EDITORIAL SPECIAL
  గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక జెడ్పీ పాఠశాలలో ఈరోజు చేపట్టిన ‘రాజన్న బడిబాట' కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులను ఆశీర్వదించిన జగన్ ఓ బాలుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం మరికొందరు చిన్నారుల చేత కూడా పలక, బలపం పట్టించి చిన్నారుల్ని తన ఒడిలో కూర్చొబెట్టుకొని అక్షరాలు దిద్దించారు. పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేటట్లు విశ్వాసాన్ని కలిగించటానికి ‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’ అనే నినాదంతో ‘రాజన్న బడిబాట' నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్షరాభ్యాసం చేయించిన అనంతరం జగన్ మాట్లాడుతూ.. చిన్నారులతో కలిసి గడపడం, వాళ్లు బాగా చదువుకోవడం తన మనసుకు నచ్చిన విషయమని తెలిపారు. తన మనసుకు నచ్చిన పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘పిల్లలు బడికి పోవాలి. బడుల నుంచి కాలేజీకి పోవాలి. అక్కడి నుంచి వాళ్లు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్ల వంటి పెద్దపెద్ద చదువులు చదవాలి. ఈ చదువుల కోసం ఏ తల్లీతండ్రి అప్పులపాలు కాకూడదు అన్నదే నా ఆశ' అని జగన్ అన్నారు. 'ప్రతీ తల్లికి, ప్రతీ చెల్లికి నేను మాటిచ్చా.. మీ పిల్లల చదువును ఇకపై నేను చూసుకుంటాను అని మాటిచ్చా. ఈరోజు ఆ మాట నిలబెట్టుకునే రోజు వచ్చింది. అందుకు సంతోషంగా ఉంది. ఇవాళ నేను ప్రతీ తల్లి, చెల్లికి ఇక్కడి నుంచి ఒకేఒక మాట చెబుతున్నా. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను మీరు బడికి పంపండి. ఏ స్కూలుకు పంపించినా ఫరవాలేదు. బడికి పంపించినందుకు వచ్చే ఏడాది జనవరి 26 నాటికి ఏపీ పండుగదినం చేస్తాం. జనవరి 26వ తారీఖున పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లి చేతిలో రూ.15,000 పెడతాం. ఏ తల్లి కూడా తన బిడ్డను చదివించేందుకు కష్టపడకూడదు అనే తపనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం’ అని జగన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ఇంత అధ్వానంగా తయారు అయ్యాయి కాబట్టే ఏ తండ్రి, తల్లి అయినా తమ పిల్లలను గవర్నమెంటు పాఠశాలలకు పంపడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. 'అదే సమయంలో ప్రైవేటు స్కూళ్ల ఫీజులు చూస్తేనే షాక్ కొడుతున్నాయి. ఎల్ కేజీలో చేర్పించాలంటే రూ.20,000 అడుగుతున్నారు. మరికొన్ని స్కూళ్లలో అయితే రూ.40,000 తీసుకుంటున్నారు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలను చదవించుకోవాలంటే తల్లిదండ్రులు తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి. ఇవన్నీ మార్చేస్తామని నేను మీకు మాట ఇస్తున్నా. నేను ప్రజలను 2 సంవత్సరాల సమయం అడుగుతున్నాను. ఈ రెండేళ్లలో స్కూళ్లను అభివృద్ధి చేసి చూపిస్తాను. పాఠశాలల్లో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తాం.’ అని జగన్ భరోసా ఇచ్చారు.
  ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే సంప్రదాయం ప్రకారం.. అధికార, విపక్ష నేతలు స్వయంగా స్పీకర్ ను ఆయన స్థానం వద్దకు తీసుకుని వెళ్లాల్సి వుండగా.. ఆ సమయంలో విపక్ష నేత చంద్రబాబు రాలేదు. దీంతో స్పీకర్ కు ధన్యవాదాలు చెప్పే సమయంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే విషయమై విమర్శలు గుప్పిస్తుండగా, చంద్రబాబు దీనిపై క్లారిఫికేషన్ ఇఛ్చారు. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేనితో తనకు సత్సంబంధాలున్నాయని, ఆయన పేరును చెప్పగానే తనకు సంతోషం వేసిందని బాబు అన్నారు. 2014లో తాము కోడెల శివప్రసాద్ పేరును అనుకున్న సమయంలో విపక్ష నేతకు సైతం విషయం చెప్పి, ఆయన సంతకం తీసుకున్నామన్నారు. అలాగే ప్రస్తుత అధికార పార్టీ తమను అడుగుతారని భావించామని, అయితే ఎవరూ తమను సంప్రదించలేదని చెప్పారు. కనీసం తమలో ఎవరికైనా చెబితే, ప్రపోజ్ చేయాలని అనుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. పోడియం స్పీకర్ అయినా, కనీసం 'విపక్షనేత రండి' అని పిలవలేదని.. ఇష్టమైతే రండి, లేకుంటే లేదన్నట్టుగా ప్రభుత్వ ప్రవర్తన ఉందని అన్నారు. ఈ విషయాలను తాను ప్రజలకు చెప్పేందుకే క్లారిటీ ఇస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది మాత్రమే కాదు.. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక సీఎం జగన్‌ వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సభలో ప్రమాణ స్వీకారం చేశాక సీఎం ప్రతిపక్ష బల్లల వైపు వచ్చి ప్రతిపక్ష నేతను కలిసి వెళ్లడం ఆనవాయితీ. పోయినసారి సభలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ వద్దకు వచ్చి కరచాలనం చేసి వెళ్లారు. గతంలో వైఎస్‌ సీఎం అయినప్పుడు కూడా ఇలాగే చంద్రబాబు వద్దకు వచ్చి వెళ్లారు. ఇప్పుడు జగన్‌ అటువంటి ప్రయత్నం చేయలేదు. ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు. దీంతో వైసీపీ సభ సంప్రదాయాలను పట్టించుకోవట్లేదంటూ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
  సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడం రాజ్యాంగ బద్ధమేనని కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు.   టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ.. గ్రూపు రాజకీయాలు, నాయకత్వ లేమితో కాంగ్రెస్‌ కొట్టుమిట్టాడుతోందన్నారు. భవిష్యత్‌పై భరోసా లేకే పార్టీ మారామని, అవసరమైతే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం.. సీఎల్పీని విలీనం చేయాలని కోరామని, చట్ట ప్రకారం విలీనం జరిగినా ఇప్పటి వరకు టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదన్నారు. పదవుల కోసం చిల్లర మల్లరగా తిడితే ఊరుకునేది లేదని, పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇటీవ జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క జడ్పీ పీఠాన్ని కూడా కైవసం చేసుకోలేక పోయిందని ఎద్దేవా చేశారు. మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష మేరకే తాము పార్టీ మారామని వివరించారు. కాంగ్రెస్‌పై తమకున్న అసంతృప్తిని చాలా సార్లు వ్యక్తం చేశామని.. రాజ్యాంగం పదో షెడ్యూల్ ప్రకారమే టీఆర్ఎస్‌లో చేరామని తాము ప్రలోభాలకు లొంగిపోవడానికి, అమ్ముడుపోవడానికి గొర్రెలం, బర్రెలం కాదన్నారు. త్రిపుర, గోవాలలో కూడా ఇలాంటి విలీనాలే జరిగామని.. ప్రధాని కూడా ఇటీవల బెంగాల్‌లో 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపిన సంగతిని రమణారెడ్డి ప్రస్తావించారు. ‘‘వరుస ఓటముల తర్వాత కూడా కాంగ్రెస్‌ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు. ఎంతో మంది నేతలు పార్టీ మారుతున్నా.. ఉత్తమ్‌ వ్యవహారశైలి మారటం లేదు. మాపై అనవసర విమర్శలు చేస్తే కాంగ్రెస్‌ నేతలపై పరువునష్టం దావా వేస్తాం. మొన్నటి వరకు ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.’’ అని అన్నారు. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మమ్మల్ని విమర్శిస్తున్న వారు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ చదువుకుంటే మంచిదని, వేరే రాష్ట్రాల్లో ఇలాంటి చాలా జరిగాయని గుర్తు చేశారు.
ALSO ON TELUGUONE N E W S
  "ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ పిల్లల వయసున్న హీరోయిన్లతో హీరోలు నటించడం సాధారణమే. ఈ ధోరణి ఆగదు. ఆగుతుందా?" - జనవరిలో చిన్మయి చేసిన ట్వీట్. సోషల్ మీడియాలో మహిళలకు అందంగా ఆమె పలుమార్లు స్పందించారు. ఇటువంటి అంశాలపై అభిప్రాయాలు వెలిబుచ్చారు. కొందరు వాటన్నిటినీ బయటకు తీసి చిన్మయిని టార్గెట్ చేస్తున్నారు. అందుకు కారణం ఒక్కటే... 'మన్మథుడు 2' టీజ‌ర్‌! అది విడుదలైన తరవాత ఆమెను నెట్టింట్లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. తనపై విమర్శలు చేసిన వారందరికీ ఆమె గట్టి సమాధానాలు ఇస్తున్నారు. మ‌న్మ‌థుడు 2 టీజ‌ర్‌కి, చిన్మ‌యికి సంబంధం ఏంటి? అంటే ఉంది. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. నాగార్జున హీరో. ప్రస్తుతం నాగార్జున వయసు దగ్గర దగ్గర 60 ఏళ్ళు. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వయసు 28 ఏళ్ళే. నాగార్జున వయసులో సగం అన్నమాట. ఆయన కుమారుడు నాగచైతన్య పక్కన సినిమా కూడా చేసింది. అలాగే, తన వయసు కంటే చిన్నవాళ్లను నాగార్జున ముద్దులు పెట్టుకున్నారు. వీటన్నిటినీ చూపిస్తూ చిన్మయి మీద ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నిటికీ ఆమె ఒప్పిగ్గా సమాధానాలు ఇచ్చారు. కొందరిపై సెటైర్స్ కూడా వేశారు. "ఇతర హీరో, దర్శకుడు, టీమ్ ఎవరైనా ఈ సినిమా చేస్తే మీ టూ కిందకు వస్తుందేమో?" అని ఓ నెటిజన్ చిన్మయిని అడిగాడు. "వేధింపులకు, అంగీకారానికి తేడా తెలియని వాళ్ళు ఇలాగే వాగుతారన్నమాట. వాగుతూ కూర్చోండి" అని చిన్మయి ఘాటుగా సమాధానం ఇచ్చారు. మరొకరికి "నా కంటే నా భర్తే గొప్ప ఫెమినిస్ట్" అని చెప్పారు. వయసు గురించి  ప్రశ్నించిన వ్యక్తిపై "సినిమా విడుదలయ్యాక అర్ధమవుతుంది. మీ పని చూసుకోండి" సెటైర్ వేశారు. అదీ సంగతి!  
తండ్రి కొడుకుల మ‌ధ్య సాగే ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశంతో  `నీదినాది ఒకే క‌థ‌`చిత్రాన్ని తెర‌కెక్కించి మంచి స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల. రానా, సాయి ప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా  `విరాట పర్వం` చిత్రం షూటింగ్ ఈ రోజు ప్రారంభ‌మైంది.  ఇక ఈ సినిమా న‌క్సైలైట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొంద‌నున్న‌ట్లు తెలుస్తోంది. సినిమా అంతా ఒక రూర‌ల్ ఏరియాలో జ‌రుగుతుంద‌ట‌. రానా ఒక న‌క్సైలైట్ గా న‌టిస్తుండ‌గా, సాయి ప‌ల్ల‌వి ఒక రూర‌ల్ ఏరియాకు సంబంధించ‌న అమ్మాయిగా న‌టిస్తుంద‌ట‌. అచ్చ‌మైన తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ ఆమె పాత్ర చాలా నేచ‌ర‌ల్ గా ఉండడోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకే సాయి ప‌ల్ల‌వి పాత్ర హైలెట్ గా ఉండ‌బోతుంద‌ట‌. క్లైమాక్స్ లో వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్స్ అంద‌ర్నీ కంటనీరు పెట్టించే విధంగా ఉంటాయ‌ట‌. ఇక  ఈ చిత్రం శ‌నివారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విక్ట‌రీ వెంక‌టేశ్ క్లాప్ కొట్ట‌గా, ఎమ్మెల్యే గొట్టిపాటి  ర‌వి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి పాల్గొన్నారు. వ‌చ్చే వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి సురేష్బొ బ్బిలి సంగీతాన్ని, దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి ప‌తాకాల‌పై సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రముఖ స్టయిలిస్ట్ నీరజ కోనలో రైటర్ కూడా ఉన్నారు. కజిన్ కోన వెంకట్ అంత కాకున్నా ఆమెలో ఒక పార్ట్ టైమ్ లిరిక్ రైటర్ ఉన్నారు. సాయిధరమ్ తేజ్ 'తిక్క'లో ధనుష్ పాడిన 'తిక్క తిక్క' సాంగ్ రాసినది ఆవిడే. తమన్ మ్యూజిక్ అందించిన ఆ సాంగులోఇంగ్లిష్ పదాలు ఎక్కువగా ఉంటాయి. సినిమాకు తగ్గట్టు, దర్శకుడి సూచనల మేరకు అలా రాసి ఉండొచ్చు. ఈసారి మాత్రం చక్కటి తెలుగులో, ఒక్క ఇంగ్లిష్ పదం లేకుండా నీరజ కోన రాశారు. మళ్ళీ ఆమె చేత పాట రాయించినది తమనే. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా 'నిను వీడని నీడను నేనే'. ఇటీవల సినిమా టైటిల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటను రాసినది నీరజ కోన. ఒక్కసారి పాట వినండి... మంచి మెలోడీ. అలాగే, పాటలో ఒక్కటంటే ఒక్క ఇంగ్లిష్ పదం కూడా వినపడదు. అలాగని, ప్రేక్షకులకు అర్థం కాని క్లిష్టమైన పదాలు కూడా ఏమీ లేవు. అందరికీ అర్ధమయ్యే పదాలతో చక్కగా పాటను రాశారు నీరజ కోన. ఈ పాట తరవాత మరింతమంది పాటలు రాయమని ఆమెను సంప్రదించినా ఆశ్చర్యపోనవసరం లేదు. 
  Cast: Saptagiri, Vaibhavi Joshi, Srinivas Reddy Jabardast Batch Direction: Arun Pawar Producers: Narendra, Jivian Reddy Music: Bulganian Release Date: June 14, 2019   Saptagiri who started his career as a comedian, turned an actor with Saptagiri express. And now with the movie Vajra Kavadhara Govinda he is seen as a hero once again. Let us find out how the movie is. Story: Govinda (Saptagiri) is unable to bear the series of death in his village due to Cancer. How did Govinda save the lives of his villagers? How did he solve the problem? Answer to these questions forms the movie story. Analysis: There are a lot of characters in the movie but still the movie does not seem interesting. The director took a lot of time to enter into the story in the first half & later in second half he himself got lost. But since there was comedy here & there, the movie will entertain the audience to some extent. The fighting scenes in the movie look a little too much! Performance: Saptagiri is the main attraction of the movie. In the scenes where he has forgotten the past, the scenes where he is in search of wealth Saptagiri has entertained the audience thoroughly. Vaibhavi Joshi looks glamorous. Though Srinivas Reddy & his Jabasdast team entered late, they tried to entertain the audience. All the others did their job well. Technical Expertise: Though the story is interesting, the Director has failed to direct it properly. The scenes in the movie do not seem realistic. Production values are good. Editing & camera work seem okay only in certain places. Finally, the movie is just a series of confusion. Rating: 2/5
హీరో నాగశౌర్య మోకాలికి తీవ్ర గాయం కావడంతో నాలుగు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు సూచించారు. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తూ నాగశౌర్య ఒక సినిమా చేస్తున్నారు. విశాఖలో డూప్, రోప్ సహాయం లేకుండా ఫైట్స్ తీయాలని ప్రయత్నించి నాగశౌర్య గాయపడ్డారు. ఒక బిల్డింగ్ మీద నుంచి మరో బిల్డింగ్ మీదకు హీరో దూకే సన్నివేశాలను తీస్తుండగా... నాగశౌర్య మోకాలికి గాయమైంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్లగా... ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు కనీసం నెల విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేసి హీరోతో పాటు యూనిట్ హైదరాబాద్ తిరుగు పయనమైంది.
  ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే మాట మార్చడం కూడా టీడీపీ ఘోర ఓటమికి కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. విభజన గాయం మానాలంటే ప్రత్యేకహోదానే ఔషదమని ఏపీ ప్రజలు భావించారు. విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని, ఏపీకి న్యాయం జరగాలంటే హోదా కావాల్సిందేనని ఏపీ ప్రజలు బలంగా కోరుకున్నారు. మొదట్లో బీజేపీతో దోస్తీ సమయంలో ప్రజలతో పాటు బాబు కూడా హోదా కావాలన్నారు. బీజేపీ కూడా పార్లమెంట్ సాక్షిగా, తిరుపతి వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి మాట మార్చి.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నది. దీన్ని వ్యతిరేకించి హోదా కోసం పట్టుపట్టాల్సిన బాబు.. బీజేపీ నిర్ణయానికి తలొగ్గి ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీతో పాటు, ఉద్యమ సంఘ నేతలు, విద్యార్థులు.. ప్యాకేజీని వ్యతిరేకిస్తూ.. హోదా గళాన్ని బలంగా వినిపించారు. అయితే బాబు మాత్రం హోదా ఏమన్నా సంజీవనీనా అంటూ వారి మీద విరుచుకుపడ్డారు. ఇక కొందరు టీడీపీ నేతలైతే హద్దుదాటి చులకన వ్యాఖ్యలు కూడా చేశారు. అంతేనా.. హోదా కోసం పోరాడిన వారిని బాబు అరెస్ట్ లు కూడా చేయించారు. మరోవైపు అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చారంటూ బీజేపీ నేతలను ఆకాశానికెత్తడాలు, సన్మానాలు చేయడాలు సరేసరి. ఈ చర్యలతో.. హోదా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలకు.. బాబు మీద, టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. రోజులు గడిచాయి. హోదా మీద ఏపీ ప్రజలకు ఆశ మాత్రం చావలేదు. ఇంతలో కొన్నాళ్ళకు ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి వచ్చింది. అప్పటి నుంచి చంద్రబాబు స్వరం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు బీజేపీ నేతలను పొగుడుతూ, సన్మానాలు చేసిన బాబు.. బీజేపీ మోసం చేసిందని, రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ పోరాటం మొదలు పెట్టారు. హోదా ఏమన్నా సంజీవనీనా అని అడిగిన బాబు.. బీజేపీకి దూరమైన తరువాత హోదా కావాల్సిందే అంటూ అడగడం మొదలు పెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీజేపీ ఏమో తాము ఏపీకి ఎంతో చేసామని, లెక్కలు అడిగేసరికి బాబు మాట మర్చి మా మీద విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చింది. మరోవైపు విపక్ష నేతలు కూడా యూ-టర్న్ బాబు అంటూ పదేపదే విమర్శలు చేశారు. దీంతో బాబు మాటలు మారుస్తున్నారన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అదీగాక గతంలో హోదా అడిగిన వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసి, వారిని అరెస్ట్ లు చేయించిన బాబు.. తరువాత హోదా కావాలని అడిగితే ప్రజలకు నమ్మకం కలగలేదు. అదే బాబు బీజేపీ ప్యాకేజీ ఇస్తామని చెప్పినప్పుడే.. దాన్ని వ్యతిరేకించి కచ్చితంగా హోదానే కావాలని పట్టుబట్టి పోరాడి ఉంటే.. ప్రజలను నిజమైన నాయకుడిలా కనిపించేవాడు. ఇలా యూటర్న్ బాబు అని పేరు తెచ్చుకునేవాడు కాదు.  
  టీడీపీ ఘోర పరాజయానికి కారణమైన వంద తప్పుల్లో.. అభ్యర్థులను మార్చకపోవడం కూడా ఒకటని చెప్పవచ్చు. ఎంతసేపూ చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థిని.. నేను కష్టపడ్డాను, నన్ను చూసి ఓటేయండి అన్నారు. అంటే బాబు చెప్పాడుగా అని నియోజకవర్గంలో ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టినా ప్రజలు ఓటేస్తారా?. వారికి స్థానికంగా అందుబాటులో ఉండాల్సింది బాబా? ఎమ్మెల్యేనా?. వివాదాలు, అవినీతి ఆరోపణలు, దందాలు, ఎన్నికలు వచ్చినప్పుడే కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులోకి రావడం. ఇలాంటి వారు అభ్యర్థులైతే బాబు చెప్పారుగా అని ప్రజలు ఎందుకు ఓటేస్తారు?. ఈ మాత్రం ఆలోచన 40 ఏళ్ళ అనుభవం ఉన్న బాబుకి రాలేదా?. గత ఐదేళ్లల్లో ఎందరో ఎమ్మెల్యేలు వివాదాల్లో ఇరుక్కున్నారు. ఎందరి మీదనో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇలా రకరకాల కారణాలతో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. వారికి టికెట్లు ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారని కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ బాబు ఇవన్నీ పట్టించుకుంటేనే కదా. ప్రజలు నన్ను చూసి ఓటేస్తారు అంటూ అతి నమ్మకంతో అభ్యర్థులను మార్చకుండా ఎన్నికల పోరులోకి దిగారు. ప్రజాతీర్పు చూసి డీలా పడిపోయారు. బాబు.. ముందే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత గుర్తించి అభ్యర్థులను మార్చి ఉంటే టీడీపీకి ఘోర ఓటమి ఎదురయ్యేది కాదుగా. ముందు నుండి పార్టీలో ఉంటూ, పార్టీ కోసం కష్టపడుతూ, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండేవారిని అభ్యర్థులగా నిలబెడితే.. ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. అలా కాకుండా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారిపోయి తన మీద విమర్శలు చేస్తాడేమో అన్న భయంతో కొందరికి, ఇతనైతేనే ఆర్థికంగా బలవంతుడు అని మరికొందరికి టికెట్లు ఇచ్చారు. అలాంటి వారి కోసం కార్యకర్తలు మనస్ఫూర్తిగా పని చేయగలరా? ప్రజలకు వారికి ఓటేయాలని అనిపిస్తుందా?. ఖచ్చితంగా అనిపించదు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడుతూ.. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటే.. అలాంటివారి కోసం కార్యకర్తలు నిజాయితీగా కష్టపడతారు. అలా కాకుండా పార్టీలు జంప్ చేసేవారిని, కేవలం డబ్బే ఉన్న వారిని తీసుకొస్తే.. వీళ్ళు గెలిచినా పార్టీలో ఉంటారో లేదో తెలీదు. ప్రజలకూ అందుబాటులో ఉండరు అని కార్యకర్తలు పని చేయడం మానేస్తారు. ఆ అభ్యర్థులను కార్యకర్తలే నమ్మకపోతే ఇక సాధారణ ప్రజలు ఎలా నమ్ముతారు?. అందుకే బాబు అన్ని నియోజకవర్గాల్లో తానే అభ్యర్థినని చెప్పినా.. ప్రజలు మాత్రం వారి నియోజకవర్గాల్లోని అభ్యర్థులనే చూసారు. టీడీపీకి ఘోర ఓటమి రుచి చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. క్రికెట్ లో కోహ్లీ ఒక్కడే బాగా ఆడినంత మాత్రాన ప్రతిసారి మ్యాచ్ గెలుస్తామా? మిగతా బ్యాట్స్ మెన్, బౌలర్ల సపోర్ట్ కూడా ఉండాలి. టీం ఎఫర్ట్ ఉండాలి. మరి వీక్ టీం ని పెట్టుకొని బాబు 'నేను కష్టపడ్డ, నన్ను చూసి ఓటేయండి' అంటే ప్రజలు పార్టీని ఎలా గెలిపిస్తారు?. ఇది చంద్రబాబు ఆలోచించలేకపోయారు. అందుకే ఓడిపోయారు.  
  టీడీపీ పరాజయానికి కారణమైన వంద తప్పుల్లో సీబీఎన్ ఆర్మీ కూడా ఒకటని చెప్పొచ్చు. ఆర్మీ అంటే యుద్ధం చేసి రక్షణగా ఉండాలి. కానీ ఈ ఆర్మీ అతి చేసి పార్టీ నాశనానికి కారణమైంది. అసలు ఈ ఆర్మీ వల్ల పార్టీకి ఒరిగిందేంటి?. ఎన్నికల ముందు సోషల్ మీడియాలోనూ, బయటా తెగ హడావుడి చేశారు. కానీ ఏం లాభం పట్టుమని పది ఓట్లు కూడా తీసుకురాలేకపోయారు. ఇంకా చెప్పాలంటే ఉన్న ఓట్లనే పార్టీకి దూరం చేశారు. చంద్రబాబు మీటింగ్ జరిగితే చాలు సీబీఎన్ ఆర్మీ పేరిట కొందరు టీ షర్టులు వేసుకొని వచ్చి హడావుడి చేసేవారు. దాని వాళ్ళ ఏం లాభం పార్టీకి? టీ షర్టులు వేసుకొని గోల చేస్తేనో, బైక్ ర్యాలీలు చేస్తేనో ప్రజలకు మంచి జరుగుతుందా? పార్టీకి ఓట్లు పడతాయా?. ఇవేమి పట్టించుకోకుండా చంద్రబాబు సీబీఎన్ ఆర్మీకి అండగా ఉంటూ వారిని నెత్తిన ఎక్కించుకున్నారు. ఇంకా ఈ సీబీఎన్ ఆర్మీలో ఒక సామజిక వర్గానికి చెందిన కొందరి అత్యుత్సహం కూడా పార్టీ కొంపముంచింది. బాబు, లోకేష్ లతో చనువుగా ఉంటూ.. పార్టీ మాకే సొంతం అన్నట్టుగా వ్యవహరించడం. మిగతా కార్యకర్తలను చిన్న చూపు చూడటం, కొందరు నేతలను బెదిరించడం చేసేవారు. వీరి వల్ల ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకొని నిజాయితీగా పనిచేసిన వారు పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. అంతేకాదు ఈ సీబీఎన్ ఆర్మీ మూలంగా తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు వంటి టీడీపీ అనుబంధ సంస్థలు మనుగడ కోల్పోయాయి. దీంతో నిజాయితీగా పార్టీ కోసం కష్టపడే వారు, ప్రజా సమస్యల మీద పోరాడేవారు పార్టీకి దూరమై.. టీ షర్టులు వేసుకొని హడావుడి చేసేవారే పార్టీలో ఎక్కువయ్యారు. ఇప్పుడు పార్టీ ఈ పరిస్థితికి రావడానికి కారణమయ్యారు. పోనీ పార్టీ ఓడిపోయాక అయినా తప్పు తెలుసుకొని పార్టీకి పునర్వవైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే అది లేదు. మాకేం సంబంధం లేదంటూ టీ షర్టులు విప్పేసి సైడ్ అయిపోయారు. ఇకనైనా చంద్రబాబు ఇలా హడావుడి చేసే వారిని కాకుండా.. నిజాయితీగా పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తిస్తే మంచిది.  
  టీడీపీ ఘోర పరాజయానికి కారణమైన 100 తప్పుల్లో జన్మభూమి కమిటీలు కూడా ఒకటి. ప్రభుత్వ పథకాలను అర్హులైన అందరికీ చేర్చాలనే ఉద్దేశంతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. సరైన అవగాహన లేకపోవడం, కమిటీ సభ్యులుగా అర్హత లేని వారిని నియమించడం వంటివి టీడీపీ కొంపముంచాయి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉండాల్సిన కమిటీ సభ్యులు.. మా పార్టీ, మా వర్గం అంటూ ప్రభుత్వ పథకాలను కొందరికే పరిమితం అయ్యేలా చేశారు. వారి ప్రవర్తన పుణ్యమా అని టీడీపీ ప్రభుత్వం కొందరి ప్రభుత్వం అనే ముద్ర పడిపోయింది. అంతేకాదు ఈ కమిటీ సభ్యుల వైఖరి వల్ల ఎన్నో ఏళ్లుగా టీడీపీని నమ్ముకొని ఉన్నవారు కూడా టీడీపీకి వ్యతిరేకమయ్యారు. ఇలా ఈ జన్మ భూమి కమిటీ సభ్యుల మూలంగా.. గ్రౌండ్ లెవెల్ లో టీడీపీ మీద బాగా వ్యతిరేకత ఏర్పడింది. ఈ వ్యతిరేకతను గుర్తించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. అసలు పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల.. కార్యకర్తల్లో, సాధారణ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని.. బాబు గ్రౌండ్ లెవెల్ లో తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు తన చుట్టూ చేరి భజన చేసే నాయకుల మాటలే నమ్మారు. కొందరు నేతలు.. బాబు, లోకేష్ ల మెప్పు పొందడం కోసం వారి చుట్టూ చేరి.. మీరు సూపర్, మన పార్టీ బంపర్ అంటూ డప్పు కొట్టారు. మెప్పు కోసం అలా డప్పు కొట్టారు కానీ పార్టీకి ఇలా ముప్పు వస్తుందని వారు కూడా ఊహించి ఉండరు. అదే ఆ నాయకులు.. వారి వారి నియోజకవర్గాల్లో, జిల్లాల్లో.. పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు వారి పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. కొందరు నేతలకు జన్మభూమి కమిటీల మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ.. ఆ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోకపోగా.. కమిటీ సభ్యులకే అండగా ఉంటూ వారు మరింత రెచ్చిపోయేలా చేశారు. అందుకే ప్రజలు వారికి ఓట్లతో బుద్ధి చెప్పారు. ఒకవేళ బాబు గ్రౌండ్ లెవెల్ అసలు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసుంటే.. ఇప్పుడిలా బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదుగా. ఇకనైనా బాబు తన చుట్టూ డప్పు కొట్టే నేతల్ని కాకుండా.. పార్టీ కోసం నిజాయితీగా కష్టపడుతూ, తప్పుఒప్పులని కరెక్ట్ గా చెప్పేవారిని, పొగడ్తతో పాటు విమర్శ కూడా చేసే వారిని పక్కన పెట్టుకుంటే మంచిది. అలా కాకుండా ఇప్పటిలాగానే ఉంటే.. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కాస్తా మూడుకి పడిపోయినా ఆశ్చర్యం లేదు.    
  దాదాపు పదేళ్ల కష్టం, తండ్రి చావు నుండి మొదలు నేటి సిఎం కుర్చీ దాకా సాగింది జగన్ ప్రస్తానం. అయితే ఆయన సిఎం స్థానం ఎంత కష్టపడి సంపాదించాడో ఆ సీటులో ఉండి చేసే పనుల ద్వారా అంతే పేరు తెచ్చుకోవాలని తద్వారా తన సిఎం స్థానం పదిలపరచుకోవాలని ఆయన చూస్తున్నాడు, హామీల పేరుతో నవరత్నాల మొదలు ఆయన చేపట్టిన చేపడుతున్న హామీలు జనాల్లోకి గుర్తుండిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నిన్న జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ మొదటి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో జగన్ కొత్తగా ఏమీ నిర్ణయాలు తీసుకోలేదు, ముందుగా తీసుకున్నవి అమలు పరుద్దామని ఫిక్స్ అయినా నిర్ణయాలలో కొన్నిటిని ఆమోదింపచేసి, కొన్నిటికి కమిటీలు నియమించాలని తీర్మానించారు, అయితే తీసుకునే ప్రతి నిర్ణయం జనాల్లో మంచి పేరు తెచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు జగన్. నిజానికి నిన్న తీసుకున్న నిర్ణయాల విషయానికి వస్తే ముందుగా ప్రమాణ స్వీకారం రోజున సంతకం పెట్టిన పెన్షన్ల పెంపు నిర్ణయాన్ని ఆమోదించారు, అయితే ఈ 250 పెంపకం అనే అంశం ఎన్నో విమర్శలకి తావిచ్చినా ఆయన దాని మీదే కట్టుబడి ఉన్నారు. ఇక ఆశా వర్కర్ల జీతాల పెంపు విషయానికి వస్తే కొద్దీ రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా బాబు ప్రభుత్వం వారి జీతాలను 8500 చేసింది, ఇప్పుడు జగన్ పెంచింది పదిహేను వందలే అయినా దానిని ప్రమోషన్ ఆబ్ జెక్టివ్ గా వాడుకోడానికి ఫిక్స్ అయ్యింది జగన్ ప్రభుత్వం. అంతేకాక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ గురించి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇది సాధ్యమయ్యే పని కాదు, ఎందుకంటే నిజాం రైల్వేస్ సంస్థ నుండి ఈ ఆర్టీసీ ఏర్పడింది, విలీనానికి సాధ్యం కానీ ఎన్నో లొసుగులు ఈ వ్యవహారంలో ఉన్నాయి, సో ఇప్పటికిప్పుడు ఆర్టీసీ సంఘాలు సమ్మెకు దిగకుండా కమిటీ పేరు చెప్పి ఆ సంఘాల నోరు మూయించారని చెప్పచ్చు. ఇక కేబినెట్ లో తీసుకున్న మరో నిర్ణయం రేషన్ డోర్ డెలివరీ, ఇప్పటికే ఏపీలో పెన్షన్లు డోర్ డెలివరీ చేస్తున్నారు. అదే పద్దతిని ఇప్పుడు రేషన్ సరుకుల విషయంలో కూడా ఫాలో కానున్నారు. ఈ దెబ్బకి జనాల్లో మంచి పేరు రావడం ఖాయం, ఎందుకు అనగా ఒకప్పుడు రేషన్ కోసం క్యూలలో ఉండాల్సిన పరిస్థితి ఉండేది, టెక్నాలజీ పుణ్యమా అని ఆ క్యూలు తగ్గినా మిషన్లు సరిగ్గా పని చేయక గంటల తరబడి ఆ రేషన్ షాపుల ముందు పడిగాపులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి, కానీ కొత్త ప్రభుత్వ నిర్ణయంతో జనాలు ఈ మేరకు ఉపశమనం పొందనున్నారు. ఇక వాలంటీర్ల విషయానికి వస్తే ఇదే కాస్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ ఈ విషయంలో క్లారిటీ మిస్సవుతున్నారు. మొదట నుండి ఈ విషయం మీద కన్ఫ్యూషన్ అలాగే ఉంది, అదేంటంటే తొలుత ఊరికి పదిమంది అన్నారు, తర్వాత వార్డుకు ఒక్కరు అన్నారు, ఇప్పుడు 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ అంటున్నారు. దీంతో ఈ వ్యవస్థ ఏర్పాటు, పని తీరు మీద ఇంకా ఏర్పడక ముందే నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. నిజానికి ఇలాంటి తప్పిదమే చేసిన తెలుగుదేశం ఘోరంగా దెబ్బతిన్నది. జన్మభూమి కమిటీల పేరుతో తమ పార్టీ వారికి అధికారాలు ఇచ్చ్చిన ప్రభుత్వ పెద్దలు, సామాన్య జనాల్లో చాలా చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వైసీపీ జాగ్రత్త పడకుంటె ఈ వ్యవస్థ కూడా వైసీపీని అంతే దెబ్బ తీసే అవకాశం కనిపిస్తోంది. ఇక జగన్ ఎంతో గొప్పగా చెప్పుకున్న నవరత్నాల లో ఒకటయిన బడికి పిల్లల్ని పంపిస్తే తల్లితండ్రులకి వేతనం ఇచ్చే పధకం కూడా ఒకటి, అయితే ఈ పధకం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకి మాత్రమే పరిమితం చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా పాలనలో జగన్ మార్క్ చూపడానికి పనికొచ్చేదిగా ఉంది, ఎందుకంటే ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నో కష్టాలు పడుతున్నా ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లల శాతం చాలా తక్కువ కానీ జగన్ నిర్ణయంతో ఆ శాతాన్ని పెంచవచ్చు, అది పెరిగితే ప్రయివేట్ స్కూల్స్ డబుల్ రేట్లు అదుపులోకి వస్తాయి. అలా ఒకే దెబ్బకి రెండు పిట్టలు పడేలా జగన్ ప్లాన్ చేసినట్టు ఇక్కడ అర్ధం చేసుకోవచ్చు. అంతేకాక ఎప్పుడూ వినపడే కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్దీకరణ అంశం కూడా ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా కమిటీ వేసి సైడ్ అయ్యారు. ఇలా ఒక్కటి కాదు ఏపీ రైతు కమిషన్, పంటకు గిట్టుబాటు ధర, ఉచిత బోర్లు, లాంటి ఎన్నో నిర్ణయాలలో జగన్ తన మార్క్ చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  
  'కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలు' అన్నట్టుగా ఏపీలో టీడీపీ ఘోర పరాజయానికి నూరు కారణాలు ఉన్నాయి. నూరు కారణాలు అనడం కంటే 'చంద్రబాబు నూరు తప్పులు' అనడం కరెక్టేమో. ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుతం టీడీపీకి కర్త, కర్మ, క్రియ అన్నీ బాబే. అన్నీ తానే అనుకునే బాబు చేసిన తప్పులు పుణ్యమా అనే టీడీపీకి ఇన్ని తిప్పలు వచ్చాయి. ఏపీలో కుల రాజకీయాలు జరుగుతుంటాయి. కానీ బాబు కుల సమీకరణలు చేయడంలో విఫలమయ్యారు. అంతేకాదు మొదటి నుండి పార్టీకి అండగా ఉన్న కులాలను సైతం దూరం చేసుకున్నారు. ఆయనకు తోడు సీనియర్లు సైతం వారి వారి కులాలను ఆకర్శించడంలో విఫలమయ్యారు.  టీడీపీలో పార్టీలో నెంబర్ 2 గా ఉన్న యనమల రామకృష్ణుడు తన సామాజికవర్గమైన యాదవ కులాన్ని ఏమన్నా ఆకర్షించగలిగారా? అస్సలు లేదు. కొల్లు రవి మత్స్యకారి వర్గానికి చెందిన నేత. మరి ఆయన వారిని ఆకర్షించే ప్రయత్నం చేసారా? లేదు. కమ్మ సామజికవర్గానికి చెందిన దేవినేని ఉమా మంత్రిగా చేసారు. కృష్ణ జిల్లాలో కమ్మ వారు దాదాపు సగం మంది టీడీపీకి దూరమయ్యారు. వారిని ఆకర్షించడంలో ఉమా విఫలమయ్యారు. ఎంత సేపూ నేతలు స్వలాభం కోసం కాంట్రాక్టర్లు, దళారులతో సత్సంబంధాలు కొనసాగించడమే తప్ప.. వారి వారి సామజికవర్గాన్ని ఆకర్షించలేకపోయారు. అసలు మంత్రులు అనేవాళ్ళు కనీసం ఓ జిల్లాని శాసించేలా ఉండాలి. కులాల ఓట్లు అనే కాదు, సాధారణ ప్రజలకు కూడా దగ్గరై జిల్లాలో పార్టీ గెలుపుకి కృషి చేయాలి. కానీ మంత్రులు సొంత నియోజకవర్గంలో గెలవలేక చతికిలపడ్డారు. ఇక టీడీపీకి ప్రధాన బలమైన బీసీలను బాబు దూరం చేసుకున్నాడు. కాపులకి దగ్గరవ్వాలని కాపు కార్పొరేషన్ పెట్టాడు. కాపులు దగ్గరవ్వకపోగా, 1983 నుంచి పార్టీకి బలం అనుకున్న బీసీలు దూరమయ్యారు. వారికి టికెట్ల పరంగానో, వేరే విధంగానే భరోసా ఇచ్చి వారిని పార్టీ నుండి దూరం కాకుండా చేసుకోలేకపోయారు. బ్రాహ్మణులకు దగ్గరవుదామని బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టాడు. కానీ వారి ఓట్లు మాత్రం గెలుచుకోలేకపోయాడు. అదేవిధంగా టీడీపీకి కమ్మ సామాజికవర్గం అండగా ఉంటుంది అంటారు. కానీ కమ్మ సామాజిక వర్గ నేతలు, కమ్మ యువతే టీడీపీ కొంపముంచారు. టీడీపీ ఘోర ఓటమికి కారణమయ్యారు.  
అనగనగా ఓ అందమైన చిలుక! అడవిలో తన నేస్తాలతో కలసి ఆడుతూ పాడుతూ ఉండే ఆ చిలుక కాస్తా ఆ దారిన పోతున్న ఓ వర్తకుడి కంట్లో పడింది. అంతే! అదను చూసి దాన్ని తన సంచిలో వేసుకుని ఇంటికి పట్టుకుపోయాడు ఆ వర్తకుడు. వర్తకుడి ఇంట్లో చిలుకకి అన్నీ ఉండేవి… ఒక్క స్వేచ్ఛ తప్ప! వెండి పంజరంలో దాన్ని బంధించి, బంగారు పళ్లెంతో దానికి ఆహారాన్ని అందించేవాడు వర్తకుడు. అయినా చిలుక మనసంతా అడవి మీదే ఉండేది. ఇదిలా ఉండగా ఆ వర్తకుడు వ్యాపారం చేసేందుకు మళ్లీ బయల్దేరాల్సిన సమయం ఆసన్నమైంది. ‘చూడూ! నేను మళ్లీ నీ కుటుంబం ఉండే అడవిగుండానే వెళ్తున్నాను. అక్కడ నీ నేస్తాలతో ఏదన్నా సందేశాన్ని అందించాల్సి ఉంటే చెప్పు!’ అన్నాడు వర్తకుడు. ‘సరే! నా కుటుంబం ఉండే ఆ మామిడి చెట్టు మీకు గుర్తే కదా! అక్కడికి వెళ్లి మీ తోటి చిలుక చాలా బాధలో ఉంది అని చెప్పండి. ఏదో తిండీ తిప్పలూ వెల్లమారిపోతున్నాయే కానీ స్వేచ్ఛ కరువైందని చెప్పండి. తను ఎక్కడున్నా తన మనసు మీతోనే ఉంటుందనీ, మిమ్మల్ని కలిసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటుందనీ చెప్పండి.’ అంది చిలుక. చిలుక చెప్పిన సందేశాన్ని తీసుకుని వర్తకుడు అడవిగుండా ప్రయాణాన్ని సాగించాడు. అక్కడ అతనికి చిలుక కుటుంబం నివసించే మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద నిలబడి వర్తకుడు ‘మీ తోటి చిలుక నా దగ్గరే ఉంది. అది మీ అందరి తోడునీ, ఈ అడవిలోని స్వేచ్ఛనీ కోరుకుంటోంది. కానీ ఏం చేసేది! నాకు ఆ చిలుక అంటే ప్రాణం. అందుకనే దాన్ని వదిలిపెట్టలేను. అందుకే కేవలం దాని సందేశాన్ని మాత్రమే తీసుకువచ్చాను. ఇప్పడు మీ సందేశం ఏదన్నా ఉంటే చెప్పంది. నేను తనకి అందిస్తాను’ అన్నాడు. వర్తకుడి మాటలు వింటూనే ఓ చిలుక చెట్టు మీద నుంచి ఢామ్మని పడిపోయింది. జరిగిన దానికి వర్తకుడు కంగారుపడిపోయి మారుమాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు. వ్యాపారాన్ని ముగించుకున్న వర్తకుడు ఇంటికి తిరిగి రానే వచ్చాడు. ‘ఏం జరిగింది! నా సందేశాన్ని మా కుటుంబానికి అందించారా? వారు ఏమన్నారు?’ అని అడిగింది చిలుక. ‘ఆ నీ సందేశాన్ని అందిచాను. కానీ… కానీ… నా మాటలు వినగానే ఓ చిలుక ఢామ్మని చెట్టు మీద నుంచి కిందకి పడిపోయింది’ అన్నాడు వర్తకుడు. ఆ మాటలు వింటూనే పంజరంలోని చిలుక కూడా ఒక్క పెట్టున కుప్పకూలిపోయింది. ‘అరెరే! అక్కడ జరిగిందే నాకు అర్థం కావడం లేదంటే, ఇదేంటి….’ అనుకుంటూ లబోదిబోమంటూ వర్తకుడు పంజరాన్ని తెరిచి ఆ చిలుకను చేతిలోకి తీసుకున్నాడు. వర్తకుడు అలా చిలుకను చేతిలోకి తీసుకున్నాడో లేదో ఒక్క ఉదుటున ఆ చిలుక ఎగిరిపోయి తలుపు దగ్గరకి చేరుకుంది. ‘నా నేస్తాలు నాకందించిన సందేశం ఇదే! ఎవరైనా మమ్మల్ని బంధిస్తే ఇలా తప్పించుకోవాలని మా పెద్దలు చెప్పేవారు. నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పడు మళ్లీ నాకు ఆ ఉపాయాన్ని గుర్తుచేశారుగా. ఇక బయల్దేరతాను.’ అంది చిలుక. ‘మరి నా సంగతో! నేను నిన్ను ఇంతగా ప్రేమించాను. నీకోసం వెండి, బంగారాలు అందించాను. మూడుపూటలా నచ్చిన ఆహారాన్ని ఇచ్చాను. ఇవన్నీ వదులుకుని నువ్వు వెళ్లిపోతావా!’ అంటూ బేలగా అడిగాడు వర్తకుడు. ‘ప్రపంచంలో ఏ జీవికైనా బానిసత్వాన్ని మించిన దౌర్భాగ్యం ఉండదు. స్వేచ్ఛే కనుక లేకపోతే కడుపు నిండినా తృప్తిగా ఉండదు. బంగారంతో చేసినా కానీ పంజరం పంజరమే! అది నాకు వద్దు. దాని బదులు ఎండిన చెట్టు మీద ఖాళీ కడుపుతో కూర్చున్నా బతికున్నాననీ, నా జీవితం నే చేతిలోనే ఉందనీ తృప్తిగా ఉంటుంది. సెలవ్‌!’ అంటూ తుర్రుమంది చిలుక.
For me classroom has always been a place where all of my friends spend the day with each other and have fun rather than a place of learning. We have spent most of our quality time of our lives in classrooms. I am sure of it..What makes the experience of classroom concept all the more intriguing is the type of students it has. Now I am back with one of my lists on the types of classic people we have come across during our classroom times. So why the delay!   1. The Studs These are the students who are the gems in the teacher’s eyes. They put up such a brilliant show in front of the teacher that she is left with nothing else to say to him except “Student ho toh aisa”.  Its strange because, most of them(the ones that I have come across) are not that sincere when the teacher is out of the scene. But when she is around, they act like they are extremely innocent and know nothing but to listen to what she says!!  They will run to her even before she gives out the H E of H E L P P.They are always the ones that carry books to and from the staff-rooms.( Wonder what pleasure they get doing that.) 2. The Toppers Well, the title itself gives away the content here.. Obviously these are the ones who do miraculous wonders when academics is talked about. But here I am talking about only those who we know have worked hard to reach their current standards.. Yes, I know the type you are thinking about right now. That’s the next one. 3. The Silent-Killers Yes, this type creeps me out. What we see out of them in class are complete back-benchers. They hardly bring books to class. (wonder what even is in their bags??). They never happen to take notice of what happens in the class. They have complete knowledge about all the possible TV shows that have been aired and are currently being played. Yet, after all this,God knows how,they manage to get their names among rank-holders.  I mean, How the hell did this happen?. The night before the exam, he was active on facebook until midnight. Now he is on the stage getting his report card from the principal for outstanding performance in the pre-finals!!!! 4.  The Bhukkads  I envy this type a lot!! These students are extreme foodies!! They just love to eat right about everything. And they eat like they are responsible for the famines in most parts of the country. But the strange thing here is they stay just the way they are. They don’t gain even a  wee bit of weight . How is it possible?  I am just sitting here, eating salads and going to the gym, aerobics and all sorts of stupid stuff and still managing to puff up.. And they are like eating up half of the lunch boxes including their own and still staying slim as a stick. I consider that a God’s gift.   5.  The Queen-bee There is always only one person in the class.(mostly a girl) of this type. She is extremely pretty and so cute and all her actions are just so elegant and girly that almost all the boys have a crush on her. She is always the centre of attraction. She is always a head-turner in the class. Even the girls just adore her. 6. The Roadside Romeos Ok.These are just silly. They are very flirty. Atleast it looks like they are!! I don’t know what they have in mind. But they act like they are the most beautiful creatures on Earth and everyone just loves them.  What do I think about them? Well, I think they are just desperate for attention and desperate to have a girlfriend(or a boyfriend),just so they can go about telling their peer group about it. 7. The Link-Masters I hate them. These are the ones that spread rumors.Nasty ones. When a boy just turns his head in the direction of a girl, The link-masters go about couple-naming him with her for the rest of his school/college life. 8. The Rebels These just amaze me. How can one just show such courage?They go about arguing with the teacher for as long as the teacher can argue back. That too in such a tone, that the teacher is taken aback at first. As for me, I am just thankful to such type of classmates because,they waste half the class time just arguing and I just get to enjoy the scene.The next half the teacher lectures on manners and how students should be and how she was as a student which obviously no one(especially me) even cares to listen to. 9. The Talented Thunderstorms These are the kids who are the most popular in the entire school because they participate and win in all the competitions ever held.. They are the ones who are always approached to by all the teachers to represent the school in interschool competitions and still pass the exams with decent scores. Half their time goes in saying “thank you”’ to the congratulations showered upon them by everybody.. Last but definitely not the least 10. The Inseparables In every class, there is always that pair of students who are the closest friends. They sit together,have lunch together, gossip only among themselves, always manage to be the lab-partners and share their own secrets. Its like there is this invisible tape binding them. Then the teachers get envious!! I don’t understand why they do this!!They either make them sit in separate benches or completely change their section during shuffling the next year. I mean what is wrong with having a mirrored being who reflects all your interests. Anyway these besties manage to meet up during breaks however!! But seriously, why do you want to separate ppl who have been together right from their kindergarden!! Well Teachers!! Now if I have to discuss about them, it will take me a whole new blog!!because there are just too many varieties you know! Whatever said and done, classroom years are the best. Those glorious years are just unforgettable. Ok!! Now I am talking like a 65 year old grand-ma. I still have lots of classroom years left!! Hope I’ll experience even more fun!! Wish you all could relate atleast a bit. Did you experience any other type? Comment below! Until then this is Sanjana signing off   By Sanjana Kunde   
మీరు మీ భార్య లేదా భర్తతో...హ్యాపీగా మంచి రిలేషన్ లో వుండాలను కు౦టున్నారా? అయితే ఓకే ఒక్క సూత్రం వుంది. దానిని పాటించ౦డి చాలు అంటున్నారు పరిశోధకులు..! ''సారీ'' ( Sorry ) ని కాస్త విరివిగా వాడితే చాలు బంధం బలపడుతుంది అంటున్నారు వీరు. సుదీర్ఘ౦గా కొన్ని వందల జంటలపై సాగించిన అధ్యయనంలో భార్య భర్తలకి ఒకరిపై ఒకరికి ఉండే ఆరోపణల్లో మొదటిస్థానంలో ఈ 'సారీ' చెప్పకపోవడమే నిలిచి౦దిట. మనసు గాయం చిన్నదైనా, పెద్దదైనా ఎదుటవ్యక్తి దానికి 'సారీ' చెప్పకపోతే దానిని తమపై ప్రేమ లేనట్లుగానే భావిస్తారట. భార్య అయినా భర్త అయినా.. నిర్లక్ష్యం, ప్రేమ లేకపోవడం, బాధ్యతారాహిత్యం, ఇలా అ ఫీలింగ్ కి రకరకాల మాస్కులు తొడిగేసి బాధ పడిపోతారట. ఇక ఆ భావనలు మనసుని పట్టి కుదిపెస్తుంటే అనుబంధం బీటలు వారక ఏమవుతుంది చెప్పండి? చిన్న సారీ పెద్ద ఉపద్రవాలని ఆపెయ్యగలదు అంటున్నారు పరిశోధకులు. చిన్న చిన్న మనస్పర్ధలు ఒకొటోకటిగా చేరి మనసును విరిచేస్తాయి కాబట్టి ఎదుటి వ్యక్తి మనసు నొప్పి౦చగానే సిన్సియర్ గా సారీ చెప్పండి..బంధాన్ని కాపాడుకోండి అని సలహా ఇస్తున్నారు. మరి కాస్త ఇగో పక్కన పెట్టి సారీ చెప్పేయడం ప్రారంభించ౦డి.     
    గడచిన ఎపి అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి పరాజయం పాలై శాసన సభలో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన పరిస్థితులలో రాష్ట్ర  వ్యాప్తంగా టిడిపి శ్రేణుల పై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సీఎం గా అధికారం లో ఉన్న గత ఐదు సంవత్సరాలలో హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికే పరిమితమైన బాలయ్య ప్రస్తుత పరిస్థితులలో తన నియోజకవర్గమైన హిందూపూర్ తో మొదలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడిపి కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. అన్నగా మీకు  తోడుగా నేను ఉంటా, గతంలో మాదిరి ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దాం అంటూ తనదైన శైలిలో బాలయ్య కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే శాసనసభ లో ఎప్పుడు పెద్దగా స్పందించని అయన తాజాగా గవర్నర్ ప్రసంగం పై స్పందిస్తూ అమరావతి విషయం ఎక్కడా ప్రస్తావించలేదని వ్యాఖ్యానించారు. టిడిపి ఓటమి తో కుంగి పోయిన పార్టీ కేడర్ బాలయ్య యాక్టీవ్ అవడంతో కొత్త ఉత్సాహం తో ఉన్నారు.
    మొట్టమొదటి సారిగా నీతి ఆయోగ్ సమావేశం లో పాల్గొన్న ఎపి సీఎం జగన్ ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. ఢిల్లీ లో మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం లో ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియ చేస్తూ ఒక నివేదికను ప్రధాని, నీతి ఆయోగ్ సభ్యుల ముందు సమర్పించారు.  గత ఐదేళ్ళలో ఎపి రెవిన్యూ లోటు 66,632  కోట్లు ఉండగా తెలంగాణ రాష్ట్రానికి లక్ష 18  వేల కోట్ల రెవెన్యూ మిగులు ఉందని సీఎం తెలిపారు.  అలాగే అత్యధిక రాబడి వచ్చే హైదరాబాద్ తెలంగాణ రాజధాని అయ్యిందని, ఎపి రాజధాని, రాబడి లేని రాష్ట్రం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వచ్చి ఉపాధి అలాగే ఆదాయం కూడా పెరుగుతుందని జగన్ ప్రస్తావించారు. ఎపి ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు.
  అమరావతిలో శుక్రవారం టీడీపీ వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి, 2024 ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ ఆవిర్భవించి 37 ఏళ్లు పూర్తయిందని, 9సార్లు ఎన్నికలను ఎదుర్కొన్నామన్నారు. ఐదుసార్లు గెలిచామని, నాలుగుసార్లు ఓటమి చెందామని గెలుపు ఓటములన్నది సమానంగానే చూస్తామని.. నేతలు, కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడొద్దని కోరారు. కార్యకర్తలు, నేతలకు ధైర్యం ఇస్తున్నామని, ఈ ఎన్నికల్లో జరిగిన వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని 2024లో ఎదుర్కొనే ఎన్నికలకు ఇప్పటి నుంచే అందరూ సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జిల్లాల వారీగా నేతలను అభిప్రాయాలు వెల్లడించాలని చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈవీఎంలపైనే అనుమానం ఉందని, బీజేపీ 300 సీట్లు గెలుస్తామని మొదటి నుంచి చెబుతున్నారని, ఇది ఎంతో సందేహించాల్సిన అంశమన్నారు. లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ ఎంపీలు గెలిచారని, అదే విధంగా రాష్ట్రంలో బీజేపీ సహకారంతో ఈవీఎంల వ్యవహారంతోనే వైసీపీ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారన్నారు. వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25వేల ఓట్లకు పైగా మెజార్టీ రావడంతో అనుమానాలున్నాయన్నారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలంతా హర్షించారని, ఎవరూ కూడా కోపంగా లేరని, ఈ ఎన్నికల్లో వాడిన ఈవీఎంల పనితీరుపై పూర్తిస్థాయి పరిశీలన జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. జగన్‌ సర్కార్‌కు ఆరు నెలలు సమయం ఇద్దామని, తప్పు చేస్తే మనం విమర్శలు చేస్తే వారు సర్దుకుంటారని, ఆరు నెలలు లేదా సంవత్సరం సమయం ఇస్తే జగన్‌ పాలన ఏమిటన్నది ప్రజలకు తెలుస్తుందన్నారు. ఇప్పటికే ఇసుక బంద్‌ చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇలా జగన్‌ పాలన వైఫల్యాను ప్రజల్లోకి తీసుకుపోతామని మీ వెంటే ఉంటాం మీకు బాసటగా ఉంటాం అని శ్రీనివాసరెడ్డి జిల్లా తరఫున చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
  ప్రస్తుత పరిస్థితుల్లో ఎండ తీవ్రత విపరీతముగా ఉన్నది. వడగాలులు కూడా ఎక్కువుగా ఉన్నాయి . ఇటువంటి సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది.  ఉద్యోగరీత్యా మరియు వ్యక్తిగత పనులనిమిత్తం బయట తిరిగేవారు ఎండ తీవ్రతకు గురి అయ్యి అనారోగ్యానికి గురవ్వడం జరుగును.   ఇప్పుడు నేను చెప్పబోయే వడదెబ్బ నివారణా యోగాలు పాటించి వడదెబ్బ నుంచి విముక్తిపొందగలరు.    *  ఉల్లిపాయ రసమును శరీరానికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.      * వేసవి ఎండలో బయటకి వెళ్లవలసి వచ్చినపుడు తలకు టోపీ ధరించి టోపి లోపల ఉల్లిగడ్డను ఉంచుకొనవలెను. లేదా రుమాలలో ఉల్లిగడ్డని ఉంచి తలకు కట్టుకుని వెళ్లవలెను .   *  నీరుల్లిపాయ రసమును రెండు కణతలకు , గుండెలకు పూసిన వడదెబ్బ వలన కలిగిన బాధ తగ్గును.      *  వడదెబ్బ తగిలినచో ముఖము పైన , శరీరంపైన నీళ్లు చల్లుచూ తలపై ఐస్ గడ్డలను ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.    *  కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనంతో కలిపి తాగుచున్న వడదెబ్బ తగలదు.    * వడదెబ్బ తగిలిన వ్యక్తికి విశ్రాంతిగా పడుకోబెట్టి కాఫీ తాగుటకు ఇచ్చుచున్న వడదెబ్బ నుంచి తట్టుకొనును.    *  48 గ్రాముల చన్నీరు తీసుకుని ఒక తులం తేనె వేసి కలిపి ఇచ్చిన వడదెబ్బ తగ్గును.      * వడగండ్లు పడినపుడు వాటిని సేకరించి విబూదిలో వేసి ఉంచి వడదెబ్బ తగిలినప్పుడు వారికి మూడువేళ్లకు వచ్చినంత తీసుకుని ఒక గ్లాసు మంచినీటితో కలిపి తాగించవలెను .    *  నువ్వులనూనెలో చనుబాలు రంగరించి చెవులలో వేసి గోరువెచ్చని నీటిలో నెయ్యి వేసి ఇచ్చిన వడదెబ్బ బాధలు తగ్గును.    *  తరవాణి తేటలో ఉప్పు కలిపి ఇవ్వవలెను .    *  తాటిముంజలు పంచదారతో కలిపి ఇవ్వవలెను.    *  నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగలో ఉప్పు వేసి అన్నములో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను .      *  చన్నీటితో స్నానం చేయవలెను . వేడివేడి పలచని గంజిలో ఉప్పు కలిపి తాగవలెను .    *  నిమ్మ ఉప్పును నోటిలో వేసుకొనిన నాలుకకు ఊట ఊరి వడదెబ్బ నివారణ అగును. పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా అనిపిస్తే దానిని పాటించి వడదెబ్బ నుంచి విముక్తిపొందగలరు.
జూన్లో దొరికే చింత చిగురును మిస్ చేసుకోకండి… దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి… చింత చచ్చినా పులుపు చావలేదు… అన్న సామెతను మీరు వినే ఉంటారు. ఆయా సందర్భాల్లో దీన్ని మనం పోలిక కోసం ఉపయోగిస్తుంటాం. అయితే పులుపు సంగతి ఎలా ఉన్నా చింతను తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. ప్ర ధానంగా ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ క్ర మంలో చింత చిగురును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది. 2. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట రాల్ను తగ్గించి అదే క్రమంలో మంచి కొలెస్ట రాల్ను పెంచుతుంది. 3. వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి. 4. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. 5. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది.   6. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. 7. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. 8. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. 9. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి లభిస్తాయి. ఇందు వల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి. 10. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.   11. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. 12. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 13. డయాబెటిస్ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 14. ఆల్కహాల్ను ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.   15. చింత చిగురును పేస్ట్లా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. 16. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రిజెంట్లా పనిచేస్తుంది. 17. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.
  Pumpkin Seeds are one of nature’s most nourishing foods. They contain high amounts of vitamin E, B-complex, magnesium, zinc, and omega-3 fatty acids. Pumpkin seeds are essential for men’s health and provide significant protection for the prostate gland. They are an excellent source of tryptophan which is critical for good quality sleep and for keeping anxiety and depression at bay.  The B-complex vitamins in pumpkin seeds work as co-factors in the body to help reduce cholesterol and enhance GABA activity which is also known to reduce anxiety and neurological disorders. Pumpkin seeds also contain anti-inflammatory properties which provide benefit for those that suffer with chronic inflammation such as in sinusitis, arthritis, bursitis, and other autoimmune disorders.    Pumpkin seeds have high concentrations of phytosterols that can help to inhibit the absorption of cholesterol in the gastrointestinal tract which ultimately can help reduce the bad cholesterol in the body. Pumpkin Seeds have also been known to prevent kidney stones and osteoporosis.  Pumpkin seed butter is a great and tasty alternative to peanut butter and can be found online and in most health food stores. Raw pumpkin seeds will provide you with the most nutrition and health benefits. Try sprinkling them on salads, adding them to trail mixes, or chop them with dates to make your own healthy energy bars.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.