
విరూపాక్ష, బ్రో' తో హిట్ మోడ్ ని ఎంజాయ్ చేస్తున్న సాయి దుర్గా తేజ్ నెక్స్ట్ ఇయర్ జనవరి 12 న మామ చిరంజీవికే పోటీ ఇస్తూ 'సంబరాల ఏటిగట్టు' తో సిద్దమవుతున్నాడు. ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలు చూస్తే హిట్ కొట్టేలాగానే ఉన్నాడు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో స్టూడియోస్ పై హనుమాన్' మేకర్స్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకుడు.
చైతన్య రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మెగా ప్రొడ్యూసర్ హోదాలో 'సంబరాల ఏటిగట్టు గురించి మాట్లాడుతు ఒక వైపు స్వాతంత్ర్య కాంక్షతో రగులుతున్న దేశం, మరోవైపు తాగడానికి చుక్క నీరు లేక ప్రాణాలు వదులుతున్న మూగజీవాలు మరియు మనుషులు. మనిషి ప్రాణానికి, సమాజంలో ఉండే అసమానతలకు మధ్య నీరు ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించగలదో చూపించే అత్యంత భావోద్వేగపూరితమైన పీరియాడికల్ విజువల్ వండర్ 'సంబరాల ఏటిగట్టు'. సింపుల్ గా చెప్పాలంటే స్వాతంత్య్ర పూర్వ కాలంలో రాయలసీమ ఏరియాలో ఎదురైన తీవ్రమైన నీటి ఎద్దడి, దాని చుట్టూ అల్లుకున్న మానవీయ సంబంధాలు మరియు సామాజిక పోరాటమే ఈ సినిమాకు ప్రధానమైన ఆత్మ అని ఆమె స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఎందుకు పూరి ఆ నీతులు: హనుమాన్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి సంచలన కామెంట్స్
సాయి దుర్గా తేజ్ ఈ చిత్రంలో ఇప్పటివరకు చేయని అత్యంత విభిన్నమైన, భావోద్వేగభరితమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన శారీరకంగానే కాక మానసికంగా కూడా ఎంతో సిద్ధమయ్యారు. 100 ఎకరాల భారీ సెట్లలో, 1000 మందికి పైగా కళాకారులతో రూపొందుతున్న ఈ చిత్రంలో నీటి సమస్యల చుట్టూ తిరిగే సన్నివేశాలు ప్రతీ ఒక్కరినీ కంటితడి పెట్టిస్తామని టాక్. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ కాగా జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీ రోల్స్.
[Sambarala Yeti Gattu Story, Producer Chaitanya Reddy, Sai Durga Tej SYG, Sambarala Yeti Gattu Update,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






