.webp)
ఇప్పటికే 'విశ్వంభర' షూటింగ్ పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం 'కాకా'తో బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా విషయంలో.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
నిజానికి చిరంజీవి తన 159వ సినిమాను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయాల్సి ఉంది. నాని నిర్మాతగా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా.. మెగాస్టార్ నెక్స్ట్ మూవీ కోసం బుచ్చిబాబు రంగంలోకి దిగుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల రూపొందించిన 'ప్యారడైజ్' మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాకి ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా శ్రీకాంత్ పై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఓదెలతో చిరంజీవి సినిమా డౌట్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. బుచ్చిబాబుతో సినిమా చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనుందని సమాచారం.

మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన'తో డైరెక్టర్ గా పరిచయమైన బుచ్చిబాబు.. తన సెకండ్ మూవీ 'పెద్ది'ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేశారు. ఇప్పుడు థర్డ్ మూవీకి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చేతులు కలపబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది.
ఒకవేళ చిరంజీవి-బుచ్చిబాబు కాంబినేషన్ నిజమైతే.. శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది. బుచ్చిబాబు ఫిల్మ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఉంటుందా? లేక హోల్డ్ లో పడిందా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: నైజాంలో 50 కోట్లు.. ‘ప్యారడైజ్’తో నాని ఆల్ టైమ్ రికార్డ్.!
[Chiranjeevi Next Movie, Chiranjeevi Buchi Babu Movie, Chiranjeevi Srikanth Odela Movie, Buchi Babu Sana, Srikanth Odela, The Paradise Movie, Megastar Chiranjeevi, Natural Star Nani, Telugu Film News]





