వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఇవి అలవాటు చేసుకోండి..!
Published on: Wed Nov 25, 2026 9:26AM
వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఇవి అలవాటు చేసుకోండి..!

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అలసట పెరగడం, బరువు పెరగడం, ముఖంలో కాంతి తగ్గడం చాలా మందికి ఎదురయ్యే సమస్యే. కానీ గంటల తరబడి జిమ్‌లో కష్టపడకుండా లేదా కఠినమైన డైట్లు చేయకుండా, మన రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే ఎప్పటికీ ఉత్సాహంగా, ఫిట్‌గా, యవ్వనంగా ఉండొచ్చు. ఆ అలవాట్లు ఏమిటో అవి వయసు పెరిగినా యవ్వనంగా ఉండటంలో ఎలా సహాయపడతాయో వివరంగా తెలుసుకుంటే..
ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా ప్రశాంతంగా రోజును ప్రారంభించాలి. ఫోన్ చూస్తే వెంటనే అనవసరపు ఆలోచనలు, ఒత్తిడి మొదలవుతాయి. కనీసం మొదటి 15 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది.
లేవగానే టీ లేదా కాఫీ తాగే బదులు ఒకటి రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. తర్వాత కాసేపు ఉదయపు ఎండలో నిలబడి కనీసం 10 నిమిషాలు నడవాలి. ఇది శరీరానికి కొత్త శక్తిని ఇచ్చి, బద్ధకాన్ని తగ్గిస్తుంది.

భోజనం చేసేటప్పుడు టీవీ లేదా ఫోన్ చూడకూడదు. ఆహారాన్ని గమనిస్తూ నెమ్మదిగా నమిలి తింటే కడుపు నిండిన భావన సమయానికి తెలిసి, అతిగా తినకుండా ఉంటాము.
ఇది కూడా చదవండి ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..
జిమ్‌కు వెళ్లే సమయం లేకపోయినా రోజంతా శరీరానికి కదలిక ఉండేలా చూసుకోవాలి. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, ఫోన్ మాట్లాడేటప్పుడు నడవడం, భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయడం వంటి చిన్న అలవాట్లు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి.
కడుపు పూర్తిగా నిండేంత వరకు కాకుండా 80 శాతం నిండగానే తినడం ఆపేయాలి. అలాగే ప్లేట్‌లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి.
ఇంట్లో జంక్ ఫుడ్, చిప్స్, కూల్ డ్రింక్స్ కనిపించేలా ఉంచుకోకుండా, పండ్లు , నీళ్ల బాటిళ్లను కళ్ల ముందు ఉంచుకోవాలి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్‌గా మంచి ఆహారం తీసుకునే అలవాటు పెరుగుతుంది.
ఒకేసారి పెద్ద పెద్ద మార్పులు చేసుకోవాలని గట్టి నిర్ణయాలు తీసుకుని తర్వాత వదిలేయడం కంటే, రోజుకు కొంచెం కొంచెంగా చిన్న అలవాట్లు మార్చుకోవడం ఉత్తమం. అలాగే ఒకరోజు తప్పు జరిగినా నిరుత్సాహపడకుండా మరుసటి రోజు మళ్లీ కొనసాగించడం ముఖ్యం.
రాత్రి పడుకునే కనీసం గంట ముందు ఫోన్, టీవీ స్క్రీన్లకు దూరంగా ఉండాలి. గాఢ నిద్ర సరిగ్గా లభిస్తే మరుసటి రోజు శరీరం ఉత్సాహంగా ఉంటుంది, అనవసరమైన ఆకలి కోరికలు కూడా తగ్గుతాయి.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు రిలేషన్‌షిప్‌లో పర్సనల్ స్పేస్..భాగస్వామి ఒంటరిగా గడపాలని కోరుకోవడానికి అసలు కారణాలు..!
జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..!


