ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగవద్దని స్పష్టం చేశారు. చాంద్రాయణగుట్ట నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్నది జమాత్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. జమాత్ పోటీ చేయాలని ఆదేశిస్తే బరిలోకి దిగుతానని, వద్దని చెబితే ఆ నిర్ణయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు. తన కుమారుడు చాంద్రాయణగుట్ట నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారంపైనా అక్బరుద్దీన్ స్పందించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలో ప్రచారం చేసినవారే.. ఇప్పుడు తన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తన కుమారుడు ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడని, అక్కడే కొనసాగుతాడని తెలిపారు. తన రాజకీయాలతో కుటుంబ సభ్యులకు సంబంధం కల్పించవద్దని కోరారు. తన రాజకీయ భవిష్యత్తుపై వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోనని, జమాత్ సూచనల మేరకే ముందుకు వెళ్తానని అక్బరుద్దీన్ పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో చాంద్రాయణగుట్ట నుంచి ఆయన మరోసారి పోటీ చేస్తారా? లేదా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మరోవైపు, తన సేవా కార్యక్రమాల గురించి కూడా అక్బరుద్దీన్ కీలక విషయాలు వెల్లడించారు. తన కుమార్తె వివాహానికి ముందే స్థానిక అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. వారి భవిష్యత్తుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పిల్లల బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.2 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ఏ ఒక్క వ్యక్తి చేసిన తప్పు కారణంగా మొత్తం పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించడం సరికాదని అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు. వ్యక్తుల చర్యలను మొత్తం పార్టీకి ఆపాదించకూడదన్నారు. తాను ఎన్నికల్లో గెలిచింది తన నిజాయితీతోనేనని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాలు, జమాత్ సూచనలకు అనుగుణంగానే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.మొత్తంగా, తన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారంపై అక్బరుద్దీన్ స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో తన రాజకీయ భవిష్యత్తుపై జమాత్ నిర్ణయమే కీలకమని వెల్లడిస్తూ.. తన కుటుంబాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని స్పష్టమైన సందేశం ఇచ్చారు.       [ Akbaruddin Owaisi, AIMIM, AIMIM MLA, Akbaruddin Owaisi Latest News, Chandrayangutta, Akbaruddin Owaisi Son, Political Entry, Telangana Politics, Hyderabad Politics, Jamaat Decision, AIMIM Politics, Akbaruddin Owaisi Statement, Election News, Orphan Children, Rs 2 Crore Donation, Telangana News ]  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పార్టీ మార్పులు, కొత్త సమీకరణాలతో వేడెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైపీపీని జీరో చేయడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వేస్తున్న ఆడుగులు ఆసక్తికరంగా మారాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకు పెట్టని కోట లాంటి విజయనగరం జిల్లాలో ఆయన పట్టు సడలే విధంగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది.  వైసీపీ  కీలక నాయకుడు, బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను ఇటీవల వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరిన సంగతి తెలిసిందే. అయితే అదేదో మామూలు చేరికగా కాకుండా.. ఏకంగా విజయనగరం జిల్లా సారథ్య బాధ్యతలను ఆయనకు అప్పగించి వైసీపీని దెబ్బతీయాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.  అయితే విజయనగరం జడ్పీ చైర్మన్ గా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన, జిల్లాలో మంచి రాజకీయ పలుకుబడి ఉన్న చిన్న శ్రీనును తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఆషామాషీది కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చిన్న శ్రీను గత నెలలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఆయన తో పాటు పలువురు ఆయన అనుచరులు కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా చిన్న శ్రీను ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం గూటికి వచ్చినట్లు విస్పష్టంగా చెప్పారు. తన చేరికకు ఎటువంటి షరతులు, పదవుల ప్రలోభాలూ లేవని కుండబద్దలు కొట్టారు.   తెలుగుదేశం గూటికి చేరిన తరువాత చిన్న శ్రీను వరుసగా ఆ పార్టీ అగ్రనేతలతో వరుస భేటీలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.   చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ను ఆయన కలిసి జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే చిన్న శ్రీనుకు తెలుగుదేశం జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇందుకు  చిన్న శ్రీనుకు జిల్లాపై ఉన్న పట్టు, పలుకుపడే ప్రధాన కారణమనడంలో సందేహం లేదు.  చిన్న శ్రీనుకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారానికి ప్రధాన కారణం జిల్లాలో ఆయనకు ఉన్న రాజకీయ పరిచయాలే అనడంలో సందేహం లేదు. అదే గనుక జరిగితే విజయనగరంలో బొత్స హవాకు పూర్తిగా గండి పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [TDP Vijayanagaram President Chinna Srinu, Chandrababu Naidu, Chinna Srinu, Majji Srinivasa Rao, Vizianagaram TDP, TDP District President, Nara Lokesh, YCP to TDP,Telugu One]
2019 ఎన్నికలకు ముందు అప్పటికి పొత్తులో ఉన్న తెలుగుదేశం, బీజేపీల మధ్య చిచ్చు పెట్టింది తానేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా 2018 నాటి రాజకీయ పరిణామాలపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెండు పార్టీఅ మధ్యా విభేదాలు పొడసూపి, అవి ముదిరి మైత్రిబంధం తెగిపోవడానికి 2016 నుంచి తాను ప్రయత్నాలు చేశాననీ, చివరకు ఆ ప్రయత్నాలు 2018 నాటికి ఫిలించాయని అప్పట్లో వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి తాజాగా చెప్పారు.  ఈ వ్యాఖ్యలను ఆయన తిరుపతిలో ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం,  బీజేపీ, జనసేన మధ్య పొత్తు  ఉండేది. ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ,  ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు, రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై సైకిల్, కమలం పార్టీల మధ్య విభేదాలు పొడసూపాయి.   2018లో తెలుగుదేశం బీజేపీతో పొత్తు తెంచుకుని,  ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఈ పరిణామం అప్పట్లో  రాష్ట్ర రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చివేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ ఘన విజయం సాధించి అధికారపగ్గాలను చేపట్టింది.   నాటి పరిణామాలపై తాజాగా నోరు విప్పిన విజయసాయి రెడ్డి.. 2016 నుంచి 2018 వరకు టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెంచేందుకు తాను అనేక విధాలుగా ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు.  అలా దూరం పెంచి, ఆ రెండు పార్టీల పొత్తునూ విచ్ఛిన్నం చేయడంలో సక్సెస్ అయ్యాను కనుకనే.. 2019 ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించిందని ఆయన చెప్పకనే చెప్పారు. అప్పట్లో వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం సిద్ధించి అధికార పగ్గాలు చేపట్టడం వెనుక ఉన్నది తానేనని విజయసాయి అన్యాపదేశంగా చెప్పారు.     [Vijayasai Reddy Behind Differences Betweem BJP And TDP, Split, TDP BJP Alliance, 2018,  YS Jagan Political Advantage,   2019 AP Elections,Andhra Pradesh Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Writer and producer Kona Venkat has expressed concern over the growing obsession with pan-India films among Telugu star heroes, questioning the long production timelines and lack of planning that are putting producers under financial pressure. Kona pointed out that several star heroes who once delivered two or three films a year are now taking four to five years to complete a single project. He argued that the industry needs a steady flow of releases to sustain its workforce and keep business moving, rather than having stars remain occupied with one film for years in the pursuit of a pan-India market. He also criticised directors for failing to plan their projects properly, particularly when it comes to a film’s runtime. Citing the example of a film shot for three hours and 50 minutes, only for nearly two hours of footage to be discarded during editing, Kona questioned the waste of time and money involved. He said such a lack of clarity can cause massive losses to producers and called for strict action against directors who put their investments at risk through irresponsible filmmaking. Kona stressed that filmmakers need to approach projects with greater clarity, discipline and financial responsibility. With budgets rising and production schedules stretching, he believes the industry cannot afford to ignore the risks associated with the current trend. His comments have reignited the debate over Telugu cinema’s pan-India ambitions, with questions emerging about whether the pursuit of a wider market is coming at the cost of production efficiency, regular releases and the financial security of producers. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Vijay Deverakonda has decided against ticket price hikes for his films, stating that cinema should remain accessible to audiences across all sections. The actor revealed his stance while interacting with the media ahead of his upcoming film Ranabaali, which is set for a worldwide theatrical release on October 16. Vijay recalled how rising ticket prices affected him during his intermediate college days and said the experience influenced his decision. He intends to speak to producers and directors to ensure that his films are released without ticket price hikes. “I still remember how difficult it was for me when movie ticket prices increased during my intermediate days. That is why I decided to speak to producers and directors and ensure there are no ticket price hikes for my films,” Vijay said. The actor added that affordable ticket prices would encourage more people to watch films in theatres. “Cinema should reach more people. Only when ticket prices are affordable to ordinary audiences will more people come to theatres. Rather than making more money from fewer people, what matters to me is that crores of people watch films in theatres,” he explained. Vijay's comments come amid continued debate over ticket price hikes for big-budget Telugu films. The makers of Ranabaali had earlier clarified that reports of a proposed ticket price hike were false and confirmed that the film would release at standard ticket prices across Andhra Pradesh and Telangana. Directed by Rahul Sankrityan, Ranabaali stars Vijay Deverakonda and Rashmika Mandanna. Presented by T-Series and produced by Naveen Yerneni and Y. Ravi Shankar under the Mythri Movie Makers banner, the period action drama is gearing up for its Dasara release. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    కంటెంట్ బాగుంటే అన్ని రకాల జోనర్స్ ని ఆదరించడం అనాదిగా ప్రేక్షకులు పెట్టుకున్న మంచి సంప్రదాయం. అది నిజం చేస్తూ ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒక సరికొత్త రొమాంటిక్ క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ చిత్రమే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న 'త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్' (Tribhuvan Mishra CA Topper). సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి జీవితంలో ఊహించని ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే, అతను ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే వినూత్న కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది. విడుదలైన నాటి నుంచి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంటూ, ఓటీటీ ట్రెండింగ్ జాబితాలో దూసుకుపోతున్న ఈ సిరీస్ విశేషాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రధారి అయిన త్రిభువన్ మిశ్రా సీఏ (Chartered Accountant) పరీక్షలో టాపర్‌గా నిలిచిన ప్రతిభావంతుడు. ఎంతో నిజాయితీగా బతికే అతనికి అకస్మాత్తుగా తీవ్రమైన బ్యాంకింగ్ సంక్షోభం మరియు కుటుంబ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. సంపాదించే మార్గం లేక సతమతమవుతున్న త్రిభువన్ మిశ్రా, తన కుటుంబాన్ని గట్టెక్కించడానికి మరియు అప్పుల ఊబి నుంచి బయటపడటానికి ఏమాత్రం ఊహించని విధంగా 'మొహాలీ ఎస్కార్ట్' లేదా మేల్ గిగోలో (Male Escort) వృత్తిని ఎంచుకోవాల్సి వస్తుంది. ఒకవైపు పరువు, మరోవైపు కుటుంబ పోషణ మధ్య నలిగిపోయే ఆయన జీవితంలో ఈ కొత్త దారి ఎలాంటి అనూహ్య మలుపులకు, విపత్కర పరిస్థితులకు దారితీసిందనేదే ఈ కథలోని అసలు మజా. ఇది కూడా చదవండి: జైలర్ 2 టికెట్స్ రగడ: తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం  ఈ క్రైమ్-డ్రామా సిరీస్‌లో కేవలం వినోదం మాత్రమే కాకుండా, సాధారణ మధ్యతరగతి మనుషుల బలహీనతలు, సమాజంలో మహిళల కోరికలు, మరియు నైతిక విలువలకు సంబంధించిన సున్నితమైన అంశాలను ఎంతో చమత్కారంగా చూపించారు. ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం 9 ఆసక్తికరమైన ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ సుమారు 44 నిమిషాల నుంచి 67 నిమిషాల పాటు సాగుతుంది. ఈ వినూత్న కథను ప్రముఖ సృష్టికర్త పునీత్ కృష్ణ రూపొందించగా, అమృత్ రాజ్ గుప్తా మరియు పునీత్ కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు రామ్ సంపత్  ప్రాణం పోశారు. ఈ సిరీస్‌లో అడల్ట్ థీమ్స్, బోల్డ్ సన్నివేశాలు ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి చూడకపోవడం మంచిది. రొమాన్స్‌తో పాటు క్రైమ్, కామెడీ, డ్రామా కలగలిపిన కథలని  ఇష్టపడేవారికి త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ మంచి చాయిస్.     నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న హిందీ వెబ్ సిరీస్ అస్సలు మిస్ అవ్వకండి.ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటుడు మానవ్ కౌల్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. అలాగే ఆయనతో పాటు తిలోత్తమ షోమ్, శ్వేతా బసు ప్రసాద్, అశోక్ పాఠక్, ఫైజల్ మాలిక్ వంటి హేమాహేమీలైన నటీనటులు కీలక పాత్రల్లో నటించి సిరీస్‌కు మరింత వన్నె తెచ్చారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సిరీస్, రాటెన్ టొమాటోస్ ప్లాట్‌ఫారమ్‌లోనూ మంచి గుర్తింపుని సాధించింది.    [Tribhuvan Mishra ca Topper Netflix Series, Tribhuvan Mishra CA Topper, Netflix web series, Manav Kaul series, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]
టైగర్ ముత్తువేల్ పాండియన్ 'హుకుం' అంటూ జైలర్ 2 తో ల్యాండ్ కావడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఆ కట్ అవుట్ కి తెలుగు నాట ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. రెండు దశాబ్దాల క్రితమే గుంటూరు లాంటి ఏరియాలో టికెట్స్ కోసం పోలీసులతో గొడవ పెట్టుకున్న ఫ్యాన్స్ సైతం ఉన్నారు. మరి 'జైలర్ 2 ' పై ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు.  అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైలర్ 2 కి ఉన్న భారీ క్రేజ్,మార్కెట్ అంచనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ జారీ చేసింది. దీని ప్రకారం సినిమా విడుదలైన మొదటి వారం రోజుల పాటు, అనగా అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ప్రత్యేక ధరలు వర్తించనున్నాయి.   ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రతి టికెట్‌పై 50 రూపాయల వరకు, అలాగే మల్టీప్లెక్సులలో  75 వరకు అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ పెంచిన ధరలతో పాటు జీఎస్టీ (GST) కూడా వర్తించనుంది. అంతేకాకుండా, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించేందుకు వీలుగా అక్టోబర్ 21 వరకు ప్రతి రోజు అదనంగా ఒక షోతో కలిపి మొత్తం 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఏపీలో దొరికిన ఈ ఊరటతో మేకర్స్ ఖుషీ అవుతున్నారు.  ఇది కూడా చదవండి: నెట్టింట చిరంజీవి పదో తరగతి సర్టిఫికేట్: పూర్తి వివరాలు తెలిస్తే షాక్ అవుతారు!     అయితే సోషల్ మీడియా వేదికగా  కొంత మంది మాత్రం డబ్బింగ్ మూవీకి రేట్స్ పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అభిమానులు, సినీ ప్రేమికులు మాత్రం టీ తాగాలంటేనే ఇరవై రూపాయలకి రావడం లేదు, అలాంటిది భారీ బడ్జెట్ మూవీ. పైగా సినిమా సినిమానే. రేట్స్ నార్మల్ గానే పెంచారని అంటున్నారు. తెలంగాణలో మాత్రం మాములు రేట్స్ కే రిలీజ్ అవుతుంది.  
  మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఏదైనా కొత్త న్యూస్ వస్తే ఆనందపడని తెలుగువారు ఉండరు. ఆ మాట కొస్తే ఆ కొత్త న్యూస్ సైతం ఆనందంతో పులకరించిపోతుంది. ఈ కోవలోనే తాజాగా చిరు 10 th క్లాస్ సర్టిఫికెట్ వైరల్ హోదాలో తన సత్తా చాటుతూ ఉంది సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఆ సర్టిఫికెట్ ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి పూర్తి అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్ రావు (K.S.S. Vara Prasad Rao) గా స్పష్టంగా ముద్రించబడి ఉంది. ఆ పత్రంలో ఆయన తండ్రి పేరు కొణిదెల వెంకట రావు అని, పుట్టిన ప్రదేశం పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండగా నమోదు చేయబడి ఉంది. అలాగే ఆయన పుట్టిన తేదీ ఆగస్ట్ 22, 1955 అని ఆ సర్టిఫికెట్ ద్వారా మరోసారి స్పష్టమైంది. చిన్నతనంలో చదువులోనూ ఎంతో ప్రతిభ కనబరిచిన చిరంజీవి, అప్పట్లో టెన్త్ క్లాస్‌ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారని మెగా అభిమానులు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: కాకాతో ఆల్ టైం రికార్డ్స్ ఖాయం!       ప్రస్తుతం చిరు 'కాకా'తో ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. [Chiranjeevi 10th Class Certificate Viral, Chiranjeevi 10th Class Certificate, megastar chiranjeevi original name, chiranjeevi 10th class certificate, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ రూట్ మార్చేసి డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటారు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌లతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’  సినిమాపై ట్రేడ్ సర్కిళ్లలో మంచి బజ్ నెలకొంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.  ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో ఆది కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆడియో హక్కులకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు ప్రకటించారు. ‘ఈగో రాజా’ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో టీం బిజీగా ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా రాబోతోన్న ఈ మూవీ ఆడియో రైట్స్‌‌ని సరిగమ సంస్థ భారీ రేటుకి సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. దురైరాజ్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు.     [Ego Raja Audio Rights, Ego Raja Movie, Aadi Saikumar, SaReGaMa, Shambhala, Telugu Songs, Telugu Film News]  
  మెగా అభిమానులు, సినీ ప్రేమికుల చూపు మొత్తం నెక్స్ట్ సంక్రాంతికి రాబోయే 'కాకా'పై ఉంది. ఇప్పటి వరకు రిలీజైన ప్రచారచిత్రాలతో అయితే ఎవరకి వారు ఫేమస్ చిరు రైటర్స్ గా మారిపోయి కాక కథ ఇదే అంటూ తమ వాళ్ళకి చెప్తున్నారు.అయితే ఇటీవల 'కాకా' గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడిన మాటలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.  చిరంజీవితో కలిసి ఉన్న ఓ క్లిప్‌ని షేర్ చేస్తూ, ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు సాధిస్తామని థమన్ చెప్పుకొచ్చాడు. థమన్ మాటలను బట్టి ఈ ప్రాజెక్ట్‌పై చిత్రబృందం ఎంతటి నమ్మకంతో ఉందో అర్థమవుతోంది.  మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలి మాస్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను షకింగ్ కలెక్షన్లతో శాసించడానికి సిద్ధమవుతున్నారు.   చిరు డాటర్ గా అనశ్వర రాజన్ కనిపిస్తుండగా చిరు సరసన జోడి కొట్టే భామని అయితే ఇంకా ప్రకటించలేదు. ఇది కూడా చదవండి:  గ్రామీ అవార్డ్స్ బరిలో ధురంధర్: న్యాయం జరుగుతుందా!అన్యాయం జరుగుతుందా!      టాక్సిక్, జన నాయగన్ మేకర్స్ కేవీఎన్ సంస్థ నిర్మిస్తున్న కాకా జనవరి 13న రిలీజ్ కానుంది. బాబీ దర్శకుడు.       [kaaka Movie Update, Thaman About kaaka, Chiranjeevi About Kaaka,  Kaaka movie, Chiranjeevi Kaaka, SS Thaman, Bobby Kolli, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]
రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ'  (‘AH) ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది.  అడివి శేష్ విడుదల చేసిన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడంతో పాటు.. ఇటీవల ‘బ్లడీ హంగర్’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 30న థియేట్రికల్‌ విడుదల చేస్తున్నారు. స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ మిస్టిరీయస్‌ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్‌ కి సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని ఇదేనా ఇదేనా అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. శ్రీచరణ్‌ పాకాల స్వరాలు సమాకూర్చిన ఈ పాటను షణ్ముఖ భరద్వాజ్ ఆలపించారు. సుమన్‌ చిక్కాల ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ పాటను జర్నలిస్ట్‌లు పర్వతనేని రాంబాబు, శివమల్లాల, వేణు బిక్కి, వాసు సజ్జా, హేమ మాలిని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా నిర్మాత గ్యారీ బీహెచ్‌ మాట్లాడుతూ ''ఈ పాట అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను. స్నేహితులు అందరం కలిసి ఈ సినిమా చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా బాగా రావడానికి కారణమైన అందరికి కృతజ్ఞతలు." అన్నారు.  శ్రీచరణ్‌ పాకాల మాట్లాడుతూ ''ఈ సినిమా నా కెరీర్‌లో వెరీ వెరీ స్పెషల్‌. రాహుల్‌ విజయ్‌, అర్చన పర్‌ఫార్మెన్స్‌ గురించి మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్‌ అందరూ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేశారు. వెరీ టాలెంటెడ్‌ పీపుల్‌ అందరూ. దర్శకుడు సాయి చూడటానికి సున్నితంగా ఉంటాడు కానీ ఈయన చేసిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చూస్తే అందరూ షాక్‌ అవుతారు. అందరికి ఈ ఇదేనా ఇదేనా పాట నచ్చిందని నమ్ముతున్నాను" అన్నారు.  దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ ''రాహుల్‌ విజయ్‌ అమేజింగ్‌ యాక్టర్‌. కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే అన్నాడు. ఎంతో క్రమశిక్షణ గల ఆర్టిస్ట్‌. నన్ను ఎంతో సపోర్ట్‌ చేశాడు. హీరోయిన్‌ అర్చన అయ్యర్‌ బ్యూటిఫుల్‌ ఆర్టిస్ట్‌. ఆమె పర్‌ఫార్మెన్స్‌ ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాకు ఖర్చు పెట్టారు. సినిమాలో పాటలతో పాటు ఆర్‌ఆర్‌ కూడా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. శ్రీచరణ్‌ పాకాల ఆర్‌ఆర్‌ గురించి సినిమా విడుదల గురించి మాట్లాడుకుంటారు. అందరి సపొర్ట్‌తో బెస్ట్‌ అవుట్‌ పుట్‌ ఇచ్చానని నమ్ముతున్నాను, టైటిల్‌ చుట్టు ఉన్న అమ్మాయి.. అదృశ్యం.. అన్వేషణ, అనుమానం.. అసాంఘీకం... అమానుషం ఈ పదాల మధ్యే ఈ కథ మొత్తం ఉంది. రాహుల్ విజయ్‌ను ఓ సీన్సియర్‌ పోలీస్ ఆఫీసర్‌గా ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇన్వెస్టిగేషన్ డ్రామాలో ఆయన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది" అన్నారు.  అర్చన అయ్యర్‌ మాట్లాడుతూ ''ఈ సారి 'అ'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఇదొక ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌. ఈ సాంగ్‌ ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమాకు శ్రీచరణ్‌ పాకాల ఎంతో ఇంటెన్స్‌గా సంగీతాన్ని అందించాడు. రాబోయే పాటలు కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమాలో నన్ను నమ్మి ఎంతో మంచి పాత్రను ఇచ్చారు. నాకెరీర్‌ ప్రారంభంలోనే ఇలాంటి మంచి పాత్ర చేయడం లక్కీగా ఫీలవుతున్నాను. ఈసినిమాను నిర్మాతలు ఎంతో పాషన్‌తో నిర్మించారు. రాహుల్‌ విజయ్‌ ఎంతో వండర్‌ఫుల్‌ ఆర్టిస్ట్‌ అంతే మంచి వ్యక్తిత్వం ఉన్న గ్రేట్‌ పర్సన్‌" అన్నారు.  రాహుల్‌ విజయ్‌ మాట్లాడుతూ ''ఈ పాటకు సంగీతం, సాహిత్యం, పిక్చరైజేషన్‌ అన్ని పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. డబ్బులంటే సరిపోదు. సినిమాపై ఎమోషన్‌ ఉండాలి. అలాంటి ఎమోషన్‌ ఉన్న నిర్మాతలు వీళ్లు. అందరూ మల్టీ టాలెంటెడ్‌ ప్రొడ్యూసర్స్‌.ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. శ్రీచరణ్‌ ఈ సినిమాకు బిగ్‌ ఎస్సెట్‌. ఈ పాటతో పాటు సినిమా కూడా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. అక్టోబర్‌ 9న విడుదల కావాల్సిన ఈ సినిమాను బెటర్‌మెంట్‌ కోసం అక్టోబర్‌ 30న ఫర్‌ఫెక్ట్‌ ప్లాన్‌తో విడుదల కాబోతుంది.' అ' మిస్టిరీయస్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా మీ అందరికి థ్రిల్ ను పంచబోతుంది"  అన్నారు.  లిరిసిస్ట్‌ సుమన్‌ మాట్లాడుతూ ''ఇది నా తొలిపాట. శ్రీచరణ్‌ నాకు ఈ అవకాశం ఇచ్చాడు. నాలోని పాటల రచయితను మీకు ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా అందరికి మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.  సింగర్‌ షణ్ముఖ్ మాట్లాడుతూ ''శ్రీచరణ్‌ పాకాల నన్ను నమ్మి ఈ పాట పాడే అవకాశం ఇచ్చాడు. ఈ పాట ఈ సినిమాలో చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఈ పాట పిక్చరైజేషన్‌ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది" అన్నారు.  ఇది కూడా చదవండి: దిల్ రాజు భారీ స్కెచ్.. ఒకే దెబ్బకు లెక్కలన్నీ సెట్ అవుతాయా.?       [AH Movie, Idhena Idhena Song, Rahul Vijay, Archana Iyer, Sricharan Pakala, Telugu Songs, Telugu Film News]  
ధురంధర్ సిరీస్ సృష్టించిన సౌండ్ మోత అభిమానులు, ప్రేక్షకుల నుంచి దూరమవ్వడం ఇప్పట్లో కష్టం. అంతలా ప్రభంజనాన్ని తన చుట్టూ అమర్చుకుంది. రీసెంట్ గా  ప్రతిష్టాత్మకమైన 2027 గ్రామీ అవార్డుల (Grammy Awards) బరిలో నిలిచింది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన అద్భుతమైన సంగీతం, సరికొత్త బాణీలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ 'బీ62 స్టూడియోస్' అధికారికంగా ప్రకటిస్తూ, మొత్తం 8 విభాగాలలో గ్రామీ అవార్డుల పరిశీలన కోసం తమ ఆల్బమ్‌ను పంపినట్లు వెల్లడించింది. ఇది భారతీయ సినిమా సంగీతానికి దక్కుతున్న మరో గొప్ప గౌరవంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ఒరిజినల్ కంపోజిషన్సే కాకుండా, పాత క్లాసిక్ పాటలను నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా రీక్రియేట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'ఫిర్ సే', 'ఆరి ఆరి', 'జాయే సజానా' వంటి సూపర్ హిట్ పాటలు గ్రామీ అవార్డుల నామినేషన్ రేసులో వివిధ విభాగాల కింద పరిశీలనకు ఎంపికయ్యాయి. ఇర్షాద్ కమిల్ సహా పలువురు ప్రముఖ గీత రచయితలు అందించిన సాహిత్యం  పాటలకి ప్రాణం పోసింది. అయితే, ఈ ఎంట్రీలు కేవలం గ్రామీ అకాడమీ పరిశీలన కోసం సమర్పించిన ప్రాథమిక దశ మాత్రమేనని, తుది నామినేషన్లు రికార్డింగ్ అకాడమీ యొక్క కఠినమైన అర్హతా ప్రమాణాలు.  ఇది కూడా చదవండి: బిగ్ బి కి బిగ్ షాక్: నవంబర్ 16 న ఆ సిటీ కోర్టులో హాజరు కావాల్సిందే!      గ్రామీ అకాడమీ అవార్డ్స్ సంగీత ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు. గ్రామీ ట్రోఫీ బంగారు పూత పూసిన ఒక గ్రామోఫోన్ ఆకారంలో ఉంటుంది. దీనిని "గ్రామియం"అనే ప్రత్యేక లోహంతో జాన్ బిల్లింగ్స్ అనే కళాకారుడు చేత్తో తయారు చేస్తారు.    [Dhurandhar Soundtrack Grammy Awards 2027, Dhurandhar Soundtrack, Grammy Awards 2027, Ranveer Singh movie, Dhurandhar The Revenge, Shashwat Sachdev music, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]  
డిస్ట్రిబ్యూటర్‌గా ఈ ఏడాది ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన నిర్మాత దిల్ రాజు, ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. యశ్ నటించిన ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ షాక్ తర్వాత.. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’ను తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది భారీ అంచనాలతో పంపిణీ చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో దిల్ రాజుకు డిస్ట్రిబ్యూటర్‌గా కొంత నిరాశ ఎదురైంది. ముఖ్యంగా యశ్ నటించిన ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల హక్కుల వ్యవహారం తర్వాత ఆయన తదుపరి అడుగుపై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ‘రామాయణం’ తెలుగు రాష్ట్రాల పంపిణీ బాధ్యతలు దిల్ రాజుకు అప్పగించినట్లు కథనాలు వస్తున్నాయి. సౌత్ థియేట్రికల్ రైట్స్ యశ్ వద్ద ఉండటంతో, ఆయన ద్వారా ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక ఇతిహాసంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. నమిత్ మల్హోత్రా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ కథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగాన్ని నవంబర్ 5న విడుదల చేయాలని, నవంబర్ 4న పెయిడ్ ప్రీమియర్లు నిర్వహించాలని ప్రణాళిక ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో థియేటర్లను అందుబాటులోకి తీసుకొచ్చి, ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘రామాయణం’కు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉండటంతో, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తే దిల్ రాజుకు పంపిణీదారుడిగా మళ్లీ ఊపు వచ్చే అవకాశం ఉంది.  ఇది కూడా చదవండి: ఎవ‌రీ గ‌రివిడి ల‌క్ష్మి?.. నారా లోకేష్ ట్వీట్‌తో ఒక్కసారిగా చర్చ.!       [Ramayana Telugu Release, Ramayana Movie, Dil Raju, Yash, Ranbir Kapoor, Sai Pallavi, Toxic Movie, Telugu Film News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
కాలం మారినా తగ్గని నమ్మకం.. భారతదేశంలో తపాలా సేవల ప్రయాణం, ప్రాముఖ్యత..!   మన జీవితంలో ఉత్తరాల ప్రాముఖ్యత, తపాలా వ్యవస్థ సేవలను స్మరించుకోవడానికి ప్రతీ సంవత్సరం అక్టోబర్ పదో తేదీన జాతీయ తపాలా దినోత్సవం జరుపుకుంటాం. ఒకప్పుడు దూరంగా ఉన్న బంధువులు, స్నేహితుల క్షేమ సమాచారాలు తెలుసుకోవాలన్నా, ముఖ్యమైన వార్తలు పంచుకోవాలన్నా ఉత్తరాలే ఏకైక మార్గంగా ఉండేవి. సాంకేతికత ఎంత పెరిగినా, చేతికి ఫోన్ వచ్చినా తపాలా శాఖ అందించిన సేవలు, అనుబంధాలు ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. అయితే ప్రపంచ తపాలా దినోత్సవానికి, జాతీయ తపాల దినోత్సవాని తేడా ఏమిటి? జాతీయ తపాలా దినోత్సవం గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. తపాలా దినోత్సవం.. అక్టోబర్ తొమ్మిదో తేదీన ప్రపంచ తపాలా దినోత్సవం జరుగుతుంది. దానిని పురస్కరించుకుని మరుసటి రోజు, అంటే అక్టోబర్ పదో తేదీన మన దేశంలో జాతీయ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. భారతదేశంలో క్రమబద్ధమైన తపాలా వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి పదిహేడో శతాబ్దంలోనే పునాదులు పడ్డాయి.1854 సంవత్సరంలో లార్డ్ డల్హౌసీ హయాంలో ఆధునిక తపాలా శాఖ అధికారికంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ రోజు నుంచి నేటి వరకు ఈ శాఖ దేశ ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూనే ఉంది. తపాలా శాఖలో మార్పులు.. ఒకప్పుడు కేవలం ఉత్తరాలు చేరవేయడానికే పరిమితమైన తపాలా శాఖ, కాలక్రమేణా అనేక మార్పులు చూసింది. పోస్టల్ మనీ ఆర్డర్ల ద్వారా డబ్బులు పంపడం, తంతి సేవలు అందించడం వంటివి గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేశాయి. ఇప్పటికీ మారుమూల గ్రామాలలో కూడా పోస్ట్ ఆఫీసులు అందుబాటులో ఉండి ప్రజలకు నమ్మకమైన సేవలు అందిస్తున్నాయి. డిజిటల్ యుగంలో తపాలా శాఖ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో తపాలా శాఖ కూడా తన రూపురేఖలను మార్చుకుంది. కేవలం ఉత్తరాలకే పరిమితం కాకుండా పొదుపు పథకాలు, ఇన్స్యూరెన్స్ సేవలు, పార్సిల్ అండ్ స్పీడ్ పోస్ట్ సేవలు అందిస్తోంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అందరికీ బ్యాంకింగ్ సేవలను గుమ్మం ముందుకు తీసుకువచ్చింది. ఈ విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను జోడించుకుని ముందుకు సాగుతోంది. ఉత్తరం తెచ్చే పోస్టుమ్యాన్ కోసం ఆత్రుతగా ఎదురుచూసిన రోజులు మన అనుభవాల్లో తీపి గుర్తుగా మిగిలిపోయాయి. దేశంలో నలుమూలలా విస్తరించిన ఈ వ్యవస్థ, ప్రజల మధ్య అనుబంధాలను కలపడంలో కీలక పాత్ర పోషించింది. జాతీయ తపాలా దినోత్సవం అనేది తపాలా శాఖ సిబ్బంది కష్టాన్ని గుర్తించడానికి, సమాజానికి వారు చేసిన సేవలను గౌరవించడానికి ఒక మంచి సందర్భం.                                                                                                                                           *రూపశ్రీ.
ప్రపంచ తపాలా దినోత్సవం..  సమాచార ప్రసారంలో చెరగని ముద్ర..    మానవ సమాజ పురోగతిలో, సంబంధాలను దగ్గర చేయడంలో  తపాలా వ్యవస్థ నిర్వహించిన పాత్ర చాలా కీలకమైనది. కాలం ఎంత వేగంగా మారినా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రూపాంతరం చెందినప్పటికీ ప్రపంచాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన ప్రాచీన, ప్రభావవంతమైన మార్గాలలో తపాలా వ్యవస్థ మొదటి వరుసలో నిలుస్తుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ప్రపంచ తపాలా దినోత్సవం (వరల్డ్ పోస్ట్ డే) తపాలా వ్యవస్థ  చారిత్రక ప్రాధాన్యతను, సమకాలీన ఉపయోగాలను స్మరించుకోవడానికి ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.  ఈ సందర్బంగా తపాలా వ్యవస్థ గురించి,  ఆవిర్భావం గురించి,  అందులో ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి వివరంగా తెలుసుకుంటే.. చారిత్రక నేపథ్యం.. స్విట్జర్లాండ్‌లోని బెర్న్ నగరంలో 1874 అక్టోబర్ 9న యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించబడింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య ఉత్తరాల రవాణాను, సమాచార మార్పిడిని క్రమబద్ధీకరించడానికి ఈ సంస్థ ప్రాణం పోసుకుంది. ఆ చారిత్రాత్మక సంఘటనకు గుర్తుగా, 1969లో జపాన్‌లోని టోక్యోలో జరిగిన యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్‌లో ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తేదీని ప్రపంచ తపాలా దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా నిర్ణయించారు. నాటి నుండి ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో ప్రపంచ దేశాలన్నీ ఈ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ తపాలా దినోత్సవ లక్ష్యం.. ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకోవడం వెనుక ప్రధానంగా రెండు ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది, మానవుల రోజువారీ జీవితంలో, వ్యాపార లావాదేవీలలో తపాలా రంగానికి ఉన్న ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచడం. రెండోది, ఒక దేశ సామాజిక, ఆర్థిక వికాసంలో తపాలా వ్యవస్థ అందిస్తున్న సహకారాన్ని గుర్తించడం. సరిహద్దులు, భాషలు, సంస్కృతులు వేరైనా ప్రజలను మానసికంగా దగ్గర చేయడంలో ఉత్తరం ఒక వారధిగా పనిచేసింది. మారుతున్న కాలం - రూపాంతరం చెందుతున్న తపాలా సేవలు.. ఒకప్పుడు కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, పార్శిళ్ల రవాణాకే పరిమితమైన తపాలా శాఖ, కాలానికి అనుగుణంగా తనను తాను సరికొత్తగా మలచుకుంది. నేడు డిజిటల్ విప్లవంలో భాగమై సాంకేతిక సేవలను ప్రజల గుమ్మం ముందుకు తెచ్చింది. తపాలా శాఖ బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించి డిజిటల్ చెల్లింపులు, సేవింగ్స్ ఖాతాలు, భీమా సేవలను గ్రామగ్రామానికీ విస్తరించింది. ఈ-కామర్స్ రంగం విస్తరించిన తరుణంలో వస్తువుల వేగవంతమైన రవాణాకు పోస్టల్ పార్శిల్ సేవలు వెన్నెముకగా నిలిచాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు, ఫించన్లు, సబ్సిడీలను చివరి మైలు వరకు చేర్చడంలో పోస్టల్ నెట్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆధార్ నమోదు, అప్డేట్  నుండి వివిధ రకాల ప్రభుత్వ ధృవీకరణ పత్రాల పంపిణీ వరకు ఎన్నో పౌర సేవలు తపాలా కార్యాలయాల ద్వారా సులభంగా అందుతున్నాయి. మానవీయ సంబంధాల తీపి గుర్తు.. సాంకేతికత పెరిగి ఈమెయిళ్లు, వెంటనే మెసేజ్ లు  యుగం వచ్చినప్పటికీ, చేతిరాతతో రాసిన ఉత్తరంలో ఉండే ఆత్మీయత, భావోద్వేగం ప్రత్యేకమైనవి. తపాలా బిళ్ళలు  అంటే స్టాంపులు.. ఒక దేశ సంస్కృతి, చరిత్ర, సైన్స్, ప్రకృతి సౌందర్యానికి ప్రతిరూపాలుగా నిలుస్తాయి. స్టాంపుల సేకరణ (ఫిలాటెలీ) నేటికీ ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందించే  వ్యాపకముగా వర్ధిల్లుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను అనుసంధానిస్తూ, నమ్మకానికి  మారుపేరుగా నిలిచిన తపాలా వ్యవస్థస సేవలను గుర్తించడం ప్రతీ ఒక్కరి బాధ్యత. సాంకేతిక పురోగతితో సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటూ, ఆధునిక సేవలతో ముందుకు సాగుతున్న తపాలా రంగానికి మద్దతుగా నిలవడం, దాని ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు తెలియజేయడమే ఈ రోజు మనం ఇచ్చే నిజమైన నివాళి.                                                                                                                                     *రూపశ్రీ.
 అనుమానించే అలవాటు భార్యాభర్తల మధ్య బంధాన్ని ఎంత నాశనం చేస్తుందో తెలుసా.! ఏదైనా ఒక అందమైన బంధానికి అతి ముఖ్యమైన పునాది ప్రేమ , పరస్పర నమ్మకం. ఇద్దరు వ్యక్తులు తమ జీవితాలను పంచుకునేటప్పుడు ఆ బంధంలో నమ్మకమే ప్రధాన ఊపిరిగా పనిచేస్తుంది. అయితే అదే నమ్మకం స్థానంలో చిన్నగా అనుమానం ప్రవేశిస్తే ఎంతటి బలమైన బంధమైనా క్రమంగా విచ్ఛిన్నం కావడానికి ఎంతో సమయం పట్టదు. భాగస్వామి ప్రతి చిన్న కదలికను తప్పుగా అర్థం చేసుకోవడం, ప్రతి విషయానికి భయపడటం , మనస్సులోనే ఎప్పుడూ  ఆలోచిస్తూ ఉండటం బంధంలో మానసిక దూరాన్ని పెంచుతాయి. అనుమానించే అలవాటు భార్యాభర్తల మధ్య బంధాన్ని ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో, ఆ లక్షణాలు ఎలా ఉంటాయో , దానిని ఎలా అధిగమించవచ్చో  వివరంగా తెలుసుకుంటే.. ప్రతి చిన్న విషయానికీ ప్రశ్నించడం.. భాగస్వామి ఎక్కడికి వెళ్లారు, ఎవరితో ఉన్నారు, ఎందుకు ఆలస్యమైంది అని సాధారణంగా అడిగే ప్రశ్నలు,  ఇవి ప్రేమకు సంకేతం కావచ్చు. కానీ అదే పనిగా ప్రతి నిమిషం వివరాలు అడుగుతూ, వారి సమాధానాలను తప్పు పడుతుంటే అది భద్రతాభావం లోపించడానికే సూచిక. భాగస్వామిని నిరంతరం ప్రశ్నించడం వల్ల వారికి తమ స్వతంత్రతను కోల్పోతున్నామనే భావన కలుగుతుంది. ఇది వారిలో తీవ్రమైన ఒత్తిడిని, అసహనాన్ని నింపుతుంది. ప్రైవసీకి భంగం కలిగించడం.. ఒకరి ఫోన్‌ను దొంగతనంగా చూడటం, మెసేజ్‌లు , కాల్ హిస్టరీ చెక్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్స్ పై  నిరంతరం నిఘా పెట్టడం వంటి పనులు బంధంలో వ్యక్తిగత లిమిట్స్ ను దాటడమే అవుతాయి. నమ్మకాన్ని పెంచడానికి ఇలాంటి పనులు ఎంతమాత్రం ఉపయోగపడవు. పైగా ఇవి భాగస్వామికి తమపై అసలు గౌరవం లేదనే భావనను కలిగిస్తాయి. ఆధారాలు లేకుండా నిందలు వేయడం.. భాగస్వామి ఏదైనా పనిలో బిజీగా ఉండి ఫోన్ తీయనప్పుడు లేదా మెసేజ్‌కు ఆలస్యంగా రిప్లై ఇచ్చినప్పుడు, పరిస్థితిని అర్థం చేసుకోకుండా నేరుగా ఏదో తప్పు జరుగుతోందని నిర్ణయానికి రావడం చాలా ప్రమాదకరం. ఆధారాలు లేకుండా కేవలం ఊహల ఆధారంగా నిందలు వేయడం వల్ల భాగస్వామి తీవ్ర మనస్తాపానికి గురవుతారు. విషయాలను సూటిగా అడిగి తెలుసుకోవడానికి బదులు ఊహించుకోవడం వల్ల లేని సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది. బంధంలో మానసిక దూరం పెరగడం.. నిరంతరం అనుమానాలు, నిందలు ఎదుర్కొనే భాగస్వామి మానసికంగా అలసిపోతారు. తమను ప్రతి విషయంలోనూ తప్పుగా భావిస్తున్నారని అనిపించినప్పుడు వారు క్రమంగా మాట్లాడటం తగ్గించేస్తారు. మరోవైపు అనుమానించే వ్యక్తి కూడా నిరంతరం ఆందోళన, భయంతో గడుపుతారు. దీనివల్ల ఇద్దరి మధ్య ప్రేమ, ఆత్మీయత తగ్గిపోయి మానసిక దూరం చాలా వేగంగా పెరుగుతుంది. అనుమానానికి అసలు కారణాలు.. అనుమానించే అలవాటు ఎప్పుడూ భాగస్వామి చేసే తప్పుల వల్లే రావాల్సిన అవసరం లేదు. గతంలో ఉన్న చేదు అనుభవాలు, చిన్నతనంలో ఎదురైన మానసిక సంఘటనలు, ఆత్మవిశ్వాసం తగ్గడం లేదా భాగస్వామిని ఎక్కడ కోల్పోతామోననే భయం కూడా వ్యక్తిని ఎక్కువగా అనుమానించేలా చేస్తాయి. ముందుగా ఈ భయాలకు కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. బంధాన్ని కాపాడుకోవడానికి మార్గాలు.. ముందుగా  మనస్సులో కలిగే అనుమానాలు నిజమైన సంఘటనల ఆధారంగా వస్తున్నాయా లేదా కేవలం  భయాల వల్ల వస్తున్నాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. భాగస్వామిపై నిందలు వేసే విధంగా కాకుండా మీ భయాలు, ఆందోళనల గురించి వారితో ప్రశాంతంగా, ఓపేన్ గా  మాట్లాడాలి. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించడం నేర్చుకోవాలి. అనుమానాలు మరీ ఎక్కువై బంధం చేజారిపోతోందని అనిపిస్తే దంపతులు మంచి కౌన్సెలర్ లేదా మానసిక నిపుణుల సలహా తీసుకోవడం ఎంతో మంచిది.                                 *రూపశ్రీ.
మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే జీవితంలో ఏ పనైనా ఉత్సాహంగా, సంతోషంగా చేయగలం. శరీరానికి ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలినా లేదా జ్వరం వచ్చినా మనం వెంటనే వైద్యుడి వద్దకు పరుగెడతాం. కానీ మనస్సు బాధపడినా, తీవ్రమైన ఒత్తిడికి గురైనా బయటకు చెప్పకుండా లోపలనే దాచేస్తుంటాం. నేటి వేగవంతమైన ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణ విషయాలుగా మారిపోయాయి. శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మనస్సుకు కూడా ప్రశాంతత అంతే అవసరమని అందరికీ గుర్తుచేయడానికే ప్రతి సంవత్సరం అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పరిష్కారమే వైద్యం.. మన సమాజంలో చాలామంది మానసిక సమస్యల గురించి మాట్లాడటానికి సంకోచిస్తారు. ఎవరైనా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని తెలిస్తే వారిని వేరేలా చూస్తారేమోననే భయం చాలామందిలో ఉంటుంది. కానీ శరీరానికి అనారోగ్యం చేసినట్లే మనస్సుకు కూడా అలసట, ఆందోళన రావడం చాలా సహజమైన విషయం. దీనిని గుర్తించి సరైన సమయంలో స్పందించడం వల్ల ఎలాంటి సమస్యలనైనా సులభంగా అధిగమించవచ్చు. చిన్న మార్పులు.. పెద్ద ఫలితాలు.. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. మన రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే కొద్దిసేపు నడవడం లేదా సులభమైన వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. సమయానికి పోషకాహారం తీసుకోవడం, రాత్రి పూట సరిపడా నిద్రపోవడం మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సోషల్ మీడియాకు దూరం.. నేటి డిజిటల్ యుగంలో రోజంతా ఫోన్లు, సోషల్ మీడియాతో గడపడం కూడా మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజులో కొంత సమయం ఫోన్ పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో, మిత్రులతో సరదాగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి.  ఇష్టమైన పుస్తకాలు చదవడం, పాటలు వినడం లేదా తోటపని వంటి చిన్న చిన్న వ్యాపకాలు మనస్సులోని ఆందోళనలను దూరం చేస్తాయి. మానసిక ఆరోగ్యం మన చేతుల్లోనే.. అన్నింటికంటే ముఖ్యమైనది మనసులోని భావాలను దాచుకోకపోవడం. తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పుడు మీకు నమ్మకమైన వ్యక్తులతో మనసు విప్పి మాట్లాడాలి. అవసరమైతే మానసిక నిపుణులు లేదా కౌన్సెలర్ల సలహా తీసుకోవడంలో ఎలాంటి భయం కానీ, మొహమాటం కానీ ఉండకూడదు. మానసిక ప్రశాంతత అనేది మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని గ్రహించి, మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.                                  *రూపశ్రీ.
గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని చాలామంది భావిస్తారు. అందుకే రోజూ గ్రీన్ టీ తాగడాన్ని తమ దినచర్యలో భాగంగా చేసుకుంటారు. అయితే మార్కెట్‌లో లభించే గ్రీన్ టీని ఎలా ఎంచుకోవాలి? ఏ ఆకులతో తయారుచేసిన టీ తాగాలి? రోజులో ఏ సమయంలో తీసుకుంటే మంచిది? గ్రీన్ టీ ఒక్కటే తాగితే బరువు తగ్గుతారా? ఇలాంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం. ఈ వీడియోలో సీనియర్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష గ్రీన్ టీకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వివరించారు. గ్రీన్ టీ తయారీకి ఉపయోగించే ఆకులు, వాటిని ఉపయోగించే విధానం, టీ తాగడానికి అనువైన సమయాల గురించి తెలియజేశారు. గ్రీన్ టీని ఎంచుకునేటప్పుడు ఎలాంటి విషయాలను గమనించాలి? దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవచ్చు? అనే అంశాలపై అవగాహన కల్పించారు. గ్రీన్ టీతో పాటు మన చుట్టూ సులభంగా లభించే కొన్ని ఆకులతో కూడా హెర్బల్ టీ తయారుచేసుకోవచ్చు. పారిజాతం ఆకులు, జామ ఆకులు, రేగు ఆకులు, మారేడు లేదా బిల్వ ఆకులు, తులసి ఆకులు, నేరేడు ఆకులతో తయారుచేసే హెర్బల్ టీల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ ఆకులను ఎలా ఉపయోగించాలి? వాటితో టీ తయారుచేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను కూడా డాక్టర్ శిరీష వివరించారు. గ్రీన్ టీ తాగితేనే బరువు తగ్గుతారా?  బరువు తగ్గాలనుకునేవారిలో గ్రీన్ టీపై ఎన్నో ఆశలు ఉంటాయి. అయితే గ్రీన్ టీ తాగడం ఒక్కటే బరువు తగ్గడానికి సరిపోదు. సరైన ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం కూడా ముఖ్యమే. కేవలం గ్రీన్ టీపై ఆధారపడకుండా, రోజువారీ అలవాట్లలో అవసరమైన మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో లభించే గ్రీన్ టీ రకాలు, వివిధ ఆకులతో తయారుచేసే హెర్బల్ టీలు, వాటిని తీసుకునే విధానం గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, ఆరోగ్యకరమైన పానీయాల కోసం చూస్తున్నవారు గ్రీన్ టీ గురించి సరైన అవగాహన కలిగి ఉండటం అవసరం. గ్రీన్ టీని ఎప్పుడు తాగాలి? ఏ ఆకులతో హెర్బల్ టీ తయారుచేసుకోవచ్చు? గ్రీన్ టీ గురించి మనకు తెలిసిన విషయాల్లో అపోహలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి డాక్టర్ శిరీష వివరణను పూర్తిగా చూడండి. గమనిక: హెర్బల్ టీలు సహజమైన ఆకులతో తయారుచేసినవే అయినప్పటికీ, అవన్నీ అందరికీ ఒకే విధంగా సరిపోతాయని చెప్పలేం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, క్రమం తప్పకుండా మందులు వాడేవారు, గర్భిణులు వైద్యుల సలహాతోనే కొత్త హెర్బల్ పానీయాలను తీసుకోవాలి. బరువు తగ్గడానికి గ్రీన్ టీని మాత్రమే పరిష్కారంగా భావించకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
బరువు తగ్గడానికి ఆహారం తగ్గించడం, నియమబద్ధంగా వ్యాయామం చేయడం వంటి మార్గాలు అందరికీ తెలిసిందే. అయితే, చాలామంది డైటింగ్ సరిగ్గా చేస్తున్నా, క్యాలరీలు తక్కువగా తీసుకుంటున్నా బరువు కాస్త కూడా తగ్గడం లేదని ఆవేదన చెందుతుంటారు. అంతగా కష్టపడుతున్నా ఫలితం కనిపించకపోవడానికి మనం పెద్దగా పట్టించుకోని ఒక రహస్య కారణం ఉంది. అదే నిద్ర, ఇన్సులిన్, బరువు పెరగడం మధ్య ఉన్న అంతర్గత సంబంధం. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. సరిగా నిద్రపోకపోతే.. రాత్రిపూట తగినంత నిద్రపోకపోవడం మన శరీర జీవక్రియలను పూర్తిగా తలకిందులు చేస్తుంది. మన నిద్రకూ, శరీరంలో ఉండే ఇన్సులిన్ హార్మోన్‌కూ నేరుగా సంబంధం ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం తనను తాను రీఛార్జ్ చేసుకుంటుంది. కానీ సరిపడా నిద్ర లేకపోతే శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసోల్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ కార్టిసోల్ ప్రభావం వల్ల ఇన్సులిన్ హార్మోన్ పనితీరు దెబ్బతింటుంది. ఇన్సులిన్ నిరోధకత.. ఇన్సులిన్ ప్రధాన పని రక్తంలో ఉన్న గ్లూకోజ్ ను కణాలకు శక్తిగా అందించడం. కానీ నిద్రలేమి వల్ల కణాలు ఇన్సులిన్ కు సరిగ్గా స్పందించవు. దీనినే ఇన్సులిన్ నిరోధకత అంటారు. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి, ఆ అదనపు చక్కెర అంతా కొవ్వు రూపంలో శరీరంలో, ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోతుంది.  ఎంత తక్కువ తిన్నా, ఇన్సులిన్ నిరోధకత వల్ల శరీరం కొవ్వును కరిగించడానికి బదులు మరింత కొవ్వును దాచిపెట్టడానికే ప్రాధాన్యం ఇస్తుంది. ఆకలి హార్మోన్లు.. మరొక వైపు, సరైన నిద్ర లేనప్పుడు ఆకలిని నియంత్రించే హార్మోన్లలో కూడా మార్పులు వస్తాయి. ఆకలిని పెంచే గ్రెలిన్ అనే హార్మోన్ పెరిగిపోతుంది, కడుపు నిండిన భావనను ఇచ్చే లెప్టిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. దీనివల్ల మనకు తెలియకుండానే తియ్యటి లేదా ఎక్కువ క్యాలరీలు ఉన్న పదార్థాలు తినాలనిపిస్తుంది. మెటబాలిజం.. నిద్రలేమితో బాధపడేవారిలో జీవక్రియ వేగం లేదా మెటబాలిజం మందగిస్తుంది. శరీరం కేలరీలను కరిగించే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా రోజంతా తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ, శరీరం దాన్ని సరిగ్గా వినియోగించుకోలేక బరువు పెరిగేలా చేస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు కేవలం ఆహార నియమాలు, వ్యాయామాలపైనే కాకుండా రాత్రిపూట కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్రపోవడంపై శ్రద్ధ పెట్టాలి. సరైన సమయానికి పడుకోవడం, పడుకునే ముందు ఫోన్లు లేదా స్క్రీన్లకు దూరంగా ఉండటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి మార్పులు చేసుకోవాలి. నిద్ర సమయాన్ని సరిచేసుకుంటే ఇన్సులిన్ సమతుల్యత పునరుద్ధరించబడి,  పడుతున్న కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది.                                                                                                                                                  *రూపశ్రీ.