TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళా రిజర్వేషన్లు కాదు: రాజకీయ లబ్ధే లక్ష్యం.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్.!

Published on: Sat Nov 28, 2026 10:23AM

కేంద్రం డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం సోమవారం (నవంబర్ 30) నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయం ఒక్కసారిగా రాజకీయవాతావరణాన్ని వేడెక్కించింది. డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఈ ప్రత్యేక సమావేశాల వెనుక అసలు లక్ష్యం నియోజకవర్గాల పునర్విభజన, తద్వారా బీజేపీకి చేకూరే రాజకీయ లబ్ధి మాత్రమే ఉందని కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పిస్తోంది.   చట్టసభల్లో మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించే  నారీ శక్తి వందన్‌ అధినియమ్ చట్టాన్ని పార్లమెంట్ 2023 సెప్టెంబర్‌లో ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని గుర్తు చేసిన కాంగ్రెస్ సీనియన్ నేత జైరాం రమేష్.. ఆ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని  పలుమార్లు కోరినా పట్టించుకోని కేంద్రం, ఇప్పటికే  పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్ని పొందిన చట్టాన్ని అమలు చేయకుండా, దాని అమలును డీలిమిటేషన్ తో ముడిపెట్టి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం రాజకీయ ప్రయోజనాలను ఆశించేనని దుయ్యబట్టారు.  

డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా బీజేపీకి అనుకూలంగా నియోజకవర్గాల  స్వరూపాన్ని మారుస్తారనే ఆందోళన కాంగ్రెస్ లో బలంగా వ్యక్తమౌతోంది. అంతేకాకుండా, నియోజకవర్గాల సరిహద్దులు, స్వరూపాన్ని నిర్ణయించే బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే అంశంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నది.

ఓటర్ల జాబితాల రూపకల్పన, ఎన్నికల నిర్వహణ తీరుపై విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు పునర్విభజన బాధ్యతలు అప్పగించడం సరికాదని కాంగ్రస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై సందేహాలు ఉన్న వ్యక్తుల చేతుల్లో  డీలిమిటేషన్ బాధ్యతలు ఉంచడం   ప్రజాస్వామ్యానికి హానికరమని అంటోంది. 

ఇది కూడా చదవండి:  డీలిమిటేషన్‌ ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే యత్నం.. కేంద్రంపై గౌరవ్‌ గొగోయ్‌ విమర్శలు​

నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశాలను  ప్రారంభం కానున్నాయి. సభా కార్యకలాపాలను బట్టి డిసెంబర్ 3న సమావేశాలు ముగిసే అవకాశం ఉంది.   ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటికీ అధికారికంగా ప్రొరోగ్ చేయలేదని, వాటి కొనసాగింపుగానే ఈ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించుకోవడానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సమకూర్చుకోవడమే ఈ సమావేశాల వెనుక ఉన్న ప్రధాన రాజకీయ ఎత్తుగడ అని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.    ఆపరేషన్ లోటస్ ప్రారంభమై 105 రోజులు పూర్తయిన తర్వాత, రాజ్యాంగ దినోత్సవం వేళ ఈ సమావేశాల ప్రకటన వెలువడటంలో  ఉన్న రాజకీయలెక్కలేంటో తేలాల్సి ఉందంటున్నారు.

మహిళా రిజర్వేషన్ల అమలును అడ్డం పెట్టుకుని డీలిమిటేషన్ బిల్లును ముందుకు తేవడాన్ని ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన బలాన్ని అనుచిత మార్గాల్లో కూడగట్టే ప్రయత్నాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శిస్తున్నాయి. ఆ ప్రయత్నాలను అడ్డుకుంటామని గట్టిగా చెబుతున్నాయి.   నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ల అమలుపై ఎలాంటి చర్చలు జరుగుతాయి, ప్రభుత్వం ఏ ప్రతిపాదనలు ముందుకు తెస్తుంది, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి అనేదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 

మీకు నచ్చవచ్చు:  డీలిమిటేషన్ ఎందుకు అవసరం: దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేదెలా.?

డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. 2051 వరకు రాష్ట్రాల ప్రాతినిధ్యం స్థిరం.!

[Special Parliament Session, Delimitation, Womens Reservation Act, Congress, Fire, BJP, Political, Intention, TeluguOne]