TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాడు తెలుగుదేశం, బీజీపీల మధ్య చిచ్చు నా చలవే: విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

Published on: Fri Oct 9, 2026 9:34AM

2019 ఎన్నికలకు ముందు అప్పటికి పొత్తులో ఉన్న తెలుగుదేశం, బీజేపీల మధ్య చిచ్చు పెట్టింది తానేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా 2018 నాటి రాజకీయ పరిణామాలపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెండు పార్టీఅ మధ్యా విభేదాలు పొడసూపి, అవి ముదిరి మైత్రిబంధం తెగిపోవడానికి 2016 నుంచి తాను ప్రయత్నాలు చేశాననీ, చివరకు ఆ ప్రయత్నాలు 2018 నాటికి ఫిలించాయని అప్పట్లో వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి తాజాగా చెప్పారు.  ఈ వ్యాఖ్యలను ఆయన తిరుపతిలో ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం,  బీజేపీ, జనసేన మధ్య పొత్తు  ఉండేది. ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ,  ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు, రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై సైకిల్, కమలం పార్టీల మధ్య విభేదాలు పొడసూపాయి.   2018లో తెలుగుదేశం బీజేపీతో పొత్తు తెంచుకుని,  ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఈ పరిణామం అప్పట్లో  రాష్ట్ర రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చివేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ ఘన విజయం సాధించి అధికారపగ్గాలను చేపట్టింది.  

నాటి పరిణామాలపై తాజాగా నోరు విప్పిన విజయసాయి రెడ్డి.. 2016 నుంచి 2018 వరకు టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెంచేందుకు తాను అనేక విధాలుగా ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు.  అలా దూరం పెంచి, ఆ రెండు పార్టీల పొత్తునూ విచ్ఛిన్నం చేయడంలో సక్సెస్ అయ్యాను కనుకనే.. 2019 ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించిందని ఆయన చెప్పకనే చెప్పారు. అప్పట్లో వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం సిద్ధించి అధికార పగ్గాలు చేపట్టడం వెనుక ఉన్నది తానేనని విజయసాయి అన్యాపదేశంగా చెప్పారు.    

[Vijayasai Reddy Behind Differences Betweem BJP And TDP, Split, TDP BJP Alliance, 2018,  YS Jagan Political Advantage,   2019 AP Elections,Andhra Pradesh Politics, Telugu One]