యాకుబ్ చివరి కోరిక

 

ఈరోజు ఉదయం ముంబై వరుస బాంబు పేలుళ్ల నేరస్తుడు యాకుబ్ మమెన్ ను ఉరితీసిన సంగతి తెలిసిందే. అయితే ఉరితీసే ముందు దోషి చివరి కోరిక తీర్చడం ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో జైలు అధికారులు కూడా యాకుబ్ చివరి కోరికలను తీర్చినట్టు సమాచారం. యాకుబ్ చివరి కోరిక ఏంటో తెలుసా.. "నా కూతురిని ఒకసారి కలవాలి". ఇది యాకుబ్ చివరి కోరిక. దీంతో జైలు అధికారులు తన కోరిక నిమిత్తం అందుకు అంగీకరించి తన కూతురు కుటుంబసభ్యులతో మాట్లాడటానికి అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది.

 

ఇదిలా ఉండగా ‘నాకు తెలుసు నేను మరణించబోతున్నాను. ఏదైనా అద్భుతం జరిగితే కానీ, నేను బతకలేను' అని బుధవారం ఉదయం యాకుబ్ అన్నట్టు ఓ హోంగార్డు తెలిపాడు. అంతేకాదు తన ఉరిశిక్ష ఖరారుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో యాకుబ్ బుధవారం చాలా ఆందోళనగా ఉన్నాడని, సుప్రీంకోర్టులో ఏం జరుగుతోందని పదే పదే తనను అడిగాడని ఆ హోంగార్డు తెలిపారు. బుధవారం ఉదయం పూట అల్పాహారం తీసుకున్న యాకుబ్ మెమన్.. మధ్యాహ్నం భోజనం మాత్రం చేయలేదని ఆ కానిస్టేబుల్ చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu