శశికళపై కర్ణాటక సీఎం ఫైర్..త్వరలో జైలు మార్పు

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తనకు జైలులో విలాసవంతమైన సౌకర్యాలు కల్పించుకునేందుకు గానూ లంచం ఇచ్చారన్న ఆరోపణలు కర్ణాటక ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. తనకు కారాగారంలో సకల సౌకర్యాలు కల్పించాలని..ఇందుకోసం జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ రావుకు రూ.2 కోట్లు లంచంగా ఇచ్చారంటూ జైళ్లశాఖ డీఐజీ రూప ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ విషయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో శశికళను పరప్పన అగ్రహార జైలు నుంచి మరో జైలుకి తరలించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది.