కాంగ్రెస్ నేత రాజయ్య ఇంట్లో అగ్నిప్రమాదం, కోడలు, మనుమలు మృతి
posted on Nov 4, 2015 6:20AM
.jpg)
సీనియర్ కాంగ్రెస్ నేత మరియు వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో నిన్న రాత్రి జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఆయన కోడలు సాగరికతో సహా ముగ్గురు మనుమలు అభినవ్ (7), అమోన్ (3),శ్రీయోన్ (3) సజీవ దహనం అయ్యారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. అగ్ని ప్రమాదం సంగతి తెలుసుకొన్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికే చేరుకొని మంటలు ఆర్పివేశారు. గత కొన్నేళ్లుగా వారి ఇంట్లో కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు సమాచారం. బహుశః ఆ కారణంగానే సాగరిక ఈ పనికి పూనుకొని ఉండవచ్చని ఇరుగు పొరుగు వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సాగరిక భర్త చాలా కాలంగా హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. సాగరిక వరంగల్ లో తన మావగారి ఇంట్లోనే మేడ మీద అంతస్తులో తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. నిన్న రాత్రి ఆమె ఉంటున్న ఇంట్లోంచి పొగలు వస్తుండటం గమనించిన ఇరుగుపొరుగు వారు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయగానే వారు అక్కడికే చేరుకొని మంటలు ఆర్పివేశారు. వరంగల్ పోలీస్ కమీషనర్ సుదీర్ బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించిన తరువాత పోలీసులను దర్యాప్తుకు ఆదేశించారు. సాగరిక ఆమె పిల్లల మరణానికి కారణాలు ఏమిటో పోలీసుల దర్యాప్తులో తేలవలసి ఉంది.