వైఎస్ స్కాం బయటపెట్టిన అద్వానీ..
posted on Nov 6, 2017 12:14PM

ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ.. కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. దానికి తోడు తాజాగా ప్యారడైజ్ పేపర్స్ లో ఆయన పేరు ప్రస్తావన వచ్చి.. మరో బాంబు పేలింది. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అది కూడా జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్కాం గురించి. అది చెప్పింది కూడా ఎవరో కాదు... బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ. ఎప్పుడూ పెద్దగా నోరు తెరిచి మాట్లాడని బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం గుర్తుంది కదా.. ఈ వ్యవహారం అప్పట్లో కార్పొరేట్ సెక్టార్లోనే కాదు రాజకీయంగా కూడా ఈ వివాదం హాట్ టాపిక్ అయ్యింది . ఎన్నో విచారణల నేపథ్యంలో సత్యం ఛైర్మెన్ రామలింగరాజు అరెస్ట్ అవన్ని చకచకా జరిగిపోయాయి.ఆ తరువాత ఆ వివాదం గురించి అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అద్వానీ సత్యం స్కాం గురించి మాట్లాడుతూ... సత్యం సంస్థకు చౌక ధరకే భూముల కేటాయింపు జరగడం వెనుక భారీ అవినీతి జరిగిందని అందరికి తెలుసునన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దల పాత్ర లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరగడం అసాధ్యం.. ఇది ముమ్మాటికీ అప్పటి ప్రభుత్వ కుంభకోణమే ఎందుకంటే సత్యం ,మేటాస్,సాక్షి ఇలా అనేక కుంభకోణాలకు మూలం భారీ ఎత్తున ప్రభుత్య కాంట్రాక్టులు, చౌకగా భూముల కేటాయింపు, లాలూచి ఇలాంటి వాటితోనే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని.. వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభుత్వ అవినీతి వల్లే ఇంతపెద్ద కార్పొరేట్ మోసం జరిగిందని అధ్వాని అభిప్రాయపడ్డాడు.. అంతేకాదు ఇప్పటి వరకూ మరుగున పడిపోయిందనుకున్న ఈ విషయం పార్లమెంట్ లో చర్చకు రానుందని కూడా చెప్పారు.