Home

»

Latest News

సీఎం విజ‌య్ కుమారుడు జేస‌న్ సంజ‌య్ మూవీ 'సిగ్మా' సెన్సార్ పూర్తి.!

Sep 29, 2026 2:25PM

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ‘సిగ్మా’. తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. యాక్షన్, అడ్వెంచర్, హీస్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సీబీఎఫ్‌సీ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సినిమా సిద్ధమైంది. 

ఇక ‘సిగ్మా’ కథ విషయానికి వస్తే.. రూ.500 కోట్ల విలువైన డ్రగ్స్, గ్యాంబ్లింగ్ రాకెట్ చుట్టూ కథ సాగుతుందని ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో తెలుస్తోంది. ట్రెజర్ హంటర్‌గా కనిపించే సందీప్ కిషన్ తన తల్లి కోసం ఓ నిధి వేటలో ఉంటాడు. మరోవైపు సంపత్ రాజ్ పోషించిన వీర శంకర్ రెడ్డి అక్రమ వ్యాపారాలతో మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. ఈ రెండు కథలు కలిసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది సినిమాలో చూడాల్సి ఉంటుంది. 

ఈ సినిమాలో సందీప్ కిషన్‌కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటించారు. సంపత్ రాజ్, రాజు సుందరం, శివ పండిట్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎల్‌కే ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్‌.థమన్ సంగీతం అందించగా.. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. 

మరోవైపు.. దర్శకుడిగా జేసన్ సంజయ్ ఎలాంటి కథను ఎంచుకున్నారు? సందీప్ కిషన్ పాత్ర ఎలా ఉంటుంది? రూ.500 కోట్ల డీల్ వెనుక అసలు కథ ఏంటి? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. సెన్సార్ పూర్తి కావడంతో ఇక సినిమా విడుదలకు సంబంధించిన పనులు వేగం పుంజుకోనున్నాయి. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సిగ్మా’తో జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలి.

 

 

[Sundeep Kishan Sigma, Sigma Movie, Sigma Movie Release Date, Jason Sanjay Sigma, Vijay Son Jason Sanjay, Sundeep Kishan New Movie, Faria Abdullah Sigma, Sigma Censor Certificate, Sigma Movie U/A Certificate, Thaman Sigma, Lyca Productions]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com