షర్మిలమ్మ ఏడ్చింది... ఎందుకు?
posted on Jan 22, 2015 2:10PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మ దంపతుల గారాల కూతురు, వైఎస్ జగన్ చెల్లెమ్మ షర్మిలమ్మ ఏడ్చింది. పాపం మనసులోని ఆవేదన దుఃఖం రూపంలో బయటకి తన్నుకురాగా కన్నీరు పెట్టుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన సందర్భంగా అనేకమంది మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకున్నారని, గుండె ఆగి మరణించారని ప్రచారంలో వున్న విషయం తెలిసిందే. అలా చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి షర్మిలమ్మ ఐదేళ్ళ తర్వాత మరోసారి యాత్ర చేస్తున్నారు. నాగార్జున హిల్ కాలనీలోని వెంకట నర్సయ్య అనే వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన షర్మిలమ్మ వాళ్ళను ఓదారుస్తూ ఎమోషనల్‌గా ఫీలైపోయి ఏడ్చేశారు. తమ ఇంటి పెద్ద చనిపోయిన ఐదేళ్ళ తర్వాత తమను ఓదార్చడానికి వచ్చిన షర్మిలమ్మ ఏడవటం చూసి ఆ ఇంట్లోవాళ్ళు కూడా ఏడ్చేశారు.