ఎవరిని బెదిరిస్తున్నావ్ జగన్....
posted on Nov 1, 2017 4:55PM

వైసీపీ పార్టీ నుండి ఇప్పటికే చాలామంది కీలక నేతలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే సాకు దొరికింది జగన్ కు. పార్టీ మారిన నేతలపై యాక్షన్ తీసుకోవాలని. ఈ సాకు చెప్పుకుంటూనే తాను అసెంబ్లీ సమావేశాలకు సైతం వెళ్లేది లేదని చెబుతున్నారు. నిజానికి తాను పాదయాత్ర చేయడానికి ఈ అసెంబ్లీ సమావేశాలు అడ్డుగా ఉంటాయి. అందుకే జగన్ ఈ కుంటిసాకు చెప్పి అసెంబ్లీకు రాకుండా పాదయాత్ర చేసుకోవచ్చని ప్లాన్ వేశాడు. పాపం జగన్ ఈ విషయం ఎవరికి అర్ధం కాదు అని అనుకుంటున్నాడు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అధికారపక్షం తప్పుపడుతుంది. విచిత్రం ఏంటంటే.. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. కానీ ఎవరూ బయటకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడివరకూ బాగానే ఉన్న అసలు జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాను అని ఎవరిని బెదిరిస్తున్నారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు జగన్ అసెంబ్లీకి వచ్చినా పెద్దగా ఒరిగేది ఏం లేదు.. కానీ సమావేశాలకు వచ్చి కాస్త ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే అతనికే లాభం. రాకపోతే ప్రజాసమస్యల పై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం పోతుంది. నిజం చెప్పాలంటే ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షానికే బెనిఫిట్. ఎంచక్కా తమకు కావాల్సిన బిల్లులను ఆమోదించుకునే వెళ్ళిపోతారు. ఈ లాజిక్కు కూడా మిస్సయి జగన్ అండ్ కో బ్యాచ్ మేము అసెంబ్లీ సమావేశాలకు రామంటే రాము అని మొత్తుకుంటున్నాడు. ఏంటో జగన్ 6 నెలల పాటు 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసేసి.. ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చుందామని అనుకుంటున్నాడు జగన్.