TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

 ఎప్పుడూ ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుందా,ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి..!

Published on: Wed Nov 25, 2026 9:17AM

భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం లేదా ఎప్పుడూ ఏదో ఒకటి కొరుకుతూ ఉండాలని అనిపించడం చాలామందిలో కనిపిస్తుంది. ఎక్కువ పని చేసినప్పుడు లేదా సరిగ్గా తిననప్పుడు ఇలా అనిపిస్తే అది సాధారణమే. కానీ కడుపు నిండా తిన్నాక కూడా పదేపదే ఆకలి వేస్తుంటే మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అది మన అలవాటా లేక శరీరంలో  ఏదైనా సమస్య గురించి అలా లక్షణం రూపంలో బయటకు తెలుస్తోందా అన్నది తెలుసుకోవడం ముఖ్యం. చాలామంది ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు.  అలాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివి. అవేంటో తెలుసుకుంటే..

అలవాట్లు..

మన రోజువారీ ఆహారపు అలవాట్లు, తినే సమయం, తినే ఆహారం మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఆకలి వెనుక శరీరంలోని హార్మోన్లు లేదా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. సాధారణ ఆకలికి, అనారోగ్య సంకేతానికి మధ్య తేడాను గుర్తించాలి.

డయాబెటిస్..

డయాబెటిస్ ఉన్నవారిలో పదేపదే ఆకలి వేయడం ఒక సాధారణ లక్షణం. రక్తంలోని గ్లూకోజ్‌ను శరీర కణాలకు చేర్చడానికి ఇన్సులిన్ అవసరం. డయాబెటిస్‌లో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కణాలకు తగినంత శక్తి అందదు. దాంతో ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. దీనికి తోడు ఎక్కువ దాహం, తరచుగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గినప్పుడు కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది. అప్పుడు చెమట పట్టడం, వణుకు, తలతిరగడం, కంగారుగా అనిపించడం లాంటివి కలగవచ్చు.

థైరాయిడ్..

థైరాయిడ్ సమస్య వల్ల కూడా ఆకలి పెరగవచ్చు. థైరాయిడ్ గ్రంథి అవసరం కంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే స్థితిలో శరీర జీవక్రియ వేగంగా జరుగుతుంది. దీనివల్ల ఆకలి పెరిగినా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, ఎక్కువ చెమట పట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి, కొన్ని రకాల మందుల వల్ల కూడా ఆకలిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడి ఎక్కువ ఆకలి వేయవచ్చు.

ఇది కూడా చదవండి   మునగాకు లడ్డూ రోజూ 2 తింటే.. శరీరానికి ఇన్ని పోషకాలా.!

ఆకలితో పాటు బరువు తగ్గడం..

ఎప్పుడూ ఆకలి వేస్తూ దానితో పాటు బరువు తగ్గడం, ఎక్కువ దాహం, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది. అవసరమైన రక్త పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు చేయించుకుంటే అసలు కారణం తెలుస్తుంది.

                                                                                                                                             *రూపశ్రీ.

 

మీకు నచ్చవచ్చు   అవిసె గింజలు ఎలా తింటే ఎక్కువ మేలు సరైన పద్ధతి ఇదే!

                                  ఇదిగో ఈ ఆహారాలు తింటే గట్ హెల్త్ సేఫ్ గా ఉంటుంది..!