
ప్రైమ్ షో స్టూడియోస్ అధినేతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి. ఈ ఇద్దరు సినిమాపై ఫ్యాషన్ తో అమెరికా నుంచి వచ్చి 'హనుమాన్' తెరకెక్కించి మొదటి సినిమాతోనే పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అనే టాగ్ లైన్ పొందారు. ప్రస్తుతం సుప్రీం హీరో 'సాయి దుర్గాతేజ్' తో ఇండిపెండెన్స్ పీరియాడిక్ 'సంబరాలయేటి గట్టు' తో మరోసారి సెల్యులాయిడ్ ని షేక్ చేయడానికీ రెడీ అయ్యారు. హనుమాన్ డేట్ అయిన 2027 జనవరి 12 న రావడంతో హిట్ సెంటిమెంట్ వినపడుతుంది. రీసెంట్ గా చైతన్య రెడ్డి ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు పూరి జగన్నాధ్, ఛార్మిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
రామ్ పోతినేని, పూరి కాంబోలో వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' డిస్ట్రిబ్యూషన్ హక్కులని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ ధరకు దక్కించుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దారుణంగా విఫలమై డిస్ట్రిబ్యూటర్లకి షాక్ ఇచ్చింది. ఈ అంశంపైనే చైతన్య రెడ్డి మాట్లాడుతు 'డబుల్ ఇస్మార్ట్ పంపిణీ హక్కులు తీసుకోవడం వల్ల మేము సుమారు 35 కోట్ల నుంచి 40 కోట్ల వరకు భారీగా నష్టపోయాము. పూరి జగన్నాథ్, ఛార్మి మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. అసలు విషయం ఏమిటంటే.. సినిమా విడుదలకు ముందే పూరి, ఛార్మిల పాత సినిమాల ఫైనాన్షియల్ వ్యవహారాలు (లైగర్ సినిమా నష్టాలు తదితర సమస్యలు) ఇంకా క్లియర్ కాకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాం.
కానీ ఆ కీలక సమయంలో ఛార్మి, పూరి రోజూ గంటల తరబడి ఫోన్లు చేసి తీవ్ర స్థాయిలో ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కి పాల్పడ్డారు. మీరు ఈ సమయంలో మమ్మల్ని కాపాడకపోతే, మాకు చచ్చిపోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. దయచేసి సినిమా రిలీజ్ అవ్వనివ్వండి, ఆ తర్వాత నష్టం వస్తే మేమే చూసుకుంటాం అని కన్నీళ్లు పెట్టుకుంటూ బతిమిలాడారు. మానవత్వంతో మేము కరిగిపోయి వారికి సాయం చేసాం. కానీ, సినిమా ప్లాప్ అయ్యి కోట్ల రూపాయల నష్టం వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోలేదు.
ఇది కూడా చదవండి: నానికి తమన్నా షాక్: ది ప్యారడైజ్ కంటే ఆ సినిమాకే క్రేజ్ ఎక్కువ!
.webp)
దీంతో మనుషులు ఇలా ఉంటారా? అని విరక్తి పుట్టింది. అమెరికా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. డిస్ట్రిబ్యూషన్ లాస్ విషయంలో వరంగల్ శ్రీను కి లాస్స్ వస్తే ఛాంబర్ నిలబడింది. కానీ మేము కొత్త వాళ్లమని నిలబడలేదు. నాలుగు నెలలు డిప్రెషన్ లోకి వెళ్ళాను. పూరి టాక్స్ లో ఎథిక్స్ ఉండాలని ఏవో నీతులు చెప్తుంటాడు కదా! అయినా పూరి చూడని డబ్బులా! చచ్చిపోతామని చెప్తే సాయం చేస్తే పోకిరి రీ రిలీజ్ అప్పుడు కూడా వాటా అడిగారు. ఆ ఇద్దరి దెబ్బకి మనుషులపై నమ్మకం పోయే పరిస్థితి అని చైతన్య రెడ్డి తన ఆవేదన చెప్పుకొచ్చింది. సినీ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చిత్తశుద్ధితో అమెరికా నుంచి వచ్చి సినిమాలు నిర్మిస్తూ పదిమందికి పని కల్పిస్తున్నారు. కాబట్టి సినీ కళామ తల్లి మీకు అన్ని హనుమాన్ లాగానే విజయాలు అందిస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు.
[Producer Chaitanya Reddy About Puri jagannadh, Producer Chaitanya Reddy, Chaitanya Reddy About Charmi, Sambarala Yetigattu, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






