ఎన్నికలను తలపించే స్థాయిలో ప్రచారం, సమీకరణలు, స్థానిక అంశాలు,  ప్రభావం చూపుతాయి. గ్రామీణ సమాజంలో ఏ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం ఉందనేదానికి ఈ ఫలితాలు ఒక లాండ్ మార్క్ అనడంలో సందేహం లేదు. తొలి విడతలో 3,949 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, వాటిలో 750కి పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆ ఏకగ్రీవ స్థానాల్లో అత్యధిక భాగం టీడీపీ మద్దతుదారుల ఖాతాలో చేరినట్లు తెలుస్తోంది. ఇక పోలింగ్ జరిగిన 3,200కు పైగా పంచాయతీల ఫలితాలను పరిశీలిస్తే, మేజర్ పంచాయతీలలో చాలాచోట్ల కూటమి-టీడీపీ మద్దతుదారులే విజయం సాధించారని, వైసీపీకి బలమైన ప్రాంతంగా భావించే రాయలసీమలోనూ వైసీపీ మద్దతుదారులు గెలవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది కూడా చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది: సీఎం చంద్రబాబు​ గ్రామీణ స్థాయిలో వైసీపీకి ఈ స్థాయిలో ప్రతికూల ఫలితాలు రావడానికి   సమన్వయ లోపం, కార్యకర్తల నిరాసక్తతే కారణమని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేత  జగన్  బెంగళూరు నుంచి చుట్టపు చూపుగా మాత్రమే ఏపీకి వస్తుండటం, స్థానిక నేతలు కూడా క్యాడర్ కు అందుబాటులో లేకపోవడం కారణంగానే పంచాయతీపోరులో వైసీపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందని అంటున్నారు.    ఇక ఆదివారం (నవంబర్29),  డిసెంబర్ 2 తేదీల్లో జరగనున్న తదుపరి విడతల పంచాయతీ ఎన్నికలపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. తొలి విడతలో కనిపించిన ధోరణే మిగిలిన విడతల్లోనూ కొనసాగుతుందా, లేక క్షేత్రస్థాయిలో సమీకరణలు మారుతాయా అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈ ఫలితాల ప్రభావం రానున్న రోజుల్లో పార్టీల సంస్థాగత వ్యూహాలు, భవిష్యత్ ఎన్నికల సన్నద్ధతపై పడే అవకాశం ఉంది. మీకు నచ్చవచ్చు: అభ్యర్థుల ప్రకటనలో తెలుగుదేశం జోరు: స్థానిక సమరం.. క్యాండేట్ల రెండో జాబితా విడుదల.!​ పురపోరు: తెలుగుదేశం కూటమి జోరు.! [APPanchayatElections, FirstPhase, Results, TDPAlliance, YCP, TeluguOne] 
 డీలిమిటేషన్  ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికకు దారి తీస్తోందా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.  కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచేందుకు, రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని స్థిరంగా ఉంచేందుకు రూపొందించిన ప్రతిపాదనలపై ఇండియా కూటమిలోభిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతుండటమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఇండియా కూటమి ఐక్యత ప్రశ్నార్థకంగా మారింది.   ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్రం  రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచడం, పాతికేళ్ల పాటు సీట్ల వాటా నిష్పత్తిని స్తంభింపజేయడం వంటి అంశాలు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలలో బిల్లుకు అనుకూలత వ్యక్తం అయ్యేలా చేసింది.  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమ రాష్ట్ర సీట్ల వాటా తగ్గకూడదని, 1971 జనాభా ప్రాతిపదికన నిష్పత్తిని కొనసాగించాలని అలాగే సీట్ల వాటా పతికేళ్లు స్థిరంగా ఉంచాలన్న డిమాండ్ కు తన  తాజా ప్రతిపాదన ద్వారా కేంద్రం అంగీకరించినట్లైంది. దీంతో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నిలబడాలన్న ఆ పార్టీ వైఖరిలో మార్పు చోటు చేసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఇక ఇప్పటికే   ఎన్సీపీ (శరద్ పవార్ ) నేతలు బిల్లు పూర్తి స్వరూపాన్ని చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఆ పార్టీ ఎన్డీయేకు జై కొట్టడం ఖాయమని తేటతెల్లమైపోయింది.  కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బిల్లును, ప్రత్యేక సమావేశాల నిర్వహణను బలంగా వ్యతిరేకిస్తోంది. మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజనను ముందుకు తీసుకెళ్లడం రాజకీయ లబ్ధి కోసమేనని కాంగ్రెస్ అంటోంది. పునర్విభజన బాధ్యతల నిర్వహణ, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత, అలాగే రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీని సమీకరించే తీరుపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితే ఇండియా కూటమిలో చీలిక అనివార్యం అన్న భావన కలిగిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  ఇది కూడా చదవండి:  ఇండియా కూటమి కీలక నిర్ణయం...ఇకపై రెండు నెలలకు ఒకసారి భేటీ!​ గతంలో ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించక ఆమోదం పొందని విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ ఆ బిల్లును ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించడానికి ఇండియా కూటమిలో చీలిక ఆశతోనే నని అంటున్నారు.   మొత్తంగా చూస్తే, డీలిమిటేషన్ బిల్లు ప్రతిపక్ష కూటమిలోని భిన్న రాజకీయ ఆలోచనలు, ప్రాంతీయ ప్రయోజనాల మధ్య ఉన్న తేడాలను మరోసారి బట్టబయలు చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో జరిగే పరిణామాలు జాతీయ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీసే అవకాశం ఉంది. మీకు నచ్చవచ్చు:  ప్రధాని అభ్యర్థిగా రాహుల్.. ఇండియా కూటమి పార్టీలు ఓకే.! ఇండియా కూటమిలోకి జగన్? [Delimitation Effect, India allience, Split, Shock, Congress, TeluguOne]
కేంద్రం డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం సోమవారం (నవంబర్ 30) నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయం ఒక్కసారిగా రాజకీయవాతావరణాన్ని వేడెక్కించింది. డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ ప్రత్యేక సమావేశాల వెనుక అసలు లక్ష్యం నియోజకవర్గాల పునర్విభజన, తద్వారా బీజేపీకి చేకూరే రాజకీయ లబ్ధి మాత్రమే ఉందని కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పిస్తోంది.   చట్టసభల్లో మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించే  నారీ శక్తి వందన్‌ అధినియమ్ చట్టాన్ని పార్లమెంట్ 2023 సెప్టెంబర్‌లో ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని గుర్తు చేసిన కాంగ్రెస్ సీనియన్ నేత జైరాం రమేష్.. ఆ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని  పలుమార్లు కోరినా పట్టించుకోని కేంద్రం, ఇప్పటికే  పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్ని పొందిన చట్టాన్ని అమలు చేయకుండా, దాని అమలును డీలిమిటేషన్ తో ముడిపెట్టి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం రాజకీయ ప్రయోజనాలను ఆశించేనని దుయ్యబట్టారు.   డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా బీజేపీకి అనుకూలంగా నియోజకవర్గాల  స్వరూపాన్ని మారుస్తారనే ఆందోళన కాంగ్రెస్ లో బలంగా వ్యక్తమౌతోంది. అంతేకాకుండా, నియోజకవర్గాల సరిహద్దులు, స్వరూపాన్ని నిర్ణయించే బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే అంశంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ఓటర్ల జాబితాల రూపకల్పన, ఎన్నికల నిర్వహణ తీరుపై విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు పునర్విభజన బాధ్యతలు అప్పగించడం సరికాదని కాంగ్రస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై సందేహాలు ఉన్న వ్యక్తుల చేతుల్లో  డీలిమిటేషన్ బాధ్యతలు ఉంచడం   ప్రజాస్వామ్యానికి హానికరమని అంటోంది.  ఇది కూడా చదవండి:  డీలిమిటేషన్‌ ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే యత్నం.. కేంద్రంపై గౌరవ్‌ గొగోయ్‌ విమర్శలు​ నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశాలను  ప్రారంభం కానున్నాయి. సభా కార్యకలాపాలను బట్టి డిసెంబర్ 3న సమావేశాలు ముగిసే అవకాశం ఉంది.   ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటికీ అధికారికంగా ప్రొరోగ్ చేయలేదని, వాటి కొనసాగింపుగానే ఈ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించుకోవడానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సమకూర్చుకోవడమే ఈ సమావేశాల వెనుక ఉన్న ప్రధాన రాజకీయ ఎత్తుగడ అని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.    ఆపరేషన్ లోటస్ ప్రారంభమై 105 రోజులు పూర్తయిన తర్వాత, రాజ్యాంగ దినోత్సవం వేళ ఈ సమావేశాల ప్రకటన వెలువడటంలో  ఉన్న రాజకీయలెక్కలేంటో తేలాల్సి ఉందంటున్నారు. మహిళా రిజర్వేషన్ల అమలును అడ్డం పెట్టుకుని డీలిమిటేషన్ బిల్లును ముందుకు తేవడాన్ని ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన బలాన్ని అనుచిత మార్గాల్లో కూడగట్టే ప్రయత్నాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శిస్తున్నాయి. ఆ ప్రయత్నాలను అడ్డుకుంటామని గట్టిగా చెబుతున్నాయి.   నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ల అమలుపై ఎలాంటి చర్చలు జరుగుతాయి, ప్రభుత్వం ఏ ప్రతిపాదనలు ముందుకు తెస్తుంది, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి అనేదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.  మీకు నచ్చవచ్చు:  డీలిమిటేషన్ ఎందుకు అవసరం: దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేదెలా.? డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. 2051 వరకు రాష్ట్రాల ప్రాతినిధ్యం స్థిరం.! [Special Parliament Session, Delimitation, Womens Reservation Act, Congress, Fire, BJP, Political, Intention, TeluguOne]
డీలిమిటేషన్పై నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు  దాదాపుగా తెరపడింది. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని కేంద్రం లోక్‌సభ స్థానాల సంఖ్యను అన్ని రాష్ట్రాల్లో దామాషా ప్రకారం 50 శాతం పెంచేందుకు నిర్ణయించింది. దీంతో దేశంలో లోక్ సభ స్థానాలు 850కి చేరతాయి. అంతే కాదు వచ్చే పాతికేళ్ల వరకూ  అంటే 2051 వరకు రాష్ట్రాల వారీగా సీట్ల కేటాయింపును స్థిరంగా ఉంచే ప్రతిపాదనకు సైతం కేంద్రం ఆమోదముద్ర వేసింది.  దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలు దాదాపుగా పరిష్కారం అయిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సోమవారం (నవంబర్ 30) ప్రారంభమయ్యే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్డానికి కేంద్రం రెడీ అయ్యింది.   కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది.  దీనితో పాటు  మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు కూడా ఉంటుంది.  గతంలో జరిగిన పరిణామాలను అవలొకిస్తే.. లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను చివరిసారిగా 1970వ దశకంలో, 1971 జనాభా లెక్కల ఆధారంగా 543 స్థానాలకు పరిమితం చేశారు   ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజనను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 131వ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు, జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే ఉత్తరాదిలో సీట్లు భారీగా పెరిగి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందంటూ ప్రతిపక్షాలు  వ్యతిరేకించడంతో ఆ బిల్లు ఆమోదం పొందలేకపోయింది. మరోవైపు, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ లోక్‌సభలో తమ రాష్ట్రానికి ఉన్న 7.18 శాతం సీట్ల వాటాను ఏ మాత్రం తగ్గించరాదని  డిమాండ్ చేశారు. 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల మధ్య ఉన్న సీట్ల నిష్పత్తిని మరో పాతికేళ్ల   పాటు యథాతథంగా కొనసాగించాలని, ఈ అంశంలో రాజీ పడే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సీట్ల ఏకరీతి పెంపు, పాతికేళ్ల స్తంభన ప్రతిపాదనలు దక్షిణాది ముఖ్యంగా స్టాలిన్ లేవనెత్తిన అభ్యంతరాలకు అనుగుణంగా ఉన్నాయి.  ఇది కూడా చదవండి: డీలిమిటేషన్ ఎందుకు అవసరం: దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేదెలా.? ఇకపోతే.. ఈ ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి పెను సవాలేననడంలో సందేహం లేదు. రాజ్యాంగ సవరణకు ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కాగా, లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందాలంటే.. ప్రస్తుత సంఖ్యలను బట్టి  358 మంది సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఎన్డీఏ కూటమికి   319 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉందని అంచనా.  అయితే  లెక్కల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన 8 మంది ఎంపీలు, డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీల వైఖరి   కీలకంగా మారింది.  రాష్ట్రాల సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచాలని ఈ రెండు పార్టీలు గతంలో డిమాండ్ చేయగా, ఇప్పుడు కేంద్రం ఆ ప్రతిపాదనకు అంగీకరించిన నేపథ్యంలో వాటి ఓటింగ్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు పార్టీల ఎంపీలు మద్దతు ఇస్తే ఎన్డీఏ మెజారిటీకి   దగ్గరయ్యే అవకాశం ఉన్నా, కూడా మూడింట రెండొంతుల మంది మద్దతుకు ఇంకా దూరంగానే నిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొందరు సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉంటే రాజ్యాంగ సవరణ అవసరమయ్యే డీలిమిటేషన్ బిల్లు ఆమోద ప్రక్రియ సులభతరం కావచ్చని పరిశీలకులు అంటున్నారు.  రానున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చర్చలు, సవరణల ప్రతిపాదనలు, వివిధ పార్టీల  వైఖరులు స్పష్టమయ్యే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల వాటా పరిరక్షణ, 25 ఏళ్ల స్థిరత్వ హామీ, మహిళా ప్రాతినిధ్య అంశాలపై పార్లమెంట్ లోపల, వెలుపల విస్తృత చర్చలు సాగుతాయనడంలో సందేహం లేదు.  మొత్తంగా చూస్తే, 50 శాతం సీట్ల పెంపు మరియు 25 ఏళ్ల స్తంభన ద్వారా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను చల్లార్చుతూనే రాజ్యాంగ సవరణకు అవసరమైన మద్దతు కూడగట్టే వ్యూహాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మీకు నచ్చవచ్చు: డీలిమిటేషన్‌ ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే యత్నం.. కేంద్రంపై గౌరవ్‌ గొగోయ్‌ విమర్శలు డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. 2051 వరకు రాష్ట్రాల ప్రాతినిధ్యం స్థిరం.! [Delimitation Bill,   LokSabha seats, ncrease,   25year freeze, Southstates, demand, TrluguOne]
ALSO ON TELUGUONE N E W S
మేబీ ఇప్పుడు చెప్పుకుంటున్న పూర్తి మ్యాటర్ కంప్లీట్ అవ్వకుండానే నందమూరి అభిమానులంతా ఆపకుండా డాన్స్ లు చేస్తారేమో. ఎందుకంటే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని? ప్రేక్షకులలో కూడా ఆనందాన్ని నింపే ఈ న్యూస్ కి సంబంధించి పూర్తి మ్యాటర్ చూద్దాం. నందమూరి కుటుంబం నుంచి మూడో తరం హీరోగా మోక్షజ్ఞ సెల్యులాయిడ్ పై   అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు, తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ మూవీలో మ్యాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నాడనే న్యూస్  ఎక్స్ క్లూజివ్ హోదాలో సినీ అడ్డాస్, సోషల్ మీడియాలో రూమర్ హోదాలో చక్కర్లు కొడుతూ ఉంది .   ఆ అందరి మాటల ప్రకారం ఎన్టీఆర్ కి ఒక ప్రత్యేకమైన రోల్  ఉందట. ఎన్టీఆర్ చేస్తే  బాగుంటుందని దర్శకుడు వశిష్ఠ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని బాలకృష్ణ దగ్గర కూడా ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే మాత్రం నందమూరి అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి.  అదే విధంగా మూవీ రూపు రేఖలు మారిపోయి అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయం. నందమూరి కుటుంబానికి చెందిన హీరోలు చాలా ఏళ్ళ తర్వాత  ఒకే సినిమాలో కనిపించడం అభిమానులకి, ప్రేక్షకులకి ప్రత్యేకమైన అనుభూతిని కూడా ఇస్తుంది. ఇది కూడా చదవండి: బాహుబలి 2 రికార్డ్స్ కి సారీ చెప్పిన రామాయణ: అది కూడా 23 డేస్ లోనే!  సోషియో ఫాంటసీ జోనర్ అనే రూమర్ కూడా యథేచ్ఛగా స్ప్రెడ్ అవుతుండటం అదనపు స్పెషాలిటీ.  మోక్షజ్ఞ తొలి సినిమా కావడంతో బాలకృష్ణ కూడా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కథ, పాత్రలు, మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నిజానికి గత కొంతకాలంగా బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య దూరం ఉందంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కుటుంబానికి సంబంధించిన సందర్భాల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఒకరికొకరు అండగా నిలిచిన దాఖలాలు ఉన్నాయి.   ఇలాంటి సమయంలో మోక్షజ్ఞ సినిమాలో ఎన్టీఆర్ ప్రత్యేక రోల్ లో కనిపిస్తారనే    వార్త రావడం ఆసక్తిని పెంచుతోంది. నిజంగానే ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటే నందమూరి అభిమానులకి భావోద్వేగపరంగా కూడా ప్రత్యేకమైన సందర్భం అవుతుంది. ఏది ఏమైనా రూమర్ కి కూడా అందరి లాగానే ఒక మనసు ఉంటుందని, ఎన్టీఆర్, మోక్షజ్ణ న్యూస్    నిజమవ్వాలని కోరుకుందాం. ఎన్టీఆర్ ప్రెజెంట్ డ్రాగన్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  మీకు నచ్చవచ్చు  ప్రముఖ హీరోయిన్ భక్తి  పాటలు: మంత్ర ముగ్దులు అవుతున్న ఫ్యాన్స్!  కావాల్సింది గెటప్, బ్యాక్ గ్రౌండ్ కాదు.. కథ, కథనం సామి!   [Balakrishna,Ntr, Mokshjna, Vasishta, Tollywood]  
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా 100 రోజుల మైలురాయిని చేరుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకోవడంతో చిత్రబృందం సెలబ్రేషన్స్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మైత్రి థియేటర్లలో ప్రత్యేక షోలు ఏర్పాటు చేశారు. ఆగస్టు 21, 2026న విడుదలైన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకెళ్లింది. ఒక మధ్యతరగతి తండ్రి తన కూతురి కోసం చేసే ప్రయాణం, ఆ క్రమంలో అతడి జీవితంలో చోటుచేసుకునే మార్పులను దర్శకుడు శివ నిర్వాణ ఎమోషనల్‌గా చూపించారు.  ఈ కథ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో సినిమా సుదీర్ఘమైన థియేట్రికల్ రన్‌ను కొనసాగించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. సినిమాలో రవితేజ నటనతో పాటు జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి బలంగా నిలిచాయి. తండ్రి–కూతురు ఎమోషన్‌తో కూడిన కథకు సంగీతం మరింత బలాన్ని ఇచ్చిందనే ప్రశంసలు వచ్చాయి. ఇది కూడా చదవండి: స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య కీర్తన.! 100 రోజుల వేడుక సందర్భంగా ఈ రోజు రాత్రి 10:23 గంటలకు బాలానగర్‌లోని మైత్రి విమల్ 70 MM, దిల్‌సుఖ్‌నగర్‌లోని మైత్రి గంగ థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహిస్తున్నారు. ఈ షోలలో సినిమాలోని హిట్ పాటలను రెండుసార్లు ప్లే చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టికెట్లు District యాప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవైపు 100 రోజుల మైలురాయి, మరోవైపు ప్రత్యేక షోలతో ‘ఇరుముడి’ టీమ్ ఈ విజయాన్ని అభిమానులతో కలిసి జరుపుకుంటోంది. రవితేజకు మరో విజయవంతమైన సినిమాగా నిలిచిన ‘ఇరుముడి’ 100 రోజుల వేడుక ఇప్పుడు అభిమానుల్లో సందడి తీసుకొస్తోంది. మీకు నచ్చవచ్చు:  తెలుగు సినిమాకు మంచి రోజులు వస్తాయా.? బాలకృష్ణకు సుమలత క్షమాపణలు!       [Ravi Teja, Irumudi, 100 Days Celebration, Special Shows, Hyderabad]  
ఎంత మంది గొప్ప నటులు ఉన్నా,  వచ్చినా, పుట్టే అవకాశం ఉన్నా కూడా  నేను మీ కంటే పెద్ద నటుడునని సగర్వంగా చెప్పుకోగలడు మమ్ముట్టి. మరి పూర్తి కండిషన్ లో రన్ అవుతున్న  ఆ  ట్రాక్ రికార్డు చూస్తే పై మాటపై అనుమానం పెంచుకున్న అనుమాన పక్షులు ఎవరైనా ఉన్నా సరే మమ్మట్టి గొప్ప నటుడని ఒప్పుకోవాల్సిందే. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తు వస్తున్న మమ్ముట్టి తాజాగా  చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమాలో కనీసం ఒక్కసారైనా డ్యాన్స్ చేయాలని తనకు కోరిక ఉండేదని.. కానీ ఇప్పుడు డ్యాన్స్ చేస్తే అది కూడా ఏఐతో చేసిన వీడియో అని ప్రేక్షకులు అనుకుంటారేమో అంటూ నవ్వులు పూయించారు. ఏఐ డ్యాన్స్ రీల్స్ చూసి మమ్ముట్టి ఆశ్చర్యం! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ వీడియోల హవా నడుస్తోంది. ముఖ్యంగా సినీ హీరోలు, హీరోయిన్ల ఫొటోలు తీసుకుని వారు చేయని పనులు చేసినట్లు వీడియోలు రూపొందిస్తున్నారు. మమ్ముట్టి కూడా ఈ ఏఐ రీల్స్‌కు అతీతం కాదు. ఆయన డ్యాన్స్ చేస్తున్నట్లుగా రూపొందించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.   ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మమ్ముట్టి ఆసక్తికరంగా స్పందించారు. తనకు ఎప్పటి నుంచో సినిమాలో డ్యాన్స్ చేయాలని కోరిక ఉందని, కానీ అది చాలా కష్టమైన పని అని చెప్పారు. ఇప్పుడు ఎంతో కష్టపడి నిజంగానే డ్యాన్స్ చేసినా.. అది ఏఐ వీడియో అని ప్రేక్షకులు అనుకుంటారని సరదాగా వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి:రామాయణ కలెక్షన్ల సునామీ: బాహుబలి 2 లైఫ్ టైం రికార్డు బ్రేక్! నా డ్యాన్స్‌ని  కూడా నమ్మరేమో! యువత ప్రస్తుతం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్‌ను ఉపయోగించి రకరకాల వీడియోలు, రీల్స్ తయారు చేస్తున్నారని మమ్ముట్టి తెలిపారు. తనను ఊహించని రీతిలో డ్యాన్స్ చేయిస్తున్న ఏఐ వీడియోలు చూసి తానే ఆశ్చర్యపోతున్నానని చెప్పారు. అందుకే నిజంగా డ్యాన్స్ చేసినా దాన్ని నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చని చమత్కరించారు. ఏఐపై మమ్ముట్టి ఆందోళన కూడా! అయితే మమ్ముట్టి వ్యాఖ్యల్లో కేవలం హాస్యం మాత్రమే కాదు.. ఏఐ భవిష్యత్తుపై ఆందోళన కూడా కనిపించింది. ప్రస్తుతం అమెరికా, చైనా వంటి దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఈ సాంకేతికతను సరైన వ్యక్తులు ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, అదే నియంతలు లేదా ఆధిపత్య ధోరణి ఉన్న వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు.   ఏఐ అనేది మనం సరదాగా మాట్లాడుకునే అంశం మాత్రమే కాదని, మనుషుల జీవితాలపై ప్రభావం చూపగల తీవ్రమైన ముప్పు అని  అభిప్రాయపడ్డారు. చివరకు మన కదలికలకి  కూడా నియంత్రించే స్థాయికి ఈ టెక్నాలజీ వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి ఒకవైపు తన డ్యాన్స్‌పై సరదా వ్యాఖ్యలతో నవ్వించిన మమ్ముట్టి.. మరోవైపు ఏఐ దుర్వినియోగంపై చేసిన హెచ్చరికలతో అందరినీ ఆలోచింపజేశారు. నిజంగా ఏఐ టెక్నాలజీ ఎంత వేగంగా మారిపోతోందో ఆయన వ్యాఖ్యలు మరోసారి గుర్తుచేస్తున్నాయి. మమ్ముట్టి ప్రస్తుతం ధనుష్ తో కలిసి 'ఓం' తో థియేటర్స్ లో ఉన్నాడు.   మీకు నచ్చవచ్చు  గురువాయూర్ ఆలయంలో ప్రముఖ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా! భోగి ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్స్!   [Mammotty, Om, Dhanush, Ai, Dance]  
  రష్మిక మందన్న నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమా ‘మైసా’. నవంబర్ 27న విడుదల కావాల్సిన ఈ మూవీ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పటివరకు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనే చర్చ నడుస్తుండగా, ఇప్పుడు మరో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. సినిమా క్లైమాక్స్ విషయంలో మేకర్స్ సంతృప్తిగా లేరని, అందుకే వాయిదా వేశారని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘మైసా’ ఫైనల్ కాపీ చూసిన తర్వాత మేకర్స్‌కు క్లైమాక్స్ విషయంలో కొన్ని సందేహాలు వచ్చాయట. సినిమా చివర్లో ప్రేక్షకులకు మరింత బలమైన ఇంపాక్ట్ ఇవ్వాలంటే ఎండింగ్‌ను మార్చాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారట. ఇందుకోసం క్లైమాక్స్ సీక్వెన్స్‌ను మళ్లీ రీషూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరోవైపు ‘మైసా’ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అందుకే కేవలం విడుదల తేదీని దృష్టిలో పెట్టుకుని హడావుడి పడకుండా, సినిమా అవుట్‌పుట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో రష్మిక ఇప్పటివరకు చేయని ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఉన్న కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో కూడా మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారనే మాట వినిపిస్తోంది. ఇది కూడా చదవండి: కాకా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. విశ్వంభర పరిస్థితి ఏంటి.? అయితే క్లైమాక్స్ రీషూట్, పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజంగానే ఎండింగ్ మార్చి మళ్లీ షూట్ చేస్తారా? ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ‘మైసా’ విడుదల ఆలస్యంపై ఇప్పుడు క్లైమాక్స్ రీషూట్ టాక్ ఆసక్తిని పెంచుతోంది. కొత్త ఎండింగ్‌తో రష్మిక సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి. మీకు నచ్చవచ్చు: RC17 కాస్టింగ్ కాల్.. రామ్ చరణ్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్.! బాలకృష్ణకు సుమలత క్షమాపణలు.. ఆ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా.?       [Rashmika Mandanna, Mysaa Movie, Climax Reshoot, Pan India]
Naga Chaitanya's Vrushakarma is gearing up for a grand worldwide release on December 4. The trailer has received a strong response, raising expectations for the ambitious film directed by Karthik Dandu. The makers recently held a grand media meet attended by a large gathering of fans and media personnel. Speaking at the event, Chaitanya said he had been manifesting to be part of a theatrical epic spectacle since the beginning of his career. He expressed happiness that Karthik Dandu came up with such an intriguing subject, adding that he loved the director's handling of emotions, visuals and grandeur in Virupaksha. Chay revealed that he completely submitted himself to Karthik's vision after seeing the way he designed the characters, visuals and VFX. Having watched the film, the actor expressed confidence that audiences would enjoy its powerful story, engaging screenplay and grand theatrical experience. The actor also said the response to the trailer gave him an unreal kick. After working collectively for three years to bring the film to life, seeing audiences react positively made him feel that such moments were the reason he had entered the film industry. Also Read: King Daddy Cool: SRK and Kareena back with a banger Director Karthik Dandu thanked Chaitanya for believing in the script after the first narration and supporting his vision. He also acknowledged the actor's dedication and creative inputs in bringing his character Arjun to life. Meenakshi Chaudhary, who plays the leading lady, said the film's characters would stand out alongside its visuals. Produced by BVSN Prasad and Sukumar Writings on a massive scale, Vrushakarma is the highest-budgeted film in Chaitanya's career. Sparsh Srivastava plays a prominent role, while Ajaneesh Loknath has composed the music. The film's pre-release event is scheduled for December 2, ahead of its multilingual release. Check Out:  Vrushakarma Trailer: An Epic Scale Film                       Chiranjeevi's popular title for Virat Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాలు పెరిగిపోయాయి. భారీ బడ్జెట్లు, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్‌తో సినిమాలు వస్తున్నాయి. కానీ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే పక్కా లోకల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్లు మాత్రం కొంతకాలంగా తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ కావడంతో.. అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై పడింది. ఎన్టీఆర్ స్వయంగా ఈ సినిమా ఒక ‘లాఫ్ రైట్’లా ఉంటుందని చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఎన్టీఆర్‌కు కామెడీ కొత్త కాదు. ‘అదుర్స్’, ‘బాద్‌షా’ సినిమాల్లో ఆయన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించారు. అయితే గత కొన్నేళ్లుగా ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’, ‘వార్ 2’ వంటి భారీ యాక్షన్ సినిమాలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే మరో భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్‌ను మళ్లీ పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌లో చూడాలనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. మరోవైపు అనిల్ రావిపూడి సినిమాలంటే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ గుర్తుకొస్తాయి. ‘ఎఫ్2’, ‘భగవంత్ కేసరి’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి సినిమాలతో ఆయన తనకంటూ ఒక కమర్షియల్ స్టైల్‌ను ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా సంక్రాంతి ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించడంలో అనిల్‌కు మంచి గుర్తింపు ఉంది. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌లో ఆ యాంగిల్.. పదేళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌.! ఇటీవల గోవాలో జరిగిన 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్' కార్యక్రమంలో కూడా ఎన్టీఆర్‌తో సినిమా గురించి అనిల్ రావిపూడి ఆసక్తికరంగా మాట్లాడారు. ఎన్టీఆర్ స్టార్డమ్, అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అదే సమయంలో ఆయనలోని కామెడీ యాంగిల్‌ను కూడా ఉపయోగించుకుంటూ, న్యూట్రల్ ఆడియన్స్ కూడా మెచ్చేలా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా మార్కెట్, ఇతర భాషల ప్రేక్షకులు అనే ఆలోచన ఎక్కువైంది. కానీ మన తెలుగు ప్రేక్షకులకు తెలిసిన కుటుంబ వాతావరణం, మన కామెడీ, మన ఎమోషన్స్‌తో సినిమా తీస్తే కూడా థియేటర్లలో మంచి ఆదరణ దక్కుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. ‘ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి’ సినిమా అలాంటి ప్రయత్నం అవుతుందా? తెలుగు కమర్షియల్ సినిమాలకు కొత్త ఊపునిస్తుందా? అన్నది చూడాలి. మీకు నచ్చవచ్చు:  జపాన్‌లో లెనిన్ రిలీజ్.. ప్రభాస్, ఎన్టీఆర్ రేంజ్‌కి అఖిల్ వెళ్తాడా.? బాలకృష్ణకు సుమలత క్షమాపణలు.. ఆ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా.?       [Jr NTR, Anil Ravipudi, Tollywood, Commercial Cinema, Pan India]  
హీరోయిన్ అంటే ఏమనుకుంటున్నారు? హీరోయిన్ అనే అనుకుంటున్నామని అంటున్నారు కదు.. తనలో మల్టి టాలెంట్ పెర్ఫార్మ్ ఉంది. సినిమాల్లో  కాదు నిజ జీవితంలో. మరి మీరే చూసేయండి.    ఒకప్పుడు వెండితెరపై సందడి చేసిన ముద్దుగుమ్మ శరణ్య మోహన్. తాజాగా కేరళలోని గురువాయూర్ ఆలయంలో భక్తి పాటలు ఆలపిస్తూ కనిపించింది. ఆమె గాత్రం విన్న భక్తులు, అభిమానులు ఫిదా అవుతున్నారు.  నటిగానే కాదు.. మంచి గాయని కూడా! మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటి శరణ్య మోహన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి  క్యూట్ లుక్స్, సహజమైన నటనతో అభిమానులని సంపాదించుకుంది. అయితే శరణ్యలో నటన మాత్రమే కాదు.. సంగీత ప్రతిభ కూడా ఉందని తాజాగా బయటపడింది. కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె భక్తి పాటలు ఆలపించారు. ఎంతో ప్రశాంతంగా, భక్తి భావంతో ఆమె పాటలు పాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కూడా చదవండి: నాగ చైతన్యలో ఈ మార్పు గమనించారా?చిన్న చిన్న విషయాలకే ఎందుకు కృంగిపోవాలి! భక్తి పాటలతో ఆకట్టుకున్న శరణ్య సినిమాల్లో కనిపించే గ్లామర్‌కు భిన్నంగా సంప్రదాయబద్ధమైన వాతావరణంలో శరణ్య కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె గాత్రంలో భక్తి భావం ఉట్టిపడటంతో వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నటిగా మాత్రమే తెలిసిన ఆమెకు సంగీతంలోనూ మంచి ప్రతిభ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నా.. అభిమానులకు దగ్గరగానే! శరణ్య మోహన్ సినిమాల్లో చురుగ్గా కనిపించిన సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలకి  దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నారు.   మొత్తానికి వెండితెరపై తన నటనతో మెప్పించిన శరణ్య మోహన్.. ఇప్పుడు భక్తి గీతాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె పాడిన పాటల వీడియో చూసిన అభిమానులు మాత్రం నటనతో పాటు సంగీతంలోనూ ఇంత ప్రతిభ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.మలయాళంలో మూడు, తమిళంలో రెండు చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. టీనేజ్‌లోకి వచ్చాక సహాయ పాత్రలు, తర్వాత హీరోయిన్ . తెలుగులో  'విలేజ్‌లో వినాయకుడు'లో హీరోయిన్‌గా చేసిన శరణ్య.. తర్వాత నాని 'భీమిలి కబడ్డీ జట్టు', 'కల్యాణ్ రామ్ కత్తి', 'హ్యాపీహ్యాపీగా' చిత్రాల్లోని కనిపించింది.   మీకు నచ్చవచ్చు  భోగి మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్! మీ అభిమాన రొమాంటిక్ థ్రిల్లర్ ఓటిటిలోకి వచ్చింది!   [Saranya, Guruvayoor, villege lo vinyakudu, Tollywood]  
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా గందరగోళం నెలకొంది. ఈ సినిమా వాయిదా పడుతుందని, ఏప్రిల్ 7న విడుదల చేయాలని చూస్తున్నారని వార్తలు వచ్చాయి. మరోవైపు చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ రెండు సినిమాల్లో సంక్రాంతి బరిలో ఏది నిలుస్తుందనే ఆసక్తి పెరిగింది. అయితే తాజాగా ‘కాకా’ చిత్రబృందం మరోసారి విడుదల తేదీపై స్పష్టత ఇచ్చింది. ముందుగా ప్రకటించినట్లుగానే 2027 జనవరి 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించింది. దీంతో ‘కాకా’ వాయిదా పడుతుందనే ప్రచారానికి టీమ్ చెక్ పెట్టినట్లయింది. రచయిత కోన వెంకట్ కూడా ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. తమ లక్ష్యం, దృష్టి, ప్లాన్ అన్నీ జనవరి 13నే అని పేర్కొంటూ.. కొత్త ఆన్-లొకేషన్ చిరంజీవి, బాబీతో కలిసి ఉన్న ఫోటోను కోన పోస్ట్ చేశారు. మరోవైపు దర్శకుడు బాబీ కూడా ఆ ఫొటోను షేర్ చేస్తూ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. ‘47 డేస్ టు కాకా’ అంటూ సంక్రాంతి రిలీజ్‌పై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘కాకా’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సత్యం అనే పాత్రలో కనిపించనున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది కూడా చదవండి: మెగా ట్విస్ట్.. వారణాసి రిలీజ్ డేట్‌కి కాకా.! మొత్తానికి ‘కాకా’ టీమ్ జనవరి 13 విడుదల విషయంలో వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేసింది. దీంతో ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది. మరి ‘విశ్వంభర’ కూడా సంక్రాంతి సీజన్ లోనే విడుదలై సర్ప్రైజ్ చేస్తుందా? లేక మరో కొత్త విడుదల తేదీని చూసుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. మీకు నచ్చవచ్చు:  సందీప్ రెడ్డి వైరల్ కామెంట్స్.. హాలీవుడ్ స్టార్స్‌ కంటే చిరంజీవి గొప్ప.! RC17 కాస్టింగ్ కాల్.. రామ్ చరణ్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్.!       [Chiranjeevi, Kaaka Movie, Sankranthi Release, Vishwambhara]  
ఫ్యాన్స్ అండ్ డియర్ ఆడియెన్స్ డోంట్ వర్రీ.. ఈ సారి కూడా డిఫరెంట్ సబ్జెక్టు వృష కర్మ తో మీకు అసలైన సినీ విందు, మజాని డిసెంబర్ 4 న ఇవ్వడానికి వస్తున్నాను అంటున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. హిట్టు కూడా పక్కా అంటూ ప్రమోషన్స్ ని కూడా చాలా కాన్ఫిడెన్స్ గా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రమోషన్స్ లో చేసిన వ్యాఖ్యలు చైతన్య అందమైన మనసుని అద్దంలో చూసేలా చేస్తున్నాయి. మరి ఆ అందమైన మనసుని చూసేద్దాం. సినిమాలు కొందరికి వినోదాన్ని ఇస్తే.. మరికొందరికి జీవితంపై కొత్త ఆలోచనలను కలిగిస్తాయి. ముఖ్యంగా కొన్ని క్యారెక్టర్స్, కొన్ని అనుభవాలు నటీనటుల జీవితాలపై కూడా ప్రభావం చూపిస్తుంటాయి. అలాంటి అనుభవమే తనకు తండేల్ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైందని యువసామ్రాట్ నాగచైతన్య వెల్లడించారు. నగరాల్లో ఉంటూ చిన్నచిన్న సమస్యలకే బాధపడే మనం.. నిజంగా ఎంత సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నామో మత్స్యకారుల జీవితాలని  దగ్గరగా చూసిన తర్వాత అర్థమైందని చెప్పుకొచ్చాడు. తండేల్ మూవీ మార్చిన ఆలోచనా విధానం! నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండేల్. ఈ సినిమాలో చైతన్య ఒక మత్స్యకారుడి పాత్రలో కనిపించారు. ఈ పాత్ర కోసం ఆయన శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మత్స్యకారులతో సమయం గడిపాడు . వారి జీవనశైలి, సముద్రంలో ఎదురయ్యే పరిస్థితులు, కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు పడే కష్టాలను దగ్గరగా తెలుసుకున్నాడు.   సినిమా షూటింగ్ సమయంలో మత్స్యకారుల జీవితాలను పరిశీలించినప్పుడు వారి కష్టాలు తనను ఎంతో కదిలించాయని నాగచైతన్య తెలిపారు. సముద్రంలోకి వెళ్లిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు. అయినప్పటికీ కుటుంబం కోసం, జీవనోపాధి కోసం వారు ప్రతిరోజూ సముద్రంలోకి వెళ్లాల్సిందే. బతికినా, చనిపోయినా సముద్రమే వారి జీవితమనే పరిస్థితులు ఉంటాయని వివరించారు. ఇది కూడా చదవండి: గెటప్ మార్చినంత మాత్రాన ప్రేక్షకులు కనెక్ట్ అవుతారా? చిన్న సమస్యలకే ఎందుకు అంత బాధపడుతున్నాం? నగరాల్లో నివసించే మనం రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలకే ఎంతో బాధపడుతుంటాం. కానీ మత్స్యకారుల జీవితాల్లోని అసలైన పోరాటాన్ని చూసిన తర్వాత మనం ఎంత అదృష్టవంతులమో అర్థమైందని చైతన్య అభిప్రాయపడ్డారు. వారి కష్టాలు, అనిశ్చితుల మధ్య కూడా వారు చూపించే ధైర్యం, కుటుంబాలపై ప్రేమ తనకు ఎన్నో విషయాలు నేర్పాయని చెప్పారు. ఒక సినిమా కోసం చేసిన ప్రయాణం తన ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చిందని ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. తెరపై ఒక పాత్రను పోషించడం మాత్రమే కాకుండా, ఆ పాత్ర వెనుక ఉన్న నిజమైన మనుషుల జీవితాలను తెలుసుకోవడం కూడా నటుడిగా తనకు గొప్ప అనుభవమని చెప్పొచ్చు. తన సైలెంట్ నేచర్‌పైనా చైతూ కామెంట్స్! ఇదే సందర్భంగా తన వ్యక్తిత్వం గురించి కూడా నాగచైతన్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను ఇంట్రోవర్ట్ అని, తన గురించి వచ్చే రూమర్స్ చూసినప్పుడు కూడా ఎక్కువగా స్పందించకుండా సైలెంట్‌గా ఉండిపోతానని తెలిపారు. అయితే తన మౌనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు.  ఇక కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన వృషకర్మ డిసెంబర్ 4న రానుంది. గోల్డెన్ లెగ్ భామ మీనాక్షి చౌదరి హీరోయిన్.ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ట్రావెల్ వ్లాగర్ జాస్తితో కలిసి ట్రెక్కింగ్ చేస్తూ తన జీవితానుభవాలని  పంచుకున్నాడు. మొత్తానికి తండేల్ సినిమా నాగచైతన్యకు కేవలం నటుడిగా కొత్త అనుభవాన్ని మాత్రమే కాదు.. జీవితాన్ని చూసే విధానంలోనూ ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసినట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. నిజ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనే మత్స్యకారుల పోరాటం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అందుకే అంటారు సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు. నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడానికి నీ ముందున్న అతి పెద్ద పాఠ్య గ్రంధం.   మీకు నచ్చవచ్చు  భోగి ఫస్ట్ డే కలెక్షన్స్ వెంకటేష్ అభిమానులకి  తీపి కబురు: మీ అభిమాన మూవీ రీ రిలీజ్!       [Naga Chaitanya, Vrushakarma, meenakshi chowdary, Karthik Dandu]    
టాలీవుడ్‌లో కొంతకాలంగా చర్చకు దారితీస్తున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జానీ మాస్టర్ భార్య, డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు చెందిన సుమలత తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన ఘటనలతో పాటు, నందమూరి బాలకృష్ణపై గతంలో చేసిన వ్యాఖ్యల విషయంలోనూ ఆమె తన తప్పును అంగీకరించారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉన్న నిర్మాతల మండలి హాల్‌లో సుమలత ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. తమ యూనియన్‌లో జరిగిన అవకతవకలతో మొదలైన వివాదం, ఆ తర్వాత ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌తో విభేదాలకు దారితీసిందని సుమలత వివరించారు. ఛాంబర్ సమావేశానికి తాము నాన్ కోఆపరేషన్ గురించి మాట్లాడేందుకు వెళ్లామని, ఆ సమయంలో పల్లి కేశవరావుపై దాడి జరగడం తప్పేనని ఆమె అంగీకరించారు. ఈ ఘటనకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ సభ్యులందరికీ, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌కు క్షమాపణలు చెప్పారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్‌లో జరిగిన ఘటనల విషయంలోనూ విచారం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. ఇక బాలకృష్ణ విషయంలో సుమలత చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ ప్రెస్‌మీట్‌లో స్పష్టత ఇచ్చారు. బాలకృష్ణ లాంటి పెద్దల వల్లే సినిమా పరిశ్రమ బాగుందని, వారి గురించి తప్పుగా మాట్లాడే అర్హత తమకు లేదని అన్నారు. గతంలో తాను మాట్లాడిన మాటలకు బాధపడుతున్నానని, వివాదాన్ని పరిష్కరించాలని సూచించిన బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఫెడరేషన్‌తో కలిసి పనిచేయాలని ఉందని చెప్పారు. ఇది కూడా చదవండి: నంది అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా బాలకృష్ణ.! నిజానికి డ్యాన్సర్స్ యూనియన్ వివాదాన్ని పరిష్కరించాలని బాలకృష్ణ స్వయంగా ప్రసన్న కుమార్ వంటి వారికి సూచించారు. అదే విషయాన్ని అప్పుడు సుమలతకు ప్రసన్న కుమార్ చేరవేయగా.. ఆమె మాతో బాలకృష్ణ మాట్లాడలేదంటూ కామెంట్స్ చేశారు. దాంతో అది వివాదమైంది. ఇప్పుడు తన తప్పు తెలుసుకొని.. నేరుగా చెప్పబోయి, మరో అర్థమొచ్చేలా చెప్పానని, అందుకు క్షమించాలని సుమలత కోరారు. మొత్తానికి సుమలత క్షమాపణలతో డ్యాన్సర్స్ యూనియన్ వివాదం సద్దుమణిగే దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే యూనియన్‌లోని అంతర్గత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయా? జానీ మాస్టర్‌పై ఉన్న ఆంక్షల విషయంలోనూ త్వరలో ఏదైనా నిర్ణయం వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మీకు నచ్చవచ్చు: ఓటీటీలోకి ‘ఆదర్శ కుటుంబం’.. రెస్పాన్స్ ఎలా ఉందంటే.? బ్రహ్మమొక్కటే: స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య కీర్తన.!       [Dancers Union Controversy, Sumalatha Apology, Nandamuri Balakrishna, Jani Master]  
వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఇవి అలవాటు చేసుకోండి..! వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అలసట పెరగడం, బరువు పెరగడం, ముఖంలో కాంతి తగ్గడం చాలా మందికి ఎదురయ్యే సమస్యే. కానీ గంటల తరబడి జిమ్‌లో కష్టపడకుండా లేదా కఠినమైన డైట్లు చేయకుండా, మన రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే ఎప్పటికీ ఉత్సాహంగా, ఫిట్‌గా, యవ్వనంగా ఉండొచ్చు.  ఆ అలవాట్లు ఏమిటో అవి వయసు పెరిగినా యవ్వనంగా ఉండటంలో ఎలా సహాయపడతాయో వివరంగా  తెలుసుకుంటే.. ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా ప్రశాంతంగా రోజును ప్రారంభించాలి. ఫోన్ చూస్తే వెంటనే అనవసరపు ఆలోచనలు, ఒత్తిడి మొదలవుతాయి. కనీసం మొదటి 15 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. లేవగానే టీ లేదా కాఫీ తాగే బదులు ఒకటి రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. తర్వాత కాసేపు ఉదయపు ఎండలో నిలబడి కనీసం 10 నిమిషాలు నడవాలి. ఇది శరీరానికి కొత్త శక్తిని ఇచ్చి, బద్ధకాన్ని తగ్గిస్తుంది. భోజనం చేసేటప్పుడు టీవీ లేదా ఫోన్ చూడకూడదు. ఆహారాన్ని గమనిస్తూ నెమ్మదిగా నమిలి తింటే కడుపు నిండిన భావన సమయానికి తెలిసి, అతిగా తినకుండా ఉంటాము. ఇది కూడా చదవండి   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది.. జిమ్‌కు వెళ్లే సమయం లేకపోయినా రోజంతా శరీరానికి కదలిక ఉండేలా చూసుకోవాలి. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, ఫోన్ మాట్లాడేటప్పుడు నడవడం, భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయడం వంటి చిన్న అలవాట్లు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. కడుపు పూర్తిగా నిండేంత వరకు కాకుండా 80 శాతం నిండగానే తినడం ఆపేయాలి. అలాగే ప్లేట్‌లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో జంక్ ఫుడ్, చిప్స్, కూల్ డ్రింక్స్ కనిపించేలా ఉంచుకోకుండా, పండ్లు , నీళ్ల బాటిళ్లను కళ్ల ముందు ఉంచుకోవాలి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్‌గా మంచి ఆహారం తీసుకునే అలవాటు పెరుగుతుంది. ఒకేసారి పెద్ద పెద్ద మార్పులు చేసుకోవాలని గట్టి నిర్ణయాలు తీసుకుని తర్వాత వదిలేయడం కంటే, రోజుకు కొంచెం కొంచెంగా చిన్న అలవాట్లు మార్చుకోవడం ఉత్తమం. అలాగే ఒకరోజు తప్పు జరిగినా నిరుత్సాహపడకుండా మరుసటి రోజు మళ్లీ కొనసాగించడం ముఖ్యం. రాత్రి పడుకునే కనీసం గంట ముందు ఫోన్, టీవీ స్క్రీన్లకు దూరంగా ఉండాలి. గాఢ నిద్ర సరిగ్గా లభిస్తే మరుసటి రోజు శరీరం ఉత్సాహంగా ఉంటుంది, అనవసరమైన ఆకలి కోరికలు కూడా తగ్గుతాయి.                                                                                                                                            *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   రిలేషన్‌షిప్‌లో పర్సనల్ స్పేస్..భాగస్వామి ఒంటరిగా గడపాలని కోరుకోవడానికి      అసలు కారణాలు..!                                   జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..!
మగాళ్ల రహస్యం..  భార్యకు,  కుటుంబ సభ్యులకు ఈ విషయాలు అస్సలు చెప్పరట..! మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా మగవారికి ఒక రకమైన  నియమం ఉంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా మొహంలో చిరునవ్వు చెరగకూడదు, ఎవరి ముందూ కన్నీళ్లు పెట్టుకోకూడదు, అన్ని బాధ్యతలను ఒంటిచేత్తో మోయాలి అనే మాటలు చిన్నప్పటి నుంచే వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, శారీరక అలసటైనా వాళ్లు చాలావరకు బయటకు చెప్పుకోరు. కానీ బయటకు గట్టిగా కనిపించే ప్రతి మనిషి లోపలా ఎన్నో సున్నితమైన భావోద్వేగాలు, చిన్న చిన్న ఆశలు దాగి ఉంటాయి. మగవారు తమ భార్య నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మనసులో ఏం కోరుకుంటారో, కానీ బయటకు ఎందుకు చెప్పలేరో వివరంగా తెలుసుకుంటే.. అసలు మీరు ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగితే బాగుంటుందని.. కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాగోగులు మగవారే చూసుకుంటూ ఉంటారు. పిల్లల చదువు, అమ్మానాన్నల ఆరోగ్యం, ఇంటి ఖర్చులు ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తారు. కానీ వారిని ఎవరైనా ఒక్కసారి మీరు ఎలా ఉన్నారు, ఈరోజు మీకు ఎలా గడిచింది అని అడిగితే చాలా సంతోషిస్తారు. తమ మనసులోని మాటలను ఎలాంటి భయం లేకుండా, మొహమాటం లేకుండా చెప్పుకునే మనిషి ఒకరు పక్కన ఉండాలని వాళ్లు లోలోపల కోరుకుంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం వాళ్లే చూపించాలని అనుకోరు.. ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అందరి చూపు ముందుగా ఇంటిలోని మగవారి వైపే ఉంటుంది. ఆర్థిక సమస్యలైనా, ఇతర కష్టాలైనా వాళ్లే పరిష్కరించాలని అందరూ ఆశిస్తారు. కానీ కష్టకాలంలో తమను ఒంటరిని చేయకుండా, కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడాలని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లు కోరుకుంటారు. ప్రతి భారాన్ని వాళ్ల మీదే వేయకుండా పంచుకుంటే ఎంతో ఊరటగా ఉంటుందని భావిస్తారు. చేసే కష్టానికి చిన్న మెచ్చుకోలు ఆశిస్తారు.. కుటుంబం కోసం మగవారు తమ సొంత ఆనందాలను, కోరికలను చాలాసార్లు పక్కన పెడతారు. రోజుల తరబడి కష్టపడి పని చేస్తారు. అయితే తమ పనికి పెద్ద పెద్ద బహుమతులు లేదా ఘనమైన సన్మానాలు ఏమీ ఆశించరు. కానీ మీ కష్టం నాకు కనిపిస్తోంది, మీరు చేస్తున్న పని చాలా గొప్పది లేదా ఒక్క చిన్న థ్యాంక్స్ వంటి మాటలు వినాలని మనసులో ఆశపడతారు. ఆ చిన్న ప్రశంస వాళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది కూడా చదవండి  రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా కాస్త విశ్రాంతి కావాలి.. సంపాదన, బాధ్యతలు అంటే జీవితకాలం పరుగెడుతూనే ఉండాలి అన్నట్టు కొందరు ప్రవర్తిస్తుంటారు. దానివల్ల కాసేపు తీరిక తీసుకుందామన్నా, సరదాగా గడుపుదామన్నా మగవారికి ఎక్కడో ఒక మూల తప్పు చేస్తున్నామనే భావన కలుగుతుంది. స్నేహితులతో కలవడమో, ఇష్టమైన సినిమా లేదా ఆట చూడటమో, లేదంటే కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండటమో వాళ్లకు కూడా అవసరం. ఏ విధమైన అపరాధ భావన లేకుండా అలాంటి సమయాన్ని కుటుంబం ఇస్తే వాళ్లు ఎంతో రిలాక్స్ అవుతారు. భావోద్వేగాలను తక్కువ చేసి చూడకూడదు.. చాలామంది మగవారు తమ బాధలను బయటకు చెప్పడానికి జంకుతారు. ఎక్కడ నన్ను బలహీనుడు అనుకుంటారో, ఎక్కడ హేళన చేస్తారో అనే భయం వారిలో ఉంటుంది. బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు రావడం లేదా మనసు విప్పి మాట్లాడటం బలహీనత కాదు, అది సహజమైన మనిషి స్వభావం. తాము ఏడ్చినా, బాధపడినా దాన్ని తేలికగా తీసుకోకుండా, అర్థం చేసుకుని గౌరవించాలని వాళ్లు కోరుకుంటారు. భార్య, కుటుంబం నుంచి ప్రేమ, ఆత్మీయతతో కూడిన తోడు.. భార్యాభర్తల బంధం కేవలం ఖర్చులు, బాధ్యతలు, అవసరాలకే పరిమితం కాకూడదు అని ప్రతి భర్త కోరుకుంటాడు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలబడటం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రేమ, నమ్మకం, ఆత్మీయత లభిస్తే ఆ మనిషికి అంతకంటే పెద్ద బలం మరొకటి ఉండదు. సొంత ఇష్టాలు, వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాలి.. పెళ్లయ్యాక, కుటుంబ బాధ్యతలు పెరిగాక చాలామంది మగవారు తమ సొంత అభిరుచులను, కలలను, ఇష్టాలను వదులుకుంటూ ఉంటారు. కేవలం డబ్బు సంపాదించే యంత్రంలానో, బాధ్యతల మనిషిలానో కాకుండా, తమకూ ఒక వ్యక్తిత్వం ఉందని, సొంత ఇష్టాలు ఉంటాయని కుటుంబం గుర్తించాలని వాళ్లు ఆశిస్తారు. తమ కలలను, స్నేహాలను, ఆసక్తులను గౌరవిస్తే వాళ్లు మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. మొత్తానికి బయటకు ఎంత గట్టిగా, ధైర్యంగా కనిపించినా మగవారికి కూడా ప్రేమ, ఓదార్పు, విశ్రాంతి, అండ అవసరం. ఈ విషయాలను వాళ్లు మాటల్లో చెప్పకపోయినా, మనసులో మాత్రం ఎంతో బలంగా కోరుకుంటారు. ఇంటిల్లిపాది కలిసి ఆ చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటే కుటుంబంలో ప్రేమ, సంతోషం ఇంకా పెరుగుతాయి.                                                                                                                                                *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ప్రేమ, నమ్మకం ఉన్నప్పటికీ.. లైఫ్ పార్ట్నర్ ఎందుకు మారిపోతారు.!                                    ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు
చలికాలం రాగానే వాతావరణం చల్లగా మారుతుంది, ఎండ వేడి తగ్గినట్టు అనిపిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలామంది సన్‌స్క్రీన్ వాడటం ఆపేస్తారు. కానీ మన చర్మం థర్మామీటర్ చూసి స్పందించదు, కాంతికి స్పందిస్తుంది. మిద్దె మీద లేదా ఆరుబయట కొన్ని గంటలు గడిపితే చల్లని గాలిలో కూడా ముఖం, చేతులు నల్లబడతాయి. నిపుణుల ప్రకారం, సన్ ట్యాన్ వేడి వల్ల కాదు, అతినీలలోహిత కిరణాల (UV rays) వల్ల వస్తుంది. వేడిని మనం అనుభవించగలం కానీ UV కిరణాలను అనుభవించలేం. చలికాలంలో UVB కిరణాలు తక్కువగా ఉన్నా, వృద్ధాప్య ఛాయలు మరియు ట్యానింగ్‌కు కారణమయ్యే UVA కిరణాలు మాత్రం చురుకుగానే ఉంటాయి. ఇవి మేఘాలను మరియు కిటికీ అద్దాలను కూడా దాటుకుని చర్మాన్ని తాకుతాయి. దీనివల్ల చర్మం తనను తాను కాపాడుకోవడానికి మెలనిన్ (melanin) ఉత్పత్తి చేస్తుంది, అదే ట్యాన్‌గా మారుతుంది. చలికాలపు ఎండ బయటకు కనిపించినంత అమాయకంగా ఉండదు. చల్లని గాలి వల్ల వేడి హెచ్చరిక తెలియక మనం ఎండలో ఎక్కువ సమయం గడిపేస్తాం. స్పష్టమైన రోజుల్లోనే కాకుండా పలుచని మేఘాలు ఉన్నప్పుడు కూడా గణనీయమైన UV కిరణాలు కిందకు వస్తాయి. మంచు, నీరు, లేదా ప్రకాశవంతమైన ఉపరితలాలు UV కిరణాలను తిరిగి చర్మంపై ప్రతిబింబిస్తాయి. ఎత్తైన ప్రాంతాలు లేదా హిల్ స్టేషన్లకు వెళ్లినప్పుడు UV తీవ్రత మరింత పెరుగుతుంది. 2024లో ప్రచురించబడిన ఒక అధ్యయన సమీక్ష ప్రకారం, UVA కిరణాలు మరియు దృశ్య కాంతి మేఘాలు, కిటికీ అద్దాల గుండా ప్రయాణించగలవు, అలాగే మెలస్మా వంటి నల్లటి మచ్చల సమస్యలో సూర్యకాంతి కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ చర్మతత్వానికి చలికాలపు ఎండ వల్ల అదనపు జాగ్రత్తలు అవసరం. ముదురు చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కమిలిపోదు కానీ సులభంగా ట్యాన్ అవుతుంది మరియు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. చలికాలపు ఎండ ముఖం, చేతులు, మెడను నల్లబర్చడమే కాకుండా, మెలస్మా (బుగ్గలు, నుదురుపై గోధుమ లేదా బూడిద రంగు మచ్చలు)ను తీవ్రతరం చేస్తుంది మరియు మొటిమల మచ్చలను ఎక్కువకాలం ఉంచుతుంది. 2022లో జరిగిన ఒక సమీక్ష ప్రకారం, దృశ్య కాంతి మరియు దీర్ఘ తరంగ UVA కిరణాలు మెలస్మాకు ముఖ్య కారణాలుగా నిలిచాయి, అయినప్పటికీ మెలస్మా ఉన్నవారిలో ఎక్కువమంది సూర్యరశ్మి నుంచి రక్షణ చర్యలు సరిగ్గా పాటించడం లేదని తేలింది. అందుకే చలికాలంలోనూ ప్రతిరోజూ ఉదయం కనీసం SPF 30 మరియు PA+++ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. సన్‌స్క్రీన్ వాడటంలో సంఖ్య కంటే వాడే పద్ధతి, మోతాదు చాలా ముఖ్యం. ముఖం మరియు మెడ కోసం సుమారు రెండు వేళ్ల పొడవు (two finger lengths) అంత సన్‌స్క్రీన్ తీసుకోవాలి. బయట ఉన్నప్పుడు ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి మళ్లీ రాయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నీడలో ఉండటం మంచిది. టోపీ, సన్‌గ్లాసెస్, ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి మరియు చేతుల వెనుక భాగం, చెవులు, మెడను కూడా కవర్ చేసుకోవాలి. చల్లని గాలి వల్ల చర్మం పొడిబారి సున్నితంగా మారుతుంది కాబట్టి మాయిశ్చరైజర్ కూడా వాడాలి. ఉష్ణోగ్రత కంటే వాతావరణ యాప్‌లో UV ఇండెక్స్ చూసి ప్రణాళిక వేసుకోవాలి. ఇది కూడా చదవండి:జలుబు, పొడి దగ్గు వేధిస్తోందా? ఇంట్లోనే ఈ సులభ పరిష్కారాలు విటమిన్ D కోసం గంటల తరబడి ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు; అలా చేస్తే పిగ్మెంటేషన్ మరియు చర్మ సమస్యలు పెరుగుతాయి. విటమిన్ D లోపం గురించి ఆందోళన ఉంటే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. 2021లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో వచ్చిన సమీక్ష ప్రకారం, ముదురు చర్మం ఉన్నవారికి అదే స్థాయిలో విటమిన్ D ఉత్పత్తి కావడానికి ఎండలో ఎక్కువ సమయం పట్టవచ్చు, కాబట్టి అంచనా వేయడం సరికాదు.  అలాగే, విస్తరిస్తున్న లేదా తగ్గని నల్లటి మచ్చలు, ఆకారం లేదా రంగు మారుతున్న పుట్టుమచ్చలు, చర్మం కాలిపోవడం లేదా పొట్టు ఊడటం, లేదా సన్‌స్క్రీన్ వాడినా పెరుగుతున్న పిగ్మెంటేషన్ కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. చలికాలంలోనూ రోజూ సన్‌స్క్రీన్ రాయడం, చర్మాన్ని కప్పి ఉంచడం ద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఆంధ్ర స్టైల్, మిరపకాయ బజ్జీ కూర.. సింపుల్ టిప్స్‌తో పర్ఫెక్ట్ గ్రేవీ!                              ఈజీగా చేసుకునే, రుచికరమైన పొట్లకాయ పచ్చిశనగపప్పు, కూర విధానం           Winter Sun Tan, Sun Tan In Winter Causes, Dermatologist Skincare Tips, Winter Sunscreen Tips, UV Rays In Winter, Prevent Tanning In Cold Weather, Skincare Tips In Telugu.
ప్రేమతో అన్నం పెడితే సరిపోదు.. పిల్లల ఎదుగుదలకు ఈ పోషకాలు తప్పనిసరి! 5 నుంచి 10 ఏళ్ల వయసు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు సరైన పోషకాహారం ఎంతో అవసరం. ఈ వయసులో పిల్లలు వేగంగా ఎదుగుతుంటారు. వారి ఎముకలు, కండరాలు బలంగా అభివృద్ధి చెందడానికి, మెదడు చురుకుగా పనిచేయడానికి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే పిల్లలకు ప్రతిరోజూ ఎలాంటి ఆహారం ఇవ్వాలి? వారి ఎదుగుదలకు అవసరమైన పోషకాలు ఏయే ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయి? అనే విషయాలపై తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు ఉంటాయి. ఈ వీడియోలో డాక్టర్ శ్రీలత గారు 5-10 ఏళ్ల పిల్లల కోసం ఎలాంటి రోజువారీ డైట్ ప్లాన్ పాటించాలో వివరించారు. పిల్లల ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఎందుకు ముఖ్యమో, ఇవి శరీర ఎదుగుదలకు, కండరాల అభివృద్ధికి ఎలా తోడ్పడతాయో తెలియజేశారు. పిల్లలకు సరైన మోతాదులో పోషకాలు అందించడానికి ఎలాంటి ఆహారాన్ని ఎంచుకోవాలో వివరించారు. పిల్లల రోజువారీ ఆహారంలో అన్నం, పప్పులు, పాలు, పెరుగు, గుడ్లు, కూరగాయలు, పండ్లు వంటి పోషకవిలువలు కలిగిన పదార్థాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే పిల్లల వయసు, శారీరక ఎదుగుదల, చురుకుదనం, ఆహార అవసరాలను బట్టి వారి డైట్‌లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు భోజనం సరిగ్గా చేయకపోవడం, పోషకాహారం పట్ల ఆసక్తి చూపకపోవడం, బయట ఆహార పదార్థాలపై ఎక్కువగా ఆధారపడటం వంటి అలవాట్ల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సరైన ఆహారపు అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్పించడం వల్ల పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పునాది పడుతుంది. మీ పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఎదగాలంటే వారి రోజువారీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి? 5-10 ఏళ్ల పిల్లలకు ఎలాంటి డైట్ ప్లాన్ ఉపయోగపడుతుంది? పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం గురించి డాక్టర్ శ్రీలత గారు అందించిన విలువైన సూచనలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈ వీడియోను తల్లిదండ్రులు తప్పక చూడండి.
జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. మజ్జిగలో ఈ మూడు పొడులు కలిపి తీసుకోండి!   జుట్టు రాలడం, పలుచబడటం, జుట్టు ఒత్తుగా పెరగకపోవడం వంటి సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే బయట ఉపయోగించే నూనెలు, షాంపూలతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ముఖ్యం. ముఖ్యంగా పోషకాలు సమృద్ధిగా ఉండే సహజ ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మునగాకు పొడి, కరివేపాకు పొడి, మెంతుల పొడిని మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయి? మునగాకులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి? కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మెంతులు మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయి? ఈ సహజ పదార్థాలను రోజువారీ ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలి? అలాగే చిరుధాన్యాలు (Millets) మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు ఏమిటి? రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు లభిస్తాయి? సంప్రదాయ ఆహారపు అలవాట్లు, సహజంగా పండించిన ఆహార పదార్థాల ప్రత్యేకత ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో ప్రముఖ నేచురల్ ఫార్మింగ్ నిపుణులు  గున్న రాజేందర్ రెడ్డి (Gunna Rajender Reddy) గారు వివరించారు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన సహజ ఆహారాలను మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. జుట్టు ఆరోగ్యం, సహజ ఆహారం, మునగాకు, కరివేపాకు, మెంతులు, చిరుధాన్యాల పయోజనాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ ఆహార పదార్థాలు పోషకాలను అందించవచ్చు. అయితే 90 రోజుల్లో జుట్టు తప్పనిసరిగా ఒత్తుగా పెరుగుతుందని హామీ ఇవ్వలేము. జుట్టు అధికంగా రాలుతున్నట్లయితే కారణాన్ని గుర్తించేందుకు వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం లేదా ఎప్పుడూ ఏదో ఒకటి కొరుకుతూ ఉండాలని అనిపించడం చాలామందిలో కనిపిస్తుంది. ఎక్కువ పని చేసినప్పుడు లేదా సరిగ్గా తిననప్పుడు ఇలా అనిపిస్తే అది సాధారణమే. కానీ కడుపు నిండా తిన్నాక కూడా పదేపదే ఆకలి వేస్తుంటే మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అది మన అలవాటా లేక శరీరంలో  ఏదైనా సమస్య గురించి అలా లక్షణం రూపంలో బయటకు తెలుస్తోందా అన్నది తెలుసుకోవడం ముఖ్యం. చాలామంది ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు.  అలాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివి. అవేంటో తెలుసుకుంటే.. అలవాట్లు.. మన రోజువారీ ఆహారపు అలవాట్లు, తినే సమయం, తినే ఆహారం మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఆకలి వెనుక శరీరంలోని హార్మోన్లు లేదా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. సాధారణ ఆకలికి, అనారోగ్య సంకేతానికి మధ్య తేడాను గుర్తించాలి. డయాబెటిస్.. డయాబెటిస్ ఉన్నవారిలో పదేపదే ఆకలి వేయడం ఒక సాధారణ లక్షణం. రక్తంలోని గ్లూకోజ్‌ను శరీర కణాలకు చేర్చడానికి ఇన్సులిన్ అవసరం. డయాబెటిస్‌లో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కణాలకు తగినంత శక్తి అందదు. దాంతో ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. దీనికి తోడు ఎక్కువ దాహం, తరచుగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గినప్పుడు కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది. అప్పుడు చెమట పట్టడం, వణుకు, తలతిరగడం, కంగారుగా అనిపించడం లాంటివి కలగవచ్చు. థైరాయిడ్.. థైరాయిడ్ సమస్య వల్ల కూడా ఆకలి పెరగవచ్చు. థైరాయిడ్ గ్రంథి అవసరం కంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే స్థితిలో శరీర జీవక్రియ వేగంగా జరుగుతుంది. దీనివల్ల ఆకలి పెరిగినా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, ఎక్కువ చెమట పట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి, కొన్ని రకాల మందుల వల్ల కూడా ఆకలిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడి ఎక్కువ ఆకలి వేయవచ్చు. ఇది కూడా చదవండి   మునగాకు లడ్డూ రోజూ 2 తింటే.. శరీరానికి ఇన్ని పోషకాలా.! ఆకలితో పాటు బరువు తగ్గడం.. ఎప్పుడూ ఆకలి వేస్తూ దానితో పాటు బరువు తగ్గడం, ఎక్కువ దాహం, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది. అవసరమైన రక్త పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు చేయించుకుంటే అసలు కారణం తెలుస్తుంది.                                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   అవిసె గింజలు ఎలా తింటే ఎక్కువ మేలు సరైన పద్ధతి ఇదే!                                   ఇదిగో ఈ ఆహారాలు తింటే గట్ హెల్త్ సేఫ్ గా ఉంటుంది..!