Publish Date:Apr 15, 2015
Publish Date:Apr 8, 2015
Publish Date:Apr 4, 2015
Publish Date:Mar 27, 2015
Publish Date:Mar 23, 2015
Publish Date:Mar 19, 2015
Publish Date:Mar 17, 2015

EDITORIAL SPECIAL
తెలంగాణలో ఖాళీ అవుతోన్న రెండు రాజ్యసభ సీట్లపై ఎప్పట్నుంచో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే ఈ రెండు స్థానాలపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, మొదట్నుంచీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్ సభలో గట్టిగా తెలంగాణ వాణి వినిపించి పేరు తెచ్చుకున్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్లో ఓటమిపాలు కావడంతో... రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అంతలోనే రాజ్యసభకు కాదు ఏకంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారంటూ కథనాలు వచ్చాయి. అయితే, కవితను రాజ్యసభకు పంపడం ఖాయమైనట్లు తెలుస్తోంది.  టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ వర్గాలతో సత్సబంధాలు కలిగివుండటం... వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండటం.... తెలంగాణ సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన కలిగివున్న కవితను, రాజ్యసభకు పంపితే... హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కూతురుగా ఉండే ఇమేజ్ ఎలాగూ ఉండనుంది. ఇలా, అన్నీ కవితకు కలిసొస్తున్నందున రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఇక, మిగిలిన మరో సీటుపైనే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళుతున్నావు..రెడీ అవ్వు అని కేటీఆర్..పొంగులేటికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదైనా, చివరి నిమిషంలో మార్పులు చేస్తే తప్ప, కవిత అండ్ పొంగులేటి రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంటెలిజెన్స్ కే సేవలందించే భాగ్యాన్ని పోలీసు బాస్ లు కల్పించారు. ఇంతకీ, ఆ ముగ్గురూ కూడా ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు గానే నిజాయితీ తో కూడిన నివేదికలను ఏ.బి. కి ఇస్తూ వచ్చే వారు. నాయుడు పార్టీ గల్లంతవుతుందని, 50 కి మించి సీట్లు రావని మరీ ఢంకా బజాయించి సమగ్ర నివేదికలు, నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. మిగిలిన డి.ఎస్.పి ల మాదిరి, ఏ.బి. అడుగులకు మడుగులు కొట్టకుండా...ఉన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు గా వివరించిన ఆ ముగ్గురు డి ఎస్ పి లకు ఆశ్చర్యకరంగా ఇప్పుడు లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బీ లో కానీ, విజిలెన్స్ ఎండ్ ఎంఫోర్సుమెంట్ లో కానీ అవకాశం ఇవ్వటానికి పోలీసు బాస్ లు ససేమిరా అంటున్నారు. ఆ ముగ్గురూ కూడా తెలుగు దేశం హయాం లో నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి, ఎలాంటి రాగ ద్వేషాలకు లొంగకుండా పని తీరు ప్రదర్శించారు కాబట్టి వారి సేవలు ఇంటెలిజెన్స్ కె అవసరం పడతాయని పోలీసు బాస్ లు సూత్రీకరించారు. దరిమిలా...వారి ముగ్గురికీ ఇంటెలిజెన్స్ లోనే కొనసాగాల్సిన గతి ఏర్పడింది. వాస్తవానికి లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బి లో కానీ వారికి అవకాశం కల్పించటానికి దారులు ఉన్నప్పటికీ, వారిని మినహాయించి వేకెన్సీ రిజర్వ్ (వీ.ఆర్.) లో ఉన్న చాలా మందికి పోస్టింగులు ఇవ్వటానికి కూడా పోలీసు బాస్ లు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ డి ఎస్ పి లు ఇక తమకు కీలకమైన విభాగాల్లో అవకాశం రాదనీ నిర్ధారించుకుని, రాజీనామా ఇవ్వటానికి సింథ్పడినట్టు పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ భోగట్టా. ఈ విషయమై వారు ఇప్పటికే, పలువురు సీనియర్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనపడక పోవటం తో , గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కూడా తమ పోస్టులకు రాజీనామా చేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ బాస్ తన ఆంతరంగికుల దగ్గర సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టు వెలగపూడి సెక్రెటేరియట్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర మైన పరిస్థితి ఏర్పడుతుందని, హోమ్ మంత్రి నేరుగాఈ వ్యవహారం పై దృష్టిపెట్టి , ముఖ్యమంత్రి దృష్టి లో సమస్యను ఉంచాలని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. డి ఎస్ పీ స్థాయి అధికారులు కూడా నైరాశ్యానికి లోనై, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, పోలీస్ శాఖపై ప్రజలకు తప్పు సంకేతాలు వెళతాయని ఆందోళనను పోలీసు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీస్ శాఖపై హోమ్ మంత్రికి సమగ్ర అవగాహనా ఉండేలా ఇంతవరకూ ఒక కార్యాచరణ తో కూడిన ప్లాన్ ను ఏదైనా సీనియర్ అధికారులతో డిస్కస్ చేశారా, లేదా అనేది కూడా తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది.  వాస్తవానికి ఆ ముగ్గురు డి ఎస్ పి లు కూడా వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వటం అనేది, ఎన్నికల ముందు వై ఎస్ ఆర్ సి పీ కి కూడా కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాలక పక్షం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పీ ప్రస్తుతమ్ ఈ తరహా అన్యాయం పై నోరు మెదపకపోవటం తో ఆ ముగ్గురు డి ఎస్ పి లు అనివార్యంగా తమ రాజీనామా నిర్ణయాన్ని నేరుగా హోమ్ మంత్రి దృష్టి కె తీసుకెళ్లాలని  భావిస్తున్నారు. చిత్రం కాకపొతే, వారి నిక్కచ్చి తనమే ...వారికి ఇపుడు కీలక విభాగాల్లో పోస్టింగులు రాకుండా అడ్డు పడటమేమిటని సెక్రెటేరియేట్ సీనియర్లు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి అవినీతీ నిరోధక శాఖ (ఏ సి బీ) కి ఇప్పుడు 14 మంది డి ఎస్ పి ల అవసరం ఉన్నప్పటికీ, ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులని ఏ సి బీ కోసం వదులుకోవటానికి ఇంటెలిజెన్స్ శాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ లో ఒక పెద్ద ఆఫీసర్ వాక్రుచ్చారు. మరి ఎల్లా కాలమూ, వారు అక్కడే సేవలందించాలా అనే ప్రశ్నకు మాత్రం ఆ పెద్దాయన దగ్గర సమాధానం లేదు. మొత్తానికి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే--మరీ ముక్కు సూటిగా పొతే, ఒకో సారి అవసరాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఎదురవ్వచ్చు అని...
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంతర శ్రామికుడు. అలుపెరుగని పోరాట యోధుడు. ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా ప్రజానురంజకంగా పాలన సాగించే ఓ మేధావి. గొప్ప రాజకీయ వేత్త. అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా ఎదిగాడు కేసీఆర్. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను.. తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజలతో హ్యాట్సాప్ అనిపించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం అలుపెరుగని కృషి చేశారుడ. తెలంగాణ ఏర్పాటుతో తిరిగులేని నేతగా ప్రజల హృదయాలను గెలిచాడు. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజానురంజకంగా పాలన చేస్తున్నాడు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయి. రోల్ మోడల్ సీఎం కేసీఆర్ ను తీసుకొని ఇతర రాష్ట్రాలు పాలన సాగిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్న తీరు అందర్నీ ఎంతో ఆకర్షిస్తుంది. తెలంగాణ చెరువులకు జలకళ తెచ్చాడు. అందుకోసం మిషన్ కాకతీయ.. ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ ఎన్నో గొప్ప పథకాలతో దూసుకుపోతున్నారు. ముందు చూపున్న నేతగా కేసీఆర్ చేపట్టిన ఈ పథకాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అపర భగీరథుడుగా మారారు కేసీఆర్. అంతేకాకుండా సంక్షేమం విషయంలో కేసీఆర్ తనదైన శైలిని ఎంచుకున్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు వంటి  పథకాలు పేదలకు భరోసాని కల్పించాయి. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకమైతే.. కేంద్రానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాగే.. కేసీఆర్ సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. అంతకు మించి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కీలకంగా చెప్పవచ్చు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఐటీ రంగం భారీగా పుంజుకుంది. మళ్లీ బెంగళూరుకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ సర్కారు అందిస్తోన్న సుస్థిర పాలన వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక. ఎవరికీ కష్టం వచ్చినా.. వారికి తెలిస్తే చాలు.. వెంటనే ఫోన్ చేసి ఆరా తీస్తాడు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడతాడు. స్థానిక ప్రజలను నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అది కేసీఆర్ కే సాధ్యం... కాదు కాదు.. ఆయన స్పీచ్ కు సాధ్యం. ప్రజల్లో ఊరమాస్ లెక్క ఉండే ఆయన స్పీచ్ లకు జనాలు దాసోహమౌతారు.  అక్షరం ముక్క రానోడి కూడా ఆయన మాటలకు పడిపోతాడు. అలాంటి కట్టిపడేసే నైజం కేసీఆర్ మాటకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. ఆ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్న కేసీఆర్ నిజంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. కాగా ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి మా తెలుగుఒన్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
ALSO ON TELUGUONE N E W S
నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'ఏమాయ చేసావె' విడుదలై నిన్నటికి (ఫిబ్రవరి 26కి) పదేళ్లు. ఇదే సినిమాను తమిళంలో శింబు, త్రిష జంటగా 'విన్నైతాండి వరువాయ' తీశాడు దర్శకుడు గౌతమ్ మీనన్. కాకపోతే క్లైమాక్స్ వేరుగా ఉంటుంది. నిజానికి, ముందు తమిళ సినిమా మొదలుపెట్టాడు. తర్వాత తెలుగులో తీశారు. అయితే రెండూ ఒకేరోజు విడుదలయ్యాయి. పదేళ్లు పూర్తయిన సందర్భంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చారు. ప్రేక్షకుల్లో కొందరు 'విన్నైతాండి వరువాయ' గురించి వదిలేసి 'ధ్రువ నక్షత్రం' గురించి ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. దాంతో గౌతమ్ మీనన్ సమాధానాలు ఇవ్వక తప్పలేదు. సినిమా షూటింగ్ పూర్తయిందని, మరో పది రోజుల్లో విక్రమ్ డబ్బింగ్ చెప్తాడని అతడు చెబుతున్నాడు. త్వరలో విడుదల కూడా చేస్తామని అన్నాడు. కానీ, ప్రేక్షకులకు మాత్రం నమ్మకాలు లేవు. ఎందుకంటే... దీని వెనుక పెద్ద కథే ఉంది.  విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ధ్రువ నక్షత్రం'. 2016లో మొదలైంది. గౌతమ్ మీనన్ సమస్యల వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. నిజానికి, ఈ కథతో సూర్య హీరోగా గౌతమ్ మీనన్ సినిమా ప్రకటించాడు. అదీ 2013లో. క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో సూర్య, గౌతమ్ మీనన్ సినిమాను పక్కన పెట్టారు. తర్వాత విక్రమ్ దగ్గర కథను ఓకే చేయించుకున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా సినిమా మొదలైంది. కొన్ని షెడ్యూల్స్ లేట్ కావడంతో అను ఇమ్మాన్యుయేల్ సినిమా నుండి తప్పుకుంది. తర్వాత రీతూ వర్మను కథానాయికగా తీసుకున్నారు. హీరోలు, హీరోయిన్లే కాదు.. ఈ సినిమానుండి ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు కూడా తప్పుకున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా షూటింగ్ పూర్తి చేశాడు గౌతమ్ మీనన్. కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సినిమాను విడుదల చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది అయినా సరే సినిమా బయటకు వస్తుందో? లేదో?
  ఇది నిజంగా వెరీ బిగ్ న్యూస్. ప్రభాస్ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సన్నాహాలు చేస్తోంది. 'మహానటి' లాంటి జాతీయ అవార్డులు పొందిన చిత్రాన్ని రూపొందించిన్ నాగ్ అశ్విన్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. సి. అశ్వినీదత్ సమర్పించే ఈ చిత్రాన్ని స్వప్నాదత్, ప్రియాంకా దత్ కలిసి నిర్మించనున్నారు. వైజయంతీ మూవీస్‌ను అశ్వినీదత్ ప్రారంభించి 49 ఏళ్లు నిండి 50వ ఏట అడుగుపెడుతోంది.  ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక సెన్సేషనల్ మూవీని నిర్మించాలని అశ్వినీదత్, ఆయన కుమార్తెలు సంకల్పించారు. నాగ్ అశ్విన్ లాంటి అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడు వాళ్ల కుటుంబ సభ్యుడుగానే ఉన్నాడాయె. అతని దర్శకత్వంలోనే వాళ్లు 'మహానటి'ని నిర్మించారు. అతను చెప్పిన కథ ప్రభాస్‌ను బాగా ఇంప్రెస్ చేసింది, వెంటనే అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇది ఏ తరహా సినిమా, ఎప్పుడు మొదలు పెడతారనే విషయాలు త్వరలో వెల్లడికానున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో 'ఓ డియర్' మూవీని చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ లవ్ స్టోరీ 2021 వేసవిలో విడుదల కానున్నది.
  నలుగురు అపరిచితులు.. 3,450 కిలోమీటర్ల దూరం ప్రయాణం.. వాళ్ల ప్రయాణం దేనికోసం.. ఆ ప్రయాణంలో వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలేమిటి?.. ఈ కాన్సెప్టుతో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1గా ఒక చిత్రాన్ని ప్రారంభించారు నిర్మాత జి. మహేష్. నలుగురు అపరిచితులుగా సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని నటిస్తున్నారు. రాంగోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, నగేష్ కుకునూర్ వంటి సుప్రసిద్ధ దర్శకుల వద్ద పనిచేసిన గురుపవన్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. బుధవారం ఈ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కు ఎన్.బి. బాలసుబ్రహ్మణ్యం క్లాప్ నివ్వగా, సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శకుడు గురుపవన్ మాట్లాడుతూ, "మహేష్ మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. భిన్న నేపథ్యాలు కలిగిన నలుగురు అపరిచితులు హైదరాబాద్ నుంచి బైకులపై చేసే ప్రయాణం ఈ సినిమా. ఏ కారణంతో వాళ్లు ఆ ప్రయాణం మొదలుపెట్టారు, వాళ్లు ఎలాంటి పరిస్థితులు, అనుభవాలు ఎదుర్కొన్నారనేది ఇందులోని ప్రధానాంశం. మార్చి 2న తొలి షెడ్యూలు, మార్చి 22 నుంచి రెండో షెడ్యూలు జరుగుతాయి. హైదరాబాద్, ఝాన్సీ, నాగపూర్, గ్వాలియర్, మనాలి వంటి లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతాం. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుంది" అని చెప్పారు. హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, "ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఉత్సాహంతో ఎదురుచూస్తున్నా. శ్రీకాంత్, ఇంద్రజ వంటి ఫెంటాస్టిక్ యాక్టర్లతో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. 'పెళ్లి సందడి' సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అప్పుడు నేను చాలా చిన్నవాడ్ని. ఇప్పుడు ఆ సినిమా హీరో శ్రీకాంత్ గారితో పనిచేస్తుండటం హ్యాపీ. ఇది మంచి సినిమా అవుతుంది" అన్నారు. నటి ఇంద్రజ మాట్లాడుతూ, "ఈ స్టోరీ చాలా డిఫరెంట్ గా, వెరైటీగా ఉంది. నటనకు అవకాశం ఉన్న ప్రధాన పాత్ర చేస్తున్నా. మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్న నాకు ఒక ఫీస్ట్ లాంటి క్యారెక్టర్ ఇచ్చారు. తన కలలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే ఒక గృహిణిగా నటిస్తున్నా. రెండు రకాల లుక్స్ లో కనిపిస్తా. సుమంత్ అశ్విన్ కెరీర్ లో బాగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. శ్రీకాంత్, నేను 'జంతర్ మంతర్' సినిమాతో ఒకేసారి సోలో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యాం. ఇన్నాళ్లకు ఆయనతో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు. హీరోయిన్ ప్రియ వడ్లమాని మాట్లాడుతూ, "ఇంద్రజ, శ్రీకాంత్ లాంటి పేరుపొందిన నటులతో కలిసి పనిచెయ్యడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇది ఎగ్జైటింగ్ స్క్రిప్టుతో తయారవుతున్న సినిమా" అన్నారు. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ, "డైరెక్టర్ గురుపవన్ చెప్పిన కథ చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కు బాగా అవకాశమున్న కథ" అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చిరంజీవి ఎల్. మాట్లాడుతూ, "ఈ సినిమా మరో చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. ఇది సందేశాత్మక, వినోదాత్మక చిత్రం" అని తెలిపారు. నిర్మాత మహేష్ మాట్లాడుతూ, "నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. ఏడు నెలల క్రితం దర్శకుడు గురుపవన్ చెప్పిన కథ బాగా నచ్చి ఈ సినిమాతో చిత్రరంగంలో అడుగుపెడుతున్నా. అన్ని వయసుల వారికీ చేరువయ్యే కథ ఇది. చక్కని అడ్వంచరస్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది" అని చెప్పారు. తారాగణం: సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని, అమ్ము అభిరామి, నాజర్, పృథ్వీ, ఈశ్వరీ రావు, సప్తగిరి, శ్రీకాంత్ అయ్యంగార్, భాను అవిరినేని, అజయ్ ఘోష్, భద్రం.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152 సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. కథ, కథలో తన క్యారెక్టర్ ను మహేష్ ఆల్రెడీ విన్నారు. దర్శక, నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఈ సినిమాకి మహేష్ డేట్స్ కూడా కేటాయించారు. మే బుధవారం నుండి లేదంటే జూన్ మొదటి వారం నుండి షూటింగ్ చేస్తానని చెప్పారట. అంతకుముందు పరశురామ్ దర్శకత్వంలో ఆయన సోలో హీరోగా నటించిన సినిమా షెడ్యూల్ ఒకటి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిరంజీవి152లో చిరంజీవి మావోయిస్టు పాత్రలో నటిస్తుండగా... మహేష్ బాబు విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. సుమారు 25 నుండి 30 నిమిషాల నిడివిగల పాత్రలో మహేష్ కనిపించనున్నారు. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేశారు. అతడి దర్శకత్వ శైలి, ప్రతిభపై ఆయనకు చాలా నమ్మకం ఉంది. అందువల్ల, పాత్ర నిడివి తక్కువే అయినా తెరపై ప్రభావవంతంగా చూపించగలరు అనే నమ్మకంతో ఈ సినిమాకు తన అంగీకారం తెలిపారని సమాచారం.
రేణు దేశాయ్ పేరు చెబితే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు రైతు సమస్యలకు సంబంధించిన టీవీ కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ తో ముడిపెడుతూ రాసిన పుకార్లను ఖండిస్తూ వచ్చే వివరణలు... ఇవే గుర్తొస్తున్నాయి. గతంలో రేణు దేశాయ్ కథానాయికగా నటించారు. తర్వాత మరాఠీలో ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. తెలుగులో రైతు సమస్యల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కిస్తానని కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అంతకంటే ముందే ఆమె ఒక మ్యూజికల్ వీడియో కి డైరెక్షన్ చేయనున్నారు.  రైతు సమస్యల నేపథ్యంలో కార్యక్రమం చేస్తున్న సమయంలో రేణుదేశాయ్ కి తెలుగు ర్యాపర్, సింగర్ రోల్ రైడ పరిచయం అయ్యారు. అతడు తన తమ్ముడు వంటి వాడని ఆమె రెండు మూడు సందర్భాలలో అన్నారు. ఇప్పుడు రోల్ రైడ పాటకు రేణు దేశాయ్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల 'అల... వైకుంఠపురములో' చిత్రంలో 'ఓ మై గాడ్ డాడీ' పాటను రోల్ రైడ పాడాడు. అంతకుముందు అమ్మాయిలు వచ్చిన సమస్య లేకుండా అతను పాడిన పాటలు యూట్యూబ్ లో విశేషమైన ఆదరణ లభించింది.
ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు మనకేం తెలుస్తుంది? అంటున్నారు జనాలు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రెండు పడవలపై కాళ్లు పెట్టి అటూ ఇటు కాకుండా పోతోంది. అధికార వైసిసి పట్ల ఏం వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వైసిపి లోక్ సభ సభ్యులతో బిజెపికి పని లేకపోయినా రాజ్యసభ సభ్యులతో మాత్రం ఆ పార్టీకి ఇంకా పని ఉంది. పైగా వచ్చే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలతో తెలుగుదేశం పార్టీకి ఉన్న సీట్లు బాగా తగ్గి అన్ని సీట్లూ వైసీపీకి రాబోతున్నాయి. అందువల్ల వైసిపి రాజ్యసభ సభ్యులతో బిజెపికి పని ఉంది. ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తోంది. ఈ బలహీనతతో బాటు వైసిపిని పూర్తిగా కట్టడి చేస్తే మళ్లీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందేమోననే అనుమానం, బెంగ  బిజెపిని పట్టి పీడిస్తున్నాయి.  అందుకోసం కూడా బిజెపి అనుకున్న విధంగా వైసీపీని కట్టడి చేయలేకపోతున్నట్టు కనపడుతుంది. వైసిపికి వ్యతిరేకంగా పూర్తి స్థాయి ఉద్యమం నడుపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విపరీతమైన స్పందన వస్తోంది. జనసేన పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినా ఆయన చేపడుతున్న కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుబాటు మనస్తత్వం కనపడుతోంది.. పవన్ కల్యాణ్ వెనుక ఉండేది అందరూ యూత్ కాబట్టి ఆయన మాటలపై వారికి  విశ్వాసం ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో వేగంగా విస్తరిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కు పార్టీ నిర్మాణం చేయడం, అందుకు ఆర్ధిక వనరులు లేకపోవడం లాంటి బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలను ఆసరాగా చేసుకుని జనసేన తమ ఆధీనంలోకి వచ్చే విధంగా బిజెపి చేసుకుంది. ఈ ఎత్తుగడతో వైసిపికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే పవన్ కల్యాణ్ ను కూడా కట్టడి చేసి వైసిపిని బిజెపి అన్ని రకాలుగా రక్షిస్తున్నట్టు సామాన్యులు సైతం అనుకుంటున్నారు. అమరావతి నుంచి రాజధానిని ఎత్తేయడం పై ఒక దశలో పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేందుకు బిజెపి ముందుకు వచ్చింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతోనే బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆ ఉద్యమాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా మాట్లాడారని ప్రజలు అనుకుంటున్నారు. జీవీఎల్ చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగానే కేంద్రం నుంచి సంకేతాలు వస్తుండటంలో రాష్ట్ర బిజెపి పూర్తిగా నీరుగారి పోయింది. ఉద్యమం చేస్తున్న పవన్ కల్యాణ్ ను కూడా చల్లార్చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన తర్వాత మాట మార్చిన బిజెపి తొలి ఐదేళ్లలో ఏపిలో బిజెపి పెరిగే అవకాశాన్ని చేజేతులా కొల్పోవడమే కాక  ఏపి ప్రజలకు విరోధిగా మారింది. తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన తర్వాత  బీజేపీకి ఏపిలో మళ్లీ పెరిగే అవకాశం వచ్చింది. అయితే అమరావతి తరలింపు తదితర అంశాలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ బిజెపి తన పెరుగుదలకు తానే పాతర వేసుకుంటోంది.  ఆంధ్రా రాజకీయాల్లో కమలం పార్టీ కన్స్యూజన్ లో ఉందని, తాజా పరిణామాలతో నేతలు అయోమయంలో వున్నారన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఆంధ్ర నాయకులు ఒకలా.. ఢిల్లీ నాయకులు మరోలా మాట్లాడుతూ నానా  గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.  మూడు రాజధానుల నుంచి మండలి రద్దు అంశం వరకూ  బీజేపీ నేతల వైఖరి భిన్నమైన దారుల్లో వెళ్లడంతో రాష్ట్ర పార్టీ వ్యూహానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కమలం పార్టీలో అసలేం జరుగుతోందో అర్థంకాక నేతలతో పాటు జనాలు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసీపీలను వ్యతిరేకించినా ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.
60వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదం మార్మోగింది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించి భారీ ఉద్యమం చేసి దాన్ని సాధించుకున్నారు. కానీ దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత అమరావతిలో విభజన ఏపీ రాజధాని కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే విశాఖ ఉక్కు ఉద్యమం నాటి పరిస్ధితులు మాత్రం కనిపించడం లేదు. విశాఖ ఉక్కు వల్ల మిగతా ప్రాంతాలకు ఎలాంటి లాభనష్టాలు లేకపోయినా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉద్యమించిన ప్రజలు ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలింపు వల్ల నష్టమని తెలిసినా కూడా ఉద్యమాన్ని మాత్రం ఎందుకు తమదిగా భావించలేకపోతున్నారు? 1965లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఐదు ప్రాంతాల్లో భారీ ఉక్కు కర్మాగారాల్ని నిర్మించాలని భావించింది. అందులో విశాఖపట్నం కూడా ఒకటి. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా దీనికి అంగీకరించారు. అయితే 1966లో శాస్త్రి మరణం తర్వాత ప్రధాని అయిన ఇందిరా గాంధీ తన రాజకీయ అవసరాల కోసం ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ లో కాకుండా వేరే రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల  ప్రజలు కుల, మత, ప్రాంతాలకతీతంగా వ్యతిరేకించారు. ప్రస్తుత రాజధాని అమరావతిలోని తాడికొండకు చెందిన కాంగ్రెస్ దళిత నాయకుడు టి.అమృత రావు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి, సొంతపార్టీకి వ్యతిరేకంగా 1966 అక్టోబర్ 14న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో 32 మంది పోలీస్ కాల్పులలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో ఉక్కు పరిశ్రమ రాకతో స్ధానికులకే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసినా, మిగతా ప్రాంతాల వారు సంకుచితంగా ఆలోచించలేదు. ఉక్కు పరిశ్రమ రాకతో తెలుగు జాతి ఆర్ధికంగా వృద్ధి చెందుతుందని భావించారు.  చివరికి ఎవ్నో పోరాటాల తర్వాత 1971 నుంచి ఉక్కు ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ తర్వాత 90వ దశకం వరకూ కేంద్రంలో వివిధ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. నలుగురు ప్రధానులు కూడా మారారు. రాష్ట్రంలోనూ వివిధ పార్టీలు, 10 మంది ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చారు. రాజకీయ అవసరాల కోసమో, మరే ఇతర కారణాలతోనో విశాఖ స్టీల్ ప్లాంట్ ను మరో ప్రాంతానికి మార్చాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికీ రాలేదు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 24 వేల ఎకరాల భూసేకరణ చేసిన అప్పటి ప్రభుత్వం..  మార్కెట్ ధర కన్నా 8 నుండి 10 రెట్లు ఎక్కువ నష్టపరిహారం కూడా ఇచ్చింది. భూములు కోల్పోయిన కుటుంబాలకు శిక్షణ ఇచ్చి, వేలాదిగా ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఇళ్ళు కోల్పోయిన వారికి ఇంటిస్థలం, ఇల్లు నిర్మించుకోవటానికి సాయం కూడా అందించారు. కానీ గతేడాది డిసెంబర్ 17న అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతి ప్రాంతంలో అనిశ్చితి మొదలైంది. వాస్తవానికి 2014 లో ప్రాంతీయ తత్వం కారణంగా ఏపీ విభజన జరిగితే, సెప్టెంబర్ 4వ తేదీన రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాలలో  నిర్మాణం చేయాలని అసెంబ్లీ లో అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. రాజధానికి 29 వేల రైతు కుటుంబాల నుంచి 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో చేపట్టిన ఈ భూసేకరణలో భూములిచ్చిన రైతులకు 25 శాతం అభివృద్ధి చేసిన ప్లాట్లను, పదేళ్ల పాటు కౌలు తప్ప చంద్రబాబు ప్రభుత్వం మరో పరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ లో వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా అమరావతిలో ఉన్న సచివాలయం, హైకోర్టును విశాఖ, కర్నూలుకు తరలించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని సమర్ధించుకునేందుకు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదికలను తెరపైకి తెచ్చింది. చివరికి 10 మంది మంత్రులతో కూడిన హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా మూడు రాజదానుల నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అయితే మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు బిల్లులు అసెంబ్లీలో నెగ్గించుకున్నా.. మండలిలో మాత్రం ఛైర్మన్ వాటిని సెలక్ట్ కమిటీకి పంపడంతో ఈ నిర్ణయం భవితవ్యం ఏమిటన్నది ఇంకా తేలడం లేదు.  అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు నిత్యం రోడ్లపై ఉద్యమాలు చేస్తున్నారు. కానీ మిగతా ప్రాంతాల నుంచి మాత్రం వారికి తగిన సహకారం, మద్దతు లభించడం లేదు. చివరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ప్రతి రోజూ రాజధాని గ్రామాల్లో తిరుగుతూ అక్కడి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. మరోవైపు సీఎం జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు మాత్రం మూడు రాజధానులకు మద్దతుగా మిగతా ప్రాంతాల్లో మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వంటి కట్టడాలతో కుదురుకుంటున్న రాజధానిని తరలింపు చేపట్టడం అనేది వాస్తవంగా అవసరమా కాదా అన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం. గతంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో కుల, మత , ప్రాంతాలకు అతీతంగా పోరాడిన ప్రజలు ఇప్పుడు అమరావతిలోనే రాష్ట్ర రాజధాని ఉండాలన్న వాదనకు మద్దతుగా నిలవకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో విశాఖ ఉక్కు కోసం ఊరూవాడా ఉద్యమించిన ప్రజలు రాజధాని విషయంలోనూ అదే చొరవ, తెలువ చూపితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే అవకాశం కూడా లభిస్తుంది. అదే సమయంలో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మీడియాత పాటు మేథావులు కూడా నిర్ణయాత్మక రీతిలో గొంతు విప్పితే అమరావతిలోనే రాజధాని ఉండాలన్న వాదనకు బలం చేకూరినట్లవుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే. సైబరాబాద్ నిర్మాతను నేను. అని చెప్తూ ఉంటారు. అదే విధంగా భవిష్యత్తులో ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తానేనని తప్పక చెప్పుకుంటారని, అందుకు ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతిని తరలించడమే కాకుండా అమరావతిని సర్వ నాశనం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కనపడుతోంది. అమరావతి అనే పేరు వినిపించకుండా చేసేందుకు వైఎస్ జగన్  నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అమరావతే రాజధానిగా ఉండాలని ఎడతెగని ఉద్యమం చేస్తున్న రాజధాని గ్రామాల ప్రజలపైకి వేరే ప్రాంత ప్రజలను యుద్ధానికి పంపుతున్నది. అమరావతి భూములలో దాదాపు నాలుగు వేల ఎకరాలను పేదలకు పట్టాలుగా పంచి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైందనే వార్తలు గుప్పు మనడంతో రాజధాని ప్రాంతాల రైతులు అలోలక్ష్మణా అంటూ ఏడుస్తున్నారు. రాజధాని తరలిపోవడం ఒక ఎత్తు అయితే రాజధాని ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇచ్చేయడం మరొక ఎత్తు. పేదలకు పట్టాలు ఇచ్చేస్తే వారు వచ్చి ఆక్రమించుకుంటారు. దాంతో అమరావతి ప్రాంతంలో అంతర్యుద్ధం తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. వేరే ఊరుకు చెందిన ప్రజలు తమకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారు, దాన్ని అమరావతి ప్రాంత ప్రజలు అడ్డుకుంటే అంతర్యుద్ధం తప్పదు. అమరావతి ప్రాంత రైతులు బాగా బలిసిన వారని అందుకే పేద ప్రజలకు భూములు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని వైసిపి నేతలు ప్రచారం మొదలు పెడతారు. దాంతో ఈ సమస్య మరింత తీవ్ర తరం అయి అమరావతి సర్వ నాశనం అవుతుంది. దాదాపు నెల కిందటే అమరావతి భూములను పందేరం చేయాలనే ప్రతిపాదన పెట్టారు. అయితే ఆ విషయం బయటకు రాలేదు. గ్రామ సచివాలయం అధికారులు విజయవాడ గుంటూరు పట్టణాలలో భూముల కోసం అర్జీ పెట్టుకున్న పేదల నుంచి అమరావతి గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమా అనే అభిప్రాయ సేకరణ మొదలు పెట్టేసరికి విషయం అమరావతి రైతులకు తెలిసింది. దాంతో వారి కలలు పటాపంచలు కావడమే కాకుండా సాటి ప్రజలతో పోరాడే స్థితికి తమను ప్రభుత్వం నెట్టివేస్తోందని ఆగ్రహిస్తున్నారు. తాము భూములు ఇస్తే తమ ప్రాంతం సింగపూర్ హాంకాంగ్ లాగా అవుతుందని కలలు కన్నారు. ఇప్పుడు రాజధాని అక్కడ నుంచి వెళ్లిపోవడమే కాకుండా తమ భూములను అందరికి పంచే వ్యూహాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలో వారికి అర్ధం కావడం లేదు. కసితో కక్షతో ప్రవర్తిస్తున్న ప్రభుత్వాన్ని ఏం చేయాలో వారికి అర్ధం కావడం లేదు. నాలుగు వేల ఎకరాలు పేదవారికి పట్టాలిచ్చి పంచితే అక్కడకు లక్షల సంఖ్యలో జనాభా వచ్చేస్తారు. వారంతా కాలకృత్యాలు తీర్చుకోవడానికి, చెత్త డంప్ చేయడానికి, ఉపయోగించిన ప్లాస్టిక్ ను పడేయడానికి కృష్ణానదిని వాడితే ఇక కృష్ణమ్మ మరో మూసీగా మారక తప్పదు. కృష్ణా నది గర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోనే కొందరు బడాబాబులు పెద్ద పెద్ద భవనాలు అక్కడ నిర్మించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు వాటిని పెద్దగా పట్టించుకోలేదు.  వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆ భవనాలన్నింటిని కూలగొట్టి కృష్ణా నదిని కాపాడతానని చెప్పడమే కాదు..దానికి నాందిగా చంద్రబాబు ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టారు కూడా. తర్వాత అక్కడ ఉన్న భవనాల యజమానులకు తాకీదులు కూడా ఇచ్చారు. కానీ కోర్టుల జోక్యంతో అక్కడ ఉన్న భవనాలను అంగుళం కూడా ఆయన కదిలించలేకపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని జనాలతో నింపేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు కనపడుతోంది. నది ఓడ్డున రాజధాని కడితే మునిగిపోతుందని ఉదర కొట్టిన జగన్ ప్రభుత్వం అక్కడ పేదలకు పట్టాలు ఎలా ఇస్తుంది? నది పొంగి పేదలంతా మునిగిపోతే ఫర్వాలేదా? ప్రజల పైకి ప్రజలనే రెచ్చగొట్టి చోద్యం చూసే ప్లాన్ ఇది..అని రాజధాని ప్రాంత రైతులు, ప్రతి పక్షాలు అంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు ఆర్ధిక సంవత్సరాల్లో మొత్తం 47,682.87 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందింది. దేశం మొత్తం మీద ఓవర్ డ్రాఫ్ట్ (ఓ.డి.) అత్యధిక మొత్తం పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవటంతో, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి భవిష్యత్ లో ఏ విధంగా ఉంటుందనే విషయంలో ఆందోళనలు మొదలయ్యాయి. 2014-15 ఆర్ధిక సంవత్సరం నుంచి 2019-2020 జనవరి 23 వ తేదీ వరకూ, ఎక్కువ మొత్తం ఓ.డి. తీసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండడటం ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదు ఆర్ధిక సంవత్సరాలలో  ఓ.డి. పొందిన రోజులే 188 దినాలుగా నమోదు అయినట్టు, సమాచార హక్కు చట్టం (ఆర్టి ఐ యాక్ట్) కింద భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బిఐ) వెల్లడించింది.  వివరాల్లోకి  వెళితే, 2014-15 లో 14 రోజులకు గాను 4,313 కోట్లు, 2015-16 లో 6 రోజులకు గాను 95. 38 కోట్లు, 2016-17 లో 6 రోజులకు గాను 1,295.22 కోట్లు, 2017-18 లో 38 రోజులకు గాను 8,625. 81 కోట్లు, 2018-19 లో 88 రోజులకు గాను 19,616.71 కోట్లు, 2019 ఆర్ధిక సంవత్సరం మొదలనప్పటి నుంచి ఈ ఏడాది జనవరి 23 వరకూ మొత్తం 36 రోజులకు గాను 13, 736. కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుందని ఆర్బీఐ.. ఆర్టిఐ చట్టం కింద సమాచారం పొందు పరిచింది. తెలుగు దేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి, గడిచిన ఏడాది అంటే 2018-19 వరకూ అత్యధికంగా, 2018-19 లోనే ఆ ప్రభుత్వం అత్యధికం గా 88 రోజులకు గాను 19,616.71 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్నిడ్రా చేసింది. ఇప్పుడా పెను భారాన్ని, వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం కూడా మోయాల్సిన పరిస్థితి రావటం తో, 2019 ఆర్ధిక సంవత్సరం మొదలైనపట్టి నుంచీ , ఈ ఏడాది జనవరి 23 వరకూ కేవలం 36 రోజులలో 13,736.75 కోట్ల రూపాయల ఓ.డి. సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది. నిజానికి ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి మించి పోతోందంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ కు, నిరుడు జూన్ 11, జూన్ 12 తేదీల్లో ఆర్బీఐ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ రెండు లేఖలు కూడా పంపారు. 2019 జూన్ 10 వ తేదీ నాటికి ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం 699. 99 కోట్ల రూపాయల మొత్తం గా నమోదైందని, ఆ త్రైమాసికం లో 16 రోజులు ఓ.డి. సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందిందనీ, వరసగా 14 రోజుల పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఓ.డి. పొందిన పక్షం లో రిజర్వ్ బ్యాంక్ చెల్లింపులు నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఆ లేఖలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ హెచ్చరించారు. నిరుడు జూన్ 12 వ తేదీన ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం 17 వరస పని దినాల్లో 339. 17 కోట్ల రూపాయల ఓ.డి. పొందినట్టు పేర్కొన్నారు. తక్షణమే ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ లేఖలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ కార్యదర్శిని కోరారు. మొత్తం ఓవర్ డ్రాఫ్ట్ లెక్కలను పరిశీలించిన ఆర్ధిక నిపుణుల విశ్లేషణ ప్రకారం..రాష్ర ఆర్ధిక పరిస్థితి అంట ఆశాజనకం గా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం ప్రభుత్వం అప్పచెప్పిన ఓవర్ డ్రాఫ్ట్ లెక్కల నుంచి బయటపడాలంటే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికక్రమశిక్షణ చర్యలను తక్షణం చేపట్టాలని వారు సూచిస్తున్నారు.
    ఒకరు సంక్షోభాలతో చెలిమి చేస్తే, మరొకరు పైనున్న దేవుడిపైన భారం వేశారు... ఇద్దరు నేతలు...వారి వ్యవహార శైలి.. ...ప్రస్తుతం రాష్ట్రం లో నలుగుతున్న చర్చ ఇదే. ఒకరు సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించే ఫిలాసఫి నిర్మాతలైతే, మరొకరు..పైన దేవుడున్నాడు... నాన్న చూస్తున్నాడు అంటూ ప్రజలను ఎమోషనల్ గా టచ్ చేసిన యువ నేత జగన్మోహన రెడ్డి. తనపై రుద్దబడిన లక్ష కోట్ల అవినీతి బురదను వదిలించుకోవటానికి లేదా దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి ఈయనకు తొమ్మిదేళ్ల గడ్డు కాలం పట్టింది. నాయుడిదయితే  డిఫ్ఫరెంట్ స్టైల్. ఆధునికాంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ పితగా తనను తాను  ఆయన మార్కెట్ చేసుకున్న తీరుకు నార్త్ ఇండియా ముఖ్యమంత్రులు సైతం ఫిదా అయిపోయి, ఆయన చేత రెండు దశాబ్దాలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పించారు. వివిధ జాతీయ పార్టీల గోసలకు , వాటి మధ్య సమన్వయానికి ఆయనే చుక్కాని అయ్యారు. అటువంటి నాయుడిని ఈ రోజు 24 గ్రామాల చక్రబంధంలో ఇరికించింది  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే , తాజాగా... ఆయన ఒకప్పటి పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, అతడి నుంచి  విలువైన ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సేకరింపచేసిన అమిత్ షా-మోడీ ద్వయం తెలుగుదేశాన్ని ఇరకాటం లో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఓ సారి నాలుగేళ్ల వెనక్కు రీలు తిప్పితే--అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 2014లో విజయవాడ వచ్చేసి రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించిన తర్వాత 2015 మధ్యలో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఒక పాజిటివ్ అప్రోచ్ కనిపించింది. . 'విభజనలో అన్యాయం జరిగింది. అయినా రెట్టింపు ఉత్సాహంతో, ధృఢ సంకల్పంతో పనిచేయాలి. హైదరాబాద్ నగరాన్ని తలదన్నే మహా నగరాన్ని నిర్మించుకోవాలి' అనే పాజిటివ్ స్పిరిట్ఆ యన మాటల్లో ధ్వనించింది. ప్రజల్లో అనేక కొత్త ఆలోచనలు, ఆశలు రేకెత్తించే పదాలు ఆ సందర్భంలో వినిపించాయి. ఆ తర్వాత ఆలాంటి 'స్ఫూర్తి'నిచ్చే ప్రసంగాలే 2018 మార్చి వరకూ కొనసాగాయి. అయితే ప్రజలు ఆతర్వాత ఎన్నికల్లో భిన్నంగా స్పందించారు. ఇప్పుడు, అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి- రాష్ట్ర ఆర్ధిక వాస్తవ పరిస్థితి, తాను ప్రజలకిచ్చిన హామీలు, రెండింటి మధ్య సమన్వయము  చేస్తున్న తీరు, రాష్ట్ర పరిస్థితిపై తన ప్రణాళికలు చెపుతున్నప్పుడు వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్టు .'గాలిలో మేడలు, అసాధ్యమైన హామీలు ఇచ్చే ఆలోచన తనకు లేదని, మన రాష్ట్ర పరిస్థితి అర్ధం చేసుకుని ఆ మేరకు ఎంత చేయగలమో అంతే మాట్లాడాలి' అనే భావం వినిపించింది.మరి అయినా సారం జగన్మోహన్ రెడ్డి ఎందుకింతగా ఆఫీసర్ల మధ్యన సమన్వయము సాధించుకోలేకపోతున్నారు. ఏ రాష్ట్ర చరిత్ర లోనూ లేని విధంగా ప్రస్తుతం, ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ ల మధ్య ఆధిపత్య పోరుకు అమరావతి సెక్రెటేరియట్  వేదిక కావటం ప్రస్తుతం దేశం మొత్తం చూస్తున్న చోద్యం. ముఖ్యమంత్రులుగా అటు నాయుడు, ఇటు  జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి ని పరిశీలిస్తే, నాయుడి ఎడ్మినిస్ట్రేషన్ ఎప్పుడూ చాలా గుంభనం గా వ్యవహరించేది. లోపల తగువులున్నప్పటికీ, ఎక్కడా ఎవరూ బయటపడిన సందర్భాలు లేవు. ఇప్పుడు అందుకు భిన్నంగాఉంది... జాస్తి కృష్ణ కిషోర్, ఏ బి వెంకటేశ్వర రావు ల ఎపిసోడ్లు పరిశీలిస్తే, అమరావతి సచివాలయం నేషనల్ మీడియాకు కావలసినంత మసాలాను ఉత్తి  పుణ్యానికే అందించినట్టు తెలిసిపోతోంది. ఇది అవాంఛనీయ, అనభిలషణీయ పరిణామమని సీనియర్ అధికారులంటున్నారు. అమరావతి లో క్యాపిటల్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ, ఇలాంటి సంఘటనల ద్వారా రాష్ట్రం పరువు ఢిల్లీ వీధుల్లో మార్కెట్ వస్తువుగా మాత్రం మారిపోయింది. ఇక నైనా , అధికారం లో ఉన్న వారు పూర్తిగా ఐ ఏ ఎస్ ల మీద ఆధారపడి పాలన సాగించే ఛత్రం నుంచి బయట పడాలి. నాయుడి ఓటమి కి కారణం ఆయన పూర్తిగా బ్యూరోక్రాట్లమీదే ఆధారపడటం అని తెలుగుదేశం లో సీనియర్ నాయకులు ఇప్పటికే, ఒక పార్టీ అధ్యక్షడుకి ఒక ధీసిస్ కూడా సమర్పించిన విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకోవాలి.
ఐదోరోజు విచారణలో కంట తడి పెట్టిన పెండ్యాల జరుగుతున్న దర్యాప్తు తీరుతో బిత్తరపోయిన తెలుగుదేశం శ్రేణులు దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఎవరూ..ఏమీ మాట్లాడవద్దని పార్టీ క్యాడర్, లీడర్లకు నాయుడు ఆదేశం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దాదాపు గా అప్రూవర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఈ సంగతి తెలుగుదేశాధినేతకు శరాఘాత సమానమైన విషయమైనప్పటికీ, దర్యాప్తు సంస్థలను ఉటంకిస్తూ కొందరు సీనియర్ అధికారులు ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నారు. వరసగా ఐదోరోజు కూడా పెండ్యాల శ్రీనివాస్ ఇంటిలో జరిగిన సోదాల సందర్భంగా, పెండ్యాల శ్రీనివాస్ అటు ఎంఫోర్సుమెంట్ డైరెక్టరేట్ , ఇటు ఇన్ కమ్ ట్యాక్స్, మరో వైపు డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ సంస్థల బృందాల వద్ద తన వైపు నుంచి అప్రూవర్ గా మారటానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడైన ఒక మాజీ ఐ.ఏ.ఎస్. అధికారికి బంధువైన పెండ్యాల శ్రీనివాస్, నాయుడు దగ్గర వ్యక్తిగత సహాయకునిగా చాలా సంవత్సరాలు పని చేశారు. 2014 లో తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన తర్వాత నాయుడు, పెండ్యాల శ్రీనివాస్ ని వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలలో, పెండ్యాల కొందరు ఐఏఎస్ లను ఏక వచనంతో సంబోధించేంతగా ఎదిగారు. నాయుడు దగ్గర పూర్తిగా ఆంతరంగిక సిబ్బందిలో భాగమైన పెండ్యాల శ్రీనివాస్ ద్వారా జరిగినట్టుగా ప్రచారమవుతున్న లావాదేవీలలో, ఎక్కువగా నాయుడికి అత్యంత సన్నిహితులైన వారి పేర్లు ఎక్కువ దఫాలు శ్రీనివాస్ ద్వారా జరిపిన బ్యాంక్ నగదు లావాదేవీల్లో రిఫ్లెక్ట్ అయినట్టు దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. కోటి రూపాయలకు పైబడి నగదు లావాదేవీలు జరిపేంతటి స్థాయి లేని పెండ్యాల శ్రీనివాస్ , పలు దఫాలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అందుకు బాధ్యులైన వారితో జరిపిన లావాదేవీలు, అలాగే ఫోన్ సంభాషణలన్నింటినీ కూడా దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా సేకరించి, అధ్యయనం చేస్తున్నాయి. ఈ దర్యాప్తులో భాగంగా, వివిధ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన పెండ్యాల శ్రీనివాస్.. తాను అప్రూవర్ గా మారటానికి సిద్ధంగా ఉన్నాననీ, వచ్చే మాసం లో తన కుమార్తె వివాహం ఉన్న దృష్ట్యా తనను ప్రస్తుతానికి విడిచిపెట్టాలని అభ్యర్ధించినట్టు సమాచారం. అంతేకాకుండా, తన ద్వారా ప్రతిరోజూ పార్టీ లోని, ప్రభుత్వం లోని అత్యంత కీలకమైన వ్యక్తులకు ఏ మేరకు సొమ్ములు చేరవేసింది కూడా పెండ్యాల శ్రీనివాస్ దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. అతని కాల్ రికార్డు హిస్టరీని, అలాగే బ్యాంక్ నగదు లావాదేవీల హిస్టరీని అధ్యయనం చేస్తున్న దర్యాప్తు అధికారులకు విస్తుపోయే సంగతులు తెలిసాయి. ఒక ప్రముఖ నటుడు, మాజీ ఎం.పి కి చెందిన నిర్మాణ సంస్థ తోనూ, అలాగే, మరో మాజీ ఎం.పి, ఆటోమోబైల్ వ్యాపార రంగం లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా శాఖలున్న సంస్థ తోనూ...శ్రీనివాస్ ద్వారా జరిగిన ఆర్ధిక లావాదేవీలతో దర్యాప్తు సంస్థలు అనివార్యంగా తమ ఇంటరాగేషన్ ను మరి కొద్దీ రోజులు పొడిగించాల్సి వచ్చింది. వాస్తవానికి అటు హైదరాబాద్ లోనూ, ఇటు విజయవాడ లోనూ, ఇంకా శ్రీనివాస్ స్వస్థలంలోనూ జరుగుతున్న సోదాల సందర్భంగా తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అని లోగడ ముఖ్యమంత్రి కార్యాలయం లో చక్రం తిప్పిన పలువురు సిబ్బంది ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా తెలుగు  దేశం హెడ్ క్వార్ట్రర్స్ నుంచి శ్రీనివాస్ ను ఆదుకునే వ్యవస్థేలేవీ ముందుకు రాకపోవడంతోనే, ఆయన అప్రూవర్ గా మారటానికి   నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
    "Accept everything about yourself--I mean everything, You are you and that is the beginning and the end--no apologies, no regrets." - Clark Moustakas Do see yourself accepting just the way you are? Notice how many conditions you attach when you look at yourself. Perhaps you feel you can accept yourself only when you have achieved something, or you want to look in a particular way, you have to lose enough weight to fit into the perfect pair of jeans or wait for others to acknowledge you. It usually leaves you feeling very dissatisfied, incomplete, or there is something incomplete unless you have those qualities or things that you want in life. What you see outside is only a reflection of what you are, what you think and what you feel deep within. Always remember, “The outer world reflects your inner feelings and thoughts”. Learning to accept yourself just the way you are is the key to positive change in your life. A very effective good way to start is by affirmations. Continuous and positive affirmations on a daily basis could change you and the situations are in. For example instead of saying “I am fat “you could say “I am the perfect weight”. When you feel stuck up in money issues and you feel the lack of it just say “I am a magnet for money”. Each situation and emotion you face can be cleared with these positive suggestions. Another powerful tool would be to look in to the mirror and say these affirmations and tell yourself how much you love yourself, this can bring a lot of change in your life.  The key to self acceptance is self awareness which will bring a major change in your life. “I Love and accept myself exactly as I am “    
The most common problem faced by both male and female is hair fall. There are several reasons for this hair fall. To name few, we can say vitamin deficiency, lack of proper care, even pollution around us. Embarrassingly this problem is most commonly seen in young people aged 15-30. Here are few simple home remedies to overcome problem of hair fall. 1. Do not comb your hair when it is wet because wet hair is more suspect able of breakage. 2. Massage your scalp as frequent as possible. This stimulates blood flow and helps in hair growth. 3. Avoid showers with hot water because hot water makes your hair dry and frizzy. 4. Most common tip and always suggestible is have lots of water which makes you hydrated and even results in glowing skin. Parlor like treatment at home: 1. Apply coconut milk to scalp gives nourishment to hair. 2. Boil neem leaves and rinse hair with that water weekly. 3. Mix henna, egg white and curd and apply to hair avoids hair fall. 4. Applying Aloe Vera gel directly also gives good results.
  Are men from Mars and Women from Venus ??.Why do they think and behave exactly the opposite way on emotions basis?? It is a classic complaint we always hear, that men accuse women of being too emotional and women accuse men of not being emotional enough. They both think that why cant this be the other way round?? Or why cant they behave a bit different?? But the basic issue lies with the brain circuitry system. The emotional processing is different in men and women. Until recently, the chasm between how men and women feel and express emotions was thought to be due to upbringing .Of course, parental upbringing dose make a difference in thought process but still we should also know that the emotional processing in the male and female brain will not be the same genetically. Research suggests that our brains have two emotional systems that work simultaneously: system or MNS (which allows us to emotionally empathize with people); and the parietal junction system or TPJ (which fires the brain's analyze-and-fix-it circuits to look for solutions to emotional problems - cognitive empathy). Males use the latter far more. This prevents their thought processes from being clouded by emotions, strengthening their ability to find practical solutions, but this obviously make them appear to be uncaring and un emotional. Male or female, when we see an emotion on someone else's face, our MNS (emotional empathy system) activates. But, for reasons scientists don't understand, the female brain stays in the sympathetic MNS longer, while the male brain, not built to wallow in anguish, switches to the practical mode. His way of showing that he cares is to try to solve your problems.  So when you see men not reacting to your emotional outburst don’t get worked up, or go bananas, just keep reminding yourself that they are men and they want results soon.  - Pushpa Bhaskar
విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు విజయనగరంలో ప్రజాచైతన్య యాత్రలో పాల్గొనేందుకు అమరావతి నుంచి విశాఖకు విమానంలో వెళ్లారు.  విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.  అయితే, భారీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.  అయినా సరే తెలుగుదేశం పార్టీ నేతలు భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లడంతో విశాఖ ఎయిర్ పోర్ట్ సమీపంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  దీంతో అక్కడ ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరు వర్గాల వ్యక్తులు నచ్చజెప్పిఅక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది.
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై ఛీటింగ్ కేసు నమోదైంది. బీహార్‌లో ‘బాత్‌ బీహార్‌ కీ’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి యువతను కలుస్తానని ప్రశాంత్ కిషోర్ ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రశాంత్ కిషోర్ తన ఐడియాను కాపీ కొట్టి ఈ కార్యక్రమాన్ని రూపొందించారంటూ ఆయనపై ఓ యువకుడు చీటింగ్ కేసు పెట్టాడు.  ‘బాత్‌ బిహార్‌ కీ’ కార్యక్రమం తన ఆలోచన అని, ఈ ఐడియాను తన మాజీ సహోద్యోగి ఒసామా, ప్రశాంత్ కిషోర్ కు చెప్పాడని.. దీంతో ప్రశాంత్ కిషోర్ తన కంటెంట్‌ను దొంగిలించి వాడుకున్నారని.. శశ్వత్ గౌతమ్ అనే యువకుడు పట్నా నగరంలోని పాటలీపుత్ర పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసాడు. ఇప్పటికే తాను ‘బిహార్‌ కీ బాత్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించానని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు ఇచ్చాడు. గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాటలీపుత్ర పోలీసులు ప్రశాంత్ కిషోర్ తో పాటు ఒసామాపై ఐపీసీ సెక్షన్ 420, 406 ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ లో విభేదాలు రచ్చకెక్కాయి. మహబూబాబాద్ కలెక్టరేట్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తనకు తెలియకుండా రివ్యూ మీటింగ్ పెట్టడంపై శంకర్ నాయక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలు మీకు తెలుసా, నాకు తెలుసా అంటూ మంత్రిపై శంకర్ నాయక్ మండిపడ్డారు. రివ్యూ మీటింగ్ అంటే నాలుగు మాటలు మాట్లాడి ఫోటోలు దిగి వెళ్లిపోవడం కాదంటూ నిప్పులు చెరిగారు. దాంతో, కంగుతిన్న మంత్రి సత్యవతి రాథోడ్... సమష్టిగా పని చేద్దాం, సమస్యలు చెప్పండి అంటూ కౌంటరిచ్చారు. మంత్రి మాటలపై శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మధ్యలో కలెక్టర్ గౌతమ్ జోక్యం చేసుకున్నారు. సమాచారమివ్వకుండా రివ్యూ మీటింగ్ నిర్వహించడంపై శంకర్ నాయక్ కు ... కలెక్టర్ క్షమాపణ చెప్పారు. దాంతో, కలెక్టర్ స్థాయి వ్యక్తి సారీ చెప్పడం సరికాదన్న శంకర్ నాయక్.. హడావిడిగా రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అయితే, శంకర్ నాయక్ తీరుపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి ఇరువురి వాగ్వాదంపై సమావేశం గందరగోళంగా మారింది. సమస్యలు మీరు చెప్పండి అంటే, మీరు చెప్పండి అంటూ ఎమ్మెల్యే, మంత్రి వాదులాడుకున్నారు. దాంతో కలెక్టర్... కలుగజేసుకుని ఎమ్మెల్యే, మంత్రిని శాంతింపజేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.