యాకుబ్ ఉరి.. పరిణామాలు ఎదుర్కొంటారు

 

ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ ను నిన్న ఉరి తీసిన సంగతి తెలిసిందే. అతని అంత్యక్రియల కార్యక్రమం కూడా ముగిసింది. అయితే యాకుబ్ ను ఉరి తీయడాన్ని అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు చోటా షకిల్ తప్పుబట్టారు. స్వదేశానికి వచ్చి లొంగిపోతే ఉరి శిక్ష వేయమంటూ యాకుబ్ ను భారత ప్రభుత్వం నమ్మించి ఇప్పుడు ఉరి వేసిందని.. యాకుబ్ కు భారత ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని నిప్పులు చెరిగారు. యాకుబ్ ను భారత ప్రభుత్వం చట్టపరంగా చేసిన హత్య అని.. అందుకు తగ్గ పరిణామాలు ఉంటాయని చోటా షకిల్ హెచ్చరించారు.