తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దక్షిణాది ప్రజల సాంస్కృతిక, మత గుర్తింపునకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి.  దేశ రాజధాని హస్తినలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజల సాంస్కృతిక, మతపరమైన గుర్తింపుల గురించి చేసిన విశ్లేషణ రాజకీయదుమారాన్ని రేపింది. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో విభజన తెచ్చేలా సీఎం రేవంత్ మాట్లాడారంటూ బీజేపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తోంది.   దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల ఆరాధనా విధానాలు, దేవుళ్ల ప్రాధాన్యతను వివరిస్తూ.. రేవంత్ రెడ్డి ఆ మీడియా సమావేశంలో దక్షిణాది  వారు ద్రావిడులని, ఉత్తరాది వారులు  ఆర్యులని అన్నారు.   దక్షిణాది వారు శివభక్తులు, ఉత్తరాది వారు శ్రీరామ భక్తులుగా అభివర్ణించారు.  అక్కడితో ఆగకుండా  బీజేపీ నాయకులు ఎప్పుడూ  జై శ్రీరామ్ నినాదాలకే పరిమితమవుతారని,  హర హర మహాదేవ్'అని ఎందుకు అనరని నిలదీశారు. శివుడిని పేదల దేవుడిగా, రాముడిని ధనవంతుల దేవుడిగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. పెను వివాదానికి హేతువయ్యాయి.   రేవంత్ర రెడ్డి వ్యాఖ్యలపై  నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.  ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హిందువులను ప్రాంతాల వారీగా, దేవుళ్ల పేరుతో విడగొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. సోమనాథ్ ఆలయ నిర్మాణం మొదలుకొని అనేక ధార్మిక ప్రాజెక్టులను గతంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని, ఇప్పుడు మళ్లీ అదే వైఖరిని ప్రదర్శిస్తోందని గుర్తు చేస్తున్నారు.  అంతేకాకుండా..  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జై శ్రీరామ్'తో పాటు 'హర హర మహాదేవ్ అని కూడా నినదించే   అంటున్నారు. రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.  హిందువుల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు.   [Revanth Reddy Comments, Lord Rama, Lord Shiva controversy, BJP,  Congress, North South India Identity, National politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్య సంచలనంగా మిగిలిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం మరోసారి రాజకీయ దుమారం  ఈ హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాటి ఘటనకు సంబంధించి పలువురు ప్రముఖుల ప్రమేయం,   ఈ కేసులో కొందరికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ రాజకీయ లబ్ది చేకూరిందనే ఆరోపణలు సంచలనంగా మారాయి. . ఘటన జరిగిన నాటి నుంచి దర్యాప్తు సరళి, కేసు దారి మళ్లిన వైనంపై వివిధ రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన సమయంలో స్థానిక పరిస్థితులు, తదనంతరం తెరపైకి వచ్చిన అంశాలు పలు అనుమానాలకు తావునిచ్చాయి. ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు. ఈ కేసు విషయంలో ఆమె అలుపెరుగని న్యాయపోరాటం చేశారు. చేస్తున్నారు.  ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ విచారణలో  హత్య జరిగిన రోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలు, టెలిఫోన్ సంభాషణలు, గూగుల్ టేకౌట్ వివరాలు నేరస్థలంలో లభించిన భౌతిక సాక్ష్యాలు, అనుమానితుల కదలికలతో పకడ్బందీగా ముందుకు సాగింది.   ఈ వ్యవహారంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డి అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. హత్యకు గురైన తర్వాత  సమాచారం బయటకు పొక్కకుండా వారు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వివేకా కుమార్తె వైఎస్ సునీత తన తండ్రి మృతిపై న్యాయం కోరుతూ సాగిస్తున్న సుదీర్ఘ పోరాటానికి పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది.    ఇక తాజాగా ఈ కేసులో ఏ2గా ఉన్న యాదటి సునీల్ యాదవ్  సంచలన విషయాలను వెల్లడించారు. వివేకా హత్య ద్వారా లబ్ధి పొందిన వారు మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి అని కుండబద్దలు కొట్టారు. వైఎస్ వివేకా హత్యకు గురి కాకుండా ఉంటే ఆయన నిస్సందేహంగా కడప ఎంపీ అయి ఉండేవారన్న సునీల్ యాదవ్.. దీనిని బట్టే ఈ హత్య వల్ల లబ్ధి పొందినది ఎవరన్నది సులభంగా అవగతమౌతుందన్నారు. సోమవారం (సెప్టెంబర్ 28)  ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సునీల్ యాదవ్.. వైఎస్ వివేకా హత్య విషయంలో తెరముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఉన్నా తెర వెనుక ఉన్నది కచ్చితంగా వైఎస్ జగన్, వైఎస్ భారతి అని విస్పష్టంగా చెప్పారు. వివేకాను హత్య చేయాల్సిన అవసరం తనకు ఇసుమంతైనా లేదన్న ఆయన.. వివేకా హత్యకు గురికాకుండా ఉండి ఉంటే.. ఆయన తనను యాదవ కార్పొరేషన్ చైర్మన్ ను చేసేవారని సునీల్ యాదవ్ చెప్పారు.  ఈ సందర్భంగా ఆయన తన ప్రాణానికి ముప్పు ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్  నుంచి తనకు ముప్పు ఉందనీ, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇప్పటికే తనపై మూడు సార్లు హత్య ప్రయత్నం జరిగిందని చెప్పిన సునీల్ యాదవ్.. ఈ కేసులో కీలక సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతిని గుర్తు చేస్తూ తనకు రక్షణ కల్పించాలని ఏపీ, తెలంగాణ సీఎంలకు విజ్ణప్తి చేశారు.  [YS Vivekananda Reddy Murder Case, YS Jagan Mohan Reddy, YS Bharathi, YS Avinash Reddy, AP Politics, A2 Sunil Ydaev, Sensational, Reveal, Telugu One]
తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ బైపోల్ హాట్ టాపిక్ గా మారంది. అందులోనూ ఈ ఎన్నిక బరిలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నిలబడనుండటంపై పోలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అంతే కాకుండా ఇక నుంచి రాబోయే ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ పోటీ చేయాలన్న కవిత నిర్ణయం రాజకీయవర్గాలలో సంచలనంగా మారింది.   . బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగనున్న ఖైరతాబాద్ ఉప ఎన్నిక,  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలోనూ,    గ్రేటర్ హైదరాబాద్ స్థానిక పోరులోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు విస్పష్టంగా ప్రకటించారు. టీఆర్ఎస్ పోటీ  ఏ పార్టీ ఓట్లకు ఆమె గండి కొట్టబోతున్నారనే చర్చ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  ఎన్నికలలో పోటీ ప్రకటనతో పాటు కవిత   కొన్ని గ్యారెంటీలు,   ప్రత్యేక హామీలూ కూడా  ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం సాధించి అధికారంలోకి వస్తే.. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే  4 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామనీ,   అలాగే ప్రైవేట్ స్కూళ్లలో  నాణ్యమైన, ఉచిత విద్యను అందించడం, దీర్ఘకాలిక వ్యాధులతో సహా అన్ని రకాల రోగాలకు పూర్తి ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించడం వంటి హామీలూ, గ్యారెంటీలు ప్రకటించారు. యువతలో స్వయం ఉపాధి,  నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లకు తగిన నిధులు అందించడంతో పాటు, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రైతులకు ప్రత్యేక సహాయక డెస్క్‌లను ఏర్పాటు చేసి  రైతే రాజు' నినాదాన్ని నిజం చేస్తామని కవిత చెప్పారు. వెనుకబడిన తరగతులకు, మహిళలకు, యువతకు రాజకీయంగా, సామాజికంగా సమాన అవకాశాలు కల్పించి.. తద్వారా సామాజిక తెలంగాణ సాధిస్తామని కవిత చెప్పారు.  2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేస్తుందని కవిత వెల్లిండించారు.  మొత్తానికి స్థానిక ఉప ఎన్నికల నుంచి సార్వత్రిక పోరు వరకు కవిత వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే టీఆర్ఎస్ ను సమాయత్తం చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  [Kalvakuntla Kavitha,  political strategy, Telangana Rakshana Sena,TRS, manifesto, Graduate MLC elections, Khairatabad bypoll, Telangana politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు అక్కడి ప్రకటనలు, ట్రైలర్లు కొంత ఇబ్బంది కలిగిస్తుంటాయి. సినిమా ప్రారంభ సమయం దాటిపోయినా యాడ్స్ కొనసాగుతుండటంతో చాలామంది అసహనం వ్యక్తం చేస్తుంటారు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది మాత్రం ఈ విషయంలో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్.. PVR మల్టీప్లెక్స్‌కు రూ.75 వేల చెల్లించాలని ఆదేశించింది.  వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది 2025 జూన్ 20న రాత్రి 10.35 గంటలకు ‘కుబేర’ సినిమా చూసేందుకు PVRలో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. నిర్ణీత సమయానికి ముందే థియేటర్‌కు చేరుకుని సీట్లో కూర్చున్నప్పటికీ సినిమా వెంటనే ప్రారంభం కాలేదు. దాదాపు 22 నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు, ఇతర ప్రచార కంటెంట్‌ ప్రదర్శించిన తర్వాత రాత్రి 10.52 గంటలకు సినిమా మొదలైంది. దీంతో సినిమా పూర్తయ్యే సమయం కూడా ఆలస్యమై, ఇంటికి చేరేసరికి మరింత సమయం పట్టిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.  అయితే థియేటర్‌లో ప్రకటనలు ప్రదర్శించడం తమ వ్యాపార హక్కులో భాగమేనని PVR తరఫున వాదన వచ్చింది. మరోవైపు.. ప్రజా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం సామాజిక అవగాహన ప్రకటనలకు నిర్దిష్ట పరిమితి ఉందని ఫిర్యాదుదారు వాదించారు. వాణిజ్య ప్రకటనలను ఆ పరిమితికి మించి ప్రదర్శించడం వల్ల సినిమా ప్రారంభంలో జాప్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ వాదనలను పరిశీలించిన వినియోగదారుల కమిషన్‌.. ప్రేక్షకుడికి కలిగిన అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకుంది.  ఈ కేసులో కమిషన్ మొత్తం రూ.75 వేల చెల్లించాలని ఆదేశించింది. ఇందులో ఫిర్యాదుదారుడికి కలిగిన అసౌకర్యం, మానసిక ఇబ్బందులకు రూ.20 వేలు పరిహారంగా, న్యాయపరమైన ఖర్చుల కింద రూ.5 వేలు, నిబంధనల ఉల్లంఘనకు రూ.50 వేలను జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాపార పద్ధతులను నిలిపివేయాలని కూడా ఆదేశించింది.  మొత్తంగా.. థియేటర్‌లో సినిమా ప్రారంభ సమయం, ప్రకటనల వ్యవహారంపై జరిగిన ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టికెట్‌పై పేర్కొన్న షో సమయాన్ని పాటించడం, ప్రేక్షకుల సమయాన్ని పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలపై ఈ తీర్పు మరోసారి దృష్టిని ఆకర్షించింది.     [PVR Fine, PVR Consumer Court, Hyderabad PVR, Movie Delay Fine, PVR Cinema Ads, Kubera Movie, Consumer Court Hyderabad, PVR Multiplex News, Movie Theatre Rules, Consumer Rights India]
ఇండస్ట్రీకి కొత్త హీరో వచ్చాడు. ఆ వస్తే ఏంటి, చాలా మంది వస్తుంటారులే, అందులో ఈ బాబు ఒక కౌంట్ అంతే కదా  అనుకుంటున్నారా! అసలు అలా అనుకోకండి.  ఈ బాబు అలాంటి ఇలాంటి హీరో కాదు. లైట్స్ ఆన్, కెమెరా, రోలింగ్, యాక్షన్ అనగానే సినిమానే కదా అని హీరోకి  వార్నింగ్ ఇవ్వడమే  కాదు. రియల్ గా స్టేజ్ పైనే అందరకి వార్నింగ్ ఇచ్చిపడేయగల కెపాసిటీ ఆ హీరో సొంతం. 'ఓ అందాల రాక్షసి' ..  త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ. హీరో,  దర్శకుడు షిరాజ్ మెహదీ. రీసెంట్ గా  హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు 'రాత్రింబవళ్ళు కష్టపడి నిర్మించిన చిన్న సినిమాలను థియేటర్లు ఇవ్వకుండా తొక్కిపెట్టాలని చూస్తే ఏమాత్రం ఊరుకునేది లేదు. ప్రాణం పోయినా సరే ఈ పోరాటాన్ని ఆపేది లేదు. మంచి సాంకేతిక నిపుణులతో, బలమైన కంటెంట్‌తో రూపొందించిన తమ 'ఓ అందాల రాక్షసి' చిత్రానికి సరైన స్క్రీన్లు ఇస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే సత్తా ఉందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చిన్న సినిమాల మనుగడ కోసం, థియేటర్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటికే 40కి పైగా ప్రెస్ మీట్లు నిర్వహించానని, 50కి పైగా ఇంటర్వ్యూలలో తన నిరసన గళాన్ని వినిపించానని షిరాజ్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: స్నేహారెడ్డి బర్త్ డే: ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్!      ఈ సందర్భంగా డిజిటల్ ప్రొవైడర్ల దోపిడీ విధానాలపై ఆయన సంచలన గణాంకాలతో విరుచుకుపడ్డారు. క్యూబ్ (Qube), యూఎఫ్‌ఓ (UFO) వంటి డిజిటల్ నెట్‌వర్క్ కంపెనీలు డిజిటల్ కంటెంట్ ప్రొసెసింగ్ మరియు ప్రదర్శన పేరుతో చిన్న నిర్మాతలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని ఆరోపించారు. వారానికి కేవలం రూ.2,000 మాత్రమే ఖర్చయ్యే డిజిటల్ ప్రాసెస్ సేవలకు గాను, ప్రతీ ఒక్క థియేటర్ నుంచి రూ.10,000 నుండి రూ.12,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆయన సంఖ్యలతో సహా బయటపెట్టారు. సెన్సార్ నిబంధనలు, ఏడీసీసీ (ADCC) ప్రాసెస్ పేరిట అదనపు మొత్తాలను గుంజుతూ చిన్న సినిమాల బడ్జెట్‌లను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారని వాపోయారు. చిన్న నిర్మాతలకు అండగా నిలవాల్సిన ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber) వ్యవస్థ ఈ విషయంలో పూర్తిగా మౌనం వహిస్తూ, చిన్న చిత్రాలను నల్లిలా నలిపేసేందుకు సహకరిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ఈ విషయం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.    [ O Andala Rakshasi Hero Shiraz Mehdi Slams Theatre Allocation, O Andala Rakshasi,  Shiraz Mehdi, Small Movies Issue, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ‘సిగ్మా’. తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. యాక్షన్, అడ్వెంచర్, హీస్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సీబీఎఫ్‌సీ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సినిమా సిద్ధమైంది.  ఇక ‘సిగ్మా’ కథ విషయానికి వస్తే.. రూ.500 కోట్ల విలువైన డ్రగ్స్, గ్యాంబ్లింగ్ రాకెట్ చుట్టూ కథ సాగుతుందని ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో తెలుస్తోంది. ట్రెజర్ హంటర్‌గా కనిపించే సందీప్ కిషన్ తన తల్లి కోసం ఓ నిధి వేటలో ఉంటాడు. మరోవైపు సంపత్ రాజ్ పోషించిన వీర శంకర్ రెడ్డి అక్రమ వ్యాపారాలతో మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. ఈ రెండు కథలు కలిసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది సినిమాలో చూడాల్సి ఉంటుంది.  ఈ సినిమాలో సందీప్ కిషన్‌కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటించారు. సంపత్ రాజ్, రాజు సుందరం, శివ పండిట్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎల్‌కే ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్‌.థమన్ సంగీతం అందించగా.. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.  మరోవైపు.. దర్శకుడిగా జేసన్ సంజయ్ ఎలాంటి కథను ఎంచుకున్నారు? సందీప్ కిషన్ పాత్ర ఎలా ఉంటుంది? రూ.500 కోట్ల డీల్ వెనుక అసలు కథ ఏంటి? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. సెన్సార్ పూర్తి కావడంతో ఇక సినిమా విడుదలకు సంబంధించిన పనులు వేగం పుంజుకోనున్నాయి. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సిగ్మా’తో జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలి.     [Sundeep Kishan Sigma, Sigma Movie, Sigma Movie Release Date, Jason Sanjay Sigma, Vijay Son Jason Sanjay, Sundeep Kishan New Movie, Faria Abdullah Sigma, Sigma Censor Certificate, Sigma Movie U/A Certificate, Thaman Sigma, Lyca Productions]
Harsh Roshan and Nakshatra starrer Thella Kaagitham has landed in the spotlight ahead of its release after an intimate scene from the film was reportedly leaked online. The video has surfaced on Reddit and is now making the rounds across social media, creating buzz around the upcoming Telugu film. It showcases Harsh Roshan and Nakshatra sharing a kiss and then getting intimate. Hence, it is being shared widely on social media. While some are condemning such trend of minors and college students intimate scenes, several are talking about how the footage might have been leaked online and questioning if makers leaked it for promotions. While such leaks often generate additional curiosity around a film, they also raise concerns over unreleased movie content being circulated without the makers' consent. With Thella Kaagitham nearing its theatrical release, the leak has brought unexpected attention to the film just days before it reaches cinemas. Thella Kaagitham is directed by Ramesh Bandreddi and the cast also includes Ajay, Deepak, Shravya and Rajkumar Kasireddy. The film is produced by Krishna Kommalapati under Arunachala Creations. Kona Venkat is presenting it.  Nandu Savarigana has handled the story, screenplay and dialogues, while K.V. Guhan is the cinematographer. Vijay Bulganin has composed the music and Karthika Srinivas R is the editor. The film is scheduled for a theatrical release on October 2. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  స్టైల్ లో, స్టైల్ విషెస్ చెప్పడంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా అని ఫ్యాన్స్ చెప్తుంటారు.మరి ఈ రోజు సతీమణి స్నేహరెడ్డి పుట్టిన రోజు. మరి అల్లు అర్జున్ విషెస్ ఏ స్టైల్ లో ఉన్నాయో చూద్దాం.    ఈ ప్రత్యేకరమైన రోజున, అల్లు అర్జున్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా భార్యతో కలిసి ఉన్న ఒక రొమాంటిక్ సెల్ఫీని పంచుకున్నారు. సూర్యాస్తమయం వెలుగుల్లో సముద్రతీరాన ప్రశాంతంగా దిగిన ఈ పిక్చర్‌లో ఇద్దరూ తెల్లటి దుస్తుల్లో ఎంతో ముచ్చటగా కనిపించారు. ఈ పిక్‌కు "హ్యాపీ బర్త్‌డే క్యూటీ" (Happy Birthday Cutie) అని ఒక ప్రేమపూర్వక రెడ్ హార్ట్ ఎమోజీని జోడించి స్పెషల్ విషెస్ అందించారు. సాధారణంగా భారీ ఎమోషనల్ క్యాప్షన్స్ కంటే, కేవలం మూడు  మాటలతోనే తన ప్రేమనంతటినీ ఎంతో ఆర్గానిక్‌గా వ్యక్తం చేయడం బన్నీ శైలి. ఇది కూడా చదవండి: ఇండస్ట్రీలో స్విమ్‌సూట్ వేసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఈమెనే: ఆ ఒక్క హీరోతోనే ఏకంగా 40 సినిమాలు     అల్లు అర్జున్ ప్రెజెంట్ 'రాకా' తో బిజీగా ఉన్నాడు.  భారతీయ సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకునేలా తెరకెక్కతుంది. జవాన్ ఫేమ్ 'అట్లీ' దర్శకుడు.   [Allu Arjun Special Birthday Wishes To Wife Sneha Reddy, Allu Arjun,  Allu Sneha Reddy Birthday, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
ఒక సినిమా తీయడానికి కొన్నేళ్ల కష్టం, కోట్ల రూపాయిల పెట్టుబడి, మరెన్నో గుండెల ఆశలు దాగుంటాయి. కానీ, సినిమా థియేటర్లలోకి రాకముందే, రిలీజ్‌కి మూడు రోజులు ముందు ఆ కష్టమంతా ఆన్‌లైన్‌లో ఉచితంగా దొరికిపోతే ఆ మేకర్స్ గుండె ఎంతలా పగిలిపోతుంది. ప్రస్తుతం ఓ తెలుగు సినిమాకి అలాంటి షాకే తగిలింది.  అక్టోబర్ 2న రిలీజ్ కావలసిన 'తెల్లకాగితం' సినిమా రిలీజ్‌కి ముందే పైరసీ భూతానికి బలయ్యింది. పైరసీ దొంగలు ఈ సినిమాని ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. ఇప్పటికే మేకర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాని లీక్ చేసిన వారితో పాటు, ఆ లింక్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలకు టీమ్ సిద్ధమవుతోంది. సినిమాని ప్రేమించే వారు ఎవరూ ఈ లీక్ అయిన కంటెంట్‌ను షేర్ చేయవద్దని, ఇండస్ట్రీని కాపాడాలని 'తెల్లకాగితం' టీమ్ కోరుతోంది. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా తెరకెక్కిన బ్యూటిఫుల్ రోమాంటిక్ ఎమోషనల్ డ్రామానే ఈ 'తెల్లకాగితం'. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించగా, అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. అంతేకాకుండా పాపులర్ రైటర్ నందు సవిరిగాన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. 2000వ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ కథ, టీనేజ్ వయసులో పుట్టిన మొదటి ప్రేమ, ఆ ప్రేమ వల్ల ఆ యువజంట ఎదుర్కొన్న ఊహించని సవాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. అందరూ అక్టోబర్ 2న థియేటర్లలో ఈ ప్రేమకథను చూద్దామని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ లీక్ వార్త ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసింది. ఇది కూడా చదవండి: శ్రీకాంత్ ఓదెలకు షాక్.. బుచ్చిబాబుతో చిరంజీవి నెక్స్ట్ మూవీ.!       [Thella Kaagitham Leaked Online, Thella Kaagitham Piracy Shock, Thella Kaagitham Movie Piracy, Harsh Roshan, Nakshatra, Thella Kaagitham, Leak, Ramesh Bandreddi, Tollywood Piracy News, Telugu Film News]  
    'స్విమ్ సూట్'.. సినిమాలో హీరోయిన్ ధరించే స్విమ్ సూట్ ని ప్రేక్షకులని ఎట్రాక్  చేయడం కోసమని  చాలా మంది అనుకుంటారు గాని, కథ, కథనంకి తగట్టుగా హీరోయిన్ చేత స్విమ్ సూట్ షాట్ వేస్తే ఆమె క్యారక్టర్ తీరు తెన్నులతో ప్రేక్షకులు ట్రావెల్ అవుతుంటారు. మనకి తెలియకుండానే సినిమాతో  ట్రావెల్ అయ్యే  స్క్రీన్ ప్లే జిమ్మిక్క్. దాంతో సినిమా మొత్తానికి మంచి జరుగుతుంది. మరి ఈ స్విమ్ సూట్ విషయంలో సౌత్ లోనే ఫస్ట్ అటెంప్ట్ చేసిన నటి జయంతి గారని మీకు తెలుసా?  భారతీయ సినీ యవనికపై తనదైన ముద్ర వేసి, ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నత నటి 'అభినయ శారద' జయంతి. 1945 జనవరి 6న కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన ఆమె అసలు పేరు కమలా కుమారి. చిన్నతనంలోనే తండ్రి బాలసుబ్రహ్మణ్యం, తల్లి సంతానలక్ష్మి వేరుపడటంతో కుటుంబంతో సహా చెన్నైకి చేరుకున్నారు. నృత్యంపై ఉన్న తీవ్ర ఆసక్తితో డ్యాన్స్ స్కూల్‌లో చేరిన జయంతికి, అక్కడ తమిళ ప్రముఖ నటి మనోరమ సహాధ్యాయిగా పరిచయమయ్యారు. నటన, నాట్యం నేర్చుకునే ఆరంభ రోజుల్లో కొందరు ఆమె లావుగా ఉందంటూ హేళన చేసినా, అధైర్యపడకుండా తీవ్రంగా శ్రమించి తన ప్రతిభతోనే సమాధానం చెప్పాలని నిశ్చయించుకున్నారు.  అభినయంలో అద్భుత రసాలను పండించే సత్తా ఉన్న జయంతిని వై. ఆర్. స్వామి గుర్తించి, 1963లో 'జేను గూడు' అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం చేశారు. ఆ చిత్రంతోనే వై.ఆర్. స్వామి ఆమె పేరును 'జయంతి'గా మార్చారు.   తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ మరియు మరాఠీ భాషల్లో కలిపి మొత్తం 500 కి పైగా చిత్రాలలో నటించి దక్షిణ భారత చిత్రసీమలో అగ్ర కథానాయికగా జయంతి వెలిగిపోయారు. కన్నడ ఇండస్ట్రీలో దిగ్గజ నటుడు రాజ్‌కుమార్‌తో ఏకంగా 30 కి పైగా సినిమాల్లో నటించి అరుదైన రికార్డు సృష్టించారు.  తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'జగదేకవీరుని కథ' చిత్ర సెట్స్‌ను సందర్శించినప్పుడు చిన్నారి కమలా కుమారిని ఎన్టీఆర్ తన ఒడిలో కూర్చోబెట్టుకుని సరదాగా "భవిష్యత్తులో నా కథానాయికవి అవుతావా?" అని అడిగారట. ఆ మాట నిజమవుతూ ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ సరసన 'జగదేకవీరుని కథ', 'కులగౌరవం', 'కొండవీటి సింహం', 'జస్టిస్ చౌదరి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలలో ఆమె మెరిశారు. అలాగే శోభన్ బాబు, కృష్ణంరాజు, అక్కినేని నాగేశ్వరరావు వంటి మహానటుల సరసన కూడా వైవిధ్యమైన పాత్రలను పోషించి మెప్పించారు. 1965లో వచ్చిన 'మిస్ లీలవతి' చిత్రంలో ఆధునిక తరహా పాత్రలో నటించి సంచలనం సృష్టించారు.   అప్పట్లోనే స్విమ్‌సూట్, మోడరన్ దుస్తులు ధరించి సరికొత్త గ్లామర్ శకాన్ని ప్రారంభించిన మొదటి కన్నడ నటిగా ఆమె రికార్డులకెక్కారు. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పతకం లభించగా, నాటి సమాచార ప్రసారాల శాఖ మంత్రి ఇందిరా గాంధీ స్వయంగా జయంతిని ముద్దాడి అభినందించడం విశేషం.  ఇది కూడా చదవండి: 'సంబరాల ఏటిగట్టు' కథ లీక్ అయ్యింది: ఇది ఆ మెగా ప్రొడ్యూసర్ పనేనా!   ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో 'ఇరు కోడుగల్', 'బామా విజయం', 'ఎదిర్ నీచ్చల్', 'పున్నగై' వంటి అనేక గొప్ప సామాజిక సినిమాలలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.   తన నటనకు గాను అత్యుత్తమ నటిగా 4 సార్లు, ఉత్తమ సహాయ నటిగా 2 సార్లు సహా మొత్తం 7 సార్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర పురస్కారాలను జయంతి గెలుచుకున్నారు. దాంతోపాటు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులను రెండుసార్లు ('ఎడకల్లు గుడ్డద మేలే', 'తులసి' సినిమాలకు) కైవసం చేసుకున్నారు. కన్నడ పరిశ్రమ ఆమెకు 'అభినయ శారద' అనే బిరుదుతో సత్కరించింది.  అప్పటికే పెళ్ళైన  ప్రముఖ నటుడు, దర్శకుడు పేకేటి శివరామ్‌ని  వివాహం చేసుకున్న జయంతి ఆ తర్వాత విడిపోయారు.  చివరి శ్వాస వరకు సినీ రంగానికే అంకితమయ్యి . జూలై 26, 2021న తన 76వ ఏట కన్నుమూశారు. మూసింది కన్నే కానీ. కళాకారిణిగా నిత్యం అభిమానులు, ప్రేక్షకుల మనస్సులో నిత్య స్పర్శ గా ఉంటూనే ఉన్నారు.   [Veteran Actress Jayanthi Biography Life Story, Actress Jayanthi Biography,swim suit, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
ఇప్పటికే 'విశ్వంభర' షూటింగ్ పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం 'కాకా'తో బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా విషయంలో.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నిజానికి చిరంజీవి తన 159వ సినిమాను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయాల్సి ఉంది. నాని నిర్మాతగా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా.. మెగాస్టార్ నెక్స్ట్ మూవీ కోసం బుచ్చిబాబు రంగంలోకి దిగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల రూపొందించిన 'ప్యారడైజ్' మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాకి ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా శ్రీకాంత్ పై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఓదెలతో చిరంజీవి సినిమా డౌట్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. బుచ్చిబాబుతో సినిమా చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనుందని సమాచారం. మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన'తో డైరెక్టర్ గా పరిచయమైన బుచ్చిబాబు.. తన సెకండ్ మూవీ 'పెద్ది'ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేశారు. ఇప్పుడు థర్డ్ మూవీకి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చేతులు కలపబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది.  ఒకవేళ చిరంజీవి-బుచ్చిబాబు కాంబినేషన్ నిజమైతే.. శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది. బుచ్చిబాబు ఫిల్మ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఉంటుందా? లేక హోల్డ్ లో పడిందా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇది కూడా చదవండి: నైజాంలో 50 కోట్లు.. ‘ప్యారడైజ్’తో నాని ఆల్ టైమ్ రికార్డ్.!       [Chiranjeevi Next Movie, Chiranjeevi Buchi Babu Movie, Chiranjeevi Srikanth Odela Movie, Buchi Babu Sana, Srikanth Odela, The Paradise Movie, Megastar Chiranjeevi, Natural Star Nani, Telugu Film News]  
  విరూపాక్ష, బ్రో' తో  హిట్ మోడ్ ని ఎంజాయ్ చేస్తున్న సాయి దుర్గా తేజ్ నెక్స్ట్ ఇయర్ జనవరి  12 న మామ చిరంజీవికే పోటీ ఇస్తూ 'సంబరాల ఏటిగట్టు' తో సిద్దమవుతున్నాడు. ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలు చూస్తే హిట్ కొట్టేలాగానే ఉన్నాడు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో స్టూడియోస్ పై హనుమాన్' మేకర్స్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకుడు. చైతన్య రెడ్డి ఇటీవల ఒక  ఇంటర్వ్యూలో మెగా ప్రొడ్యూసర్ హోదాలో 'సంబరాల ఏటిగట్టు గురించి మాట్లాడుతు ఒక వైపు స్వాతంత్ర్య కాంక్షతో రగులుతున్న దేశం, మరోవైపు తాగడానికి చుక్క నీరు లేక ప్రాణాలు వదులుతున్న మూగజీవాలు మరియు మనుషులు. మనిషి ప్రాణానికి, సమాజంలో ఉండే అసమానతలకు మధ్య నీరు ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించగలదో చూపించే అత్యంత భావోద్వేగపూరితమైన పీరియాడికల్ విజువల్ వండర్ 'సంబరాల ఏటిగట్టు'. సింపుల్ గా చెప్పాలంటే స్వాతంత్య్ర పూర్వ కాలంలో రాయలసీమ ఏరియాలో  ఎదురైన తీవ్రమైన నీటి ఎద్దడి, దాని చుట్టూ అల్లుకున్న మానవీయ సంబంధాలు మరియు సామాజిక పోరాటమే ఈ సినిమాకు ప్రధానమైన ఆత్మ అని ఆమె స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి:  ఎందుకు పూరి ఆ నీతులు: హనుమాన్ ప్రొడ్యూసర్  చైతన్య రెడ్డి సంచలన కామెంట్స్    సాయి దుర్గా తేజ్ ఈ చిత్రంలో ఇప్పటివరకు చేయని అత్యంత విభిన్నమైన, భావోద్వేగభరితమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన శారీరకంగానే కాక మానసికంగా కూడా ఎంతో సిద్ధమయ్యారు. 100 ఎకరాల భారీ సెట్లలో, 1000 మందికి పైగా కళాకారులతో రూపొందుతున్న ఈ చిత్రంలో నీటి సమస్యల చుట్టూ తిరిగే సన్నివేశాలు ప్రతీ ఒక్కరినీ కంటితడి పెట్టిస్తామని టాక్. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ కాగా   జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీ రోల్స్.     [Sambarala Yeti Gattu Story, Producer Chaitanya Reddy, Sai Durga Tej SYG, Sambarala Yeti Gattu Update,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
      ప్రైమ్ షో స్టూడియోస్ అధినేతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి. ఈ ఇద్దరు  సినిమాపై ఫ్యాషన్ తో అమెరికా నుంచి వచ్చి 'హనుమాన్' తెరకెక్కించి మొదటి సినిమాతోనే పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అనే టాగ్ లైన్ పొందారు. ప్రస్తుతం సుప్రీం హీరో 'సాయి దుర్గాతేజ్' తో ఇండిపెండెన్స్ పీరియాడిక్  'సంబరాలయేటి గట్టు' తో మరోసారి సెల్యులాయిడ్ ని షేక్ చేయడానికీ రెడీ అయ్యారు. హనుమాన్ డేట్ అయిన  2027 జనవరి 12 న రావడంతో హిట్ సెంటిమెంట్ వినపడుతుంది. రీసెంట్ గా చైతన్య రెడ్డి ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు పూరి జగన్నాధ్, ఛార్మిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రామ్ పోతినేని,  పూరి కాంబోలో  వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' డిస్ట్రిబ్యూషన్ హక్కులని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ ధరకు దక్కించుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దారుణంగా విఫలమై డిస్ట్రిబ్యూటర్లకి షాక్ ఇచ్చింది. ఈ అంశంపైనే  చైతన్య రెడ్డి మాట్లాడుతు 'డబుల్ ఇస్మార్ట్  పంపిణీ హక్కులు తీసుకోవడం వల్ల మేము సుమారు 35 కోట్ల నుంచి 40 కోట్ల వరకు భారీగా నష్టపోయాము. పూరి జగన్నాథ్, ఛార్మి మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. అసలు విషయం ఏమిటంటే.. సినిమా విడుదలకు ముందే పూరి, ఛార్మిల పాత సినిమాల ఫైనాన్షియల్ వ్యవహారాలు (లైగర్ సినిమా నష్టాలు తదితర సమస్యలు) ఇంకా క్లియర్ కాకపోవడంతో  ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ ఆ కీలక సమయంలో ఛార్మి, పూరి రోజూ గంటల తరబడి ఫోన్లు చేసి తీవ్ర స్థాయిలో ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కి పాల్పడ్డారు. మీరు ఈ సమయంలో మమ్మల్ని కాపాడకపోతే, మాకు  చచ్చిపోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. దయచేసి సినిమా రిలీజ్ అవ్వనివ్వండి, ఆ తర్వాత నష్టం వస్తే  మేమే చూసుకుంటాం అని కన్నీళ్లు పెట్టుకుంటూ బతిమిలాడారు. మానవత్వంతో మేము కరిగిపోయి వారికి సాయం చేసాం. కానీ, సినిమా ప్లాప్ అయ్యి కోట్ల రూపాయల నష్టం వచ్చిన తర్వాత   మాట నిలబెట్టుకోలేదు. ఇది కూడా చదవండి: నానికి తమన్నా షాక్: ది ప్యారడైజ్ కంటే ఆ సినిమాకే క్రేజ్ ఎక్కువ!     దీంతో మనుషులు ఇలా ఉంటారా? అని విరక్తి పుట్టింది. అమెరికా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. డిస్ట్రిబ్యూషన్ లాస్ విషయంలో వరంగల్ శ్రీను కి లాస్స్ వస్తే ఛాంబర్ నిలబడింది. కానీ మేము కొత్త వాళ్లమని నిలబడలేదు. నాలుగు నెలలు డిప్రెషన్ లోకి వెళ్ళాను.  పూరి టాక్స్ లో ఎథిక్స్  ఉండాలని  ఏవో నీతులు చెప్తుంటాడు కదా! అయినా పూరి చూడని డబ్బులా!   చచ్చిపోతామని చెప్తే సాయం చేస్తే పోకిరి రీ రిలీజ్ అప్పుడు కూడా వాటా అడిగారు. ఆ ఇద్దరి దెబ్బకి మనుషులపై నమ్మకం పోయే పరిస్థితి అని చైతన్య రెడ్డి తన ఆవేదన చెప్పుకొచ్చింది. సినీ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చిత్తశుద్ధితో అమెరికా నుంచి వచ్చి సినిమాలు నిర్మిస్తూ పదిమందికి పని కల్పిస్తున్నారు. కాబట్టి సినీ కళామ తల్లి మీకు అన్ని హనుమాన్ లాగానే విజయాలు అందిస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు.   [Producer Chaitanya Reddy About Puri jagannadh, Producer Chaitanya Reddy, Chaitanya Reddy About Charmi, Sambarala Yetigattu, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన భారతీయుల నిత్య జీవితంలో అన్నం లేని ఆహారాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అని తేడా లేకుండా ప్రతిరోజూ ప్లేట్ నిండా తెల్లటి పాలిష్ చేసిన బియ్యాన్ని తినడానికి అలవాటుపడిపోయాం. అయితే, రుచికి ఎంతో బాగుండే ఈ పాలిష్డ్ తెల్ల బియ్యం మన ఆరోగ్యానికి ఎంతటి చేటు చేస్తుందో అని తెలిస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. ధాన్యం నుంచి లభించే పోషకాలను, పీచు పదార్థాన్ని పాలిషింగ్ ప్రక్రియ ద్వారా పూర్తిగా తొలగించి కేవలం పిండి పదార్థాన్ని మాత్రమే మిగిల్చే తెల్ల బియ్యం కంటే, తృణధాన్యాల వర్గానికి చెందిన  బ్రౌన్ రైస్  (తవుడు తీయని బియ్యం) రోజూ తీసుకోవడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకునే వారికి, ముఖ్యంగా ఆధునిక జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారికి బ్రౌన్ రైస్ ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో విటమిన్ బి1, విటమిన్ బి3, విటమిన్ బి6 వంటి అత్యవసర విటమిన్లు, అలాగే మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, ఇనుము మరియు జింక్ వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటన్నింటికీ మించి బ్రౌన్ రైస్‌లో లభించే అధిక పీచు పదార్థం (ఫైబర్) జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కడుపులో ఉండి నెమ్మదిగా అరుగుతుంది. కాబట్టి కొద్దిగా తిన్నా సరే కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా అతిగా తినే అలవాటు తగ్గి, బరువు తగ్గాలనుకునే వారికి మరియు ఊబకాయంతో బాధపడేవారికి బ్రౌన్ రైస్ ఒక అద్భుతమైన ఆహార ఎంపికగా మారుతుంది. ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మధుమేహం లేదా టైప్ 2 డయాబెటిస్. తెల్లటి బియ్యం తిన్నప్పుడు అందులోని పిండి పదార్థం వేగంగా రక్తంలో గ్లూకోజ్‌గా మారి షుగర్ లెవెల్స్‌ను ఒక్కసారిగా పెంచేస్తుంది. కానీ బ్రౌన్ రైస్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. దీనిని ఆహారంగా తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగకుండా చాలా నెమ్మదిగా విడుదలవుతాయి. అందువల్ల డయాబెటిస్ బాధితులు బ్రౌన్ రైస్‌ను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిలను చాలా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి మరియు గుండె ఆరోగ్యాన్ని పటిష్టం చేసుకోవాలనుకునే వారికి బ్రౌన్ రైస్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో లభించే పీచు పదార్థం, మాంగనీస్ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో దోహదపడతాయి. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడి, రక్తపోటును (బిపి) అదుపులో ఉంచుతుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన ముప్పుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తూ, మెదడు నాడీ వ్యవస్థను వేగవంతం చేయడంలో బ్రౌన్ రైస్ సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక పూట తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్‌ను అలవాటు చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యవంతమైన జీవనాన్ని సొంతం చేసుకోవచ్చు.     [ Brown Rice, White Rice, Whole Grains, Dietary Fiber, Diabetes, Blood Sugar, Low Glycemic Index, Weight Management, Heart Health, Cholesterol ]
నేటి ఆధునిక జీవనశైలిలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు మరియు వాపులు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం లేదా పెరిగిన బరువు వల్ల నడవడమే కష్టంగా మారిన రోజుల్లో తక్షణ ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ మాత్రలను మింగడం సర్వసాధారణమైపోయింది. అయితే, మన పూర్వీకులు మరియు ఆయుర్వేద మూలికా వైద్యులు ఎన్నో ఏళ్ల క్రితమే మోకాళ్ల నొప్పులు, వాపులు, కండరాల నొప్పులు మరియు దెబ్బలకు అద్భుతమైన సహజ నివారణగా ఆమెడ ఆకులను  (ఆముదపు ఆకులు) ఉపయోగించేవారు. ఆయుర్వేదంలో ఎంతో ప్రాశస్త్యం పొందిన ఈ ఆముదపు ఆకులలో వాపును తగ్గించే ఆంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, నొప్పులను నయం చేసే అనాల్జెసిక్ లక్షణాలు సమృద్ధిగా లభిస్తాయి. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఆమెడ ఆకులు అందించే 5 సాంప్రదాయ మరియు ప్రయోజనకరమైన ఉపయోగాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. మొదటిది, మోకాళ్ల నొప్పులు మరియు కీళ్ల వాపులను తక్షణమే తగ్గించడంలో ఆమెడ ఆకుల కాపడం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. తాజా ఆమెడ ఆకులను శుభ్రంగా కడిగి, వాటికి కొద్దిగా నువ్వుల నూనె లేదా ఆముదం నూనె పూసి పెనంపై లైట్‌గా వేడి చేయాలి. అలా గోరువెచ్చగా ఉన్న ఆకులను మోకాళ్లు లేదా తీవ్రమైన నొప్పి ఉన్న కీళ్ల భాగంలో ఉంచి, సున్నితంగా గుడ్డతో కట్టు కట్టాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆకుల్లోని మూలికా మూలకాలు చర్మంలోకి ఇంకి కీళ్లలో చేరిన ద్రవాలను, వాపులను తగ్గించి తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. రెండవది, ఆర్థరైటిస్ మరియు కండరాల పట్టేతకు ఆమెడ ఆకులతో నూనె మసాజ్ అద్భుతమైన నివారణ. ఆముదం నూనెను గోరువెచ్చగా వేడి చేసి, దానికి ఆముదపు ఆకుల పసరును కలిపి కీళ్లపై మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత వేడి చేసిన ఆకుని కట్టుగా కట్టడం వల్ల కీళ్ల మధ్య ఉండే దృఢత్వం తగ్గి, రక్తప్రసరణ మెరుగవుతుంది. మూడవది, చర్మంపై ఏర్పడే దెబ్బలు, వాపులు మరియు గాయాలను త్వరగా నయం చేయడంలో కూడా ఇవి సహాయపడతాయి. ఆమెడ ఆకులను మెత్తటి పేస్ట్‌లా నూరి, దానికి కొద్దిగా పసుపు కలిపి వాపులు లేదా చిన్న చిన్న గాయాలపై లేపనంగా రాయడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా గాయాలు త్వరగా మానడానికి తోడ్పడుతుంది. నాల్గవది, ఆమెడ ఆకుల కషాయం ద్వారా పొందే ఆవిరి పట్టుట (వేదనా శమనం). ఆమెడ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటి ఆవిరిని నొప్పులు ఉన్న కీళ్లకు పట్టించడం వల్ల నరాలు ఉద్దీపన చెంది కండరాల ఒత్తిడి తక్షణమే తొలగిపోతుంది. ఇక ఐదవది, పాదాల నొప్పులు మరియు మడమల వాపు నివారణ. రోజంతా నిలబడి పనిచేయడం వల్ల పాదాల కింద వచ్చే నొప్పులకు, వేడి చేసిన ఆమెడ ఆకులపై పాదాలను కొద్దిసేపు ఉంచి తొక్కితే అరికాళ్ల మంటలు మరియు వాపులు నయమవుతాయి. ఈ విధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కేవలం మన ఇంటి పరిసరాల్లో లభించే ఆమెడ ఆకులతో మోకాళ్ల నొప్పులను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు.     [ Castor Leaves, Knee Pain, Joint Pain, Arthritis, Joint Swelling, Ayurvedic Remedies, Anti Inflammatory, Muscle Pain, Castor Oil, Natural Pain Relief ]  
నేటి డిజిటల్ యుగంలో ఉదయం నిద్రలేచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకపోతే క్షణం గడవని పరిస్థితి నెలకొంది. అందులోనూ ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ వీడియోల మోజులో పడి గంటల తరబడి సమయాన్ని స్క్రీన్‌కే అంకితం చేస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. కేవలం ఒకే ఒక్క నిమిషం రీల్ చూద్దామని యాప్ ఓపెన్ చేసిన నెటిజన్లు, తమకు తెలియకుండానే గంటల తరబడి బొటనవేలితో రీల్స్ స్క్రోల్ చేస్తూ అంతులేని ఆన్‌లైన్ ప్రపంచంలో మునిగిపోతున్నారు. ఈ అలవాటునే వైద్య పరిభాషలో  డూమ్‌స్క్రోలింగ్ (Doomscrolling) అని పిలుస్తారు. అయితే, కేవలం కాలక్షేపం అనుకునే ఈ చిన్న అలవాటు మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఏ స్థాయిలో దెబ్బతీస్తోందో తెలిస్తే ఎవరైనా సరే తీవ్ర దిగ్భ్రాంతికి గురికావాల్సిందే. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వంటి స్వల్ప వ్యవధి వీడియోలను నిరంతరం చూడటం వల్ల మెదడులో  డోపమైన్  అనే హార్మోన్ వేగంగా విడుదలవుతుంది. ప్రతి కొత్త రీల్ వచ్చినప్పుడల్లా మెదడు ఒక క్షణికానందాన్ని, వినోదాన్ని పొందుతుంది. ఈ ప్రక్రియ పదే పదే జరగడం వల్ల మెదడు ఈ వేగవంతమైన డోపమైన్ విడుదలకు అలవాటుపడిపోయి క్రమంగా దానికి బానిసగా మారుతుంది. దీనివల్ల మనుషుల్లో ఏకాగ్రత మరియు శ్రద్ధ వహించే సమయం (Attention Span) దారుణంగా పడిపోతుంది. పుస్తకాలు చదవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం లేదా సుదీర్ఘమైన పనిపై దృష్టి పెట్టడం వంటి సాధారణ విషయాలు మెదడుకు తీవ్రమైన విసుగును కలిగిస్తాయి. ఫలితంగా ఏ పనిపైనా సరిగ్గా దృష్టి సారించలేక జ్ఞాపకశక్తి మందగించే ప్రమాదం ఏర్పడుతుంది. అంతేకాకుండా, గంటల తరబడి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ వైపే చూస్తూ ఉండటం వల్ల దాని నుంచి వెలువడే తీవ్రమైన బ్లూ లైట్ కంటి రెటీనాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల కళ్ళు పొడిబారిపోవడం, మంటలు పుట్టడం, దృష్టి లోపాలు కలగడం వంటి డిజిటల్ ఐ స్ట్రెయిన్ సమస్యలు తలెత్తుతాయి. రాత్రి వేళల్లో బెడ్‌పై పడుకుని రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల నిద్రను ప్రేరేపించే  మెలటోనిన్  హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల తీవ్రమైన నిద్రలేమి (Insomnia) ఆవహించి, ఉదయానికి శరీరం తీవ్ర అలసటకు గురవుతుంది. శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి ఒకే చోట కూర్చుని లేదా పడుకుని ఫోన్ చూడటం వల్ల మెడ నొప్పులు, వీపు నొప్పులు రావడమే కాకుండా, శరీర జీవక్రియ మందగించి ఊబకాయం మరియు గుండె సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ డిజిటల్ అడిక్షన్ మానసిక ఆరోగ్యానికి కలిగిస్తున్న నష్టం మరింత తీవ్రమైనది. రీల్స్‌లో కనిపించే ఇతరుల గ్లామరస్ జీవితాలు, లగ్జరీ ప్రయాణాలు, అందమైన రూపాలను చూసి సామాన్యులు తమ నిజ జీవితంతో పోల్చుకోవడం ప్రారంభిస్తారు. ఈ అవాస్తవిక పోలికల వల్ల తమలో అభద్రతా భావం పెరిగిపోయి, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన (Anxiety) మరియు డిప్రెషన్‌కు దారితీస్తోంది. కాబట్టి ఈ డిజిటల్ వల నుంచి బయటపడటానికి ప్రతిఒక్కరూ స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేసుకోవడం అత్యంత అవసరం. రోజుకు ఎంత సమయం సోషల్ మీడియా వాడాలనే దానిపై కచ్చితమైన సమయ పరిమితిని ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి పడుకునే కనీసం ఒక గంట ముందు ఫోన్‌ను పక్కన పెట్టడం, డిజిటల్ డిటాక్స్ పాటించడం ద్వారా ఈ వ్యసనం నుండి బయటపడి మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.     [ Doomscrolling, Social Media Addiction, Instagram Reels, Smartphone Addiction, Screen Time, Attention Span, Digital Eye Strain, Sleep Problems, Mental Health, Digital Detox ]
 గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి డాక్టర్లు చెప్పిన సలహాలు..! గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక్క రోజులో జరిగే  పని కాదు. నేటి ఆధునిక జీవనశైలి, సరైన పోషకాహారం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాల వల్ల చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం మన దేశంలో సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే, ముందే మన లైఫ్ స్టైల్ లో  కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే.. చురుగ్గా ఉండటం.. బాగా  వర్కవుట్లు చేయలేకపోయినా, రోజూ కొంత సమయం నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేసే వారు మధ్యమధ్యలో లేచి కాసేపు అటుఇటు తిరగడం వల్ల శరీరంలో రక్తం సరఫరా మెరుగ్గా ఉంటుంది. ఆహారం..  బరువు తగ్గడం కోసమే కాకుండా, శరీర జీవక్రియలను క్రమబద్ధీకరించే పౌష్టికాహారాన్ని ఎంచుకోవాలి. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం ఎంత పరిమాణంలో ఉందో, అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో గమనించడం చాలా అవసరం. దీర్ఘకాలంలో గుండెకు మేలు చేసే బాలెన్స్డ్  ఆహారాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. కండరాలను బలంగా ఉంచే వ్యాయామాలు..  వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కండరాల సాంద్రత తగ్గుతుంది. అందుకే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదా కండరాలను దృఢపరిచే వ్యాయామాలు చేయడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని, ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో రక్షణ ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం.. ఇప్పటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి చాలా సాధారణమైపోయింది. ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మనస్సును, నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడానికి సంగీతం వినడం, ధ్యానం చేయడం, లోతైన శ్వాస తీసుకోవడం వంటివి చేయాలి. రోజులో కొంత సమయాన్ని మనస్సును తేలికపరిచే కార్యకలాపాల కోసం కేటాయించడం చాలా ఉపయోగకరం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏవేవో  ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. మన రోజువారీ అలవాట్లలో నడకను భాగం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని దూరం చేసుకోవడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారానే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.  
అన్నానికి ప్రత్యామ్నాయంగా ఈమధ్య చాలామంది చూపు క్వినోవా వైపు మళ్లుతోంది. బరువు తగ్గాలనుకునే వారు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలనుకునే వారు ప్రతిరోజూ తినే తెల్ల అన్నాన్ని పక్కన పెట్టి క్వినోవాను ఎంచుకుంటున్నారు. ఇది చూడటానికి చిన్న చిన్న గింజల్లా అనిపించినా, దీనివల్ల శరీరానికి అందే పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. మన చిరు ధాన్యాల మాదిరిగానే క్వినోవా కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ అన్నం స్థానంలో క్వినోవాను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి  మార్పులు వస్తాయో తెలుసుకుంటే.. ఎక్కువ పోషకాలు.. అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువ. దీనివల్ల అన్నం తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరుగుతాయి. కానీ క్వినోవాలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీనివల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచి ప్రత్యామ్నాయం. అలాగే, ఇది తిన్న తర్వాత చాలా సేపటి వరకు కడుపు నిండిన భావన ఉంటుంది. పదే పదే ఆకలి వేయకపోవడం వల్ల ఆటోమేటిక్‌గా ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా శరీరంలో అనవసరమైన కొవ్వు కరిగి బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు.. శాకాహారులకు క్వినోవా ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. సాధారణంగా మొక్కల సంబంధిత ఆహారాల్లో అన్ని రకాల అమైనో ఆసిడ్లు లభించడం కష్టం. కానీ క్వినోవాలో శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అవసరమైన అమైనో ఆసిడ్లు ఉన్నాయి. దీనివల్ల శరీరానికి కావలసిన సంపూర్ణ ప్రొటీన్ అందుతుంది. ఇది కండరాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తి లభిస్తుంది. మలబద్దకానికి చెక్.. ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం , జీర్ణక్రియ లోపాలు. క్వినోవాలో ఉన్న అధిక పీచు పదార్థం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వ్యర్థాలు తేలికగా బయటకు వెళ్లేలా చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.  గుండె ఆరోగ్యం కూడా.. క్వినోవా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. క్వినోవాలో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. గ్లూటెన్ ఫ్రీ.. గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి క్వినోవా ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో గ్లూటెన్ ఉండదు. కాబట్టి గోధుమలు, ఇతర ధాన్యాలు పడనివారు కూడా దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి  ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. ఐరన్ శరీరంలో రక్తం కొరత రాకుండా చూస్తే, మెగ్నీషియం నరాలు , కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. వండుకోవడం కూడా తేలిక.. క్వినోవాను వండుకోవడం కూడా చాలా తేలిక. బియ్యాన్ని ఏ విధంగా వండుకుంటామో, అదే విధంగా రెండుసార్లు నీటితో శుభ్రంగా కడిగి ఉడికించుకోవచ్చు. దీనిని ఉడికించిన తర్వాత కూరలతో కలిపి తినవచ్చు లేదా రకరకాల కూరగాయలు చేర్చి ఉప్మా, పులావ్, సలాడ్స్ రూపంలో కూడా తయారుచేసుకోవచ్చు.  రోజువారీ ఆహారంలో తెల్ల అన్నం స్థానంలో క్వినోవాను చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని, చక్కటి ఫిట్‌నెస్‌ను  సొంతం చేసుకోవచ్చు.                     *రూపశ్రీ.
మన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, సమస్యలకు బయట పరిస్థితులే కారణమా? లేక మనలోని ఆలోచనలు, భావాలు, నిర్ణయాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయా? ఈ వీడియోలో Inner Engineering అంటే ఏమిటి? మనలోని ఆలోచనా విధానం మారితే మన ప్రవర్తన, నిర్ణయాలు, జీవన విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనే విషయాలను డాక్టర్ శారదా దేవి, Professor of Human Development and Family Studies వివరిస్తున్నారు. మనల్ని మనం అర్థం చేసుకోవడం, Self-Awareness పెంచుకోవడం, మన ఆలోచనలు మరియు ప్రవర్తనను గమనించడం ద్వారా జీవితంలో సానుకూల మార్పులు ఎలా తీసుకురావచ్చో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. Stress Relief, Mental Well-being, Self-Awareness, Motivation వంటి అంశాలపై ఉపయోగకరమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ పూర్తి వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)