Home

»

Latest News

టాలీవుడ్‌లో కలకలం: రిలీజ్‌కి ముందే 'తెల్లకాగితం' ఫుల్ మూవీ లీక్.!

Sep 29, 2026 1:16PM

ఒక సినిమా తీయడానికి కొన్నేళ్ల కష్టం, కోట్ల రూపాయిల పెట్టుబడి, మరెన్నో గుండెల ఆశలు దాగుంటాయి. కానీ, సినిమా థియేటర్లలోకి రాకముందే, రిలీజ్‌కి మూడు రోజులు ముందు ఆ కష్టమంతా ఆన్‌లైన్‌లో ఉచితంగా దొరికిపోతే ఆ మేకర్స్ గుండె ఎంతలా పగిలిపోతుంది. ప్రస్తుతం ఓ తెలుగు సినిమాకి అలాంటి షాకే తగిలింది. 

అక్టోబర్ 2న రిలీజ్ కావలసిన 'తెల్లకాగితం' సినిమా రిలీజ్‌కి ముందే పైరసీ భూతానికి బలయ్యింది. పైరసీ దొంగలు ఈ సినిమాని ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. ఇప్పటికే మేకర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాని లీక్ చేసిన వారితో పాటు, ఆ లింక్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలకు టీమ్ సిద్ధమవుతోంది. సినిమాని ప్రేమించే వారు ఎవరూ ఈ లీక్ అయిన కంటెంట్‌ను షేర్ చేయవద్దని, ఇండస్ట్రీని కాపాడాలని 'తెల్లకాగితం' టీమ్ కోరుతోంది.

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా తెరకెక్కిన బ్యూటిఫుల్ రోమాంటిక్ ఎమోషనల్ డ్రామానే ఈ 'తెల్లకాగితం'. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించగా, అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. అంతేకాకుండా పాపులర్ రైటర్ నందు సవిరిగాన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు.

2000వ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ కథ, టీనేజ్ వయసులో పుట్టిన మొదటి ప్రేమ, ఆ ప్రేమ వల్ల ఆ యువజంట ఎదుర్కొన్న ఊహించని సవాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. అందరూ అక్టోబర్ 2న థియేటర్లలో ఈ ప్రేమకథను చూద్దామని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ లీక్ వార్త ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసింది.

ఇది కూడా చదవండి: శ్రీకాంత్ ఓదెలకు షాక్.. బుచ్చిబాబుతో చిరంజీవి నెక్స్ట్ మూవీ.!

 

 

 

[Thella Kaagitham Leaked Online, Thella Kaagitham Piracy Shock, Thella Kaagitham Movie Piracy, Harsh Roshan, Nakshatra, Thella Kaagitham, Leak, Ramesh Bandreddi, Tollywood Piracy News, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com